5, ఫిబ్రవరి 2017, ఆదివారం

సమస్య - 2274 (రమణి యజ్ఞోపవీత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రమణి యజ్ఞోపవీత ధారణముఁ జేసె"
లేదా...
"అలరుంబోడి ధరించె సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్"

44 కామెంట్‌లు:

 1. బిడ్డ పుట్టగ మెడచుట్టు బొడ్డు తాడు
  చుట్టు కొనినచో బ్రాహ్మడు పట్టు పట్టి
  తాడు వెండిది తొడిగించ; నాడు "బేబి
  రమణి" యజ్ఞోపవీత ధారణముఁ జేసె!



  ...ఈ ఆచారం ఇప్పటికీ మా వంశములో నున్నది...బారసాల అవగానే "వెండి జంధ్యం" పురోహితుడు స్వాహా!

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. సవరణ

   గలదమ్మా రమణీ మనోన్మణిగ మేల్గాంచన్, రమాకాంతయై
   వెలుగై నిర్మల శక్తియై యిలని సావిత్రీ మహామంత్రమై
   గలదే యందరికిన్నుపాయమది, సాకారంబు గావింప నౌ
   యలరుంబోడి ధరించె సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్!

   జిలేబి

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనోన్మణిగ'....? 'యిలను' అనండి.

   తొలగించండి

  3. తెలుగు నిఘంటువు మనోన్మని అంటోందేమిటండి ?
   మనోన్మణి మందహాసిని మంజులవాణి మాతే ... ముత్తయ్య భాగవతార్ శుభ పంతువరాళి రాగం

   कमाल है ; not sure

   జిలేబి

   తొలగించండి
 3. వేద పఠనము గావించ వేడు కగును
  యజ్ఞ యాగము లన్నను పరమ ప్రీతి
  తాను క్రతువును చేయగ తనరు మదిని
  రమణి యజ్ఞోప వీత ధారణముఁ జేసె

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా సత్యనారాయణ
  హక్కులకు బోరు నారికి నవనియందు
  బాధ్యతలు నుండ దగునని భవ్య దీప్తి
  నంద నాధ్యాత్మ రంగము నందు జొరగ
  రమణి యజ్ఞోపవీత ధారణము జేసె!
  తెలియంగా నిది భూతయజ్ఞముసుమీ!తీటన్ భుజాల్గోకగా
  వలయున్నెంతటివారికైన యిదియే వాల్లభ్యమౌ; బ్రాహ్మణుం
  డలవోకన్ దన జందె మందులకనన్నాడించగా జూచెనో
  అలరుంబోడి ధరించె సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్!

  రిప్లయితొలగించండి
 5. ఆటలమ్మ వచ్చును చిన్న నాటి వేళ
  పడుచు తనమందు మరియును వయసు మీర
  సంతరించ జంధ్యాలది సర్పి యపుడు
  రమణి "యజ్ఞోపవీత" ధారణముఁ జేసె!



  జంధ్యాల సర్పి = herpes joster

  రిప్లయితొలగించండి
 6. వార్షికోత్సవమందున పాఠశాల
  నందు విద్యార్థి వేయగా నాటకమ్ము
  వటువు పాత్రకు వేషమ్ము వైచువేళ
  రమణి యజ్ఞోప వీత ధారణముఁ జేసె.

  రిప్లయితొలగించండి
 7. వేద శాస్త్రాధ్యయన మందు పేరునొంది
  యుపనిషద్భావ వీధుల నూర్మి గలిగి
  నిత్య సాధనానుష్ఠాన నియమ భాసు
  ర, మణి యజ్ఞోపవీత ధారణము జేసె!

  రిప్లయితొలగించండి
 8. అచ్చెరు వదియేమి సుకవీ! యాది నుండి
  యయ్య వామభాగిని గాగ నమ్మ వారు
  యర్ధనారీశ్వరి యనగ నౌచితిగను
  రమణి యజ్ఞోపవీత ధారణము జేసె!


  యజ్ఞోపవీతాన్ని యెడమ వైపు నుండి ధరిస్తారు!

