22, ఫిబ్రవరి 2022, మంగళవారం

సమస్య - 4000

23-2-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సామాన్యుఁడు లోకమున యశమ్ముం బడసెన్”
(లేదా...)
“సామాన్యుం డొకఁ డీ ప్రపంచమునఁ బ్రాశస్త్యమ్మునందెన్ భళా”

33 కామెంట్‌లు:

 1. కందం
  తామె విశిష్టాద్వైతము
  రామానుజులందజేసి ప్రజలందరిలో
  శేముషి సమతను బంచి య
  సామాన్యుఁడు లోకమున యశమ్ముం బడసెన్!

  శార్దూలవిక్రీడితము
  ఏమా వైభవమంచు నెల్లరును సేవింపంగ ముచ్చింతలన్
  స్వాముల్ తీరిరి బోధఁ జేసియు విశిష్టాద్వైత రామానుజుల్
  వ్యోమమ్మున్ స్పృశియించు మూర్తిగను నీవొప్పంగనే శ్రీనివా
  సా! మాన్యుం డొకఁ డీ ప్రపంచమునఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భళా!

  రిప్లయితొలగించండి
 2. శ్రీమంతుఁడు ధీమంతుఁడు
  భూమీశులలోన కీర్తిఁబొందిన సీతా
  రాముండసదృశ వీరుఁడ
  సామాన్యుడు లోకమున యశమ్ముంబడసెన్.

  రిప్లయితొలగించండి
 3. నీమము నీతియు గల్గియు
  నేమాత్రము స్వార్థ చింత నెరుగని వాడై
  కామితములు దీర్చ గల య
  సామాన్యుడు లోకమున యశమ్ము బడసెన్

  రిప్లయితొలగించండి
 4. ఖామందుడ నాకేమని
  కామము నొందుచు నొక పరకాంతను పట్టన్
  నామెను రక్షించెననుచు
  సామాన్యుఁడు లోకమున యశమ్ముం బడసెన్

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జన క్షేమ' మన్నపుడు 'న' గురువై గణభంగం. "గాంధి జనక్షేమంబును..." అనవచ్చు.

   తొలగించండి
  2. కందం
   సామాన్యుడు గాంధి జన
   క్షేమంబును దలచి పోరు జేయగ ఖ్యాతిన్
   ధీ మతుడై బడయగ నా
   సామాన్యుడు లోకమున యశమ్ముం బడసెన్
   ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
   ఉండవల్లి సెంటర్.
   ధన్యవాదాలు గురువు గారు.

   తొలగించండి

 6. రాముని కార్యంబనుచును
  కోమలి సీతమ్మ జాడ కొరకై ఘన నీ
  ర్వామిని తరించి యనుమడ
  సామాన్యుఁడు లోకమున యశమ్ముం బడసెన్.  భామన్ వీడిన రామచంద్రుఁ బరితాపంబింక తొల్గింప నీ
  ర్వామిన్ దాటి యయోనిజన్ వెదక తాలంఘించి సంద్రమ్మునే
  యా మార్తాండుని శిష్యుడౌ హనుమయే లంకాపురిన్ గాల్చి యా
  సామాన్యుం డొకఁ డీ ప్రపంచమునఁ బ్రఖ్యాతిం గనెం జిత్రమే

  రిప్లయితొలగించండి
 7. నీమముగా జేకొనినా
  డామహనీయుం డహింసయను సువ్రతమున్
  ధీమంతుఁడు మనగాంధి య
  సామాన్యుఁడు లోకమున యశమ్ముం బడసెన్

  రిప్లయితొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  ధీమసమున నాంగ్లేయుల
  నామిక నణగార్చి గాంధి నచ్చగు స్వేచ్ఛన్
  ప్రామియు జాతికి తా నతి
  సామాన్యుడు లోకమున యశమ్ముం బడసెన్.

  రిప్లయితొలగించండి
 9. సామాజికోద్ధరణకై
  నీమంబులనేర్పరచిన నిజవర్తనుడై
  క్షేమాభిలాషి బుద్ధుడ
  సామాన్యుఁడు లోకమున యశమ్ముం బడసెన్

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  తామీదేశము నాక్రమించి జనులన్ దండించు నాంగ్లేయులన్
  స్థేమమ్మౌ తన బుద్ధిసూక్ష్మతను గాంధీతాత వారెల్లరిన్
  పోమొత్తంగగజేసి స్వేచ్ఛ నిలిపెన్ పొంకమ్ముగా తాను నో
  సామాన్యుండొకడీ ప్రపంచమున ప్రాశస్త్యంబు నందెన్ భళీ!

