6, ఫిబ్రవరి 2017, సోమవారం

సమస్య - 2275 (గణయతులు లేని పద్యంబు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"గణయతులు లేని పద్యంబు గణన కెక్కు"
లేదా...
"గణయతు లుజ్జగించిననె గారవ మందును పద్యకావ్యముల్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

51 కామెంట్‌లు: 1. అందమగు నడకలును వయ్యార మలరు
  గణ యతులు లేని పద్యంబు గణన, కెక్కు
  కెక్కు మను జిలేబి కదంబ కేళి యగుచు
  నందు పసయు రసములేక నమ్ము మమ్మ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. సుమతి వేమన పద్యముల్ సుఖము గాను
  వేయి సంవత్సరమ్ములు హాయి గాను
  తెలుగు నలరించు రీతినే తీరు? కఠిన
  గణయతులు లేని పద్యంబు గణన కెక్కు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. శాస్త్రి గారు

   బాగుందండీ


   గణములు సరిపడు పదముల
   గుణములు చందము యతిగతి గురువులు లఘువుల్
   కణిక జిలేబీ ప్రాసల్
   గణగణ గునగున సొబగగు గరగరి శాస్త్రీ !

   తొలగించండి
  2. జిలేబీ గారు:
   ధన్యోస్మి! కవులు పండితులు విజ్ఞులు కూడిన ఈ శంకరాభరణ మహా వేదిక లో విదూషకుడనైన నాకు బహు సంతోషం!

   తొలగించండి
  3. మీ "గరగరి" కందం "ఎమితిని సెబితివొ కవితము" ను గుర్తుకు తెచ్చింది...

   తొలగించండి
  4. ప్రజాకవుల ప్రస్తావన బాగు బాగు!🙏🙏🙏🙏

   తొలగించండి
  5. జిలేబీ గారు:

   మన హాస్య పద్యములు చదివిన కవివర్యులు శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య (85) గారి వ్యాఖ్య:

   ప్రాయ మింతకు మిగుల కైవ్రాలకుండ
   పేరడీ కైతలో వ్రేలుపెట్టినావు
   ఎటుల నవ్వింతువో మమ్ము నింక మీద
   తీపి కవితల కాణాచి జీపి శాస్త్రి

   తొలగించండి
  6. ప్రాయ మింతకు మిగుల కైవ్రాలకుండ
   పేరడీ మేడలో కాలు పెట్టినారు
   తెలుగు కవులకు గుండియల్ దిగ్గురనగ
   చిలిపి కైతల పెనుమేస్త్రి జీపి శాస్త్రి. ☺��☺

   తొలగించండి


  7. ఔరా! మురళీ ధర రా
   వే రావడిజేసెగాద వేణి జిలేబీ :)

   జిలేబి

   తొలగించండి
 3. వచన కవితలు ప్రవహించు వాగు లయ్యె
  తెలుగు పదములు పలుకగ తెగులు బట్టె
  ఆంగ్ల మేనేడు మనకింక యాత్మ గ్రాహి
  గణ యతులు లేనిపద్యంబు గణన కెక్కు

  ఆత్మగ్రాహి = కుక్షింభరి , ఆత్మజ్ఞుడు

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా సత్యనారాయణ
  కోడి యీకల బంతినిన్ గూడియాడ
  మధ్య వల యున్న పందెముల్ మాన్యత గను
  లేదు కాదన్న యార్యుల లెక్కగనరె:
  "గణయతులు లేని పద్యంబు గణనకెక్కు"!😢
  గణనకు నుండునొక్క మితి గానము గాను నిబద్దతల్ జుమీ!
  క్షణిక వినోదకేళిననుశాసనముండును; సిద్ధ మంత్రమౌ
  ఫణితి(వాక్కు)జెలంగ తన్నియమ పాలన జేయుటె ప్రజ్ఞ; దుష్టపుం
  గణ యతులుజ్జగించిననె గారవమందును పద్య కావ్యముల్!

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా సత్యనారాయణ నుండి
  ఆర్యా
  "Writing a poem without prosody is like playing tennis without a net"American poet Robert Frost.

