4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

సమస్య - 3983

5-2-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిరిప మెత్తిన లభియించు సిరులు మెండు”
(లేదా...)
“ఏవిధిఁ గాంచినన్ దిరిప మెత్తిన దక్కును పెక్కు సంపదల్”

35 కామెంట్‌లు:

  1. యాచకుల కెప్పుడు దొరకు నన్నమిచట,

    జలథిజను‌ కొలువగ నేమి కలుగు‌ నెపుడు,

    తక్కువకు వ్యతిరేక పదమ్ము తెలుపు,

    తిరిప మెత్తిన,లభియించు సిరులు, మెండు

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    కృష్ణ రామ మారుత్యాదులింపొదవఁగ
    జనులపాపమ్ము గైకొను మనము తోడ
    విశ్వనాథుఁడై సాయియే భిక్షమెంచి
    తిరిప మెత్తిన లభియించు సిరులు మెండు

    ఉత్పలమాల
    దైవమె రూపు దాల్చి భువి ధన్యులఁ జేయఁగ భక్తకోటినిన్
    పావన సాయిరాముడు నపార దయాళువు విశ్వనాథుడై
    పోవఁగ మానవాళి యఘముల్ మన ముంగిట నిల్చి భిక్షకై
    యే విధిఁ గాంచినన్ దిరిప మెత్తిన దక్కును పెక్కు సంపదల్!

    రిప్లయితొలగించండి
  3. రెక్కముక్కలుజేసినరేయిపవలు
    కడుపునిండుటజూడంగకష్టమగును
    రాజయోగంబుబట్టినరాజ్యమందు
    తిరిపమెత్తినలభియించుసిరులుమెండు

    రిప్లయితొలగించండి
  4. వీడు వీడు దిరిగి వోటు వేయమనుచు
    తిరిప మెత్తిన లభియించు సిరులు మెండు
    పదవినొందగ గాజేయ బ్రజల సొమ్ము ,
    విలువ నెరిగి తగినదాని వేడ మేలు

    రిప్లయితొలగించండి
  5. జీవిత మందునొక్కపరి చిక్కన జాలును
    రాజకీయ సం
    భావన దక్కగానె కడు బట్టువహించియు
    మానవాళికిన్
    సేవొనరింతు నేననుచు జెప్పుచు మ్రొక్కుచు
    నోట్లు బొంది తా
    న్నేవిధి గాంచినన్ తిరిప మెత్తిన దక్కును
    పెక్కు సంపదల్

    రిప్లయితొలగించండి
  6. భావమునందుశ్రీహరినిపాయకమానసనందునిల్పుచున్
    కావగవచ్చునాతడునుకంబమువెల్వడిరక్షసేయగా
    ఆవిరిగాదునెప్పుడునుయాచనజేయగముక్తినాత్మలో
    ఏవిధిగాంచినన్దిరిపమెత్తినదక్కునుపెక్కుసంపదల్

    రిప్లయితొలగించండి
  7. భావమునందుశ్రీహరినిపాయకమానసమందునిల్పినన్

    రిప్లయితొలగించండి

  8. కార్యి కొనుగోలు సరుకుల ఖర్చు గాంచ
    మిగులుటన్నది శూన్యమై మెరమెరలయె
    దొరికినదియెల్ల మిగులునీ ధరణి యందు
    తిరుప మెత్తిన, లభియించు సిరులు మెండు.

    కొనెడు వాడికి దక్కును కొన్నదొకటె
    భిక్ష మెత్తు వాడికిల లభించు కదర
    వలసిన పదార్థములవెల్ల వసుధ యందు
    తిరుపమెత్తిన లభియించు సిరులు మెండు.


    కోవిడు కాలమంచు నట కూలికి పిల్చెడు వారులేక సం
    భావన లేని జీవితము పస్తుల పాలయె నంచు బాధతో
    కోవెల చెంత కూర్చొనిన కూలియొకండట యిట్లు పల్కెనే
    యేవిధి గాంచినన్ దిరిప మెత్తిన దక్కును పెక్కు సంపదల్.

    రిప్లయితొలగించండి
  9. క్రమాలంకారంలో ---
    బిక్షకుల కెట్లు లభియించు బిక్షమిలను?
    ఏవి సమకూరు వణిజుల కిలను జూడ?
    నెట్టు లుండును శీతాద్రి హిమము గనగ?
    తిరుప మెత్తిన లభియించు : సిరులు :మెండు

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది

    క్షుత్తు తీరు //తిరిపె మెత్తిన,లభియించు
    సిరులు మెండు//గాను,పురుషకార
    మున్నఁదనను నమ్ము కొన్న వారిని బ్రోచు
    నట్టి వారిఁగనమె యవని మీద.

    హా!విధివైపరీత్యముగదా!బలి దైత్యుని మూడె యడ్గులన్
    దైవము విష్ణువే యడిగె దానముగా మును వామనుండునై
    యీవలదన్న శుక్రుఁడు ,త్యజించెను ప్రాణము మాట తప్పకే
    యేవిధి గాంచినన్ దిరిపెమెత్తిన దక్కును పెక్కు సంపదల్.

