17, ఫిబ్రవరి 2022, గురువారం

సమస్య - 3995

18-2-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మందు గొట్టిరి తృప్తిగా మగువలెల్ల”
(లేదా...)
“మగువలు మందు గొట్టిరఁట మాఁపటి వేళను దృప్తిగా వెసన్”

21 కామెంట్‌లు:

  1. పెళ్లి‌ పార్టీ కి సతులతోవెళ్ళి నట్టి


    పురుషు లెల్లరు
    కోరికల్ పెరిగి పోవ

    మందు గొట్డిరి తృప్తిగా, మగువ లెల్ల

    చిందు లేయుచు కొట్టిరి చెప్పు తోడ

    రిప్లయితొలగించండి


  2. విత్త మార్జింప వేశ్యలే విటుల కొరకు

    వెకిలి వేషాలు వేయుచున్ పిలిచి వారు

    క్షారితుల నుండి విరివిగా సాతిబొంది

    మందు గొట్టిరి తృప్తిగా మగువలెల్ల

    రిప్లయితొలగించండి
  3. శ్రీకరంబగు నామని రాకతోడ
    పూలమొక్కలు చిగురించి పూయునంచు
    కేలధరియించి పిచికారి క్రిములుఁజావ
    మందుఁగొట్టిరి తృప్తిగా మగువలెల్ల.

    రిప్లయితొలగించండి
  4. నవ్యనాగరికంబులోనారియుండ
    తరమునంతరమెందుకుతరుణికనగ
    తలలువంచుటమీకికతప్పదయ్య
    మందుగొట్టిరితృప్తిగామగువలెల్ల

    రిప్లయితొలగించండి
  5. కూలి పని జేయు చుండిన కొమ్మ లెల్ల
    చీడ పోగొట్టు కొఱకునై శీఘ్ర గతిని
    తోట యందున జేరియు తూర్ణ ముగను
    మందు గొట్టిరి తృప్తి గా మగువ లెల్ల

    రిప్లయితొలగించండి
  6. ఎగుసము జేయ రైతులకు యేపుగ పంటలు జేర నిల్లు, రే
    బగలును బడ్డ కష్టములు బాసెనటంచును ముచ్చటించిరా
    మగువలు; మందు గొట్టిరఁట మాఁపటి వేళను దృప్తిగా వెసన్
    మగలటు మోదమంది భగవంతున కర్పణ సేసి వేడుకల్.

    రిప్లయితొలగించండి
  7. జగమున బ్రాకిపోయినది సత్యము
    పశ్చిమ సంస్కృతీవడిన్
    వగువగ నేమి కారణము వాస్తవ మీ
    కలికాలమందునన్
    తెగువవహించి పల్కుచును దొయ్యలి
    పూరుషులొక్కటేయనిన్
    మగువలు మందు గొట్టిరట మాపటి
    వేళను దృప్తిగా వెసన్

    రిప్లయితొలగించండి

  8. మగనికి యెందుచూసిన సమానమె భార్యలటంచు వారితో

    జగడము లాడు స్త్రీలదొక సంగము స్థాపన జేసి నిత్యమున్

    మగలట త్రాగివత్తురని మచ్చరికమ్మున పంతమూనుచున్

    మగువలు మందుగొట్టిరట మాపటి వేళను దృప్తిగా వెసన్.

    రిప్లయితొలగించండి
  9. సగముగనాకసంబుననుసాధనజేసిననారియామెయే
    వగవకభర్తబాటనికబాసనుజేయుచుసాగుగానికన్
    ఖగపతిదెచ్చినట్టిఘనక్షారముద్రావుటకేలజాగనన్
    మగువలుమందుగొట్టిరటమాపటివేళనుదృప్తిగావెసన్

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    సుతుని మిత్రులు వచ్చిరి చూడనెంచి
    తుమ్మె నొక్కడు దగ్గుచు తూలెనొకడు
    స్వస్థచిత్తత నింటికి పరిసరముల
    మందు గొట్టిరి తృప్తిగా మగువలెల్ల

    దిగిరన మిత్ర బృందము యధేచ్చగ పుత్రలు నాడిపాడగన్
    వగరుచు దగ్గ కొందరును వాలుచు తుమ్మగ కొందరచ్చటన్
    దిగులుగ స్వస్థచిత్తతను దెచ్చియు శుభ్రము జేయనింటిలో
    మగువలు మందు గొట్టిరఁట మాఁపటి వేళను దృప్తిగా వెసన్

