28, ఫిబ్రవరి 2022, సోమవారం

సమస్య - 4006

1-3-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తల్లికిం దిండి పెట్టుట దండుగ గద”
(లేదా...)
“తల్లికిఁ దిండి పెట్టుటయె దండుగ యంచనె నీతిశాస్త్రముల్”

33 కామెంట్‌లు:

  1. పాపపుణ్యంబుజూడకపంచజేర్చి
    దైవభావంబుతోడుతదరినిజేరి
    ధీరధర్మంబుతల్లికిందిండిపెట్టుట
    దండుగగదరజీవియుదయనుదప్ప

    రిప్లయితొలగించండి

  2. భూరి ధనమున్న పిసినారి మూఢుడతడు
    పరుల యిండ్లలో భుజియించు బంక ముచ్చ
    టంచు వివరించి తెలిపెనా యాత్మజుండు
    తల్లికిం, దిండి పెట్టుట దండుగ గద.

    రిప్లయితొలగించండి

  3. పిల్లికి కూడ బిక్కిరము వేయని కూళుడు సంచితార్థమున్

    పిల్లలకందకుండ తన పేరున దాచి యయావరుండె యై

    యిల్లులఁ దిర్గుచున్ గబళమిమ్మని గోరునటంచు తెల్పెనా

    తల్లికిఁ, దిండిపెట్టుటయె దండుగ యంచనె నీతిశాస్త్రముల్.

    రిప్లయితొలగించండి
  4. అల్లినపేగుబంధముననంబయదేవతసజ్జనాళికిన్
    వల్లనుగాదులేయిటులపంతములాడుటతల్లితోడుతన్
    కల్లలుమాటలేగదరగాడిదపుత్రులునిట్టులాడుటల్
    తల్లికిదిండిపెట్టుటయెదండుగయంచనెనీతిశాస్త్రముల్

    రిప్లయితొలగించండి
  5. పనియు పాటును సేయక పవలు రేయి.
    తినియు సోమరి గానుండ దేవత యని
    తల్లికి దిండి పెట్టుట దండుగ గద
    చేర్చు డామె నాశ్ర మమందు శీఘ్ర ముగను
    ( భార్య భర్త తో పల్కిన మాటలు )

    రిప్లయితొలగించండి
  6. జన్మమిచ్చిన దేవత జనని యట్టి
    తల్లికిం దిండి పెట్టుట దండుగ గద
    యనుట ఘోరము పాపమీ యవనియందు
    వృద్ధులందున జూపగ శ్రద్ధ మేలు

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    "ఒక్కగానొక్క కొడుకుకు బొక్కినంతఁ
    కూడ బెట్టక పితరుండు గోతిఁజేరి
    నిన్నుభారమ్ము సేసెనన్" నిందలాడి
    దల్లికిం దిండి పెట్టుట దండుగ గద!

    ఉత్పలమాల
    పల్లవితమ్ముగన్ గడుపు పండెనటంచును సూనునందగన్,
    "గొల్లగ బొక్కినంత సిరిఁ గూర్పక తండ్రి గతించి నీవు నన్
    దల్లడపెట్ట భారముగ నా తలపైనిడె"నంచు నిందలన్
    దల్లికిఁ దిండి పెట్టుటయె దండుగ యంచనె నీతిశాస్త్రముల్

    రిప్లయితొలగించండి
  8. ఆటవెలది

    క్లేశమగున?//తల్లికిందిండి పెట్టుట,
    దండుగగద//కల్లు త్రాగుటకును
    జూదమాడుటకును సొమ్ము ఖర్చునిడుట
    మాను వ్యసనములను మానవుండ!

    రిప్లయితొలగించండి
  9. పిల్లలమేలుకోరుకొను పెన్నిధులీభువి తల్లులన్న, కో
    కొల్లలు తల్లడంబులను గూడ సహించు రుణంబు దీర్చుటా
    తల్లికిఁ దిండి పెట్టుటయె, దండుగ యంచనె నీతిశాస్త్రముల్
    తల్లినలక్ష్యపెట్టు దురితాత్ములజన్మము నిశ్చయమ్ముగా

    రిప్లయితొలగించండి
  10. తనయులందరికిని తమ ధర్మమెగద
    తల్లికిం దిండి పెట్టుట ; దండుగ గద
    యెందరుండిన గూడ వారెడలగ , కొన
    సాగెడు బతుకునెంచ నేజననికైన

    రిప్లయితొలగించండి
  11. పిల్లల బ్రేమతో మిగుల వేదన కోర్చియు
    బెంచు దల్లియే
    పిల్లల బాధ్య తౌనుగద ప్రేమగ మర్వక
    నెల్లవేళలన్
    తల్లికి తిండి బెట్టుటయె, దండగయంచనె నీతి శాస్త్రముల్
    తల్లికి యన్నమే యిడని దానవ పుత్రుల
    జన్మయిద్ధరన్

