కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హారము లేకున్న నగు మహాప్రళయమ్మే"
లేదా...
"హారము లేకపోయిన మహాప్రళయమ్మె సముద్భవించెడిన్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హారము లేకున్న నగు మహాప్రళయమ్మే"
లేదా...
"హారము లేకపోయిన మహాప్రళయమ్మె సముద్భవించెడిన్"
రిప్లయితొలగించుఓరయ్యో నాయయ్య
ర్వాళ్, రమ్మా యింట పవళ రాళ్ళపు సుమ మా
లారవ్వల నెక్లెసుతో,
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే :)
జిలేబి
జిలేబి గారు-అయ్యర్వాల్ కి వర్నింగ్ ఇచ్చారు గా . haram వెంటనే వస్తుంది.
తొలగించుజిలేబీ గారూ,
తొలగించుమీ పూరణలోని చమత్కారం బాగున్నది. కాని రెండవ పాదంలో ప్రాస తప్పింది. ప్రాసాక్షరానికి ముందు పొల్లు హల్లు ఉండి అది ళ్ర అవుతుంది.
తొలగించుఓరయ్యో నాయయ్యర్
రా, రమ్మా యింట పవళ రాళ్ళపు సుమ మా
లారవ్వల నెక్లెసుతో,
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే :)
జిలేబి
తీరుగ శివరాత్రియు శని
రిప్లయితొలగించువారము కలసి మెలసి యుప వాసము రాగా
భారమ్ముగ దోసెల ఫల
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుసారధి లేకను తేరుకు
తొలగించుభారము గాదలచు తల్లి పాపల నెపుడున్
సారము తెలియని ప్రేమలు
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే
అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించుకారమునుప్పుల మాని వి
కారములౌ చేష్ట లుడుగ గనని నరునకున్
గూరదు స్వాస్థ్యము, స్వచ్ఛ వి
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మే!
"భారము మాది వోటునిడ భాగ్యవిధాతలమౌదుమం"చు తా
త్సారము జేసి యెన్నికల సాలుకు నెట్టిన నాప్రతిజ్ఞలన్
జోరుగ గూర్చు యత్నములు చుక్కల కెక్కును గానమేగతిన్
పోరును పొంగులప్పటివె పోడిమి జూపెడు సర్వ దుష్ట సం
హారము లేకపోయిన మహా ప్రళయమ్మె సముద్భవించెడిన్!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధారుణి పాపులేష నొక దారుణమైన సమస్యగానయెన్
రిప్లయితొలగించుచేరువ లేదు దీనికిని చెప్పగ,చేయ,పరిష్కృతంబు-నా
హార విహారముల్ జటిలమయ్యె-జనోల్బణ రూపుమాప సం
హారము లేకపోయిన మహాప్రళయమ్ము సముద్భవించెడన్
ప్రసాద రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించువైరము నొదవుచు బ్రతుకున
భారంబయి దోచుచుండి వంతల నిడు నా
యారున్ దుర్గుణముల సం
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మే!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధారుణి తాపము మీరగ
రిప్లయితొలగించువారిధులుప్పొంగ సహజ వనరులు తరగన్
మీరిన యాశల కేపరి
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే!
గుఱ్ఱం సీతాదేవి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్నటి పూరణ:
రిప్లయితొలగించుసరదాకని మొదలిడెడున్
సిరి మ్రింగెడు దురలవాట్లఁ జిక్కిన వారల్
మరగిన బలహీనఁపుటవ
సరములు జీవులకుఁ గడు నసహ్యములయ్యెన్
నేటి పూరణము:
క్షీర జలధిన్ జిలుకఁగన్
హోరున గరళమ్ము పుట్ట హూనమటంచున్
కోరఁగ సురలు శివుని పరి
హారము లేకున్ననగు మహా ప్రళయమ్మే
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నీరసమునొడలుదిరుగుట
రిప్లయితొలగించుహారములేకున్ననగు,మహాప్రళయమ్మే
కారడవినిబెనుమంటలె
యూరికివ్యాపించునెడలనూరేగాలన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించుహారం లేకుంటే ఒడలు ఎలా తిరుగుతుంది? పూరణలో మిగతా భాగం బాగుంది. "నీరసమును మూర్చయు నా।హారము లేకున్న..." అందామా?