    (మందు = సానిటైజరు)

    రిప్లయితొలగించండి
  11. పిండి వంటలు తలపెట్టి పెండ్లి కొరకు
    మూట లోపలి ధాన్యము రోట బోసి
    దానినంతయు పిండిగా దంచి నిమిష
    మందు గొట్టిరి తృప్తిగా మగువలెల్ల

    రిప్లయితొలగించండి
  12. దైవ దర్శనము కొరకై దరలివెడల ,
    నగరి దేవాలయమునందు నారికేళ
    ఫలము ద్రుంచ కూడదనుట వలన , నజిర
    మందు గొట్టిరి తృప్తిగా మగువలెల్ల

    రిప్లయితొలగించండి
  13. జగతిని”మంద”నంగనె నిషానిడు మద్యమె యంద్రు,
    వద్దనన్
    మగువలు,మందుఁగొట్టిరట మాపటివేళను దృప్తిగా
    వెసన్
    మగువరొ!తాముఁజెందిన శ్రమంబుఁదొలంగగ కూలిరైతులున్
    మగువల మాటవిందురె?ప్రమాదమటన్నను లెక్కసేతురే?

    రిప్లయితొలగించండి
  14. తగునని మున్గి నాధునికతాంబుధి నందున, గుంపుగూడి రే
    పగలను భేదమున్ విడచి, బారులు తీరుచు బారునందునన్
    మగువలు మందు గొట్టిరఁట మాఁపటి వేళను దృప్తిగా వెసన్
    తెగువనుకొంద్రు స్వేచ్ఛయట! తెల్సెను, నోటికి తాళమేసితిన్||

    రిప్లయితొలగించండి
  15. మురుగు కాల్వల దోమలు పెరిగిపోగ
    మునిసిపాలిటి పనివారు పురమునందు
    మందు గొట్టిరి, తృప్తిగా మగువలెల్ల
    ధన్యవాదముదెలిపిరి దైవమునకు.

    రిప్లయితొలగించండి
  16. మందు గొట్టిరి తృప్తిగా మగువలెల్ల
    రబ్బురంబిందు లేదార్య! యాడవారు
    కొంత మందిట తమతమ కొడుకు,భర్త
    లయెదుట నద్రాగు చుండిరి రమ్యముగను

    రిప్లయితొలగించండి
  17. పిల్లలు సనంగఁ జెడు దారిఁ దల్లడిల్లి
    భర్తల జడత నారసి యార్తి సెంది
    నిబ్బరముగ ననుచు నిట్లు దెబ్బ లందు
    మందు గొట్టిరి తృప్తిగా మగువ లెల్ల


    తగ దిది గర్హితం బగును దద్దయు నెల్లర కెంచి చూడఁగా
    మగతన మౌనె మానినుల మన్ననఁ గాంచక కొట్ట నివ్విధిం
    బగ తగఁ దీరు నట్లు పరిపంథులు క్రుద్ధులు తెచ్చు చుండఁగా
    మగువలు మందు గొట్టిరఁట మాఁపటి వేళను దృప్తిగా వెసన్

    రిప్లయితొలగించండి
  18. తగదని యెంతజెప్పినను దండ్రుల మాటలు లెక్కజేయకే
    మగువలు మందుగొట్టిరట మాపటివేళను దృప్తిగా వెసన్
    మగడను వానికీయదియ మాయని మచ్చగ నిల్చిపోవుగా
    జగమున వీరి చేష్టలను సజ్జను లెవ్వరుగార వించరే

    రిప్లయితొలగించండి
  19. పగలును రాత్రి సంధ్య పలువంటల చేసి గడించి మెప్పులన్
    తగువిధి వడ్డనల్ సలిపి తన్వి నొసంగి వివాహ మందునన్
    దగదగలాడు హారముల దాల్చి చెలంగి ముగించి కార్యముల్
    మగువలు మందు గొట్టిరఁట మాఁపటి వేళను దృప్తిగా వెసన్

    రిప్లయితొలగించండి
  20. వెరటి యందున మొక్కలు పెంచ నెంచి
    విత్తులనునాట నేనుగా పెరిగె గాని
    ఫలములందెడి వేళకు పట్ట చీడ
    మందుగొట్టిరి తృప్తి గా మగువలెల్ల

    రిప్లయితొలగించండి