12, ఫిబ్రవరి 2017, ఆదివారం

సమస్య - 2280 (కర్ణుఁడు చచ్చుటన్...)

కవిమిత్రులారా!
(సమస్యలను ఇవ్వడంలో 'ఛందోనిగూఢం' అన్న పద్ధతి ఒకటి ఉంది. సాధారణంగా సమస్యను ఒక పద్యపాదంగా ఇవ్వడం సంప్రదాయం. కాని పృచ్చకుడు పాదంలోని కొన్ని అక్షరాలను వదిలి కాని, పాదానికి కొన్ని అక్షరాలు కలిపి కాని సమస్యను ఇవ్వవచ్చు. అది ఏ పద్యపాదమో వెంటనే స్ఫురించకుండా అవధానిని తికమక పెట్టడం పృచ్ఛకుని ఉద్దేశం. అవధాని దానిని మననం చేసికొని అది ఏ పద్యపాదమో తెలిసికొని అక్షరాలను కలుపుకొని పూరణ చేస్తాడు. ఈరోజు ఇచ్చిన సమస్య రెండు విధాలుగా ఉంది. గమనించి పూరించండి)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"కర్ణుని యాయువు చెల్లఁగ గెలిచెనట సుయోధనుఁ డనిలోన్"
లేదా...
 "కర్ణుఁడు చచ్చుటన్ విజయలక్ష్మిన్‌ బొందె రారా జనిన్"
ఈ సమస్యను పంపిన వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

  1. అవలీలగ కర్ణుని యా
    యువు చెల్లఁగ గెలిచెనట, సుయోధనుఁ డనిలో
    నవనిని వీడగ, పాండవ
    నవ జీవన ధార సాగె నవరసములతో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పద్యం బాగుంది. కాని పూరణలో కొంత అన్వయలోపం ఉంది.

      తొలగించండి
    2. ఆర్యా! శుభోదయం!

      ఈరోజు నా బ్రహ్మప్రయత్న ఫలితం చూస్తే చిన్నప్పుడు మా హెడ్మాస్టరు గారి కామెంటు గుర్తుకు వచ్చుచున్నది:

      "Operation Success!!! But patient died..."

      తొలగించండి
  2. రవి వ్యధను క్రుంకెనెప్పుడ
    న? విజయుఁడోడెనె? మడుగున నక్కె నెవండె
    ట్టి విధిని? వళి - కర్ణుని యా
    యువు చెల్లఁగ గెలిచె నట సుయోధనుఁ డనిలోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వరుసగా అన్న అర్థంలో 'వళి' శబ్దాన్ని ప్రయోగించినట్టున్నారు. కాని దాని ఆ అర్థం లేదు కదా!

      తొలగించండి
  3. జవనము పెరిగిన తరుణము
    నవివేకము గలిగి మదిని నానా విధముల్
    అవమాన మనగ కర్ణుని యా
    యువు చెల్లఁగ గెలిచె నట సుయోధనుఁ డనిలోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగుంది. కాని పూరణలో అన్వయం లోపించినట్లు అనిపిస్తున్నది.

      తొలగించండి
  4. ఆలోచింప నధర్మయుద్ధమున సఖ్యస్ఫూర్తి లేదయ్యె,మే
    లై లోకంబున శాంతినిల్ప మది చాలన్ తల్చెనా దర్మజ
    వ్యాలోల క్షుభితాత్మ-దైవఘటనావైచిత్రి --కానిమ్ము మిం
    కేలా? కర్ణుడు చచ్చుటన్ విజయలక్ష్మిన్ పొందె రారాజనిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కానిమ్ము+ఇంక = కాని మ్మింక' అవుతుంది.

      తొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    నిల్చెను యాత్మ బంధువుగ నీడగ తోడుగ రాజరాజునున్
    మల్చెను సఖ్యభావనయె మాన్యత గాంచెను వీరి పొందునన్
    దల్చె సుయోధనున్ జయము తానె వరించు నటన్న కర్ణునిన్
    గెల్చె సుయోధనుండనిని గిట్టెను కర్ణుడదేమి యోగమో!

    సింహగఢ యుద్ధమందున చెలగి పోరి
    జయము నందించె తానాజి జనులు మెచ్చ
    ..'గఢము గాంచి శివాజి ప్రగాఢ చింత
    "సింహమే పోయె వచ్చునే శ్రేయమ"నెను
    రాజు నెన్నగ విజయ పరాజ్ఞ్ముఖుండె
    కర్ణుడే చావ రారాజు గాంచె జయము!?