  రిప్లయితొలగించండి
 11. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  రాముని కీర్తన జేయుచు
  భామిని సీతను వెదకెడు బాధ్యత నందున్
  సోమించి పావని యను న
  సామాన్యుడు లోకమున యశమ్ముం బడసెన్.

  రిప్లయితొలగించండి
 12. హేమాహేములు భారతంబుఁ గొని దామేలంగ పీడించ నే
  మోమాటంబులు లేని యోధుడుగ దా మూర్తీభవించంగ నీ
  ధామమ్మున్ గడచేర్చగా నిలచె సీతారామరాజై గనన్
  సామాన్యుం డొకఁ డీ ప్రపంచమునఁ బ్రాశస్త్యమ్మునందెన్ భళా

  రిప్లయితొలగించండి
 13. కామములకు దలనొగ్గక
  భూమిజనులకు నిరతము బోధలు గఱపన్
  ధీమంతులుగ నగుటయొక
  సామాన్యుడు లోకమున యశమ్ముం బడసెన్

  రిప్లయితొలగించండి
 14. కామంబొందక యెన్నడున్ మిగుల దాకామారి నిర్జించిగా
  సామాన్యుండొకడీ ప్రపంచమున బ్రాశస్త్యమ్ము నందెన్ భళా
  ధీమంతుల్ నిరతమ్ము బోధల్ దగన్ దేదీప్యమానంబుగా
  భూమ్యాకాశము లందు రీతిగ ను బ్రబోధింతు రెల్లప్పుడున్

  రిప్లయితొలగించండి
 15. ధీమంతుండయి బానిసత్వమును వే తీర్చంగ సంసిద్ధుడై
  కామమ్మున్ త్యజియించి పట్టుదలతో కార్యమ్ములన్ జేయుచున్
  ప్రేమన్ బంచుచు పేదవారలకు తా భేదించి యంగ్లేయులన్
  సామాన్యుం డొకఁ డీ ప్రపంచమునఁ బ్రాశస్త్యమ్మునందెన్ భళా

  రిప్లయితొలగించండి
 16. సామాన్యుం డెదుగఁగ నీ
  భూమిని విజ్ఞాన మం దపూర్వమ్ముగ విం
  తేమున్నది లోకై కా
  సామాన్యుఁడు లోకమున యశమ్ముం బడసెన్


  ఏ మాత్రమ్ము భయమ్ము లేక మది లోకేశుండు నౌ రుక్మిణీ
  భామా నాథుని వాసుదేవు నట సంభావింప నీ రీతి సం
  గ్రామేచ్ఛన్ శిశు పాలుఁ డుగ్రుఁ డయి యా కౌంతేయు నిందించె ధి
  క్సామాన్యుం డొకఁ డీ ప్రపంచమునఁ బ్రఖ్యాతిం గనెం జిత్రమే

  రిప్లయితొలగించండి
 17. ఆమంత్రించె స్వతంత్ర సంగరము నందాంగ్లేయులన్ ఢీకొనన్
  క్షేమంబంచునహింసమార్గమను సంకేతంబుతో నెల్లరన్
  నీమంబాతఁడుబూని సత్యపథమున్ నిత్యంబు వర్తిల్లగన్
  సామాన్యుం డొకఁ డీ ప్రపంచమునఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భళా

  రిప్లయితొలగించండి
 18. నీమమ్మున్ విడనాడకుండ జదివెన్ నిత్యంబు పంతంబుతో
  రామోజ్యాత్మజుడెంతయో శ్రమముతో
  బ్రాజ్ఞుల్ ప్రశంసించగా
  నామేధావి రచించె భారతపురాజ్యాంగమ్ము
  నంబేడ్క రా
  సామాన్యుండొకడీ ప్రపంచమున ప్రాశస్త్య
  మ్ము నందెన్ భళా!

  రిప్లయితొలగించండి
 19. ఏమియునెరుగనటంచును
  సామాన్యునివలె పలుకుచుసతతంబిలలో
  సామముతోడను పలుకు న
  సామాన్యుఁడు లోకమున యశమ్ముం బడసెన్”*

  రిప్లయితొలగించండి