14, ఫిబ్రవరి 2022, సోమవారం

సమస్య - 3992

15-2-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మానవజన్మమ్ము శ్రేష్ఠమా కాదు గదా”
(లేదా...)
“మానవజన్మ శ్రేష్ఠమను మాట యసత్యము సూడ నెవ్విధిన్”

47 కామెంట్‌లు:

  1. ఆనగహనుమయలేకను
    పూనికరామునికథగనపొందరుదృప్తిన్
    వానరమీవిధిభాసిలె
    మానవజన్మమ్ముశ్రేష్ఠమాకాదుగదా

    రిప్లయితొలగించండి

  2. దానము చేయక సతము వి
    ధానము నార్జింపనెంచు తఱ్ఱులు భువిలో
    దీనుల పై దయజూపని
    మానవ జన్మమ్ము శ్రేష్ఠమా? కాదుగదా!

    రిప్లయితొలగించండి
  3. దానము ధర్మము సేయక
    దానవుని వలెను మనుచును ధరలో మెలఁగన్
    వానిని గాంచుచు బల్కరె
    మానవ జన్మమ్ము శ్రేష్ఠ మా కాదు గదా!

    రిప్లయితొలగించండి
  4. కానగ ధాత్రిలోన దన కర్మ ఫలంబులచే
    జనించు యీ
    మానవ జాతియే కడు సమస్తపు ప్రాణుల
    కంటె గొప్పదే
    కాని దురాశచే బలు రకాల కుచేష్టలు చేయు
    ధూర్తమౌ
    మానవ జన్మ శ్రేష్ఠమను మాట యసత్యము సూడ నెవ్విధిన్

    రిప్లయితొలగించండి
  5. తానుగసూక్ష్మరూపుడుగదాగునుబ్రహ్మముజీవకోటిలో
    వేనకువేలుజీవులకువేల్పుగనుండెడివాడునొక్కడే
    వానికితారతమ్యమెటుభావననుండునుసృష్ఠికర్తగా
    మానవజన్మశ్రెష్ఠమనుమాటయసత్యముసూడనెవ్విధిన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    ఏనాడైనను నాదియు,
    నేనను గర్వమున మునిగి నిక్కుచుఁ బుడమిన్
    గానక పరోపకారము
    మానవజన్మమ్ము శ్రేష్ఠమా? కాదు గదా!

    ఉత్పలమాల
    మేను పరోపకారమున మీరక సాగిన జన్మసార్థక
    మ్మౌనని యార్యులున్ బలుక నందిన దెల్లను దోచనెంచుచున్
    దీనులఁ గావనెంచక యదృష్టము నాదె యటన్న పోకడన్
    మానవజన్మ శ్రేష్ఠమను మాట యసత్యము సూడ నెవ్విధిన్

    రిప్లయితొలగించండి

  7. కానలలోఁ జరించెడు మృగమ్ములు కారుకదా ధరిత్రిలో

    మానవులన్న, విజ్ఞతయు మాలిమి కల్గిన వారలందురే

    దీనుల ప్రాణగొడ్డముల దీర్చక స్వార్థము తో చెలంగినన్

    మానవజన్మ శ్రేష్ఠమను మాట యసత్యము సూడనెవ్విధిన్.

    రిప్లయితొలగించండి
  8. జానకి!”రాముండు నరుఁడు
    మానవ జన్మమ్ము శ్రేష్ఠమా?కాదుగదా!
    దానవులు గొప్పవారలు
    దానవపతిఁగూడు”మనిరి దానవ వనితల్.

    రిప్లయితొలగించండి
  9. దానవ జన్మము మేలా
    మానవ జన్మమ్ము నొంది మనుగడమేలా
    దానవగుణములు కలిగిన
    మానవజన్మమ్ము శ్రేష్ఠమా కాదు గదా

    రిప్లయితొలగించండి
  10. నానారక జీవులలో
    జ్ఞానము గల్గినదయినను స్వార్థము తోడన్
    మానము విడి వర్తించెడి
    మానవజన్మమ్ము శ్రేష్ఠమా ! కాదు గదా

    రిప్లయితొలగించండి
  11. “జానకి!మానవాధములు సంద్రము దాటియు లంకలోన,కా
    లూనుట సాధ్యమా?మదిని యూహలు మానుము,హీన జన్మమౌ
    మానవ జన్మసత్యమనుమాట యసత్యము,సూడనెవ్విధిన్
    దానవ జాతి గొప్ప”దని దానవ కాంతలు పల్కిరామెతోన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'మదిని నూహలు...' అని ఉండాలి కదా?

      తొలగించండి
    2. నమస్తే శంకరయ్యగారు!!మీరన్నట్లే ఉండాలి..

      తొలగించండి
  12. కానదె సాటి మానవులకై దయ స్నేహము సానుభూతియున్
    తానిది జేసినన్ తనకు దక్కెడి లాభము యేమిటంచు తా
    నానక ప్రశ్నలేయు పలు నాసి రకమ్ములు ఉండియుండగన్
    మానవజన్మ శ్రేష్ఠమను మాట యసత్యము సూడ నెవ్విధిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లాభము+ఏమి' టన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "లాభ మదేమిటంచు" అనండి. అలాగే "నాసి రకమ్ములు నుండి యుండగన్" అనండి.

