7, ఫిబ్రవరి 2017, మంగళవారం

సమస్య - 2276 (గురుల దోషంబులన్....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు"
లేదా...
"గురువుల తప్పు పట్టుటయె కూర్చు యశంబిల శిష్యకోటికిన్"

70 కామెంట్‌లు:

 1. "నవైనూనం భగవన్తస్త ఏతద్ అవేదిషుః
  యధ్ధి ఏతదవేదిష్యన్ కథం మే నావక్ష్యన్"

  ...శ్వేతకేతు


  "చనువు మితిమీర నింటిలో చదువు రాక
  వెదికి వేసారి కనుగొంటి తుదకు నేను
  తండ్రి మించిన గురువులు ధరను లేరు
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు"

  రిప్లయితొలగించండి
 2. ''పరుల సొత్తునాశించుతు పరుగులెత్తు
  తరుణి మెప్పులు బొందుచు ధరణి నేలు
  వరుని వెలగట్టు సంతలు వధువు మెచ్చు
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పుట్టంరాజు సునీల్ కుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సొత్తు నాశించుచు' అనండి.

   తొలగించండి


 3. పరుగున వత్తురోయి తమ పంచన పారుని పల్కు సూక్ష్మము
  ల్లరయగ మేలటంచు, గని లబ్జుగ పట్టిక జేర్తురయ్య శం
  కర! తమ పాఠమెల్లెడల కాలపు పోకడ లేక డొల్లయౌ,
  గురువుల తప్పు పట్టుటయె కూర్చు యశంబిల శిష్యకోటికిన్


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'సూక్ష్మముల్+అరయగ = సూక్ష్మము లరయగ' అన్నపుడు లకారద్విత్వం రాదు. 'సూక్ష్మమున్+అరయగ = సూక్ష్మము నరయగ/ సూక్ష్మము న్నరయగ' అవుతుంది.

   తొలగించండి

 4. అరకొర పల్కులెల్ల గని యర్థము వేరుగ గాంచి భేషుగన్
  గురువుల తప్పు పట్టుటయె కూర్చు యశంబిల శిష్యకోటి "కి
  న్నరులకు", చాక చక్య మిది, నవ్యపు రీతిని కార్పొరేటు క
  ల్చరిది, జిలేబి, నేర్చి సరి లబ్ధిని బొందుము మెత్తురెల్లరన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. అందరికీ భీష్మేకాదశి పర్వదిన శుభాకాంక్షలు.

  నేటి పూరణ:

  చెప్పి శ్రీరంగ నీతులు చేర దొమ్మ
  రి గుడిశల చేయఁ దగునేదొ ప్రియము తోడ
  చేయఁ రానిదదేదియో మాయ కాగ
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు

  రిప్లయితొలగించండి
 6. ముచ్చటైన వృత్తములందు మునిగి తేలి
  జాతులుప జాతుల ప్రజల చావ గొట్టి
  తంక హైకు నాని జెనులు తాక లేక
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'తంక హైకు నాని జెనులు'...?

   తొలగించండి
  2. సార్! ఈ నాలుగు జపనీసు భాషలోని "మిని" కవితల పేర్లు. మన తెలుగు ఆధునిక కవులు వీటిని అనుకరించి కవితలు వ్రాస్తున్నారు. అర్ధం అవవు గాని అద్భుతంగా ఉంటాయంటారు. వీటిని గురించి నాకు ఇంతకన్నా తెలియదు. జిలేబీ గారిని సంప్రదించాలి. వీటన్నిటినీ మన తరం గురువులు నేర్పలేదని మన శిష్యకోటి మనలను దూషించడం సబబేనేమో!

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి


  4. శాస్త్రి గారు

   తేటగీతి లో ఒక పాదాన్ని హైకు :)

   హైకు

   పుజుయికియ
   కవజుతొ బికొము
   మిజునూతొ

   తేటగీతి

   పుజుయికియ కవజుతొ బికొము మిజునూతొ
   పుజుయికియ కవజుతొ బికొము మిజునూతొ
   పుజుయికియ కవజుతొ బికొము మిజునూతొ
   పుజుయికియ కవజుతొ బికొము మిజునూతొ


   చీర్స్
   జిలేబి


   తొలగించండి
  5. అద్భుతంగా ఉందండీ జిలేబీ గారు. ఇకమీదట నేను హైకూలే వ్రాస్తాను. ధన్యవాదాలు.

   తొలగించండి


  6. ధన్య వా
   దము లయ్యరో !
   ధరణి రాజ !


   చీర్సు సహి
   తముగ జిలేబి
   చిలిపి హైకు

   హైకు 5 7 5 మాత్ర లలో ఉండాలి :) కలిపితే తేట గీతి విడదీస్తే హైకు :)

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
 7. అరుల దోడుత శిష్యుల వరమవంగ
  సరిగ వివరించు రీతిని సాగదీయ
  నదియె మరిమరి పునరుక్త మవగ నపుడు
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు!

