9, ఫిబ్రవరి 2017, గురువారం

సమస్య - 2278 (పంటల నొసంగని...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పంటల నొసంగని పొలము పసిఁడి నిచ్చు"
లేదా...
"పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

58 కామెంట్‌లు:

 1. నల్ల బంగార మనగనో నెల్లరెరుగు
  తైల మదియె పెట్రోలను మైల నూనె
  సౌది మరుభూమిలో పుట్టు బూది లోను...
  పంటల నొసంగని పొలము పసిఁడి నిచ్చు


  black gold

  Crude petroleum oil, so called for its black color and extremely high value

  http://idioms.thefreedictionary.com/black+gold

  రిప్లయితొలగించండి
 2. డా.పిట్టా సత్యనారాయణ
  చెరువు కావలి భూముల చేష్ట లుడుగ
  సాగరుల దేల్చ మరుభూమి సత్వ మెసగె
  నష్ట పరిహారమే మేలు, నాడు నేడు
  పంటలనొసంగని పొలము పసిడి నిచ్చు!
  కుంటల్ మట్టిని గూడినన్ చెరువులే గూలంగ గండిన్ వడన్
  మింటన్ బండిన నీరు కాల్వల బడన్ మిర్రుల్ సరుల్ గావు; నే
  గంటిన్ నా తెలగాణ రాష్ట్రమగుటన్ గట్టెక్కె నీ యాపదల్
  పంటల్ పండని భూమి రైతులకిడున్ బంగారమున్ చిత్రమే!

  రిప్లయితొలగించండి
 3. ధరను శపియించ పార్వతి వరమ టంచు
  వివిధ రూపములను దాల్చి వేరు పడగ
  గనుల నిండుగ బంగారు ఘనత నొంది
  పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు

  రిప్లయితొలగించండి


 4. మింటన్బోవగ సెంటు భూమి ధరలౌ మేల్గాంచి రైతన్న వె
  న్వెంటన్నా యమరావతీ నగర నైవేద్యంబు గావింప గా
  గంటారావము జేయ, జైట్లి సమతా గానంబు జేర్చెన్ భళీ
  పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. విద్యలందున వెనుకంజ వేయుచుండు
  చదువులందున వాడు నిస్సత్తువేను
  కాని సాంకేతికపు మేథ కలిగయుండు
  పంటల నొసంగని పొలము పసిఁడినిచ్చు

  రిప్లయితొలగించండి
 6. పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు
  నందు సందియము వలదార్య !యాపొలమున
  వ రుసనిండ్లను గట్టిన వలసి నంత
  ధనము నార్జింప వచ్చును దధ్య మిది య

  రిప్లయితొలగించండి
 7. మిత్రులందఱకు నమస్సులు!

  పంటల్ పండవటంచుఁ దల్లడిలుచున్ బండంగ శాస్త్రజ్ఞులన్
  వెంటం దెచ్చియుఁ జూప నట్టి భువిలో వెల్గొందు బంగారపుం
  దుంటల్ గొండల రీతి నుండె నన సంతోషించె రైతన్నయే!

  పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ జిత్రమే!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిన్న సవరణతో...

   పంటల్ పండవటంచుఁ దల్లడిలుచున్ బండింప శాస్త్రజ్ఞులన్
   వెంటం దెచ్చియుఁ జూప నట్టి భువిలో వెల్గొందు బంగారపుం
   దుంటల్ గొండల రీతి నుండె నన సంతోషించె రైతన్నయే!
   పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ జిత్రమే!!

   తొలగించండి
  2. గుండు మధుసూదన్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 8. ప్రజల కోరిక నెరవేర్చ ప్రభుత కూర్చు
  ఎత్తి పోతల పథకము నేర్పడంగ
  నీటి పారుదల యమరి నిరుడు యెట్టి
  పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. శబ్ద భావ కవనము నోచ దకట యట
  రయమునం దికమక కూతల కలగలపు
  మాటల చలన చిత్ర నిర్మాతల తలు
  పంటల, నొసంగని పొలము, పసిఁడి నిచ్చు

  [తలుపు +అంటు+అలన్ = తలుపంటలన్; ఒసంగని = ఇవ్వని; పొలము = విధము: ఎవ్వరూ యివ్వని విధము ]


  కంటిం జిత్రము లెన్న నేరమిక నౌకల్ బండ్లుగన్ మారెనే
  తొంటిన్బండ్లు కలమ్ము లాయె నిట సంతోషమ్ము గల్గించుచున్
  మింటిన్నంటు విమానయాన కరణన్ మిఱ్ఱైన వ్యర్థంపు టీ
  పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చిన్న సందేహము.
   అంటు, అంటుము. అంటలన్ (అంటు +అలన్), అంటుమలన్ రెండు రూపములు సాధువులేనా లేక “అంటుమలన్” అనడమే సాధువా?
   అడుగతనిని , అడుగుమతనిని ల వలె.

