9-2-2022 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితము”(లేదా...)“ఖలు నొక మార్గదర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్”
తిమిర ముండిన వేళలో తిరుగ లేరుజనులు మార్గము కనలేక, జగతి కెపుడుతూర్పు నగముల నుదయించి తోడు చూపుఖలుడు మార్గ దర్శకుడైన కలుగు హితము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జారచోరులుచెలరేగజగతియందుకుక్కజింపినవిస్తరిగకూడుకీడుఖలుడుమార్గదర్శకుడైన’”గలుగుహితముధర్మవర్తిగప్రభువుండధరణియందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణభంగం. సవరించండి.
కుక్కజింపినవిస్తరికూడుకీడు
తేటగీతిచోరవృత్తిని రంజిల్లి చోద్యముగనుపక్షిజంటను విడదీసి బాధ తెలిసిమౌని బోధను రామ నామాన మారుఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితముచంపకమాలపలువురి బాధపెట్టి వనవాసిగ దోపిడినెంచి వేటలోవలపున మున్గు పక్షులను బాణముతో విడదీసి జాలిమైమెలకువ మౌనిమంత్రమున మిన్నగ రాముని దల్చి మారెడున్ఖలు నొక మార్గదర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కులమదిబ్రహ్మవంశమునుగూర్చెనురావణులంకరాజుగాఖిలమునుగాగధర్మమునుగిల్బిషమాతడుజేసెజూడగన్కలిగెనురాముదర్శనమకాంక్షితముక్తినిబొందెరాక్షసుల్ఖలునొకమార్గదర్శకుడుగాగణుతింపహితమ్ముసేకుఱున్
సలలిత మానసంబునను సజ్జను డైమదిలోన సర్వదాదలచుచు దేవదేవుడిని దానముధర్మము పేదవారికిన్చెలగుచు జేసి దీనజన చింతలుదూరము సేయునట్టి నిష్ఖలునొక మార్గ దర్శకుడుగా గనుతింపహితంబు జేకురున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఆటవెలదిమనుగడెట్లు?//ఖలుఁడు మార్గ దర్శకుఁడైన,గలుగు హితము //సజ్జనుల సుపథమునందు నడచు కొనగ నందఱికి నెపుడుసరస కవి వరేణ్య!శంకరార్య!
మంచి మార్గము జూపించు మాన్యులగుచు జన హితమ్మును గోర రే సజ్జనాళి సంఘ నాశ ము కాంక్షిo ప జరుగు నెటుల ఖలుడు మార్గ దర్శకుడైన గలుగు హితము?
ఈ సమాజ మెవ్వానిని హీను డనుచు దూరుచుండునో గని వాని దుష్కృతములచేయకుండ నుండుటకునీ స్థిరము నందుఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుగు హితము.పలువురు ఛీత్కరించు కడు పాపపు కృత్యము లేవియో భువిన్ దొలుత నెఱుంగగా వలయు దుష్కృతమైన ప్రయోజనమ్ములన్ సలుపెడు వారివైన ఖలు సానువు వీడగ నెంచు వారికిన్ ఖలునొక మార్గదర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
స్వీయ శక్తితో వెలుగులు చిమ్మువాడుగగనవీధినకొలువైన కమల ధరుడుతిమిర సంహారమొనరించు దినకరుండుఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితముఖలుడు=సూర్యుడు
బ్రతుకు నేర్పిన యనుభవ పాఠములకువక్రమార్గము విడనాడి సక్రమమగుమార్గమవలంబనముచేయ మారినట్టిఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితము
అలసట లేకయే తిరుగు నశ్వములేడును నేక చక్రమే యలరగ తేరికిన్,నడుపు నాతఁడు పిచ్చుక కుంటియౌ వియత్తలమది శూన్యమౌ పథము తప్పక గమ్యముఁజేరునట్టి యాఖలునొక మార్గ దర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
అవసరముదీర్చు ప్రాణికి యడుగ కుండనదియె తన ధర్మమనుకొని యాచరించుఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితముమానవులకను సంగతి మరువకెపుడుఖలుడు = సూర్యుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "ప్రాణిని నడుగకుండ"
🙏🏽
మంచి వానిగ మారుచు మంచి జేసి ఖలుడు మార్గదర్శకు డైన గలుగు హితము దేశమున నింక మోసపు దిగులు గనము మంచి కాపాడు నిరతము మానవులను
దేశ హితయోచనల యందుఁ దేలు వాఁడు సకల భూత హిత రత విశాల హృదియురిక్త కార్య ద్వేషుండు దూరీకృతైక ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితముజలనిధి సన్ని భోన్నత విచార గభీర మనో విరాజితున్ విలస దమేయ దానగుణ వృత్త విశుద్ధ చరిత్ర పూరుషున్ సలలిత మాన సోత్తముని సద్గణ సన్నుత ధర్మ భర్మ మేఖలు నొక మార్గదర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.'కార్యద్విషుండు' టైపాటు.
