కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్"
లేదా...
"ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్"
లేదా...
"ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే"
చేతలలో శూన్యముగా
రిప్లయితొలగించండికోతల పెక్కింటిఁబల్కి కుదురే లేకన్
నాతులకడ బీరములిడి
ఖ్యాతినిఁగన్నట్టి వీరఁడన నుత్తరడే.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రీతిగ పార్థుని సారధి,
రిప్లయితొలగించండిరీతిగ నభిమన్యు బావ, రిమిఝిమ్మనుచున్
తాతగ జనమేజయునికి,
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రీతిగ రణమున గెలువగ
రిప్లయితొలగించండిజూతిగ నేబోద మన్న సూతుడు లేడే
హేతువు తెలుపగ నాతడు
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే
------------------------------
జూతి = వేగము , వడి , జవము, తొందర
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఓ తియ్యటి కల గంటిన్,
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే!
మాతా! పూరణ యాయెన్
బో! తిరిగి నిదురన జారు కొమ్మ జిలేబీ !
జిలేబి
జిలేబీ గారు: శుభోదయం! మీరు యతి భంగం చేశారని నేను నమ్మను. గూగులమ్మను వరమడిగితే ఈ క్రింది యతి పట్టిక లభించినది. వీనిలో మీ నాల్గవ పాదం లోని యతి ఏదవునో?
తొలగించండి1.యుష్మదస్మఛ్ఛబ్దయతి
2.పరరూపయతి
3.ప్రాది యతి
4.నిత్య సమాస విశ్రాంతి
5.దేశ్యనిత్యసమాసయతి
6.నిత్యయతి
7.రాగమసంధివళి
8.విభాగవళి
9.నామాఖండమిశ్రమం
11.కాకుస్వరవళి
12.ప్లుతయుగ విశ్రామము :)
తొలగించండిజీ పీ యెస్ వారు
మాయమ్మ చందసు సాఫ్టౌ :)
తప్పులున్న క్షమ ! యిన్ని వివరాలు నాకు తెలియవు!
మాతా పూరణ యాయెనొ
కో ... అంటే సరిపోతుందా ?
మా గొంగటి అయ్యవారు వచ్చి నన్ను వాయించకుంటే యివ్వాళ నాకు చీర్సు దినమే :)
సావేజిత
జిలేబి
__/\__
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిసవరించిన తరువాత మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచేతల లో దైన్యతయును
కోతల లో గొప్పతనము కొందలమందన్
ఊతమె విధి బార్థుని గను
ఖ్యాతిని గన్నట్టి వీరుడన నుత్తరుడే!
జాతిని జూడ రత్నమట జారినయట్టి వెలుంగు సీసపుం
భాతిని జన్మ నెత్తినను భాగ్యము తోడుగ రాగ వీరుడౌ
జూతును కర్ణు గాథయన జోడుగ రాని యదృష్ట రేఖ, వి
ఖ్యాతిని గన్న వీరుడెవడన్నపు డుత్తరు నే దలంచెదన్!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండిమోతక బీరము లాడెను
భీతిని జెంది యని నరుని వెనుకకుదిరుగన్
జోతలు జేసెనను నప
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మోతక'....?
మాస్టరుగారూ ధన్యవాదములు..
తొలగించండిఅది టైపు పొరబాటు...మోతక ను మోతగ గా సవరిస్తున్నాను
మోతగ బీరము లాడెను
భీతిని జెంది యని నరుని వెనుకకుదిరుగన్
జోతలు జేసెనను నప
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే.
చేతల జేవను జూపక
రిప్లయితొలగించండికోతలనే గోయుచుండి కూరిమి తోడన్
నా తుల బొగడ్త లందుచు
ఖ్యాతిని గన్నట్టి వీరుడననుత్త రుడే
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూతికి మీసము లేకనె
రిప్లయితొలగించండిభీతినెరుంగక రణమున విల్లు ధరించన్
రీతిగ మారిన విజయుని
ఖ్యాతిని గన్నట్టి వీరుడన నుత్తరుఁడే
అద్భుతం!
తొలగించండిG.P Sastry గారికి ధన్యవాదములు.
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
G.P Sastry గారికి ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిఉత్తర గోగ్రహణంలో:
రీతిం బోరెను పార్థుడు
ఖ్యాతిని గన్నట్టి వీరుడన; నుత్తరుడే
భీతిం గొనుచున్నా యని
నో తలపాగను గ్రహించె నుత్తర కొసగన్!
నా రెండవ పూరణము:
తొలగించండిఆతడు సంపదల్ బడసి
యార్తుల గానక భోగియౌను, సం
ప్రీతిని త్యాగమార్గమున
వేదన బాప నొకండు నిల్చు, నీ
రీతిని గాంచ సంఘమున
రేయిబవల్ ప్రజలందు మెల్గి, వి
ఖ్యాతిని గన్న వీరుడెవ
డన్నపు డుత్తరునే దలంచెదన్!