   తొలగించండి
  2. పలికితనిన ; పలికితివనిన:
   "...బరమ బ్రహ్మణ్యుల నేమి కారణంబున నుదరి పలికితనిన గంధర్వుండిట్లనియె." భార. ఆది. 7.55.

   తొలగించండి
  3. అబ్ధి మీన నిలయము రత్నాకరమ్ము
   నడవి యౌషధ వృక్షరా జాకరమ్ము
   శైల రాజము వరధాతు సంహితమ్ము
   పంటల నొసంగని పొలము, పసిఁడి నిచ్చు

   [పొలము = ప్రదేశము]

   తొలగించండి
  4. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉన్నవి. రెండవ, మూడవ పూరణలు ఉత్తమంగా ఉన్నవి. మన్నించాలి... మొదటి పూరణలో మీ భావం అవగతం కాలేదు.
   మీరు వెలిబుచ్చిన సందేహం విషయంలో నాదీ సందిగ్ధస్థితియే.

   తొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   ఆసందేహము వలననే మూడవ పూరణ చేసితిని.
   ఛందో బద్ధ పద్యాలతో కాక యపశబ్దపు పాటలతో నిర్మాతల తలుపు తట్టితే యెవరూ యివ్వని విధముగా కనక వర్షము కురుయునని నా భావము.

   తొలగించండి
 10. తంటా లేలనొ నేటి కాలమున ప్రా
  ప్తంబయ్యె నెన్నో నిధుల్
  పంటల్ రాలని చోటులన్నిటను జూ
  పట్టెన్ గదా "ప్లాటు" లై
  కంటన్ వెల్గులయెన్నిజంబు గద బిం
  కంబేలనో బీడనన్
  పంటల్ పండని భూమి రైతులకిడున్ బంగారమున్ చిత్రమే!

  రిప్లయితొలగించండి
 11. బరగ నత్యద్భు తమ్మైన పట్టణముగ
  నాంధ్ర నమరావతే యని యాక్రమించి
  పంచ కనకము రైతుకు బంజరులకె
  పంటల నొసంగని పొలము పసిఁడి నిచ్చు

  మింటిన్ గొల్చుచు భక్తి తత్పరత భూమిన్ దున్ని యాసించగా
  కంటన్నీరె లభించు గాని కురువం గాబోదు వర్షంబటన్
  తంటాలేలని రాజధాని కయి నేతల్ గోర నర్పించగన్
  పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'అమరావతి+ఏ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి

 12. పిన్నక నాగేశ్వరరావు.

  పట్టణ శివారు నందున్న మెట్ట భూమి

  నింటి స్థలమునకై ధరనెంత గానొ

  పెంచ పోటీలు పడి ,భూమి విలువ పెరిగె

  పంటల నొసంగని పొలము పసిడినిచ్చు.

  *********************************

  రిప్లయితొలగించండి
 13. పూనికగ సాగు సేయక పోవ నంత
  పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు
  ననుచు వరిని కాదని హరితాంగణమును
  రొయ్యల చెఱువుగా మార్చకయ్య రయిత!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారు:
   అద్భుతం...
   "...మార్చవయ్య" ;)

   తొలగించండి
  2. జీ పి శాస్త్రి గారికి వందనములు, ధన్యవాదములు. " మార్చి వెయ్య తగదు "

   తొలగించండి
  3. శ్రీధర రావు గారూ,
   మీ సవరణతో పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. గుంటలు,శిలలు,మెండుగ కంటకములు
  గల్గు యా పొలమున లోతు గర్తమందు
  వాహ్యముల్ నడపు చమురు బావి యుండ
  పంటల నొసంగని పొలము పసిఁడి నిచ్చు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గల్గు నా పొలమున..' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులసూచనతో సవరించిన పద్యము
   గుంటలు,శిలలు,మెండుగ కంటకములు
   గల్గు నా పొలమున లోతు గర్తమందు
   వాహ్యముల్ నడపు చమురు బావి యుండ
   పంటల నొసంగని పొలము పసిఁడి నిచ్చు.

   తొలగించండి
 15. తీర ప్రాంతములన్నింట తీరుగాను
  యోడరేవుల యభివృద్ధి యూతమిడగ
  నుప్పు భూములు ధనరాశు లొప్పగాను
  పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తీరుగాను+ఓడ..' అన్నపుడు 'తీరుగా నోడ..' అవుతుంది. 'తీరు చెలగ। నోడ..' అనవచ్చు.