దారుణ దానవ రాక్షస
రిప్లయితొలగించుశూరవర నిచయ భరిత వసుమతీ సుమహా
భార విదళ నాసుర సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే
దూరి విరించి శౌర్యమునఁ దోరపుఁ గిన్క హరించి వేదముల్
నీరధి దూరి ఘోరముగ నేర్పు వహించిన సోమకాసురుం
జేరి వధించె నాహరియె శ్రీపతి నందిత దేవతా సమా
హారము లేకపోయిన మహాప్రళయమ్మె సముద్భవించెడిన్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించుసంహార, సమాహారాలతో మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా మొదటి పూరణలోని సుదీర్ఘ సమాసం అలరించింది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించుపూజ్యులు సుకవివర్యులు శ్రీ కామేశ్వర రావు గారికి యథావిధిగా శత సహస్ర వందనములతో ఒక చిన్న మనవి:
తొలగించునేటినుంచి మీరు నాతో ఒక ఒప్పందమునకు రావలె...సమస్యా పూరణలోని కందము, తేటగీతి, ఆట వెలది లాటి జాతులు, ఉపజాతులను మీరు ద్రాక్షా పాకములో వేమన, సుమతి శతకముల వలె నాబోటి వారికి సైతం ఏకబిగిని అర్ధం అయేలా వ్రాయవలెను. వృత్తములు మీ ఇష్టం...పద్యం అంతా ఒకే సమాసంలో వ్రాసినా నాకు శ్రవణానందకరముగ నుండును.
కొంచెం శ్రమతీసుకుని మీరిలా వ్రాసినయెడల మీ ప్రతిభ ద్విగుణీకృతముగ రాణించునని నా అభిప్రాయము. నమస్సులు.
తొలగించుఅన్నియు యర్థం బైన మ
హోన్నత పదసంపదల నహో గన వీలౌ ?
యెన్నగ మిన్న కవివరా
యున్నత కవి పోచిరాజు యుక్తుల నేర్వన్ !
(మనకున్న అవకాశంబిది)
చీర్స్
జిలేబి
వీరల రక్కసుల వలని
తొలగించుభారము మన భూమి దాల్చ వలెననఁ దరమే
తీరుటకు వెత లసుర సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే
శాస్త్రి గారికి, జిలేబి గారికి ధన్యవాదములు. జిలేబి గారు (క్షమించాలి మీ పేరు తెలియదు)చెప్పినట్లు తెలుసున్న పదాలే యెప్పుడూ వాడుతుంటే కొత్త పదాలు తెలిసే దెప్పుడు?
__/\__
తొలగించుఓ యమ్మ! నీ కుమారుఁడు
తొలగించుమా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభులాన మంజులవాణీ!
తొలగించుఆహా! సుదినంబిది కో
లాహల మింక చెలరేగ లలిత కవులకుం
బాహి యనఁ గుకవి సంఘము
సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్
శ్రీ కామేశ్వర రావు గారిది
కామేశ్వర రావు గారూ,
తొలగించుమీ తాజా పూరణ మృదు మధురంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. శాస్త్రి గారి కోరిక మేర చేసిన పూరణ యది.
తొలగించుజిలేబి గారు పద్యము మనోహరముగా నున్నది. నా కా యర్హత సంశయ మయినా.
తొలగించుపోచిరాజు వారు
ఆ పద్య పద లాలిత్యం మీదే నండీ ! ( మీ బ్లాగులో నించి కట్ పేస్ట్ చేసినదే )
జిలేబి
అందుకేనేమో ఎక్కడో విన్నట్టుందని పించింది. ధన్యవాదములు.
తొలగించు
తొలగించుభలే వారండీ :)
జిలేబి
భారత భూమికి శిరమగు
రిప్లయితొలగించుధీరోత్తర ధవళవర్ణ దివ్యశిఖరమున్
బారెడి జీవనదీ నీ
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే
పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రూరుడు భస్మాసురు డిల
రిప్లయితొలగించుఘోరమ్మగు కృత్యములను గుప్పించంగన్
శౌరిదలంచె నసుర సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీరముమాత్రమేగొనుచునీరజనాభునిగొల్వుమాసమా
రిప్లయితొలగించుహారములేకపోయిన,మహాప్రళయమ్మెసముద్భవించెడిన్
ధారుణిశత్రుభావములుదారుణమొందగరక్తధారలే
గారుచునొక్కరొక్కరుగగాలునిచెంతకుబోవుచుండుటన్
సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించుGlobalization, economic slowdown, immigration issues నేపథ్యం లో
భారం బాయె మది జిలే
బీ రయ్యన బతుకు బండి బీటలు వేసెన్
బారక దస్కము యభ్యవ
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించుపిన్నక నాగేశ్వరరావు
ఘోరముగా బాంబులతో
దారుణ హింసకు తెగబడి దనుజుల వోలెన్
జేరెడు దుర్మార్గుల సం
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మే.
