12, ఫిబ్రవరి 2022, శనివారం

సమస్య - 3990

13-2-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుసుమమ్మును ద్రుంచఁ దగును గొడ్డలిచేతన్”
(లేదా...)
“కుసుమముఁ ద్రుంచఁగాఁ దగును గొడ్డలిచేఁ గొనగోట సాధ్యమా”

44 కామెంట్‌లు:


  1. అసహజ రీతిని శిల్పియె
    పసదనము కొరకని పాదపమునకు చెక్కెన్
    ప్రసవము నొక్కటి గననా
    కుసుమమ్మును ద్రుంచఁ దగును గొడ్డలి చేతన్.

    రిప్లయితొలగించండి
  2. అసదృశుడీతడుధ్రువుడును
    పసితనమునజేసెతపముపరమముకొఱకై
    కసిగనిదైవముమెచ్చెను
    కుసుమమ్మునుద్రుంచదగునుగొడ్డలిచేతన్

    రిప్లయితొలగించండి
  3. పసి వాడైనను సులువుగ
    కుసుమమ్మును ద్రుంచ దగును : గొడ్డలి చేతన్
    పొసగ దగు నొక్క తరువున్
    వెస ఖండింప శ్రమియించ వీలగును గదా !

    రిప్లయితొలగించండి
  4. విసమునునింపిమానసమువింతగనీతినిబోధసేయుచున్
    హసితముఖంబుతోడుతనుహాయనిపల్కులమేలమాడుచున్
    కుశలతమాయజేసిఘనగుంభనమోసముజేయులోహపున్
    గుసుమముద్రుంచగాదగునుగొడ్డలిచేగొనగోటసాధ్యమా

    రిప్లయితొలగించండి

  5. పశువులు సంచరించు నెల వాసిగ పెర్గిన వృక్షరాజమున్

    పసగల వాడె యైన నొక వడ్డగి గాంచి ముదమ్మునంది తా

    నసహజ మైననేమి యొక యద్భుత పుష్పము గాను మల్చె నా

    కుసుమముఁ ద్రుంచఁగాఁ దగును గొడ్డలిచేఁ గొనగోట సాధ్యమా!

    రిప్లయితొలగించండి
  6. కందం
    కొసరగ భాజప గురుతదె
    ముసలము పుట్టింపఁ జూడ మూర్ఖత కాదే?
    దిసల కుఠారమ్మెక్కడొ?
    కుసుమమ్మును ద్రుంచఁ దగును గొడ్డలిచేతన్!

    ( భాజప : భారతీయ జనతా పక్షము)

    చంపకమాల
    కొసరెను భాజపా గురుతు గొప్పగ నిల్చె ప్రజాళి గుండెలన్
    వెస వ్యతిరేకతన్ వెగటు పెంచగ జూడగ చంద్రశేఖరుల్
    దిసలను వైరి పక్షములు తేరగ రారు కుఠారమెక్కడే?
    కుసుమముఁ ద్రుంచఁగాఁ దగును గొడ్డలిచేఁ గొనగోట సాధ్యమా?

    (భాజపా : భారతీయ జనతా పార్టీ)

    రిప్లయితొలగించండి
  7. కసుగందుని జేతులతో
    కుసుమమ్మును ద్రుంచఁ దగును ; గొడ్డలిచేతన్
    పసగల యువకునికే దగు
    పసిమి చెడగ యెండినట్టి వటమును నరకన్

    రిప్లయితొలగించండి
  8. అసిధారావ్రతమట్టుల
    వెస,పార్వతి తపముసేసె వృషభధ్వజుఁగో
    రి,సకియరొ!మనో వాంఛా
    కుసుమమ్మును ద్రుంచఁదగును గొడ్డలి చేతన్.

    బసుమము మేనఁబూసుకొని భక్తి ప్రపత్తుల మూడు
    కాలముల్
    అసదృశమౌ తపోవిధుల నర్చనసేసి భవాని కోరెగా
    యసమశరాస్త్రువైరి,నిటలాక్షుని భర్తగ,నీప్సితంబనే
    కుసుమము ద్రుంచగా దగును గొడ్డలిచేఁగొనగోట సాధ్యమా!

