6, ఫిబ్రవరి 2022, ఆదివారం

సమస్య - 3984

7-2-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రావీణ్యచ్యుతియె యిడును ప్రాశస్త్యంబున్”
(లేదా...)
“ప్రావీణ్యంబు విలుప్తమైననె కదా ప్రాశస్త్యమందంగనౌ”

33 కామెంట్‌లు:

  1. ఆవిరటునిపుత్రుడుగన
    చావునుగోరకకలననుచయ్యనబారెన్
    భావినికవ్వడిమామయె
    ప్రావీణ్యచ్యుతియేయిడునుప్రాశస్త్యంబున్

    రిప్లయితొలగించండి
  2. ఏ విషయముపై నైనను
    కోవిదుడు తలచిన రీతి కూర్పును జేయన్
    భావము నవమానపరచు
    ప్రావీణ్యచ్యుతియె యిడును ప్రాశస్త్యంబున్

    రిప్లయితొలగించండి

  3. కోవిదు డెప్పుడు విడువక
    హేవాకము నభ్యసనము నింపుగ జేసినన్
    జేవపెరుగు దరిజేరదు
    ప్రావీణ్యచ్యుతియె, యిడును ప్రాశస్త్యంబున్.

    రిప్లయితొలగించండి
  4. కందం
    సేవింప ద్రోణునొజ్జగ
    నేవిధి తా 'నరునిక'న్న నెక్కువననెడున్
    భావమున, నేకలవ్యుని
    ప్రావీణ్యచ్యుతియె, 'యిడును ప్రాశస్త్యంబున్'

    శార్దూలవిక్రీడితము
    భావంబందున నిల్పి, బొమ్మ గురుడన్ భక్తిన్ ధనుర్విద్యకై
    చేవన్గల్గిన నేకలవ్యుఁడడవిన్ ఛేదింప నుద్ధండుడై
    నావా'డర్జును'నెట్లుమించునని, పొందన్ ద్రోణుఁడంగుష్ఠమున్
    బ్రావీణ్యంబు విలుప్తమైననె కదా, 'ప్రాశస్త్యమందంగనౌ'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏

      సవరించిన కందం

      కందం
      సేవింప ద్రోణునొజ్జగ
      నేవిధి తా 'నరునిక'న్న నెక్కువ యనెడున్
      భావమున, నేకలవ్యుని
      ప్రావీణ్యచ్యుతియె, 'యిడును ప్రాశస్త్యంబున్'

      తొలగించండి
  5. కావగ బోక యె చెడగును
    ప్రావీణ్య చ్యుతి యిడును : ప్రాశస్త్య o బున్
    దీవెన ల నుతుల నిడునిల
    చేవగ మెప్పించ వ్రాయు చెల్వగు కవితల్

    రిప్లయితొలగించండి

  6. ఆవశ్యంబది సుప్రయోగమని, మర్త్యంబందు మేధావులే
    చావేమేలని చెప్పుచుందురెపుడున్ సప్తద్వీపలో సూరికిన్
    బ్రావీణ్యంబు విలుప్తమైననెకదా, ప్రాశస్త్యమందంగ నౌ
    తా విద్యార్థిగ సాధనమ్మిలను నిత్యంబందు సాగించినన్.

    రిప్లయితొలగించండి
  7. జీవోద్యానమునందు శాస్త్ర సుధలన్ సేవించి
    సన్మార్గమున్
    బోవన్నాడియు దుష్ట మిత్ర తతితో మోదం
    బుతో గడ్పుచున్
    ద్రావంబూనియు నిత్యమున్ మునిగె దా
    దౌర్భాగ్య మీమత్తుదౌ
    ప్రావీణ్యంబు విలుప్త మైననె కదా ప్రాశస్త్య
    మందందుగున్

    రిప్లయితొలగించండి
  8. ప్రావీణ్యము లేకుండగ
    నేవిషయము నెరుగకుండ నేతలు యెదుగున్
    గావున చెప్పగనొప్పున్
    ప్రావీణ్యచ్యుతియె యిడును ప్రాశస్త్యంబున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నేతలు+ఎదుగున్' అన్నపుడు యడాగమం రాదు. "నేతయె యెదుగున్" అనండి.

      తొలగించండి
    2. సూచించిన సవరణతో....