  రిప్లయితొలగించండి
 8. తల్లి దండ్రుల దూషించు దనయుడెపుడు
  నత్త మామల ద్వేషించు నల్లుడెపుడు
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు
  యుత్తములను వెక్కిలిగొను సత్త లేక
  దోషమెంచుటె నైజము ధూర్తు నికిని!

  రిప్లయితొలగించండి
 9. ఎన్న కూడదు నెప్పుడు నిదియ యనుచు
  గురుల దోషంబులన్ శిష్య కోటి ,పట్టు
  కొనగ వలయునా తనిబ్రతిభ ను ని రతము
  శిష్యు డుండవలయునుసూ చెలిమి తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కూడదు+ఎప్పుడు = కూడ దెప్పుడు' అవుతుంది. నుగాగమం రాదు. 'ఎన్నడు.. ఎప్పుడు' పునరుక్తి దోషం. "ఎన్న డైనను కూడదు గద యిది యటంచు" అందామా?

   తొలగించండి


 10. సుబ్బారావు గారు సెహభేషైన విరుపు !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. విమల విజ్ఞానములను వివేకమంది
  పొందెదరుఁగాదె సెవించి పూజచేసి
  గిరుల,--దోషంబులన్ శిష్యకోటిపట్టు
  పరుల నీతి విదూరుల భ్రష్టజనుల

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   టైపాటు వల్ల గురుల... గిరుల అయింది.

   తొలగించండి
 12. ………………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  { చ౦డామార్కులను కాదన్న ప్రహ్లాదు డు

  యశమును పొ౦దలేదా ? }


  సరసిజజాది దివ్య గణ సన్నుత సద్గుణ

  ……………… మూర్తి యౌ హరిన్
  ి

  స్మరణము జేయ నట్టి నరజన్మము

  …………… జన్మము కాదట౦చు దా

  గురువులతో వివాదమునకున్ దిగె

  ……… హ్లాదుడు | సత్యమార్గమున్

  మరచి యసత్య బోధన మొనర్పగ సు౦తయు

  …………… స౦శయి౦పకన్

  గురువుల దప్పుపట్టుటయె కూర్చు

  ……………… యశ౦ బిల శిష్యకోటికిన్

  { హ్లాదుడు = ప్రహ్లాదుడు }

  రిప్లయితొలగించండి
 13. ……………...………………………………….....

  గు రు మూ ర్తి ఆ చా రి

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  నిన్నటి పూరణము స్వీకరి౦చ మనవి
  ………………………………………………


  గణయతులు లేని పద్యము గణుతి కెక్కు

  నే ? దళ కుసుమ హీన మహీజ మెసగు ్

  నే ? సఖా ! ఛా౦దసమ్మది యేల నయ్య |

  ఛా౦దస ఙ్ఞాన కల్ప మౌ శ౦కరాభ

  రణమె శరణము నీకు | నాశ్రయము పొ౦దు

  మా | పటుత్వ కవిత్వ స౦పదల నొసగు ! ! !


  { దళ కుసుమ హీన మహీజము =

  గణ యుతులు లేని పద్య౦ =

  పత్రపుష్పరహిత మగు మహీజము తో సమాన౦


  ఛా౦దసము = మూర్ఖత్వము ;

  ఛా౦దసము = ఛ౦దస్సు స౦ „ ఙ్ఞానము ;

  ఛా౦దస ఙ్ఞాన కల్పము = ఛ౦దో

  ఙ్ఞానమునకు కల్ప వృక్షము వ౦టిది }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగున్నదండీ మీ పూరణ. అభినందనలు. ముఖ్యంగా పాదాద్యంక్షరం విరుపును పొందినా ధార కుంటుబడక సాఫీగా సాగడం ప్రశంసనీయం.

   తొలగించండి
 14. వంత వడనేల యెల్లరు నింత పనికి
  వృక్ష శాస్త్రవేత్త వెతలఁ బెట్ట నేల
  భూరి విటప విస్తృతములు భూరుహపు చి
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు


  బిరుదులఁ బెక్కు పొందుటను విద్యల యందున దిట్ట లౌటయున్
  గరువము మిక్కుటంబయి వికారపుఁ జేష్టల నెల్లఁ జూపి యే
  యొరిమిక లేకయున్ నిజ గురూత్తము నిందలఁ బాలు చేయు వా
  గురువుల తప్పు పట్టుటయె కూర్చు యశంబిల శిష్యకోటికిన్

  [వాక్ +ఉరువు = వాగురువు : వాక్కులందు విరివియైనవాడు ( వాచాలుఁడు ); ఉరువు = విరివియైనది]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగాను, ఉత్తమంగాను ఉండి 'వహ్వ' అనిపించాయి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   మూడవ పాదములో చిన్న సవరణ:

