గురువుగారూ, శంకరాభరణం లో పద్యం రాయగలగటం నా భాగ్యం. మీరు దానిపై వ్యాఖ్యానిస్తే మహద్భాగ్యం. పరిశీలించారా లేదా అన్న ప్రశ్నే లేదు. నా యందు దయయుంచి. మీ వ్యాఖ్య లో చివరి వాక్యము తొలగించమని ప్రార్ధన. భవదీయుడు
మిత్రులకు నమస్సులు. సిద్దిపేటలో జాతీయ సాహిత్య పరిషత్ వారి పురస్కార సభకు వచ్చాను. అందువల్ల మధ్యాహ్నం నుండి మీ పూరణలపై స్పందించలేదు. మన్నించండి. రేపు చూస్తాను.
(భీముని స్వగతము)
రిప్లయితొలగించండినీటుగా యముఁజేర్చుట నిశ్చయంబు
చేతువాపున్నెమెరుగక సిగ్గుపనులు
ఓయి కీచక! విరటు కాపుండుననుచు
అరసి, కామాంధతను మృగమగుట తగదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసార్! క్షమించండి...కీచకవధ నా సిలబసులో లేదు!
తొలగించండిఓరీ! ప్రభాకర శాస్త్రీ!:
రసికుల సభలో నీకిది
కసిగా యములాడి వోలె కఠిన సమస్యౌ
పసివాడెపుండు నెగ్గడు
నసగక నీవాపు రచన నా మాట వినుం!
'యములాడు, సమస్య+ఔ=సమస్యయౌ, ఎపుండు (ఎపుడుకు రూపాంతరం కాదు), వినుం' ఇవీ మీ పద్యంలోని దోషాలు. నా సవరణ....
తొలగించండిరసికుల సభలో నీకివి
కసిగా యముడు వలె వచ్చె కఠిన సమస్యల్
పసిపా పుండునె నెగ్గునె
నసగక నీ వాపుము రచనా యత్నమ్మున్.
__/\__ _/\__ __/\__
తొలగించండినిన్నున్ గాయము కందనివ్వ నెపుడున్ నీపైన యానందు, నా
రిప్లయితొలగించండిపున్నెంబంతయు నేడు పండెననవా పూబోణి! రాకున్నచో
నన్నున్ శంభురిపుండు జంపుటనియే నాడెందెము న్నమ్మితే
యన్నంతన్ మరణించెబో రుధిరసిక్తాంగుండుగాన్ రాజటన్
బహుకాల దర్శనం... సంతోషం!
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని 'పుండు' కనిపించలేదు.
"శంభురిపుండు"
తొలగించండినిజమే... నేను గమనించలేదు. ధన్యవాదాలు.
తొలగించండినిశిత పరిశీలన చేయకుండానే వ్యాఖ్యానించినందుకు రామకృష్ణ గారూ! మన్నించండి.
గురువుగారూ,
తొలగించండిశంకరాభరణం లో పద్యం రాయగలగటం నా భాగ్యం.
మీరు దానిపై వ్యాఖ్యానిస్తే మహద్భాగ్యం.
పరిశీలించారా లేదా అన్న ప్రశ్నే లేదు.
నా యందు దయయుంచి. మీ వ్యాఖ్య లో చివరి వాక్యము తొలగించమని ప్రార్ధన.
భవదీయుడు
త్వరగా యమునిం జూపెద
రిప్లయితొలగించండిపరకాంతను మరులు గొన్న పశువువి నీవా
పురుషుడ! వాపాంచాలికి
నిరతము కాపుండు వాడ, నెరసిని భీమున్||
నెరసి = శూరుడు
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండి__/\__
తొలగించండి
రిప్లయితొలగించండిరసికుడ! రారా యనుచున్
కసిగా యముడివ లె నొక్కి కాపుండు భళా
రసమయపు తీటవాపుడు
రుసరుస గావించెనోయి రౌద్రము గానన్
జిలేబి
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిరసికత నొందుచు వాపున
రిప్లయితొలగించండికసికసిగా కీచకుడు వేచి కాంక్షించంగా
విసవిస గాయముని వలెను
విసుగున కాపుండు నంట బిడియము లేకన్
బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణదోషం. 'కసికసిఁ గీచకుడు వేచి కాంక్షింపంగన్' అనండి.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిప్రేమము బుండలించుకొని(అభూత కల్పన జేసికొని)పెక్కువిధంబుల నాతినొంచగా
క్షేమమదెంతయో యరసి కీచక వృత్తమువాపు సోదరా!