వీరుడు=శ్రేష్టుడు
ఉత్తరుడు=తర్వాతివాడు
శ్రేష్ఠుడు...
తొలగించండిశిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో '..గొనుచున్నా యనినో' అన్నచోట 'గొనుచున్నను' అనియా మీ భావం? అలాగైతే 'కొనుచున్నా' అనడం వ్యావహారికం. "భీతిం గొనియు సమరమున।నే" అందామా?
గురువు గారూ....నమస్సులు. భీతిన్+కొనుచున్+ఆ+అనిన్+ఓ+తలపాగను....ఒప్పునా?!
తొలగించండిఒప్పుతుంది.
తొలగించండిధన్యవాదములు.
తొలగించండిభీతి దురమువీడియు వి
రిప్లయితొలగించండిఖ్యాతుడగు విజయునిరూపుఁ గని కరమౌ సం
ప్రీతి నతని సారథియై
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
...………………………………………............
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
చేతును భ౦డనమ్ము కురుసేనల తార్కొని |
…………… వారి గొ౦తుకల్
కోతును ఖస్సుమ౦ చనుచు కోతల గోసిన
…………… వీరసి౦హుడే
భీతిలె | నైననున్ బటు గభీరిమ మీర
………..... కిరీటికి న్నత౦
డా తరి కౌశలమ్ముగల స్య౦దన చోదకు
………… డయ్యె నౌర ! వి
ఖ్యాతిని గన్న వీరు డెవ డన్నపు
………… డుత్తరునే దల౦చెదన్ !
{ గభీరిమ = గభీరము = గా౦భీర్యము ;
స్య౦దన చోదకుడు = రథము నడుపువాడు
........................ రథ సారధి }
ి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాతుల తోడబీరములనాడి రణమ్మున సేనఁ గాంచి తా
రిప్లయితొలగించండిభీతిని బొంది కంపమున వేడె బృహన్నల తేరుఁ ద్రిప్పగన్
చేతము సంతసిల్లఁ గని చిత్రముగా నరు రూపు, సూతుడై
ఖ్యాతిని గన్న వీరుడెవడన్నపు డుత్తరు నే దలంచెదన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏతరి నైన మానవుల కిద్ధర ధర్మ చరిత్ర మేలగున్
రిప్లయితొలగించండిపాతక కార్య చిత్త సహవాసము కీర్తి వినాశ కారియౌ
భూతల మందు నున్న ఘన పూరుషు లర్కజ పార్థు లందునన్
ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్
[ఉత్తరుఁడు = అనంతరము చెప్పబడిన వాఁడు]
జాతక్షత్రియ వీరుడు
వీత భయభ్రాంతుడు జన విదితప్రౌఢ్యా
భూతిని నర సారథ్యపు
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే
కవిరాజులకు బహుపరాక్కులు!!
తొలగించండిమీ మొదటి పద్యమమోఘము!
🙏🙏🙏🙏🙏🙏
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండికర్ణార్జునులలో ఉత్తరు డుత్తముడన్న మీ మొదటి పూరణ, నర సార్థ్యపు ఖ్యాతిని పొందిన ఉత్తరకుమారుని ప్రస్తావనతో రెండవ పూరణ అత్యద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
ఉద్యోగరీత్యా ఉత్తర భారతంలో ఉన్నారు గాని ఆంధ్రదేశంలో ఉండి ఉంటే కవివరేణ్యులుగా కీర్తి గడించేవారు. తెలుగువాళ్ళకు మీ సాంగత్యపు టదృష్టం లేదు!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కడుంగడు ధన్యవాదములు.
తొలగించండిప్రస్తుతము పద్య పఠన రచనాది వ్యాసంగమే ప్రధానోద్యోగము. “శ్రీమదాంధ్ర సుందర కాండ” రచన యందు నిమగ్నుడను.
డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
మీ మొదటి పూరణ అద్భుతమండీ.
తొలగించండిదురదృష్టవశాత్తు నాకు తెలుగు రాదు. ఆంగ్లంలో శ్రీ కామేశ్వర రావుగారి ప్రతిభకు సరిపడే పదం ఒకటే!...GENIUS..
తొలగించండిహనుమచ్ఛాస్త్రి గారు , ప్రభాకర శాస్త్రి గారు ధన్యవాదములండి.
తొలగించండిఖ్యాతిని గన్న వీరు డెవడన్న పు డుత్తరునే దలంచెదన్
రిప్లయితొలగించండిమీత లపట్లుగా గలదు మేమిపు డేమియనంగ లేముగా
నాతలపెన్నగా వినుడు నాకవి భుండుని సూనుడే సుమా
ఖ్యాతిని గన్న భీరు డె వడన్న పుడు త్తరురునే దలంచెదన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నాకవిభూత్తమ సూనుడే' అనండి.
నాతుక జనములలో తన
రిప్లయితొలగించండిపోతరమును తానె పొగడి పోటరి ననుచున్
మూతిని మీసలు ద్రిప్పిన
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నాతుక/ నాతుల'...?