    రిప్లయితొలగించండి
  9. ఇసుమంతయు శ్రమియించక
    కుసుమమ్మును ద్రుంచఁ దగును; గొడ్డలిచేతన్
    పొసగక సాధ్యంబగునా
    పసగలిగినవానికైన వటమును గూల్చన్

    రిప్లయితొలగించండి
  10. అసువుల నెన్నియొ బాయగ
    పొసగిన రాష్ట్రమె గద యిది , పొడువలు దీనిన్
    యిసుమంత చెఱపు జరుపగ
    కుసుమమ్మును ద్రుంచఁ దగును గొడ్డలిచేతన్

    రిప్లయితొలగించండి
  11. పసిమనసుబోలియుండును
    కుసుమమ్మును, ద్రుంచఁ దగును గొడ్డలిచేతన్
    వ్యసనమ్మనియెడు తరువును
    విసమును నింపిన ఫలములు పెరుగక మునుపే

    రిప్లయితొలగించండి
  12. కందం
    మసిబూసి మతోన్మాదపు
    ముసుగున చెలగు కమలదళముల జట్టులవిన్.
    కసిగ విషము జిమ్మెడి యా
    కుసుమమ్మును ద్రుంచ దగును గొడ్డలి చేతన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  13. విసమును, కంటకమ్ములును
    విస్త్రృతిగాపరివేష్టితమ్మునౌ
    కుసుమము ద్రుంపగాదగును
    గొడ్డలిచే గొనగోట సాధ్యమా?
    అసహజ ఘోరపాపవిష
    భంజనసేయగ శౌరినందకం
    బసమ ప్రభావశీలమది
    యల్పమునౌ చురకత్తికెట్లగున్.

    రిప్లయితొలగించండి
  14. పసితనమందు బాలునకు బాగును నోగును నేర్పకున్నచో
    వ్యసనములందు చిక్కుకొని వంతలపాలగు, బాల్యమన్నచో
    కుసుమము, ద్రుంచఁగాఁ దగును గొడ్డలిచేఁ గొనగోట సాధ్యమా
    విసమునుపోసి మూలమున పెంచిన వృక్షము నేరికేనియున్?

    రిప్లయితొలగించండి
  15. ఇసుమంతయు శ్రమ లేకను
    కుసుమమ్మును ద్రుంచదగును ,గొడ్డలి చేతన్
    బుసబుసలాడుచు దరికిని
    కసితోడం వచ్చు ఫణిని కడదేర్చవలెన్

    రిప్లయితొలగించండి
  16. వసుమతినం దనేకులటు బాళిని యెప్పుడు పిల్లపాపలున్
    రసమున గూరలందున జలాంతర చారిణిఁ వేపుడందునన్
    వ్యసనము తోడ దిందురట వంటల, నీటిని బుట్టినట్టిదౌ
    కుసుమముఁ ద్రుంచగా దగును గొడ్డలి జేకొని గోటసాధ్యమా?

    రిప్లయితొలగించండి
  17. కుసుమ దళావృత సుఫల వి
    లసిత తరులఁ దగదు త్రుంచ రక్షింప వలెన్
    వెసఁ దరువు విగత ఫల దళ
    కుసుమమ్మును ద్రుంచఁ దగును గొడ్డలి చేతన్


    కుసుమ సమంపు మానసము ఘోరతరం బగు మాట చాలు వే
    పస చెడి మొద్దువోవుటకు భైరవ ఖడ్గము లేల నెంచఁగన్
    మిస మిస లాడు కొమ్మలను మేదిని మొల్చిన బెట్టిదంపు ఱా
    కుసుమముఁ ద్రుంచఁగాఁ దగును గొడ్డలిచేఁ గొనగోట సాధ్యమా

    [ఱాకుసుమము = ఱా పువ్వు]

    రిప్లయితొలగించండి
  18. కుసుమము ద్రుంచగా దగును గొడ్డలిచే గొనగోట సాధ్యమా
    పసిమిగ నున్ననాడెగద బాలుని మంచిగ జేయగావలెన్
    గుసుమము ద్రెంచ వీలగును గోమలమౌ గొనగోటి చేతనే
    వ్యసనము లుండు వ్యాపకుని భావ్యము జేయగ మంచివానిగన్

    రిప్లయితొలగించండి
  19. ముసురుచునున్న కోర్కుల సమూలము
    గా దెగటార్చగావలెన్
    మసలిన బెర్గి పెద్దగను మ్రానుగ మారున
    ద్రెంచ సాద్యమా
    విససమమౌ మనంబునను పేరియు
    దుర్భర మైన యట్టి యా
    కుసుమము దృంచగా దగును గొడ్డలిచే కొనగోట సాద్యమా

    రిప్లయితొలగించండి
  20. పసివారలుకొనగోటన
    *కుసుమమ్మును ద్రుంచఁ దగును గొడ్డలిచేతన్”*
    కసిగానుపట్టికొట్టిన
    విసురుకు కూలునట పెద్ద వృక్షము లైనన్


    మరొక పూరణ


    వసుధనుదుష్టబుద్ధిగలభండునిమార్చనసాధ్యమౌనుగా
    రుసరుసలాడువానికినిరోసముహెచ్చగ త్రుంచగా వలెన్
    విసమదినిండినట్టితరువేపుగపెర్గుచుచిమ్మినంతనా
    *కుసుమముఁ ద్రుంచఁగాఁ దగును గొడ్డలిచేఁ గొనగోట సాధ్యమా*


    రిప్లయితొలగించండి