వర్ణము లెన్నియో కలిపి పార్ధుని యాలయ గోడపైన నా కర్ణుడు గుంభకర్ణుడును గైకసుతుల్ గనుమయ్య ధీనిధీ! పర్ణము మీద గీచిన సభాపతి భీముని చిత్ర రాజముల్ వర్ణపు శోభతోమిగుల భాసిలు చున్నవి చూడుమా యికన్
ఆర్ణవ భారతంబున మహాద్భుత కావ్యము నందు నెక్కడన్ వర్ణన రామ చంద్రు కథ వాస్తవ గ్రంథము నందుగాంచ మీ కర్ణ కఠోర వాక్యమును , గాదిటు బల్కచు మోసగించ కే కర్ణుడు కుంబకర్ణడును కైకసుతుల్ గనుమయ్య ధీనిధీ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరా భరణము సమూహములో నేటి సమస్య
తొలగించండికర్ణ కుంభ కర్ణులు సూడ కైక సుతులు
నా పూరణ.
క్రమాలంకారములో పంచ పాది
కుంతి సుతుని పేరు తెల్పు, కుండ చెవులు
వారి నేమందు,కాకకు వాడు పదము
తమిళ మందేమి, భరతుని తల్లి పేరు
తెలుపు,పుత్రులన యెవరు తెలుపు మిపుడు
కర్ణ,కుంభ కర్ణులు, సూడ, గైక, సుతులు
తొలగించండినిక్కముగ రాగి హేమంబు లొక్క టైన
వక్క సున్నంబు తమలము లొక్కటైన
కుక్క సింగము వ్వాఘ్రము లొక్కటైన
కర్ణ కుంభకర్ణులు సూడ కైక సుతులు
కారని తెలుప న్యాయమా ఖలము లోన
(మైలవరపు వారి పూరణ చూసి)
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరాజయోగంబుకోరకరాజుకొఱకు
రిప్లయితొలగించండిసేవజేసిరివీరలుసేమమరసి
మువ్వురీవిధిచూడగముచ్చటయ్యె
కర్ణకుంభకర్ణులుసూడకైకసుతులు
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములతో గురువుగారు
తొలగించండిద్వంద్వమున కుదాహృతిగను బాలుడొకఁడు
రిప్లయితొలగించండికర్ణ కుంభకర్ణులు ,సూడ,ఁగైకసుతులు
తత్పురుషములోనన్ షష్ఠి తప్పకగున
టంచు వచియించె గురువుగారడిగినంత.
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండిచూర్ణమునైనజీవితపుచేదునుమ్రింగెనునగ్రజుండునై
రిప్లయితొలగించండికర్ణముమూసినిద్దురనుగైకొనిరావణుగాచెతమ్ముడున్
జీర్ణముగానిమాటలనుజేరకరామునితమ్ముడుండెగా
కర్ణుడుకుంభకర్ణుడునుగైకసుతుల్గనుమయ్యధీనిధీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమూర్ఖులె నిజులై చరియించు మూఢుడొకడు
పక్వరసమును గ్రోలుచు పఠినటంచు
చెంతనున్నట్టి వారితో చెప్పె నిటుల
కర్ణ కుంభకర్ణులు సూడఁ గైక సుతులు.
ఆర్ణవమన్ననేమిటని యన్న గృహమ్మని, జంగలమ్మనన్
వర్ణమటంచు జెప్పుచు విభావరి యన్న జగద్వహమ్మనిన్
స్వర్ణమనంగ వెండియని పల్కెడు పామరుడిట్లు చెప్పెనే
కర్ణుఁడు గుంభకర్ణుఁడును గైకసుతుల్, గనుమయ్య ధీనిధీ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిప్రజలకేరికి లాభింప రాదనంగ
విత్త మంత్రిణి నిర్మల చిత్తులెక్క
విన్న మేధావి పిచ్చెక్కి వింతనొలికె
"కర్ణ కుంభకర్ణులు సూడఁ గైక సుతులు"
ఉత్పలమాల
నిర్ణయమై యమాత్య మణి నిర్మల జేయ మదింపు లెక్కలన్
కర్ణకఠోరమై వినుచుఁ గానక నేరికి లాభమన్నదే!
పూర్ణ యశోవిరాజిత ప్రబుద్ధుడె తా భ్రమియించి యిట్లనెన్
"కర్ణుఁడు గుంభకర్ణుఁడును గైకసుతుల్ గనుమయ్య ధీనిధీ"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిచూడ రారాజ , రావణ సోదరులు వి
రిప్లయితొలగించండికర్ణ , కుంభకర్ణులు ; సూడఁ గైక సుతులు
గ దలచుచు సమస్య నిడిరి కవిసఖులకు
నేమి భాగ్యమో యిదియ నాకెరుకరాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమంద మతి యైన విద్యార్థి మాస్ట రడు గ
రిప్లయితొలగించండిమూర్ఖ మైనట్టి రీతిగా పోజు వెట్టి
చెప్పె నీ రీతి నవ్వగ చెడుగ తాను
" కర్ణ కుంభకర్ణులు సూ డ కైక సుతులు "
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివర్ణములెల్లఁగూర్చుకొని భారత రామచరిత్ర ఘట్టముల్
రిప్లయితొలగించండివర్ణనసేసె చిత్రముల బాగుగ గోడలఁజిత్రకారుడున్
పూర్ణముగాను ధర్మజుఁడు,భూసుర ద్రోణుఁడు,సవ్యసాచియున్
కర్ణుఁడు,కుంభకర్ణుఁడును,కైకసుతుల్ కనుమయ్య ధీనిధీ!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికైకయనెడి కాంతామణి కన్నదోయి
రిప్లయితొలగించండికవల లిరివురి నొకపరి కాన్పులోన
నామ మిడెను వారికి శబ్ద నీమమలర
కర్ణ కుంభకర్ణులు సూడఁ గైక సుతులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాధపెంచినదెవ్వని? రావణునకు
రిప్లయితొలగించండిసోదరుండుతానెవ్వడు సుప్తినుండు?