  రిప్లయితొలగించండి
 9. నాదుకొమరునినుపనయనముదినమున
  వేదమంత్రాలఘోషణవిబుధవరుల
  పిక్కటిల్లగదశదిశల్లొక్కసారి
  రమణి!యఙ్ఞోపధారణముజేసె

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. తేటగీతి తేటతెల్లముగ నున్నది. అద్భుతం!
   "బాహ్మణుల" టైపాటు గదా!

   తొలగించండి
  2. వృత్తము కూడ అర్ధమైనది. విరుపు అందముగ నున్నది. తల్లిని రెండు కామాల మధ్య బంధించుట మంచి పని!

   తొలగించండి
  3. శాస్త్రి గారు నమస్సులు. అవునండి బ్రాహ్మణుల అని యుండవలసినది. గమనించలేదు . ధన్యవాదములు. సవరించెదను.

   తొలగించండి
  4. బంధు మిత్రుల శుభకర భాషణములఁ
   దల్లిదండ్రు లాశీస్సుల నుల్ల మలర
   బ్రాహ్మణుల వేద సన్మంత్ర వచనము లమ
   ర మణి యజ్ఞోపవీత ధారణముఁ జేసె


   కలధౌతశ్రుతి మంత్ర భాషణము లోంకారప్రభూతమ్ములై
   చెలగన్బాంధవ మిత్ర సంచయపు టాశీర్వాదముల్ మ్రోగగన్
   నలినావిర్భవ వంశ జాతకుడు, నానందించగం దల్లి యా
   యలరుంబోడి, ధరించె సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్

   [కలధౌతము = అవ్యక్తమధుర ధ్వని]

   తొలగించండి
  5. రెండు "కామాలు":

   ...విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ...

   ...బృహదారణ్యక ఉపనిషద్

   తొలగించండి
 11. క్షిపణి పచ్చని ధూమంపు సృతియె తీరె
  సూర్యబింబమ్ము మీదుగన్, జూడ నంబ
  రమణి యజ్ఞోపవీత ధారణముఁ జేసె
  యన్నటుల కనువిందయ్యె నాకశాన!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అత్యద్భుత మైన అలంకారము! రాకెట్ విడిచిన పొగలు సూర్య భగవానుని జంధ్యము వలె చుట్టు కొనుచున్నవి అనిరి కదా?

   తొలగించండి
 12. కలుగన్ గర్భిణి కొక్కనాడు కవలల్ కన్యా కుమారుల్, భళా!
  చెలి జందెమ్మును, స్వర్ణ హారములనుంచెన్నాపయిన్, కూతురా
  యలరుంబోడి ధరించె; సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్
  తులలేనట్టి దటంచు దాల్చె సుతుడున్ తూగాడుచున్ వేడ్కతో

  బ్రహ్మ, మతిచెడి , పురుషుని పడతియనుచు
  బంప భూమికి విజ్ఞులు ప్రజకు దెలుప
  రమణునికి యుప నయనం రక్తిఁజేయ
  రమణి యజ్ఞోపవీత ధారణముఁ జేసె

  రిప్లయితొలగించండి
 13. వేద మాత గాయత్రి దీవెనల నంద
  ఆత్మసంభవుండిల వటుడైన వేళ
  మానసములు ముదము నందె! మా గృహాంబ
  రమణి యఙ్ఞోపవీత ధారణము జేసె!
  (మా గృహాంబరమణి = మా ఇంటి సూర్యుడు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగున్నది శ్రీధర రావుగారు! మా గృహాంబరమణి పెళ్ళికి వారం రోజుల ముందు వటువుగా పాస్పోర్టు పొందెను!

   తొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:
  గురువుగారూ! నమస్కారములు. దయతో క్రింది పూరణలనన్ని పరిశీలించగలరు.

  02-02-2017:

  పోరాడుము పాపుల సం
  హారము లేకున్న నగు మహాప్రళయమ్మే
  గౌరికని బల్కి కౌరవ
  పోరుకు పార్ధుని మురారి పొంకించెనుగా!

  03-02-2017:

  పూర్తగు నవసరము వరకు
  ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుడు; సుజను
  న్వర్తనలో కన్పించెడి
  కీర్తిని నిరతము పట్టగ కెరలుచు నుండుమో!