  రిప్లయితొలగించండి
 6. అక్షరమ్ములఛందస్సునందు వ్రాసె
  మోక్ష మొసగు రామాయణ మును మహర్షి
  ఆది కావ్యమ్ముగా నది యలర లేదె
  గణ యతులు లేని పద్యమ్ము గణన కెక్కు

  రిప్లయితొలగించండి
 7. ……………...………………………………….....

  గు రు మూ ర్తి ఆ చా రి

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  గణయతులు లేని పద్యము గణుతి కెక్కు

  నే ? దళ కుసుమ హీన మహీజ మెసగు ్

  నే ? సఖా ! ఛా౦దసమ్మది యేల నయ్య |

  ఛా౦దస ఙ్ఞాన కల్ప మౌ శ౦కరాభ

  రణమె శరణము నీకు | నాశ్రయము పొ౦దు

  మా | పటుత్వ కవిత్వ స౦పదల నొసగు ! ! !


  { దళ కుసుమ హీన మహీజము =

  గణ యుతులు లేని పద్య౦ =

  పత్రపుష్పరహిత మగు మహీజము తో సమాన౦


  ఛా౦దసము = మూర్ఖత్వము ;

  ఛా౦దసము = ఛ౦దస్సు స౦ „ ఙ్ఞానము ;

  ఛా౦దస ఙ్ఞాన కల్పము = ఛ౦దో

  ఙ్ఞానమునకు కల్ప వృక్షము వ౦టిది }

  రిప్లయితొలగించండి
 8. భావ సరళత స్పష్టత భాషనుండ
  దోష రహిత వ్యాకరణమ్ము తోడ మెరయ
  చక్కనౌయలంకారముల్, సంశయంపు
  గణ యతులు లేని పద్యమ్ము గణనకెక్కు

  రిప్లయితొలగించండి
 9. చకనైనట్టి చందమ్ము సరస గతుల
  భావమెంతయొ క్రొత్తగా భాసిలగను
  తరచి జూచిన నెక్కడో తప్పుదొరలు
  గణ యతులు లేని పద్యమ్ము గణనకెక్కు

  రిప్లయితొలగించండి

 10. చెలఁగి శబ్దార్థ సౌరభ స్నిగ్ధ మగుచు
  చెంగలించెడు ధారా విశేష మందు
  నన్వయార్థంబు ప్రాసయు నమరి, దోష
  గణయతులు లేని పద్యంబు గణన కెక్కు!

  రిప్లయితొలగించండి
 11. ఘన సుమనోజ్ఞ సత్కవిత- కావ్యరసామృత పానసత్ క్రియా
  ధన చరితాతరంగమయి మంజులమై తనరారె పూర్వమున్--
  విన కటువయ్యె నీ నవ కవిత్వపు హేయపు రీతులెన్నగన్
  గణ యతులుజ్జగించిననె గారవమందును పద్యకావ్యముల్

  రిప్లయితొలగించండి
 12. చెత్త చె త్తగా రచనలు సేయు వారి
  భావ మిట్లుండు నిరతము బంకిలముగ
  గణ యతులు లేని పద్యంబు గణన కెక్కు
  వారి సంస్కార మదియ యో పాండురంగ !

  రిప్లయితొలగించండి
 13. భావ శబ్ద మహోన్నత వర్ణ నాతి
  శయ విభావ వైభవ జిత సత్కవి గణ
  తోషిత విబు ధాపూరమై, దూషిత సుర
  గణ యతులు లేని, పద్యంబు గణన కెక్కు

  [యతి = సన్న్యాసి; విభావము = రసోత్పాదనకారణము , పరిచయము]


  గణుతి వహింప నెంచ నవికారము వ్యాకరణమ్ము నింతయుం
  బణముగఁ బెట్ట కుండ ఘనపండిత భావ నిరంకుశేద్ధ ధో
  రణులఁ బరిత్యజించి కవిరాజ వరేణ్యులు దోషదూషణల్
  గణయతు లుజ్జగించిననె గారవ మందును పద్యకావ్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారి సంతోషకారకము:
   ఉప్పు లేని కూర పులుసు పప్పు లేని
   కూడు దిండు లేని పడక గూడు లేని
   బ్రతుకు తోడు లేని కునుకు వెతల తోడ
   గణ యతులు లేని, పద్యంబు గణన కెక్కు

   [గణనకు = లెక్కకు]

   తొలగించండి
  2. గురువు గారూ మీ పద్యములు అధ్బుతము గా వున్నవి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  4. గురువు గారికి నమస్కారములు!
   దయచేసి నా పద్యము చూడగలరు.

