11, ఫిబ్రవరి 2017, శనివారం

దత్తపది - 106 (నిధనము-శవము-పాడె-చితి)

నిధనము - శవము - పాడె - చితి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
పెండ్లి వేడుకలను వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

63 కామెంట్‌లు:


 1. వా"ని ధనము"తో పెండ్లికి పూని పిలువ
  నా"శ వమ్ము" జేయక నప్పు డచటి కేగి
  యతివ లందరు హారతు లద్ది "పాడె"
  పిదప దీవిం"చి తి"నిరట విందొసంగ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అతివలు.. పాడె' క్రియాపదం ఏకవచనంలో ఉంది. "ఇంతి యొక్కతి హారతి నిచ్చి పాడె" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  2. సవరణతో.....
   వా"ని ధనము"తో పెండ్లికి పూని పిలువ
   నా"శ వమ్ము" జేయక నప్పు డచటి కేగి
   యతివ గణమును హారతు లద్ది "పాడె"
   పిదప దీవిం"చి తి"నిరట విందొసంగ!
   తొలగించండి
 2. కన్యాదానము:

  ఎవని ధనము నీసతి? శై
  శవమున బాల్యమున నుండి చక్కగ నాదౌ
  యువతిని కాపాడెదవో!
  యువకుని కిచ్చితిని పరిణయమ్మున నేడే...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "యువకున కిచ్చితిని..." అనండి.

   తొలగించండి
 3. చూచితిని ధనము కొఱకని
  వేచితి శైశవము నుండి వేడుక మీరన్
  వేచిరి హితముగ పెండ్లికి
  తోచిన పాటలను పాడె తోయజాక్షు లనంగా


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి సోదరి గారికి నమస్సులు. పద్యము అద్భుతముగ నున్నది. నాల్గవ పాదమున గణములు సరిపడినవా?

   తొలగించండి
  2. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాల్గవ పాదాన్ని "తోచిన పాటలను పాడెఁ దొయ్యలి యచటన్" అనండి.

   తొలగించండి
 4. నాకునూ సందియముగ నున్నది మరి తోచుటలేదు ఏమిచేయవలె సోదరా ?

  రిప్లయితొలగించండి


 5. నీలాంబరి ! తెరిచితివి మ
  నో లావణ్యముల, పాడెనొక కోయిలటన్,
  మాలిని, ధనమిక పతియే !
  కాలపు శైశవవము విడు కాత్యాయినివౌ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. *కాలపు శైశవము విడుము కాత్యాయినివౌ

   నెనర్లు
   బిలేజి

   తొలగించండి
  2. జిలేబీ గారు: నిధనము కు ముందే చితి, పాడె తయ్యార్ :)

   తొలగించండి


  3. జీ పీ ఎస్ గారు,

   అంతే కదుటండీ !

   పుట్టినప్పుడే నిధనం ఎప్పుడో బ్రహ్మ రాత !

   ఆ పాటి రాసిన వాడికి ,ఆఫ్టరాల్ చితి పాడె తయారు చేసి ఉంచ డంటారా :)

   అట్లా వచ్చేస్తుందండి బ్రహ్మరహస్యాలు వాటి కంతటి కవే !

   మనం నిమిత్ర మాత్రులము సుమా :)

   జేకే !
   చీర్స్
   జిలేబి
   గుడ్ ఫైండింగ్ :)

   తొలగించండి
  4. జిలేబీ గారూ,
   మీ (సవరించిన) పూరణ బాగున్నది. అభినందనలు.
   *****
   శాస్త్రి గారూ,
   దత్తపదాలను ఇచ్చిన వరుసలోనే ప్రయోగించాలన్న నియమాన్ని ఇవ్వలేదు కనుక వరుస తప్పవచ్చు.

   తొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  ఎవ్వని ధనమున కనువగు
  సవ్వడి శైశవము మొదలు సాగెను; పెళ్ళిన్
  పువ్వుల మనసులు బాడెడు
  గువ్వల జూచితిమి కలిసి గొనగా శుభముల్!

  రిప్లయితొలగించండి
 7. GP Sastry garu,
  చిదిమిన పాల్గారు...పద్యం నేను గూగుల్ చేసి విన్నాను. నా పరిజ్ఞానం మేరకు ఛందస్సు ఏ వృత్తానికి గానీ, సీసానికి గానీ సరిపోవటం లేదు. అందువల్ల సినిమాకోసం లైనులు తొలగించారేమో అనుకొన్నాను. మీకు తెలిస్తే చెప్పగలరు. ధన్యవాదాలతో...

  రిప్లయితొలగించండి
 8. తరుణి వరునకుఁ దరగని ధనము గాదె
  శైశవమునఁ గన్న కలలు సాకృతిఁ గనె
  నప్పగింత పాటను పాడె నతివ యొకతె
  హితులు దీవించి తిని మోద మెంతొ కనిరి.