      తొలగించండి
  13. సమస్య :- “మానవజన్మమ్ము శ్రేష్ఠమా కాదు గదా”

    *కందం**

    దానవ గుణముల తోడను
    దీనుల యెడ కర్కశమ్ము దెలుపు జననమున్
    మానవత జూపనట్టిది
    మానవ జన్మమ్ము శ్రేష్ఠమా? కాదు గదా!?
    ...................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  14. కానల నాశనమ్మునను కాసులుపొంద తలంచి చెచ్చెరన్
    దానవులై చరించుచును దౌష్ట్యములన్ బొనరించు చుండగా
    స్థానము లేక వర్తిలగ జంతువు లన్నిగతించు చుండెనే
    మానవజన్మ శ్రేష్ఠమను మాట యసత్యము సూడ నెవ్విధిన్

    రిప్లయితొలగించండి
  15. ఓ లతాంగీ...
    ఆననమెంత సుందరము హా!చనుకట్టు మహాద్భుతంబు ని
    ర్మాణనితంబ కుంభములు మాన్యములై మురిపించుచుండ సం
    ధానముజేయు కౌను పరితాపము బెంచ రమింపకున్న నీ
    *మానవజన్మ శ్రేష్ఠమను మాట! యసత్యము సూడ నెవ్విధిన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  16. పానముజేయుచు మద్యము
    దానమునేజేయ కెపుడు దాపుడు నుంచన్
    గానము జేయని విష్ణుని
    మానవ జన్మమ్ము శ్రేష్టమా,కాదుగదా

    రిప్లయితొలగించండి
  17. కానఁగ విహంగ తిర్య
    గ్యోనుల కిల శ్రేష్ఠ తర మగును వీక్షింపం
    గా నిర్జర తతి కన్నను
    మానవ జన్మమ్ము శ్రేష్ఠమా కాదు గదా


    ఈ నర లోక సంభవులు హింసను వీడక యున్నఁ గానలన్
    గీనల నుండ నోపుదురు కింపురు షోరగ కిన్న రాది సం
    తాన సదైత్య సానిమిష దానవ రాక్షస సమ్మతంబ యీ
    మానవ జన్మ శ్రేష్ఠ మను మాట యసత్యము సూడ నెవ్విధిన్

    రిప్లయితొలగించండి
  18. వీనుల విందుగా దగదు వేలకువేలుగ జన్మలందునన్
    మానవ జన్మ శ్రే ష్టమని మాన్యులు సెప్పుట వారెఱింగియున్
    మానవ జన్మ శ్రేష్టమనుమాట యసత్యము సూడనెవ్విధిన్
    నానతినీయగా దగునె యార్యులవారికి యెట్లుదోచెనో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వారికి నెట్లు దోచెనో" అనండి.

      తొలగించండి
  19. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సృష్టించే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారు.మార్పు జేసిన పద్యం.

      కందం
      నానా విధంబులైన క
      రోనా క్రిమి జీవ జాతి రూపసృజనులున్
      ఈనాటి శాస్త్ర వేత్తల
      మానవ జన్మమ్ము శ్రేష్ఠమా ?కాదు గదా!
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.

      తొలగించండి
  20. ఈ నేలలోన శ్రేష్టము

    మానవ జన్మమ్ము,శ్రేష్టమా కాదుగదా

    దానవులజన్మమార్యా

    మానిని‌ని విడువ శుభమనె మండోదరియే

    రిప్లయితొలగించండి
  21. కం//
    జ్ఞానత్రయమును వీడుచు
    తా, నవధూతనని పలుకు దౌర్జన్యముచే !
    దానవ గుణములు గలిగిన
    మానవ జన్మమ్ము శ్రేష్ఠమా కాదు గదా !

    రిప్లయితొలగించండి
  22. మానవతాగుణమునువిడి
    దానవులట్లుగభువినిసతతముతిరుగుచున్
    దీనులనిందించెడుయా
    మానవ జన్మమ్ము శ్రేష్టమా?కాదుగదా!

    హీనపు బుద్ధితోవిడిచి యింగిత మజ్ఞుల వోలె పెద్దలన్
    జ్ఞానమొసంగుచున్సతముచక్కని సంస్కృతి నేర్పువారలన్
    కానక కన్నవారలకు కస్తిని బెట్టెడి డెందమున్నచో
    మానవజన్మ శ్రేష్ఠమను మాట యసత్యము సూడ నెవ్విధిన్”*

    రిప్లయితొలగించండి
  23. దానవులైవర్తించుచు
    తాననుసరణము నుచేయు దారియె శ్రేష్టం
    బైనదటంచుచరించెడి
    మానవజన్మమ్ము శ్రేష్టమా కాదుగదా

    రిప్లయితొలగించండి