   ''గుణము లేని వానికి పెండ్లిగుదురు నేడు
   ఋణమున ధనము బుట్టని ఋుతువు లేదు
   పెళ్ళి లేని కాపురములు పెక్కు యగును
   గణయతులు లేని పద్యంబు గణన కెక్కు''

   తొలగించండి
 14. అర్థమొకటె చాలదు! పద్దెమగునె మహిని
  గణయతులు లేని పద్యంబు! గణన కెక్కు
  ఛందము లమరి లయ కూడ, నంద మొసగు
  తెనుగు పద్య కావ్యమనుచు తెలియు మెపుడు!

  గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ చూడ గోరుతాను. ధన్యవాదములు.
  వేద మాత గాయత్రి దీవెనల నంద
  ఆత్మసంభవుండిల వటుడైన వేళ
  మానసములు ముదము నందె! మా గృహాంబ
  రమణి యఙ్ఞోపవీత ధారణము జేసె!
  (మా గృహాంబరమణి = మా ఇంటి సూర్యుడు)

  రిప్లయితొలగించండి


 15. గణయతు లుజ్జగించిననె గారవ మందును పద్యకావ్యము
  ల్రణగొణ శబ్ధ మన్న జను లందరు మెత్తుర టంచు సూక్ష్మముల్
  కణకణ బుస్సు కస్సు మని గర్హపు యైటము సాంగ్సు బోధనల్
  సణుగుచు కావ్యకన్ని యను చక్కగ లేవని యేడ్తు రేలరో !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. అలతి పదములను కలిగి యనవరతము
  ప్రజల జిహ్వలన్ పల్కుచు పరుష మైన
  గణ యతులు లేనిపద్యంబు గణన కెక్కు
  వేగముగ నది మనుజుల బాగుచేయు

  రిప్లయితొలగించండి
 17. పద్య పఠనము వినుటకు పరుగులెత్త
  మధుర పదగుంఫనము కడు మహిమ జూప
  భావ ధార రహితమగు భాష, దుష్ట
  గణయతులు లేని పద్యంబు గణన కెక్కు

  రిప్లయితొలగించండి
 18. గుణనిధి ఏమితెల్పెదను? గొప్పల కోరిడి వారు, పద్యల
  క్షణములు రాక, చిత్రముగ కన్పడు కొన్ని పదాల తోడ భీ
  షణముగ వ్రాయు వ్రాతలె ప్రశస్త కవిత్వముగా భ్రమింపగా
  గణయతు లజ్జగించిననె గారవమందును పద్యకావ్యముల్

  రిప్లయితొలగించండి
 19. మనుజులమానసమ్ములను మంచిగ చేరవు పద్య సంపదల్
  గణ యతులుజ్జగించిననె, గారవమందును పద్య కావ్యముల్
  ఘనమగు కూర్పుతోడుత వికాసమునొందిన నల్క మాటలన్
  ధనధన రాలు కైతలకు దక్కదు కీర్తియు రాని భాషతో

  రిప్లయితొలగించండి
 20. "కూరిమిగల దినములలో
  నేరము లెన్నఁడును గలుగ నేరవు మఱి యా
  కూరిమి విరసంబైనను
  నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!"