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు! ప్రతి సారీ సంధులు తప్పుతున్నవి! పెద్ద మనసుతో సవరించుచున్నందుకు కృతజ్ఞతలు! 🙏🙏🙏🙏🙏

   తొలగించండి
 16. పాడుపడిన తాతలనాటి బాడువఁగని
  పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు
  ననుచు చేపల చెరువుకై నర్థితోడ
  కోరి తాక్రయించె నొకడు కుప్పమందు
  కుప్పముః గ్రామము

  రిప్లయితొలగించండి
 17. తంటాలన్నియు దాటి కేంద్రమిడవిస్తారమ్ముగా సొమ్ములన్
  ఘంటల్ మ్రోగెను రైతుగుండియలలో కాల్వల్ వెసన్ త్రవ్వగన్
  జంటల్ జేరి ధృతిన్ చెలంగి కరమౌ సంప్రీత్రి నర్తించెడిన్
  పంటల్ పండని భూమి రైతులకిడున్ బంగారమున్ చిత్రమే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సంప్రీత్రి'..టైపాటు..

   తొలగించండి
 18. ప్రజల కోరిక నెరవేర్చ ప్రభుత కూర్చు
  ఎత్తి పోతల పథకము నేర్పడంగ
  నీటి పారుదల యమరి నిరుడు యెట్టి
  పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు

  రిప్లయితొలగించండి
 19. "చామలను జల్లి వదలుము భూమినెపుడు"
  యనుచు నుడివిరి పెద్దలె యనువు గాను
  ఫాక్ట రీలను స్థాపింప పనికి వచ్చు
  "పంటల నొసంగని పొలము పసిఁడి నిచ్చు"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఎపుడు+అనుచు = ఎపు డనుచు' అవుతుంది. "భూమి నెప్పు। డనుచు..." అనండి.

   తొలగించండి
 20. "చామలను జల్లి వదలుము భూమినెపుడు"
  యనుచు నుడివిరి పెద్దలె యనువు గాను
  ఫాక్ట రీలను స్థాపింప పనికి వచ్చు
  "పంటల నొసంగని పొలము పసిఁడి నిచ్చు"
  శా. గుంటల్ మిట్టలు రాయి రప్పలును గొండంతగా నుండనీ
  దంటుల్ తుప్పలు భూమినంతటను విస్తారమ్ము గానుండనీ
  గుంటూరందున రాజధాని నడుమన్ గొంతైన చేనున్నచో
  "పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే"

  రిప్లయితొలగించండి
 21. పంట వేసెడి సమయాన కంటకంబు
  లమ్మ బోయెడివేళలో సొమ్మురాక
  నష్ట జాతకమందు నయిష్టబడుచు
  పంటలనొసగనిపొలము|”పసిడినిచ్చు
  వాటినమ్మగ సొమ్ముతోకోటియాశ
  2.పంటల్ వంటలె కండబంచుగద|సర్వాభీష్టసంతృప్తికిన్
  అంటీయంటనికంటకంబు ధరలేయన్యాయమేకూర్చగా|
  పంటల్ బండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే
  వంటల్ మానియు మందు బిళ్ళళనెసర్వుల్ వాడు సంబంధమౌ|


  రిప్లయితొలగించండి
 22. క్రొవ్విడి వెంకట రాజారావు:

  బీఱు వారిన తెఱఁగున పెనచు నట్టి
  పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు
  చుండె నతనికశ్రాంతము సూటియైన
  వజ్రముల గని యేర్పడి పశ్చిమమున

  రిప్లయితొలగించండి
 23. పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు
  ననెడి మాట సత్యమగును నవని యందు
  పత్తి తెల్లబంగారమై పంటలల్లె
  యన్నదాతకమితమైన హాయి నొసగు.

  వానలు సకాలమున రాక వసుధ లోన
  బాధ పడుచు నుండెను గదా బడుగు రైతు
  చేయునదియును లేక తా చేలనమ్మ
  పంటలనొసంగని పొలము పసిడి నిచ్చె.

  రిప్లయితొలగించండి
 24. ​మెట్ట మాగాణి భూములు పట్టణమ్ము
  ​నంటి ​యుండియు ​​​ప్రియముగా నమ్మబ​డుచు
  కరవులో బాధ పడుచున్న కర్షకులకు
  పంటల నొసంగని పొలము పసిడినిచ్చు!

  రిప్లయితొలగించండి
 25. గంటల్ గంటలు తిండి లేక నికతా కన్పించ నైశ్వర్యగా
  వంటల్ జేసెడి ముచ్చటైన మగువా భాగ్యమ్మునగ్రమ్మునన్
  తంటాలయ్యను లాయరొక్కడినితా తంత్రాన మంత్రించగా
  "పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే"

  ఐశ్వర్య = నడుము లేని ఒక cinema actress

  రిప్లయితొలగించండి