భీముడు రాకపోడొకడభిన్నుడుగాయము డుండు పొంచి నీ
నీమము దప్పకుండుము మనిన్ బర పీడనముండరాదిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాని 'పుండలించు'లో 'పుండు' లేదు.
నా నిన్నటి సమస్యకు పూరణ
రిప్లయితొలగించండిఫక్తుగ దైవంబనుచు
శక్తిగ 'నోటరు ' ననుదురు సరినాయకులే
భుక్తికి "పెన్షన్" కోసము
భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్.
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండివచ్చెఁగా యముఁ డగుచు నా వాయుసుతుఁడు
రిప్లయితొలగించండి"తులువ వా పుణ్యసతికిఁ గీ డొలయఁ జేసి
బ్రతుకఁ గలవె రే పుండునె పాపి నీకు"
ననుచు రుధిర సిక్తునిఁ గీచకుని నడంచె.
భీముడు కీచకునితో....
రిప్లయితొలగించండిత్వరగా యమునే జూపెద
మెరసిన నా పౌరుషమ్ము మెచ్చగ తుళువా!
పురమున కాపుండెవ్వడు
గిరగిర నినుద్రిప్పి జంప కీచక! ధూర్తా!
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
తొలగించండిఅంతరసికుడువాకీచకాధమ!యిక
రిప్లయితొలగించండినెవరుకాపుండునోజూతునిప్పుడేను
దనరనిన్నుగాయమునిచెంతకునుజేర్తు
బళిరనీవాపుకొందువాబలముతోడ?
మారుతి వాపుట కార్తిని
రిప్లయితొలగించండివీరాలాపుండు ఘోర వేగమ్మున భీ
మోరసిలుఁడు కీచకుఁ డటఁ
జేరగఁ గాయమును జీరి చేర్చెను దివికిన్
……………………………...........................
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ ద్రౌపది కీచకుని తో }
ఓరి తులువా ! పురస్త్రీల కోర నేల ?
వీర రసికుడ నే నని విర్రవీగ c
గాయమును హూనమొనరి౦చు వాయుసుతుడు ,
క్రూర జనరిపు౦డు , బకారి , ధీరవరుడు
ఆపవా పునీతులపైన నాగడములు
రిప్లయితొలగించండిపోర సింగములై యొప్పు వీరవరులు
పతులు కాపుండు చుందురు సతము నాకు
వేగిరముగా యముని పురి కేగగలవు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదయచేసి నా పై పద్యాన్ని తొలగించ వలసినది . ఒక పదం రాలేదు.