  భావ గాంభీర్యమలరుచు పద మధురిమ,
  మానవత్వంబు దెలుపుచు మనసు తీరు,
  తేట తెల్లగ నీతులు దిద్ది, క్లిష్ట
  గణయతులు లేని పద్యంబు గణన కెక్కు

  రిప్లయితొలగించండి
 21. గణముల తోడ వ్రాయుటకు గా దగు శక్తియు లేక చెచ్చెర న్
  గణ యతు లుజ్జ గించిననె గారవ మందును పద్య కావ్యము
  ళ్లణువునునొప్ప డట్లన,గ దా ర్య !మరింతగ నీఛమౌ సుమా
  గణ యతు లుండ యందమును గారవ మబ్బును గాదె యెల్లెడన్

  రిప్లయితొలగించండి
 22. తెలిసి తెలియక వినగల్గుపలుకు బడికి
  మనసు పరిపరి విధములు మలచుచుండ
  గణయతులు లేని పద్యంబు గణన కెక్కు|
  రాగమనురాగమొలికించు భాగమందు|
  2.ఫణముగ భావమున్ వదలి పద్యము బల్కగరాగయుక్త మై
  గణయతు లుజ్జగించిననె గారవమందును పద్యకావ్యముల్
  క్షణమొకరాగ మందుఱుకుకల్పన తల్పనవన్సు మోర్లత
  క్షణమున బల్క నాటకపు కర్తలు మెత్తురు పల్లెటూర్లలో|
  రిప్లయితొలగించండి

 23. పిన్నక నాగేశ్వరరావు.

  భావమున్ పద్యమందున పరిమళించ

  పాదములయందు రసరమ్య పదములుంచి

  భంగమున్ లేక ఛందస్సు వలన, దోష

  గణ,యతులు లేని పద్యంబు గణనకెక్కు.

  *********************************

  రిప్లయితొలగించండి
 24. కవిమిత్రులు మన్నించాలి.
  జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి. కంప్యూటర్ తెరను ఎక్కువసేపు చూడలేకపోతున్నాను. మందులు వాడుతున్నాను. దేవుడు కరుణించి రేపటికి ఆరోగ్యం కుదుటపడితే మీ పద్యాలను సమీక్షిస్తాను.
  వీలైతే దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.

  రిప్లయితొలగించండి
 25. రిప్లయిలు
  1. ఊకదంపుడు పద్యములొప్పవు గద
   శ్రవణపేయ శబ్దభర ధారానువర్త
   రసమయ జ్ఞాన ధర్మసారంబు, భ్రంశ
   గణయతులు లేని పద్యంబు గణనకెక్కు

   రాజు ప్రస్తుతుల వినుచు రంజిలు కడ
   రాణి సౌందర్య రాశిగా బ్రమయు తఱిని
   మంత్రి చుట్టములె కవులై మనెడు చోట
   గణయతులు లేని పద్యంబు గణనకెక్కు

   తొలగించండి
 26. ​​రణమగు నంతరంగమున రమ్యముగా రచియింప పద్య ల
  క్షణముల ​నన్నియున్ గలిపి ​​​​​​కమ్మని భావము కూర్పుచేయగా
  గణనము జేయ దోషములు గానగ వచ్చిన ​నొప్పు గాని యా
  గణయతు లుజ్జగించిననె గారవ మందును పద్యకావ్యముల్!!

  రిప్లయితొలగించండి
 27. గణయతులు లేని పద్యంబు గణనకెక్కు
  ననెడి వాక్కు కాదు నిజము నవని యందు
  పద్యరాజములకు నెల్ల ప్రాణమైన
  గణయతులు లేవు ననువారు గారు బుధులు.

  రిప్లయితొలగించండి
 28. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఘనమగు పరిభవమ్మును కల్గజేయు
  గణ యతులు లేని పద్యంబు; గణన కెక్కు
  చక్కనైన పదములతో నిక్కమైన
  వహిని ఛందస్సుతో నుండు పద్య మిలను

  రిప్లయితొలగించండి
 29. ధణధణ మ్రోగునట్టివగు దంభపు సంస్కృత మౌక్తికమ్ములున్
  కణకణమందు పిక్కటిలు గాఢపు రీతుల శబ్దనాదముల్
  క్షణమున భీకరమ్మునగు సంధి సమాసము క్లిష్ట మైనవౌ
  గణయతు లుజ్జగించిననె గారవ మందును పద్యకావ్యముల్

  రిప్లయితొలగించండి