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టానుండి
  ఆర్యా, నిన్నటి పూరణ సవరింపు:
  పితృపతి గాంచడు బంధము
  పితృవనమున కంపు నతని భేదమె లేదా
  భర్త్తృదారక భవముంగను
  పితృ వాక్పాలనమె సుతుని వృషలుం జేయున్!
  పితృపతి..యముడు..పితృవనము..శ్మశానము..భర్తృదారకుడు..యువరాజు.శ.ర(నాట్య పరిభాష యందు).భవము..సత్త.ప్రాప్తి.

  రిప్లయితొలగించండి
 10. శాస్త్రిగారూ, ఇది సీసపద్యమే (తే.గీ.ముగింపు)! అక్కడక్కడ కొన్ని అక్షరాలు రాగంకోసం విడగొట్టటం, కలపటం జరిగింది. అంతే! సందేహం పటాపంచల్ :-)

  రిప్లయితొలగించండి
 11. మన తెలుగు వారు,

  ఆ పద్య లిరిక్స్ ఇక్కడ పొందు పరిస్తే బాగుంటుందండీ చదవడానికి వీలుగా

  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. దశరథుడు కైకతో కోపగృహంలో అంటున్న మాటలు:
  సీ.
  చిదిమినపాల్గారు చెక్కుటద్దములపై
  జిలిబిలి చిరునవ్వులొలయువాడు
  కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లుమనంగ నం
  దరి కనుల్ చల్లగా తిరుగువాడు
  బుడిబుడినుడువుల పూర్వ భూపాల గా
  ధల నేను నుడువుచో పలుకువాడు
  రాఘవా! ముద్దీయ రా! యన్న ఎగిరి గం
  తిడుచు హాయిగ కౌగెలించు వాడు
  అట్టి పదునాలుగేడుల బొట్టెనెట్టు
  లసురభీకర వనసీమ కంపువాడ
  ననుచు ఏడ్చితి నెపుడో యపుడు, మరల
  నిపుడునీ మూలమున నట్టు లేడ్చుచుంటి!

  రిప్లయితొలగించండి
 13. మేని ధనముగ కాంతి చిమ్మెడు లతాంగి!
  ఆశ వమ్మును చేయకు మతివ నీవు
  ప్రణయ గీతిని పాడెద వగలరాణి
  వేచితిని తాళిఁగట్టగా పెండ్లివేళ!!

  రిప్లయితొలగించండి
 14. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఒక మిత్రుని సోదరి వివాహమునకు సహాయం చేస్తే :

  01)
  _______________________________

  ఇచ్చెద నని ధనము నిడిన
  నచ్చిన శైశవము నాటి - నందంతునకే !
  మెచ్చితి నంచును పాడెను
  విచ్చగ ముఖమదె, సకుక్షి - వివహము నందున్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   బహుకాల దర్శనం... సంతోషం!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. శైశవముదాటిపెండ్లీడుశర్మ!వచ్చె
  వేచియుండుటపాడెయే?విమలచరిత!
  దాచితినిధనమునుమరిదానికొరకు
  చూచుకొనుమురచక్కనిచుక్కనికను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'పాడియే' అనవలసింది పూరణకోసం 'పాడెయే' అన్నారు.

   తొలగించండి
 16. అవని ధనమున్న నింక క
  లవె యధిపా డెప్పరపుఁ గరణ చయములు శై
  శవ ముద భరితమ్ము లనగ
  వివాహపుఁ బనులఁ దలచితివి కదా మదినిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. 'డెప్పరము' శబ్ద ప్రయోగం ప్రశంసార్హం. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 17. ………………………………………....

  గు రు మూ ర్తి ఆ చా రి

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  " కాని ధనము నైనను నేను కట్న మడుగ |

  పరచితిని నాదు హృత్పీఠి , వలచి నిన్నె |

  యాశ వమ్మును చేయుట న్యాయ మగునె ,

  రావె " యని వల పాడె మరదలి నతడు |
  ి
  ప్రేమ న౦గీకరి౦పగ పెద్ద లెల్ల ,

  వైభవమ్ముగ జరిగె వివాహ మపుడు |

  రిప్లయితొలగించండి
 18. వలచితి ననిచెప్పె బావనా కన్నెయే
  . . . వంతపాడెను తల్లి సంతసించి
  వేడ్కతో జరిపిరి పెండ్లినా జంటకున్
  . . . మేలతాళాలతో మిన్నగాను
  పాదరక్షలుదాచి బావమరుదులైన
  . . . కేశవ మురళులు కేలు జాపి
  వరుని ధనము గోరి పరిహాస మాడగన్
  . . .వరసైన వారెల్ల సరసమాడ

  అందమైన సఖుల మందహాసాలతో
  వెన్నెలలె విరిసెను పెండ్లియింట
  సరసమాడు చుండ వరసైన బావలు
  సంబరాలు దాకె నంబరమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. విరించి గారూ! "హమ్ ఆప్ కె హై కోన్"!
   చక్కటి పూరణ! పెండ్లి వేడుకలను చక్కగా చిత్రీకరించారు!