    రిప్లయితొలగించండి
  6. కవిమిత్రులకు శుభోదయం!
    ఈరోజు సాయంత్రం 5 గం.లకు హైదరాబాద్ బషీర్‍బాగ్ ప్రెస్ క్లబ్‍లో 'గురజాడ ఫౌండేషన్, అమెరికా' వారు అందిస్తున్న జాతీయ పురస్కారాన్ని అందుకొనడానికి వెళ్తున్నాను.
    అన్నట్టు... ఏటియంలో గల్లంతైన పదివేల రూపాయలు మళ్ళీ నా అకౌంటులో చేరాయి. ఆందోళన తగ్గింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోయె ననుకున్న సొమ్ములు పొందు కత న
      మిమ్ము లనభి నం దింతును నిమ్ము గాను
      పోదు కష్టార్జి తంబది పుడక యైన
      నిలవదెప్పుడు మనయొద్ద యొరుల సొమ్ము

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మనఃపూర్వకాభినందనలు!!!

      తొలగించండి
    3. మాన్యులకు మనఃపూర్వక శుభాభినందనలు!

      తొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సుయోధనుని అంతిమ యాత్రా సమయమున :

    01)
    _____________________________________

    " చివ్విన్ గర్ణుడు చచ్చుటన్ విజయల - క్ష్మిన్ బొందె రారాజనిన్ "
    నవ్వున్ దచ్చనలాడ బీముడట, కాం - తాళంబు పెంపొందగా
    చివ్విన్ జేయగ లేచి వచ్చె కొలకున్ - జెండాడుచున్ వేగమే
    క్రొవ్వున్ దీసెద నీకు రమ్మనెగా - క్రుద్ధుండు రారాజటన్
    చివ్వెన్ భీముడు వాని యూరువులనే - జీవచ్ఛవంబవ్వగన్ !
    _____________________________________
    చివ్వి = యుద్ధము
    తచ్చనలాడు = ఎగతాళి సేయు
    చివ్వు = ఖండించు

    రిప్లయితొలగించండి
  8. అవనిని గలిసె గర్ణుని యా
    యువు చెల్లగ, గెలిచె నట సుయోధను డ నిలో
    నవహేళన జేయుట గద
    పవన సుతు న్ గెల్వ ననిని వశమే దలపన్

    రిప్లయితొలగించండి
  9. పురస్కార గ్రహీతలయిన గురువర్యులకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. పురస్కార గ్రహీతలయిన గురువర్యులకు అభినందనలు.
    మీ అక్కౌంటు లోకి తిరిగి మీ డబ్బులు చేరాయన్నారు. సంతోషం...అదే " పదివేలు "

    రిప్లయితొలగించండి
  11. 01అ)

    _____


    " చివ్విన్ గర్ణుడు చచ్చుటన్ విజయల - క్ష్మిన్ బొందె రారాజనిన్ "

    నవ్వున్ దచ్చనలాడ బీముడట, కాం - తాళంబు పెంపొందగా

    చివ్విన్ జేయగ లేచి వచ్చె కొలకున్ - జెండాడుచున్ వేగమే

    క్రొవ్వున్ దీసెద నీకు రమ్మనగనే - క్రుద్ధుండు రారాజటన్

    చివ్వెన్ భీముడు వాని యూరువులనే - జీవచ్ఛవంబవ్వగన్ !

    _____

    చివ్వి = యుద్ధము

    తచ్చనలాడు = ఎగతాళి సేయు

    చివ్వు = ఖండించు

    రిప్లయితొలగించండి
  12. తీసిన యక్షరములు కుండలములలోను, కలిపిన యక్షరములు క్రిందగీత తోనూ యున్నవి.

    (కర్ణుని) యాయువు చెల్లఁగ న్ గెలిచె (న) నంత టఁ గర్ణు సుయోధ (నుఁ) నుం డని (లో) న్ :

    కర్ణుఁడు చచ్చుటన్ విజయ కాంతను లక్ష్మి(న్‌) ని బొందె (రా)రా జనిన్


    తోయపు వార లెల్లరును దోర్బలముం గని సంతసింపగన్
    సాయక షండముల్ విసరి శస్త్రపు టస్త్రపుఁ బాటవంబునం
    బాయక ధైర్యముం జలముఁ బార్థు డు వీరుడు సవ్యసాచియే
    యాయువు చెల్లఁగన్ గెలిచె నంతటఁ గర్ణు సుయోధనుం డనిన్

    [సుయోధనుడు = మంచి యుద్ధము నిచ్చువాడు]


    వర్ణ చతుష్క ధర్మములఁ బాలనఁ జక్కగఁ జేయు వాడు నా
    కీర్ణ యశో ధనప్రభవ కేళి విలాస విరాజితుండును
    న్నర్ణవ తుల్య ధీర సుగుణావలి భాసిత ధర్మసూనుడే
    కర్ణుఁడు చచ్చుటన్ విజయ కాంతను లక్ష్మిని బొందె రాజనిన్

    [లక్ష్మి = సంపద]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. యీ ప్రక్రియ యేలనో నాకు నచ్చలేదు!