   "భూరి విటప విస్తృతమైన భూరుహపు చి"

   తొలగించండి
 15. పద్యముల తన శైలిలో వ్రాయు చుండ
  పదములన్నియు సవరించి వరుసగాను
  భావమును మార్చి ప్రకటించ, బాధతోడ
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు

  రిప్లయితొలగించండి
 16. నిరతము పద్యముల్ కరము నిష్ఠ లిఖించుచు పట్టు యేర్పడన్
  పరుని సమాదరించుచు సభాసదులందరిముందు శిష్యులన్
  పరిహసనమ్ముచేయ, కని ప్రజ్ఞను జూపుచు మించి పాండితిన్
  గురువుల తప్పు పట్టుటయె కూర్చు యశంబిల శిష్యకోటికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'పట్టు+ఏర్పడన్' ఇక్కడ ఉత్వసంధి నిత్యం. యడాగమం రాదు. "పట్టు దక్కగన్" అనండి.

   తొలగించండి
 17. ఎన్నబోకు మెప్పుడును మహీతలమున
  గురుల దోషంబులన్ , శిష్యకోటి పట్టు
  దలన సంస్కార యుక్త విద్యలను నేర్చి
  సద్విధేయుడై మెలగిన చాలు గాదె.

  అరయగ బుణ్యకార్యములు నాశ్రిత రక్షణ జేయనేమి యా
  నరకము తప్పదంచు జన నానుడి కెయ్యది కారణమ్మనన్
  గురువుల తప్పుపట్టుటయె, కూర్చును యశంబిల శిష్యకోటికిన్
  మరువక యొజ్జలన్ మదిని మన్నన జేయుచు గొల్చినంతనే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'పట్టుదలను' అనండి.

   తొలగించండి
 18. దైవమును మించు దక్షుదు,తగదరయగ
  గురుల దోషంబులన్,శిష్యకోటి, పట్టు
  విడువ కాతనిసేవింప విదిత మగును
  ఇహ పరమ్ముల సాధన కిక్కపట్టు

  రిప్లయితొలగించండి
 19. చదువులన్నియు బాగుగా చదివి వత్స
  రాంతమున వార్హికోత్సవమందు గురువు
  లందరును శిష్యులును క్రీడ లాడువేళ
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు

  రిప్లయితొలగించండి
 20. గురువుల తప్పు పట్టుట యె కూర్చు యశంబిల శిష్య కోటికిన్
  గురువుల దప్పు పట్టుటను ఘోరమయూ నను భావ మొందుచు
  న్ని రతము గారవంబున ననేక విధంబుల వందనంబుల
  న్ని రవుగ నీయ శ్రేయము వివేకము తోడనశిష్య కోటికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఘోరమయూ నను'...? కొంత అన్వయదోషం ఉంది.

   తొలగించండి
 21. క్రొత్తగా వృత్తి జేపట్టు కోడె కారు
  గురుల దోషంబులన్ శిష్య కోటి పట్టు
  కొనుట సామాన్యమనుచుంద్రు! కూర్మి నెంచి
  తప్పుల సవరించుకొనగ ధన్యమౌను!

  గురువు గారికి నమస్కారములు. నిన్నటి, మొన్నటి నా పూరణలు కూడా చూడ గోరుతాను. ధన్యవాదములు.
  అర్థమొకటె చాలదు! పద్దెమగునె మహిని
  గణయతులు లేని పద్యంబు! గణన కెక్కు
  ఛందము లమరి లయ కూడ, నంద మొసగు
  తెనుగు పద్య కావ్యమనుచు తెలియు మెపుడు!

  వేద మాత గాయత్రి దీవెనల నంద
  ఆత్మసంభవుండిల వటుడైన వేళ
  మానసములు ముదము నందె! మా గృహాంబ
  రమణి యఙ్ఞోపవీత ధారణము జేసె!
  (మా గృహాంబరమణి = మా ఇంటి సూర్యుడు)

  రిప్లయితొలగించండి
 22. దురిత సుయోధనుండు చెడ,దుష్టుల బోధల కారణమ్ముచే
  గురువుల తప్పు పట్టుటయె, కూర్చు యశంబిల శిష్య కోటికిన్
  స్థిరమగు వర్తనమ్ము గురుదేవుల మెప్పు,మురారిప్రీతితో
  దురమున ఫల్గునిన్ రథము తోలి విజేతల జేసె పాండులన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పాండులన్'...?