భరత శత్రుఘ్నులేతల్లి భవ్యసుతులు?
కర్ణ కుంభకర్ణులు సూడఁ గైక సుతులు
శత్రుఘ్నుడు కైక సుతుడు కాదు మిత్రమా
తొలగించండిసుమిత్ర సుతుడు గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవపాదములో దొర్లిన పొరపాటుకు క్షంతవ్యుణ్ణి. సవరించి మరల పోస్టుచేస్తున్నాను.
తొలగించండిరాధపెంచినదెవ్వని? రావణునకు
సోదరుండుతానెవ్వడు సుప్తినుండు?
భరతుడీభువినేతల్లి భవ్యసుతుడు?
కర్ణ కుంభకర్ణులు సూడఁ గైక సుతులు
తేటగీతి
రిప్లయితొలగించండిత్రేత ,ద్వాపరముల జేర్చి తెలివి ప్రశ్న
వేయ న్యాయమా మాకిది విస్మయంబు
గల్గ జేసెను ,చిత్రము గనగ, వినగ
కర్ణ కుంభకర్ణులు సూడ కైక సుతులు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మంద బుద్ధిని బ్రశ్నించ ,మందగొడిగ
రిప్లయితొలగించండినిట్లు చెప్పెను పదిమంది యెదుట నతడు
కర్ణకుంభ కర్ణులు సూడ గైకసుతులు
ఫక్కు మనుచును నవ్వగ పదుగురచట
పూర్ణమసున్ నుతించెనల పొందెను కుంతి సుపుత్రునేరినో
రిప్లయితొలగించండివర్ణినినాహరించె కులపాంసనుఁడాతని తమ్ముఁడెవ్వరో
నిర్ణయమెంచి పాదుకల నెమ్మిని పట్టము గట్టెనెవ్వరో
కర్ణుఁడు గుంభకర్ణుఁడును గైకసుతుల్ గనుమయ్య ధీనిధీ
కైకసీ విశ్రవసులకు గాదిలి సుతు
రిప్లయితొలగించండిలై జనించిరి రక్షో గణాధిపులుగ
రావణుఁడు విభీషణుఁడును రమ్య భీమ
కర్ణ కుంభకర్ణులు సూడఁ గైక సుతులు
[చూడన్ గైక సుతులు: రామలక్ష్మణులు సూడఁగా]
జీర్ణములే పురాణములు చెన్నుగ నీ కని వింటిఁ జక్కఁగం
గర్ణ పుటమ్ములే తనియఁ గ్రన్ననఁ బేర్కొన వీరి నీవు సం
పూర్ణపు నమ్మకమ్మునను భూరి యశస్వులు వీర లెవ్వరో
కర్ణుఁడు గుంభకర్ణుఁడును గైక సుతుల్ గను మయ్య ధీనిధీ
పూర్ణ సఖిత్వ భావనల భూతల నాకము భారతమ్మునే
రిప్లయితొలగించండిశీర్ణ వికీర్ణ వస్త్రమున సృష్టిని నిల్పిన నాయకాళి, సం
కీర్ణ దురంధరాధములు, కీచక దుర్గుణ రాజకీయులే
కర్ణుఁడు, గుంభకర్ణుఁడును, గైకసుతుల్ గనుమయ్య ధీనిధీ!
ఆకీర్ణ _విస్తరించిన, సంకీర్ణ
వర్ణము లెన్నియో కలిపి పార్ధుని యాలయ గోడపైన నా
రిప్లయితొలగించండికర్ణుడు గుంభకర్ణుడును గైకసుతుల్ గనుమయ్య ధీనిధీ!
పర్ణము మీద గీచిన సభాపతి భీముని చిత్ర రాజముల్
వర్ణపు శోభతోమిగుల భాసిలు చున్నవి చూడుమా యికన్
ఆర్ణవ భారతంబున మహాద్భుత కావ్యము
రిప్లయితొలగించండినందు నెక్కడన్
వర్ణన రామ చంద్రు కథ వాస్తవ గ్రంథము
నందుగాంచ మీ
కర్ణ కఠోర వాక్యమును , గాదిటు బల్కచు
మోసగించ కే
కర్ణుడు కుంబకర్ణడును కైకసుతుల్ గనుమయ్య ధీనిధీ
అర్ణవమందు పుట్టుబడబానల మెందులకారకుండె? గో
రిప్లయితొలగించండికర్ణమునందు గోవులకు కర్ణములుండెన లేకపోయెనా?
నిర్ణయమాయెనేడు విను నిక్కముగా బలరామ కృష్ణులున్
కర్ణుఁడు గుంభకర్ణుఁడును గైకసుతుల్ గనుమయ్య ధీనిధీ
కుంతి జ్యేష్ట సుతుండన కువలయాన
రిప్లయితొలగించండివల్లమాలిన నిద్రను వరము గాను
పడసె, రామాయణమ్మున భరతుడయ్యె
*“కర్ణ కుంభకర్ణులు సూడఁ గైక సుతులు”*