      తొలగించండి
    2. కొన్ని అక్షరములను తీయ వచ్చు , కొన్ని కలుపవచ్చు నన్నప్పుడు
      అనంతమైన పాదములు రా నవకాశము కలదు కదా!
      ఉదాహరణ కు:
      “కర్ణుఁడు చచ్చుటన్ విజయలక్ష్మిన్‌ బొందె రారా జనిన్”
      పాదమును

      “కలదు సుఖము దుఃఖమందు కలవరమేలన్”

      గా మార్చ వచ్చును.
      ఇందు “క, ల, న్” ల మాత్రము నుంచి మిగిలినవన్నీ తీసేసాము. కొత్త పాదములో మిగిలినవన్నీ కలిపాము నియమ భంగము రాకుండా.

      తొలగించండి
    3. ఆర్యా:

      నాకర్ధమైనంత మేరకు ఇచ్చిన పదముల క్రమం యథాతధంగా ఉంచి సరిపడిన ఛందస్సులో సమస్యను పూరించవలయునేమో. క్రొత్త పదములు ముందూ వెనకా మాత్రమే కలుపవలెను కాబోలు.

      ఉదాహరణకు ప్రధమ సమస్యను కందంలోనూ, ద్వితీయ సమస్యను శార్దూలం లోనూ యథాతదంగా పూరించబడి యున్నవి...

      తొలగించండి
    4. సమస్యలు పద్యములలో "పాదములు" గా కాక, "భాగములు" గా నివ్వబడినవేమో..

      తొలగించండి


    5. జీపీయెస్సులవారు కందమున రాజేయుండు మేలౌగనన్ :)

      జిలేబి

      తొలగించండి
    6. వృత్తములలో నా స్కోరు పెద్ద వృత్తము(0)

      తొలగించండి

    7. వృత్తంబెల్లన నాదు మార్కులు ఘనావృత్తం జిలేబీవలెన్ :)

      జిలేబి


      తొలగించండి
  13. స్వాయత్తంబగు సజ్జయంబు మనకున్ సత్యంబు సంహారమే
    న్యాయం బంచు దలంచి క్రీడి యపుడా యస్త్రప్రయోగంబు తా
    జేయం కర్ణుడు చచ్చుటన్ విజయలక్ష్మిన్ బొందె, రారాజనిన్
    సాయంబించుకయేని లేక కుమిలెన్ సర్వప్రయత్నంబునన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి


  14. శ్రీలా! కర్ణుఁడు చచ్చుటన్ విజయలక్ష్మిన్‌ బొందె రారా జనిన్
    వేళాకోళముగాద !మిత్రుడు మనోవేగంబు నాయానలన్
    కాలాతీతముగాక సల్పి నను సౌకర్యంబులన్దేల్చి నా
    డౌ! లావుల్విడె నన్ను నేడు వెనుకాడన్ సూవె యుద్ధంబునన్!

    శార్దూలా!
    బిజి ? లే!
    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. అవరోధములన్ని గడచి
    యవమానములన్ని సైచి యాతుర మతియై
    యవగుణుడా కర్ణుని యా
    యువు చెల్లగ గెలిచెనట సుయోధనుడనిలో!

    రిప్లయితొలగించండి
  16. శ్రీ కందిశంకరయ్యగురువర్యులకువందనాలతో పురస్కారాలుమరీమరీపొందాలనినాకోరిక
    జాతీయ పురస్కారము
    నేతలతో బొందుచున్ననేర్పరి వయ్యున్
    నూతన వొరువడిపద్యాల్
    వ్రాతల శ్రీ కంది శంకరయ్యకె జేజేల్.
    1.నిక్కంబియ్యది నిత్యసత్యమిదియే|నేర్పున్నయుద్డంబునన్
    చిక్కే కర్ణుడుచచ్చుటన్ “విజయ లక్ష్మిన్ బొందె|”రారాజనెన్
    కుక్కల్ జింపినవిస్తరాయె గద|సంకోచంబుగన్పించు యే
    దిక్కుల్ జూచిన రక్ష గన్పడదు సంధిగ్దంబె|ప్రత్యక్ష మౌ|
    2.కవి యూహగ కర్ణునియా
    యువు చెల్లగ గెలిచె నట|”సుయోధనుడనిలో
    బావురు మనె దుర్యోధన
    జీవనమస్వస్తమాయె చిక్కు లటంచున్”|


    రిప్లయితొలగించండి