************************************
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పెళ్లిపందిట పేరంటాన హారతిజేయునప్పుడు పెళ్లికుమారునిబెదిరింపు
రిప్లయితొలగించుహారతి బట్టలేదు”పరిహారపు పళ్ళెమునింపుమన్న?ఆ
హా రతిజేయకుండగనె అన్నుల మిన్నకు డబ్బులాశ?|ఆ
హార తిరస్కృతిన్ దెలిపి|అల్లుడ నయ్యెద “పెళ్లి పందిటన్
హారములేకపోయిన”?మహాప్రళయమ్మె సముద్భవించెడిన్|
2.భార్యహారతి| భర్తకుబెదిరింపు సూచన
హారతి మణిహారమునన్
హారతిగొని తులసి పూజ హాయిగ జేయన్?
“హార తిరస్కృతులప్పే
హారములేకున్న?నగు మహాప్రళయమ్మే| {హారమెఅప్పని నగుమన? మహాప్రళయమెఅంటున్నభార్య}
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించుఓరీ ట్రంపూ వేసేయ్ !
పోరలు మాట వినకున్న పోటుగ వేసేయ్ !
హోరా హోరీ నన్ సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే !
జిలేబి పరార్ :)
జిలేబీ గారూ,
తొలగించుబాగుంది మీ పూరణ. 'నన్'...?
పారుడగు ద్రౌణి శిఖి సం
రిప్లయితొలగించుహారము లేకున్న నగు మహాప్రళయమ్మే
వారింపుము సత్వరమని
పారాశర్యుండు పలుక పార్ధు౦ డుడిపెన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోరక ముక్కెర తెచ్చిన
రిప్లయితొలగించువారిజముఖి మూతివిరిచి భర్తన్నురిమెన్
గౌరీవ్రతమున ముక్తా
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే
ధారుణమౌ కాలుష్యపు
రిప్లయితొలగించుకారణమున పృథ్వియంత కష్టము పాలౌ
వారించెడి యుచితపు పరి
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మే
ధారుణమౌ కాలుష్యపు
రిప్లయితొలగించుకారణమున పృథ్వియంత కష్టము పాలౌ
వారించెడి యుచితపు పరి
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మే
ధారుణమౌ కాలుష్యపు
రిప్లయితొలగించుకారణమున పృథ్వియంత కష్టము పాలౌ
వారించెడి యుచితపు పరి
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మే
చేరిరి దీనులమాత్యుల
రిప్లయితొలగించువారిని కోర్కెలను దీర్చు ప్రభువని తలచీ
ఘోరమయె మాబతుకులా
హారము లేకున్ననగు మహా ప్రళయమ్మే
పేరాశ తోడ మనుజుడు
ఘోరాలను చేయుచుండు కువలయమందున్
నేరాలకు మూలము సం
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మే
చేరిరమాత్యుసన్నిధి వచింపగ బాధల దీనులీ విధిన్
భూరిగ కాటకమ్మలరె భూమియె వ్రయ్యలు వారె నిండుగన్
బారెడు యేరులెండగను పంట ఫలింపకపోయె నా
హారము లేక పోయిన మహా ప్రళయమ్మె సముద్భవించెడిన్
"జగమే మాయా..."
రిప్లయితొలగించుకోరికలన్ని తీర్చుచును కొండల పిండిని చేయగల్గు నా
భారత మాతృరూపిణియె భాగ్యము కోరుచు వచ్చిచేరగా
కూరిచి కోటి రూప్యములు క్రొత్తవి నోటుల కుట్టినట్టిదౌ
హారము లేకపోయిన మహా ప్రళయమ్మె సముద్భవించెడిన్ :)