రిప్లయితొలగించండికరవా పుర్రెకు బుద్ధియె
రిప్లయితొలగించండిత్వరగా యమునకు నతిథిగ తరలును కామా
తురుడా రసికుడు కీచకు
డరయగ నిది మన నృపుండు నచ్చెరు వొందున్
ద్రోవదిఁ గాయ ముదితవలె
రిప్లయితొలగించండినా వలలుఁడు రసిక కీచకాధము తోడన్
నీవా! పురుషుడ వనుచున్
భావోద్వేగాధి పుండు భరతము పట్టెన్
నమస్కారం గురువువుగారు నా పేరు శేష శ్రీధర్ ఇలాపావులూరి చాలాకాలం తరువాత ఎలా వున్నారు
రిప్లయితొలగించండి.రసికరాజగు కీచక కసినిమాన్ప
రిప్లయితొలగించండిభీముడేగా యమునికడ వేయదలచి
రాత్రి కాపుండు వాడిని రచన జేసి
వాపుచేతను జంపెను వాయుసుతుడు| {వాపు=వాయింపు}
"చెడుఁగువు నీవెగా, యముని చెంతకుఁ బంపెద నిన్ను; నన్యయౌ
రిప్లయితొలగించండిపడఁతినిఁ బిల్తె? తులువా, పురుషుండవె? యన్యు భార్యనున్
దొడరుచుఁ గామ మిట్లు గొని, దూఁకలిఁ ద్రోతె? నృపుండు నైనచోఁ
బడునె దొసంగులందు? జనవంద్యులు నారసి నిందసేయరే? "
[కీచకుని చేఁతకు నాగ్రహించి, వానిఁ జంప నుద్యుక్తుఁడై భీముఁడు పల్కిన మాటలు]
తొలగించండి"చెడుఁగువు నీవెగా, యముని చెంతకుఁ బంపెద నిన్ను; నన్యయౌ
పడఁతినిఁ బిల్తె? తులువా, పురుషుండవె? యన్యు భార్యనున్
దొడరుచుఁ గామ మిట్లు గొని, దూఁకలిఁ ద్రోతె? నృపుండు నైనచోఁ
బడునె దొసంగులందు? జనవంద్యులు నారసి నిందసేయరే? "
సవరణ: రెండవపాదంలో "పడఁతినిఁ బిల్తె? యోరి తులువా, పురుషుండవె?....అని పఠింపఁ బ్రార్థన.
తొలగించండిరసికుని కొైరకై వేచె వీరాధిపుండు
రిప్లయితొలగించండిచెలియగా, యముజెంతకు సింహబలుని
బంప దలచి నర్తనమాడు భవన మందు,
చేరవే నను నీవాపు సిగ్గు ననుచు
వచ్చె, జంపె కీ చకుడనా పవన సుతుడు.
మిత్రులకు నమస్సులు.
రిప్లయితొలగించండిసిద్దిపేటలో జాతీయ సాహిత్య పరిషత్ వారి పురస్కార సభకు వచ్చాను. అందువల్ల మధ్యాహ్నం నుండి మీ పూరణలపై స్పందించలేదు. మన్నించండి. రేపు చూస్తాను.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరసిక కీచకాధముని పేరడచ నెంచి
జోరుగా యముని దరికి జేరునట్లు
నతనితో తులువా! పురినందు నిన్ను
నిలుప కాపుండు వారేరి? పిలువ మనుచు
గుద్దులను గుద్ది భీముడు గూల్చె వాని
*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
రిప్లయితొలగించండిఆ *రసి* సూటి *గాయము*డునాయువుపట్టులగ్రుద్దినట్టుగా
క్రూరుడుకీచకున్ బొడిచి క్రుమ్ముచుజంపెనుసద్దుచేయకన్
పోరుచుభీరు
*వా!పు*రుగుపోలికనీబలమంచుదంచుచున్
పోరగ చాటుగూర్పతలు *పుండు*టచే వలలుండు దాగగన్
*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
🙏🙏🙏🙏
*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
రిప్లయితొలగించండిఆ *రసి* సూటి *గాయము*డునాయువుపట్టులగ్రుద్దినట్టుగా
క్రూరుడుకీచకున్ బొడిచి క్రుమ్ముచుజంపెనుసద్దుచేయకన్
పోరుచుభీరు
*వా!పు*రుగుపోలికనీబలమంచుదంచుచున్
పోరగ చాటుగూర్పతలు *పుండు*టచే వలలుండు దాగగన్
*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
🙏🙏🙏🙏
*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
రిప్లయితొలగించండిఆ *రసి* సూటి *గాయము*డునాయువుపట్టులగ్రుద్దినట్టుగా
క్రూరుడుకీచకున్ బొడిచి క్రుమ్ముచుజంపెనుసద్దుచేయకన్
పోరుచుభీరు
*వా!పు*రుగుపోలికనీబలమంచుదంచుచున్
పోరగ చాటుగూర్పతలు *పుండు*టచే వలలుండు దాగగన్
*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
🙏🙏🙏🙏