    రిప్లయితొలగించండి
  11. వండుకొనువాని కొకకూర బరగనుండు
    బిచ్చగానికి కొరతేమి? హెచ్చుగుండు
    నన్నసామెత నిక్కమీ యవనియందు
    తిరిప మెత్తిన లభియించు సిరులు మెండు

    రిప్లయితొలగించండి
  12. పౌర సమ్మేళన సభలు పరిఘటించి
    పాదయాత్రలు సలుపుచు సాదరముగ
    పూటకొకచోట దిరుగుచు వోట్లకొరకు
    తిరిప మెత్తిన లభియించు సిరులు మెండు

    రిప్లయితొలగించండి
  13. ప్రభుత్వము ప్రజలను పట్టించుకోకపోతే అంతేగా!

    కావగ రారు పాలకులు కాచిన పంటల నమ్మువేళలన్,
    వావిరి దప్పి కార్యులకు బంధుగణంబుల దూరమేర్పడన్,
    జీవిత మెవ్విధిం నడచు జీతము లందక కార్మికాలి? కిం
    *కేవిధిఁ గాంచినన్ దిరిప మెత్తిన దక్కును పెక్కు సంపదల్.*

    కార్యి-ఉద్యోగి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిరిప మెత్తిన లభియించు సిరులు మెండు
      వాస్తవమ్ములీ పలుకులు వసుధ యందు
      బిచ్చగాండ్రెందఱో గన పెద్దపెద్ద
      భవన ములుగల్గి యుండిరి దైవ కృపను

      తొలగించండి
    2. కోవెల మెట్లమీదబడి కూరిమి నీయుడు నంచు వేడగన్
      బావల బేడయో యికను బన్నుగ నీయగ రోజురోజునున్
      భావన జేసి చూడగను వందలు వందలు వచ్చు గావునన్
      నేవిధి గాంచినన్ దిరిపమెత్తిన దక్కును పెక్కుసంపదల్

      తొలగించండి
  14. చిత్త మందు నిలిపి భక్తి నుత్తమంపు
    నిష్ఠ నూని పూజింపఁగ శ్రేష్ఠ తరము
    పన్నుగను సత్యదేవుని వ్రతము నెంచి
    తిరిప మెత్తిన లభియించు సిరులు మెండు


    కా విల సాటి సంపదలు కాంచనముల్ ధన ధాన్య రాశులే
    యీ వసుధా తలమ్మున మహేశ్వర భక్తికిఁ బుట్ట నేర్చునే
    రావము సెల్గ నార్చినఁ బురాకృత పుణ్యము లేక భక్తియే
    యేవిధిఁ గాంచినన్ దిరిప మెత్తిన దక్కును బెక్కు సంపదల్

    రిప్లయితొలగించండి
  15. తేటగీతి
    ఏక చక్రపురాన కుంతీ తనయులు
    తిరిపమెత్తి గడుపుచును ధీమతులయి
    తిరిగి, బొందిరి ద్రుపదు పుత్రికని సతిగ
    తిరిపమెత్తిన లభియించు సిరులు మెండు
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  16. కావలె నంచు భక్తి యను గారము బిచ్చము వేయ కోరుచున్
    బ్రోవగ నీ ప్రజన్ శివుడు ముక్తి ఫలమ్ముగ నీయ నెంచుచున్
    పావనమౌ నటుల్ మహిని భాసిల జేయును గాదె! యీశ్వరుం
    డే విధి గాంచినన్ దిరిపె మెత్తిన దక్కును పెక్కు సంపదల్!

    రిప్లయితొలగించండి
  17. దైవబలంబు నమ్మినను దానికి నాత్మ బలంబు దోడుతన్
    ధీవరుడై యహర్నిశము దీక్షను బూని సదాశయంబునన్
    చేవను జూపు సాధకుని శ్రీలు వరించుట నిక్కమౌను, లే
    దే విధిఁ గాంచినన్ దిరిప మెత్తిన దక్కును పెక్కు సంపదల్?

    రిప్లయితొలగించండి
  18. కోరక సిరిసంపదలను కూర్మి తోడ
    శారదాంబను వేడుచు శ్రద్ధ బూని
    *తిరిపె మెత్తిన లభియించు సిరులు మెండు*
    గాను తడవును సేయక కదలి రండు

    డా బల్లూరి ఉమాదేవి
    మరొక పూరణ
    బ్రోవుము శారదాంబయని మ్రొక్కుచువేడిన నెల్లవేళలన్
    పావన మూర్తియా జనని వారకచక్కని విద్యలెల్లయున్
    జీవులకిచ్చుచుండునని చిత్తమునందుననమ్మనిచ్చుతా
    *నేవిధి గాంచినన్ దిరిపెమెత్తిన దక్కును పెక్కు సంపదల్*

    రిప్లయితొలగించండి