      ప్రావీణ్యము లేకుండగ
      నేవిషయము నెరుగకుండ నేతయె యెదుగున్
      గావున చెప్పగనొప్పున్
      ప్రావీణ్యచ్యుతియె యిడును ప్రాశస్త్యంబున్

      తొలగించండి
  9. జీవుల ప్రగతినిరోధము
    ప్రావీణ్యచ్యుతియె, యిడును ప్రాశస్త్యంబున్
    ప్రావీణ్యముతోడ పనుల
    నేవిధమగు వెరపులేక నిర్వర్తింపన్

    రిప్లయితొలగించండి
  10. శ్రీవాణీ కరుణాకటాక్షములచే సిద్ధించ సద్విద్యలెం
    తో విఖ్యాతిని గాంచరే ప్రజయు నోహో!యంచు కీర్తించనౌ
    రా!విశ్వంబును రూపుమాపుటకు మాయామంత్ర జాలంబులో
    ప్రావీణ్యంబు విలుప్తమైననుగదా!ప్రాశస్త్యమందంగనౌ.

    శ్రీవిలసిల్లెడు విద్యల
    ప్రావీణ్యము కల్గువాడె ప్రస్తుతికెక్కున్
    ఠీవిగ,నిందిత విద్యా
    ప్రావీణ్యచ్యుతియె యిడును ప్రాశస్త్యంబున్.

    రిప్లయితొలగించండి
  11. జీవితమగు నంధునిగను
    ప్రావీణ్యచ్యుతియె,యిడును ప్రాశస్త్యంబున్
    జీవులయెడ దయజూపుచు
    భావిని గడు నుద్ధరించ పావను లుంగాన్

    రిప్లయితొలగించండి
  12. ఈ వసుధా తలమున భర
    తావని ఘన కర్మ భూమి యై వెలుఁ గొందెన్
    భూవర పాలనమున దు
    ష్ప్రావీణ్యచ్యుతియె యిడును బ్రాశస్త్యంబున్


    ఈ విశ్వక్షయ శాస్త్ర సంచయములం దెందేని నైపుణ్య మిం
    కా విద్వేషము వృద్ధి సేయఁ దగు విద్యాభ్యాస చాతుర్యమున్
    భావోద్రేకము పిక్కటిల్ల జనులన్ వంచించు కార్యమ్ములం
    బ్రావీణ్యంబు విలుప్త మైననె కదా ప్రాశస్త్య మందంగ నౌ

    రిప్లయితొలగించండి
  13. భావంబందున ద్రోణు గుర్వుగ గడున్ భావించి శస్త్రాస్త్రముల్
    చేవన్ నేర్చెను నేకలవ్యుడు భువిన్ శీఘ్రంబు కాలంబునన్
    ప్రావీణ్యంబును బొంద ,ద్రోణుడడుగన్ బ్రాధాన్య మంగుష్ఠ మీన్
    ప్రావీణ్యంబు విలుప్తమైననె కదా ప్రాశస్త్య మందంగనౌ

    రిప్లయితొలగించండి
  14. కందం
    ఆవిలు విద్యానిపుణుం
    డే విధముగచింతలేక, డిగ్గన వ్రేలిన్
    ఠీవిగ గురుదేవుని కిడె
    ప్రావీణ్యచ్యుతియె యిడును ప్రాశస్త్యంబున్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    (ఏకలవ్యుడు గురు ద్రోణునకు బొటన వ్రేలిని దక్షణగా యిచ్చిన సందర్భము).

    రిప్లయితొలగించండి
  15. ఏవిద్యయందును తగిన
    ప్రావీణ్యములేకతిరుగుపామరుడొకడున్
    జీవితమందున తనదు
    ష్ప్రావీణ్యచ్యుతియె యిడును ప్రాశస్త్యంబున్.

    రిప్లయితొలగించండి
  16. దైవాధీనము సర్వమంచునలసత్వంబూని మూఢత్వమం
    దావంతైనను శ్రద్ధ లేక విడి సద్వ్యాసంగముల్ ధూర్త సం
    సేవాసక్తి జనంగరాదకట నిశ్శేషంబుగా దుష్కళా
    ప్రావీణ్యంబు విలుప్తమైననె కదా ప్రాశస్త్యమందంగనౌ

    రిప్లయితొలగించండి