పలువురి సేమముం దలచి వారికి సేవలు సేయగోరుచో ఖలునొక మార్గదర్శకుడుగా గణుతింప హితమ్ము సేకుఱున్ గలియుగ మందునన్ ఖలులు గాంతురెమంచినిగోరువారుగా గలనున జర్గునట్లుగను గాంతరొ! కాదది జీవితంబునన్
స్వార్థమించుక లేనట్టి వాజసనియె నియతి తప్పక ధర్మమ్ము నిర్వహించి పరులకుపకార మొనరించు పటుగభస్తి ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుగు హితము. పులుగులు జంతు జాలములు భూజపు బంధువుగా ప్రసిద్ధుడై తొలిదెస నుద్భవించి కడు తూర్ణము నందున పశ్చిమానికై చలనము జేయుతాపనుడు స్వార్థము లేని పరోపకారియౌ ఖలునొక మార్గదర్శకుడుగా గణుతింప హితమ్ము సేకుఱున్.
చెడునుకార్యములన్నియు జీవితమున*ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ, గలుఁగు హితము*మంచిమార్గమునందున మహిని మెలగునటుల బోధించు మాటలనాలకించ.
తిమిర ముండిన వేళలో తిరుగ లేరు
రిప్లయితొలగించండిజనులు మార్గము కనలేక, జగతి కెపుడు
తూర్పు నగముల నుదయించి తోడు చూపు
ఖలుడు మార్గ దర్శకుడైన కలుగు హితము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజారచోరులుచెలరేగజగతియందు
రిప్లయితొలగించండికుక్కజింపినవిస్తరిగకూడుకీడు
ఖలుడుమార్గదర్శకుడైన’”గలుగుహితము
ధర్మవర్తిగప్రభువుండధరణియందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. సవరించండి.
కుక్కజింపినవిస్తరికూడుకీడు
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిచోరవృత్తిని రంజిల్లి చోద్యముగను
పక్షిజంటను విడదీసి బాధ తెలిసి
మౌని బోధను రామ నామాన మారు
ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితము
చంపకమాల
పలువురి బాధపెట్టి వనవాసిగ దోపిడినెంచి వేటలో
వలపున మున్గు పక్షులను బాణముతో విడదీసి జాలిమై
మెలకువ మౌనిమంత్రమున మిన్నగ రాముని దల్చి మారెడున్
ఖలు నొక మార్గదర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికులమదిబ్రహ్మవంశమునుగూర్చెనురావణులంకరాజుగా
రిప్లయితొలగించండిఖిలమునుగాగధర్మమునుగిల్బిషమాతడుజేసెజూడగన్
కలిగెనురాముదర్శనమకాంక్షితముక్తినిబొందెరాక్షసుల్
ఖలునొకమార్గదర్శకుడుగాగణుతింపహితమ్ముసేకుఱున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసలలిత మానసంబునను సజ్జను డై
రిప్లయితొలగించండిమదిలోన సర్వదా
దలచుచు దేవదేవుడిని దానము
ధర్మము పేదవారికిన్
చెలగుచు జేసి దీనజన చింతలు
దూరము సేయునట్టి ని
ష్ఖలునొక మార్గ దర్శకుడుగా గనుతింప
హితంబు జేకురున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిమనుగడెట్లు?//ఖలుఁడు మార్గ దర్శకుఁడైన,
గలుగు హితము //సజ్జనుల సుపథము
నందు నడచు కొనగ నందఱికి నెపుడు
సరస కవి వరేణ్య!శంకరార్య!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమంచి మార్గము జూపించు మాన్యులగుచు
రిప్లయితొలగించండిజన హితమ్మును గోర రే సజ్జనాళి
సంఘ నాశ ము కాంక్షిo ప జరుగు నెటుల
ఖలుడు మార్గ దర్శకుడైన గలుగు హితము?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఈ సమాజ మెవ్వానిని హీను డనుచు
దూరుచుండునో గని వాని దుష్కృతముల
చేయకుండ నుండుటకునీ స్థిరము నందు
ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుగు హితము.