  04-02-2017:

  దుష్ట తత్వము నెంచెడి దుర్జనులను
  పరిహరింపగ ననువగు పథకమెంచి
  పద్మినీశయు డాహరి భక్తజనవ
  శంకరుఁ డవతరించి దాశరథి యయ్యె

  05-02-2017:

  వేద విహిత ధర్మముల తోడ విప్రవరుడు
  తన కొమరున కుపనయనమున ననువగు
  లగ్నమెంచుచుండి శుభ కాలమ్మది నమ
  ర, మణి యజ్ఞోపవీత ధారణము జేసె!

  రిప్లయితొలగించండి
 15. సకల వేదపురాణ శస్త్రవిదులైన
  శ్రీయుతుల కుటుంబమున విశేష రీతి
  నలర ఉపనయనోత్సవమందు భూసు
  రమణి యజ్ఞోపవీత ధారణముఁ జేసె

  రిప్లయితొలగించండి
 16. ఒదవ తూరుపు దిక్కున చదలు నంబ
  రమణి, యజ్ఞోప వీత ధారణముఁ జేసె
  వటువు పెద్దలు దీవించ పదుగురెదుట
  తల్లిదండ్రులు కరమగు తనివినొంద

  రిప్లయితొలగించండి
 17. పగతుర దునుమాడె నచట భండనమున
  రక్తమేరులై పారెనా ప్రాంగణమున
  విడిచె నెత్తురంటెననుచు వీరుడు సమ
  రమణి, యజ్ఞోప వీతధారణము జేసె

  కులభేదమ్ము సహింపరో ప్రియుడ నన్ గోరంగ సాధ్యమ్ము కా
  దిల సత్యమ్ము వచించినన్ వినుము నీదే గోత్రమంచడ్గ వి
  ప్రుల మేమంచును జెప్పుమింక సఖుడా! బొంకైనదే కోరెనా
  యలరుంబోడి, ధరించె సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్

  రిప్లయితొలగించండి
 18. చింతన,శరణాగతి,హరిసేవలనెడి
  దారముల జన్నిదములుగా తనర జేసి
  శివమునున్ ప్రసాదించ భాగవత మనెడి
  రమణి యజ్ఞోపవీత ధారణము జేసె

  రిప్లయితొలగించండి
 19. ఉన్నదొకకూతురాయె మహోన్నతుడికి
  చదువు సంధ్యలు నేర్పించిచక్కబరచ
  రమణి యజ్ఞోప వీతధారణము జేసె
  అబల గాదనివిద్యలసబలయనుచు
  2.విలువల్ లెక్కిడ బోక లోకులిల నిర్వీర్యంపుశాస్త్రోక్తులై
  కలిలోస్త్రీలునుసంధ్య వార్తురట| సంకల్పంబులాసించియున్
  పలుకుల్ నేర్చినభావనా ప్రతిభసంబంధాన లాభేక్షతో
  అలరున్ బోడి ధరించె సంతసమునన్ యజ్ఞోప వీతమ్మునున్.

  రిప్లయితొలగించండి

 20. పిన్నక నాగేశ్వరరావు.

  జందెమున్ శరీరము నుంచి జారిపోవ

  క్రింద పడినట్టి దానిని యందుకొనియు

  రమణి ; యజ్ఞోప వీత ధారణము జేసె

  హస్తములు లేని తన భర్త కపుడు వేగ.

  *********************************

  రిప్లయితొలగించండి
 21. కవిమిత్రులు మన్నించాలి!
  ఉదయం ఒక పుస్తకావిష్కరణ సభకు వెళ్ళి అలసి వచ్చాను. కొద్దిగా జ్వరం, మానసిక ఆందోళన. ఇప్పటికి మీ పూరణలను సమీక్షించలేకున్నాను. వీలైతే రేపు ఉదయం పరిశీలిస్తాను.

  రిప్లయితొలగించండి
 22. "అలరుంబోడి ధరించె సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్"

  అలరుంబోడి యొకత్తె సంతుగను తానావిర్భవించంగ తా
  తలవన్ జాలని రీతినిన్ పితయె తత్కాలంపు నిర్యాణమై
  బలవంతమ్మగు కర్మలన్ తనయయే భారమ్ము దాల్చంగ
  నలరుంబోడి ధరించె సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్

  తత్కాలము = that time

  రిప్లయితొలగించండి