    రిప్లయితొలగించండి
  12. కనుల కింపైన రీతిన గడనగలిగి
    లెక్కలేనంత పైకమార్జించి నట్టి
    రసిక జనరంజని యగుజారవనితామ
    తల్లికిం దిండి పెట్టుట దండుగ గద

    మతల్లి = శ్రేష్ఠురాలు

    రిప్లయితొలగించండి
  13. వల్లభ,వల్లభుంగనియు ప్రల్లదమాడుచు నేటినుండి నీ
    తల్లికిఁదిండి పెట్టుటయె దండుగ యంచనె,నీతిశాస్త్ర
    ముల్
    కొల్లగ వల్లెవేసి తన కోమలి కోపముఁబాపి భర్తయున్
    తల్లికిఁదిండి పెట్టుటయె ధర్మమటంచును నచ్చచెప్పెగా.

    రిప్లయితొలగించండి
  14. ఆదిభిక్షువువానికినన్నమిచ్చె
    నయ్యవారికిదానట్లుయదననిల్చె
    బ్రహ్మనాల్కనదారాడెభారతమ్మ
    మువ్వురమ్మలశక్తిగామూలమయిన
    తల్లికిం దిండి పెట్టుట దండుగ గద
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  15. నన్నయ కిచ్చెను నాటి భూనాథుడు
    మడులుమాణ్యమ్ములు మరువ కుండ

    తిక్కన కొసగిరి మక్కువ తోడగ్ర
    హారము లెన్నియో నాదరించి,

    శ్రీనాథుని కిడిరి సిరులను పండించు సేద్యపు భూములన్ చెలిమి‌ తోడ,

    కడుపు నిండు నటుల కమ్మ నైనట్టి భో
    జనమును తినివారు సంత సముగ

    తెలుగు తల్లికి పెట్టితిరి గాదె నిరతము
    పుష్టి నొప్పారెడు భోజనమ్ము


    నేటి పాలకులెల్ల వేటును వేయుచు
    గిద్దెడు బియ్యపు గింజ లైన

    మాకిడ కుండిరే, మాడుచుండె కడుపుల్
    మాకీ దినములందు మథుర మైన

    కావ్య భోజనమే రీతి కన్న తల్లి
    కిడెద

    శ్వాస నైనను తీయగ జాలనట్టి

    ( *తల్లికిం దిండి పెట్టుట దండుగ గద)*

    యనుచు నొక కవి తెలిపెగా నత్త తోడ


    తల్లి = తెలుగు మాత,
    అత్త= ఆంగ్ల మాత

    రిప్లయితొలగించండి
  16. తల్లికిం దిండి పెట్టుట దండుగ గద
    తల్లి కంటెను మించిన దైవమెచట
    గానరాదార్య!యేమిది కఠిన మనము
    తల్లి రక్తమే గదమన తనువు నిండ

    రిప్లయితొలగించండి
  17. తాను దిన్నచో నింకను దార తిన్న
    స్వీయ నందను లెల్ల భుజించిన యది
    దండుగ యయిన సత్యమే తప్పకుండఁ
    దల్లికిం దిండి పెట్టుట దండుగ గద


    ఒల్లదె యిట్టి భూత దయ నుర్విని నెన్నఁడు సజ్జనాళి శో
    భిల్లరు గొప్ప వారయినఁ బృథ్విని నింటను బెంచి నట్టి యా
    పిల్లికి నెట్టివానికిని వింతగఁ గాదని తన్ను గన్న యా
    తల్లికిఁ దిండి పెట్టుటయె దండుగ యంచనె నీతిశాస్త్రముల్

    రిప్లయితొలగించండి
  18. తల్లికిందిండి పెట్టుటయె దండుగ యంచనె నీతిశాస్త్రముల్
    కల్లలు సెప్పు శాస్త్రమును గాంచగనుండుట యుక్తమౌనుగా
    దల్లియ నంగదై వమిల దల్లికి కూడును వెట్టకుండుటన్
    నుల్లము లేనివానిగను నూహను బొందుచు దూరముంచనౌ

    రిప్లయితొలగించండి
  19. చిత్తశుద్ధితోకొడుకులుచేయదగిన
    ముఖ్యకర్తవ్య మేదన ముదముతోడ
    *తల్లికిం తిండి పెట్టుట; దండుగ గద*
    కాని పనులను చేసెడి ఖలున కెపుడు


    మరొక పూరణ

    ఉల్లమునందుభక్తినిల నొప్పుగనుంచుచు నెల్లవేళలం
    దొల్లనిమాటలాడకయె యొద్దికగా నొనరించుకార్యమే
    *తల్లికిఁ దిండి పెట్టుటయె, ;దండుగ యంచనె నీతిశాస్త్రముల్”*
    కల్లలనాడుచున్ సతముగాంచెడిహీనులనాదరించుటన్

    రిప్లయితొలగించండి