   తొలగించండి
 19. రిప్లయిలు
  1. శైశవము నాడె వలచితి శంకలేక
   రంగనాధుడె నావాడు సింగరింప
   నేనగుదు నతనిధనము నింపు గాను
   మోదమున బాడెదనుగాక మోక్షమంద
   గోద కల్యాణము హితము గూర్చు నిలను!

   తొలగించండి
  2. గుఱ్ఱం సీతాదేవి గారూ,
   మీ గోదా కళ్యాణ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సింగారించు'ను 'సింగరించు' అనడం దోషమే.

   తొలగించండి
 20. శైశవమునుండి ప్రేమతో సమ్ముదమున
  పెంచితిమి నిన్ను నేడునీ పెండ్లి చేసి
  పంపుచుంటిని ధనమును పసిడినిచ్చి
  మెట్టి నింటిని కాపాడె దిట్ట వీవె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాపాడు'ను 'కాపాడె' అన్నారు.

   తొలగించండి
 21. కూర్చుకొని ధనము వరుని కోర్కెలన్ని
  తీర్చ, పందిరి వేయించి తిరముగాను
  ఆదికేశవమూరితి యాలయమున
  పాడె వధువు తల్లి కరము భక్తితోడ
  శుభములొసగుచు మురహరి యభయమివ్వ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'శవమూ' అని 'కేశవ మూరితి' అన్నారు. మూరితి వైకృతం కనుక దుష్ట సమాసం అవుతుంది.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. "ఆదికేశవమూర్తి దేవాలయమున" - అంటే సరిపోతుందా? తెలియజేయ ప్రార్థన.

   తొలగించండి
 22. రాని ధనమును రప్పించి రక్తి గదుర
  శైశవమున యానామున జరుప పెండ్లి
  జూచితిని కండ్ల వేడుక ; శుభమటంచు
  పాడెనచ్చట సంగీత పండితుండు

  రిప్లయితొలగించండి
 23. గురువుగారికి నమస్కారములు! సవరించిన నా పూరణ చిత్తగించండి!


  శైశవమునాడె వలచితి శంక లేక
  రంగనాధుడె నావాడు రమణి యింక
  నేనగుదు నతని ధనము నింపుగాను
  మోదమున బాడెదనుగాక మోక్షమంద
  గోద కల్యాణము హితము గూర్చు నిలను!

  రిప్లయితొలగించండి
 24. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఔచితిని ధనమును గూడి నడరు నట్టి
  కేశవ గుణమ్ము లెరుగుచు కీర్తినిచ్చి
  వేంకటేశుని గుడినందు విధము నెంచి
  పెండ్లి జరిపించి గాపాడె ప్రేమమీఱ
  సవతి బారినుండి సుతను సాంబశివుడు

  రిప్లయితొలగించండి
 25. .శైశవదశలో బొమ్మలసంబరమ్ము
  ఆశనిధనము గన సొంపు| లాడపెళ్లి
  యాట చూచితి నుత్సాహ చోటునందు
  మనసు సొంపాడె| మమతలమానవతలు.
  నాటి నవరాత్రిశోభలోచాటుపెళ్లి|

  రిప్లయితొలగించండి
 26. శుభదంతిని ధనములతో
  విభావరిగ,గాంచితి వధువేషమునందున్
  శుభముగ,గాణుడు పాడెను
  విభవమ్ముగ శైశవమున వినిన పదములన్

  రిప్లయితొలగించండి
 27. తమరు కినుక మాని ధనమును గోరక
  కేశవ!ముదమందు డాశ తగునె?
  బావమరదితోడ పాడెడి యాటలో
  లేచి తిరుగు డనియె లీల యపుడు.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 28. వలచితినా మరదలునే
  అలశైశవమునను కలసి యాడిన దానిన్
  వలదని ధనమున్ కట్నము
  చెలువుగ పెండ్లాడ పాడె చెంగున మనసే.

  రిప్లయితొలగించండి
 29. పెద్దలకు నమస్కారములు మీ ఆశీస్సులే నాకు కొండంత బలం,ప్రోత్సాహం.కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 30. డా.పిట్టా సత్యనారాయణ
  ఎవ్వని ధనమున కనువగు
  సవ్వడి శైశవము మొదలు సాగెను; పెళ్ళిన్
  పువ్వుల మనసులు బాడెడు
  గువ్వల జూచితిమి కలిసి గొనగా శుభముల్!

  రిప్లయితొలగించండి