గురుదేవులకు ప్రణామములు స్త్రీ పదమునకు పర్యాయపదములునాచి,నాతి,నాతుక,
తొలగించండినారీ,ఇత్యాదులు.
వివరణ ఇచ్చి నా సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోతల గొల్లల గోయుచు
తొలగించండినాతుల నెదుటను నటించు నాయకుని వలెన్
చేతల లేమి బెనుయప
ఖ్యాతిని గన్నట్టి వీరుడన నుత్తరుడే!
గుఱ్ఱం సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కోతల గొల్లగ..' అని మీ అభిప్రాయం కావచ్చు. 'నాతుల యెదుటను...' అనండి.
గురువు గారికి నమస్కారాలు! ధన్యవాదములు! నా యభిప్రాయాన్ని సరిగా గ్రహించారు! తప్పులు సవరిస్తాను!
తొలగించండినాతిశయమ్ము ఘోర కదనమ్మున కౌరవసేన గర్వమున్
రిప్లయితొలగించండినా తనయుండు తానొకడె నాశము జేసెనటంచు నెంచి సం
ప్రీతి విరాటరాజు పలు రీతుల పొంగుచునిట్లనెన్ జగత్
ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్
నేమాని రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేతనము బెంచె సారథి
రిప్లయితొలగించండిభీతిని బోగొట్టె యోద్ధ బిగువున్ బెంచెన్
నూతన శక్తిని గొని ప్ర
ఖ్యాతిని గన్నట్టి వీరుడన నుత్తరుడే
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచేతలు పలుకుల లోన
న్నేతులు బల్కుచు నిరతము నెక్కటి వలెనున్
పోతరమెత్తుచు నుండెడి
ఖ్యాతిని గన్నట్టి వీరుడన నుత్తరుడే
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా తగు సారధి యుండిన
రిప్లయితొలగించండిజూతురు నా శౌర్యమనుచు, జూచి పగతుర
న్నాతుర తన్ పరుగిడి యప
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినాతి జనమ్ములన్ తన యనన్యసమాన పరాక్రమమ్ముతో
పోతరమొప్పయుద్ధమును పోడిమి సేతు నటంచు పేర్కొనెన్
సూతుడులేమి,పేడి,రథచోదకుడై చని సంగరమ్మునన్
ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
కోతలు కోసెను డాబుగ
నాతుల ముందు;రిపుసేన ననియందుగనన్
భీతిలి వెనుదిరిగి యప
ఖ్యాతిని గన్నట్టి వీరుడన నుత్తరుడే.
***********************************
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేత ధనువు గలదు వినుము
రిప్లయితొలగించండిసూతు లెవరులేరు నేను జోరుగ పోరున్
చేతునను గొప్పలాడెడి
ఖ్యాతిని గన్నట్టి వీరుడన నుత్తరుడే.
కోతలరాయడన భువిని
ఖ్యాతిని గన్నట్టి వీరుడన నుత్తరుడే
చేతల యందున ధీరత
నేతీరుగనైన గాంచ నిటశక్యంబే?
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కోతలు కోసియు డాబుగ...అని చదువగలరు.
రిప్లయితొలగించండికోతలు కోసియు డాబుగ...అని చదువగలరు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి🙏🌺విజయాయ నమః🌺🙏
రిప్లయితొలగించండిభూతపతిప్రదత్త వర పుణ్య మహాస్త్ర ధనుండు తచ్ఛరా..
ఘాత నిపాత శత్రుచయ కార్ముకుడై రణమందు నిల్వగా
భీతి దవాగ్ని రేగె నరివీర చమూ వనమందు, పార్థవి..
ఖ్యాతినిఁ గన్న వీరుడెవడన్నపు
డుత్తరునే దలంచెదన్ !!
(కన్న = చూచిన)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
నేతులు తాగిరి తాతలు
రిప్లయితొలగించండిమూతుల వాసన గొనమన మూఢుల వోలెన్
కోతల రాయుఁడను నప
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే
పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోతలు గోయుటందు గడు గొప్పలు జెప్పుచు యుద్ధమందునన్
రిప్లయితొలగించండిచేతలు జూపుదంచు నతి చిత్రపుమాటల జెప్పుటందు సం
ఘాతముజూసి భీతిలుచు కాలికి బుద్ధిని జెప్పుటందు వి
ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్!
బొడ్డు శంకరయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాతో గురువిట్లనె ప్ర
రిప్లయితొలగించండిఖ్యాతుడు భీముండె ? నరుడె ? గాండీవి యనన్ .
నే తడుముకొనక జెప్పితి
ఖ్యాతిని గన్నట్టి వీరు డన నుత్తరుడే
(ఇక్కడ ఉత్తరుడు అంటే పైన పేర్కొన్న పేర్లలో రెండవ పేరు ఎవరిదైతే అతడు వారు అని భావం.)
ధనికొండ రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.