   తొలగించండి
 23. శిష్యకోటి కి చక్కని శిక్ష నిడగ
  గురు బృహస్పతి యనుచు నిగూఢముగనె
  ప్రథమ కోపము, నశ్యము పలు రుజలుగ
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు

  గురుని నిర్లక్ష్యమున తార గోరె శశిని
  మరల జీవించి శుక్రుని మంత్ర మహిమ
  కచుడు పొందెను ప్రాణంబు గాచు విద్య
  గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 24. పరువమునందు విద్యలను బాగుగ నేర్వక దుష్టమూకలన్
  వెరవక వెంటవేసుకొని వెర్రిగ దిర్గుచు వింత చేష్టలన్
  గరువముతోడ జేయుచును కన్యల గాంచుచు నేడిపించుచున్
  గురువుల తప్పు పట్టుటయె కూర్చు యశంబిల శిష్యకోటికిన్?

  రిప్లయితొలగించండి
 25. చదువు జెప్పెడి నెపమున జనవు జూపి
  సరస సంభాషణములను సరస జేరి
  శిష్యురాండ్రను జెరచగ సిగ్గు లేని
  గురుల దోషముల్ శిష్యకోటి బట్టు!

  రిప్లయితొలగించండి
 26. గురువు గారికి నమస్కారములు! మొన్నటి నా పూరణ సరి చూడ విన్నపము!

  అచ్చెరువదియేమి సుకవీ! యాది నుండి
  నయ్య వామభాగిని గాగ నమ్మవారు
  యర్ధనారీశ్వరి యనగ నౌచితిగను
  రమణి యజ్ఞోపవీత ధారణము జేసె!


  యజ్ఞోపవీతాన్ని యెడమ భుజం మీదనుండి ధరిస్తారు గదా!

  రిప్లయితొలగించండి
 27. కరువులు కానరాని పదకంబులు నేర్పెడి విద్య బుద్దినే
  తరుగక జేయగల్గు గురుతంత్రము లన్నియుగల్గియున్న?యే
  మరచెడి తత్వమున్న ననుమాన మటన్ననుయిష్టపడ్డచో
  గురువుల తప్పు పట్టుటయె|కూర్చు యశంబిల శిష్య కోటికిన్
  2.ముఖము నందున మరకలు ముసిరియున్న?
  గురువు కగుపించబోవులే పరువమందు|
  గురుల దోషంబులన్ శిష్య కోటిపట్టు
  ప్రక్కవారికి గనుపించు నిక్కమెపుడు|


  రిప్లయితొలగించండి
 28. గురుదేవులకు ప్రణామములు సవరించినపద్యమును పరిశీలించ గలరు
  దురిత సుయోధనుండు చెడ,దుష్టుల బోధల కారణమ్ముచే
  గురువుల తప్పు పట్టుటయె, కూర్చు యశంబిల శిష్య కోటికిన్
  స్థిరమగు వర్తనమ్ము గురుదేవుల మెప్పు,మురారిప్రీతితో
  దురమున ఫల్గునిన్ రథము తోలి విజేతను జేసె ధర్మజున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 29. పిన్నక నాగేశ్వరరావు.

  పూజ్య భావమ్ము నెఱపుచు బోధచేయు

  గురుల ; దోషంబులన్ శిష్య కోటి పట్టు

  దలగ సరిదిద్దు కొనుచు విద్యను గడించ

  గురువులున్ సంతసింతురు గొప్పగాను.

  **********************************

  రిప్లయితొలగించండి
 30. డా.పిట్టా సత్యనారాయణ
  లాభసాటి బేరమటన్న లావుగాను
  సంస్థలను బెట్టి రుసుముల చాల గనుచు
  శిష్యులను బిల్చి గురువుల శీల మరయ
  గురుల దోషంబులన్ శిష్యకోటి బట్టు!
  గురువు శిష్య పాపములనున్నిరవుగాను
  పట్టునన్నది యార్యోక్తి,బ్రతుకు కొరకు
  ధనికు సంస్థనబని జేయ ధర్మ మిపుడు
  గురుల దోషంబులన్ శిష్య కోటి పట్టు!
  పరువు బ్రతిష్టలెన్న బహు పారగుడీతడటంచు బేరు నా
  బరువగు బోధనల్ గరుప బట్టిన కూలికి విద్య నేర్ప నా
  దరము నెరుంగరా చదువు దారుల నెంచగలేక యూరకే
  గురువుల తప్పు పట్టుటయె గూర్చు యశంబిల శిష్యకోటికిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సంస్థను' అనండి.

   తొలగించండి
 31. మిస్సమ్మ (1955):

  చురుకుగ నౌషధమ్ములను చూర్ణము గొట్టు భిషక్కుడొక్కడున్
  పరుగిడి పోవు గోవులవి బాటలు చెప్పు డిటెక్టివొక్కడున్
  కరవున వృత్తి కోరుచును కాపుర మొల్లెడి కల్ల దంపతుల్...
  గురువుల తప్పు పట్టుటయె కూర్చు యశంబిల శిష్యకోటికిన్ :)

  రిప్లయితొలగించండి