పలువురు ఛీత్కరించు కడు పాపపు కృత్యము లేవియో భువిన్
దొలుత నెఱుంగగా వలయు దుష్కృతమైన ప్రయోజనమ్ములన్
సలుపెడు వారివైన ఖలు సానువు వీడగ నెంచు వారికిన్
ఖలునొక మార్గదర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిస్వీయ శక్తితో వెలుగులు చిమ్మువాడు
రిప్లయితొలగించండిగగనవీధినకొలువైన కమల ధరుడు
తిమిర సంహారమొనరించు దినకరుండు
ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితము
ఖలుడు=సూర్యుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబ్రతుకు నేర్పిన యనుభవ పాఠములకు
రిప్లయితొలగించండివక్రమార్గము విడనాడి సక్రమమగు
మార్గమవలంబనముచేయ మారినట్టి
ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅలసట లేకయే తిరుగు నశ్వములేడును నేక చక్రమే
రిప్లయితొలగించండియలరగ తేరికిన్,నడుపు నాతఁడు పిచ్చుక కుంటియౌ వియ
త్తలమది శూన్యమౌ పథము తప్పక గమ్యముఁజేరునట్టి యా
ఖలునొక మార్గ దర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅవసరముదీర్చు ప్రాణికి యడుగ కుండ
రిప్లయితొలగించండినదియె తన ధర్మమనుకొని యాచరించు
ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితము
మానవులకను సంగతి మరువకెపుడు
ఖలుడు = సూర్యుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ప్రాణిని నడుగకుండ"
🙏🏽
తొలగించండిమంచి వానిగ మారుచు మంచి జేసి
రిప్లయితొలగించండిఖలుడు మార్గదర్శకు డైన గలుగు హితము
దేశమున నింక మోసపు దిగులు గనము
మంచి కాపాడు నిరతము మానవులను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదేశ హితయోచనల యందుఁ దేలు వాఁడు
రిప్లయితొలగించండిసకల భూత హిత రత విశాల హృదియు
రిక్త కార్య ద్వేషుండు దూరీకృతైక
ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితము
జలనిధి సన్ని భోన్నత విచార గభీర మనో విరాజితున్
విలస దమేయ దానగుణ వృత్త విశుద్ధ చరిత్ర పూరుషున్
సలలిత మాన సోత్తముని సద్గణ సన్నుత ధర్మ భర్మ మే
ఖలు నొక మార్గదర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'కార్యద్విషుండు' టైపాటు.
పలువురి సేమముం దలచి వారికి సేవలు సేయగోరుచో
రిప్లయితొలగించండిఖలునొక మార్గదర్శకుడుగా గణుతింప హితమ్ము సేకుఱున్
గలియుగ మందునన్ ఖలులు గాంతురెమంచినిగోరువారుగా
గలనున జర్గునట్లుగను గాంతరొ! కాదది జీవితంబునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిస్వార్థమించుక లేనట్టి వాజసనియె
నియతి తప్పక ధర్మమ్ము నిర్వహించి
పరులకుపకార మొనరించు పటుగభస్తి
ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుగు హితము.
పులుగులు జంతు జాలములు భూజపు బంధువుగా ప్రసిద్ధుడై
తొలిదెస నుద్భవించి కడు తూర్ణము నందున పశ్చిమానికై
చలనము జేయుతాపనుడు స్వార్థము లేని పరోపకారియౌ
ఖలునొక మార్గదర్శకుడుగా గణుతింప హితమ్ము సేకుఱున్.
చెడునుకార్యములన్నియు జీవితమున
రిప్లయితొలగించండి*ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ, గలుఁగు హితము*
మంచిమార్గమునందున మహిని మెలగు
నటుల బోధించు మాటలనాలకించ.