23, ఫిబ్రవరి 2022, బుధవారం

సమస్య - 4001

24-2-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉద్యద్రవిఁ బడమటఁ గని యుక్తంబంటిన్”
(లేదా...)
“ఉద్యద్భానునిఁ గాంచి పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్”

42 కామెంట్‌లు:

  1. సద్యస్ఫూర్తినిశ్రీశ్రీ
    విద్యనువిప్లవకవితనువీరుడుకాగా
    పద్యమువచనంబాయెను
    ఉద్యద్రవిబడమటగనియుక్తంబందెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    విద్యలఁ బడమటి దేశము
    సద్యశమందంగ నేర్ప సాధించి సుతుం
    డుద్యోగమంద నున్నతి
    నుద్యద్రవిఁ బడమటఁ గని యుక్తంబంటిన్!

    శార్దూలవిక్రీడితము
    విద్యల్నేర్వఁగ పశ్చిమంబుజని ప్రావీణ్యం బు సాధించి తా
    నుద్యుక్తుండయి స్పర్ధతో బడయఁగా నుద్దండుడౌచున్ సుతుం
    డుద్యోగంబను మేటివేతనముతో నొందంగ సద్గామిగన్
    నుద్యద్భానునిఁ గాంచి పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్!

    రిప్లయితొలగించండి
  3. మద్యపు మత్తు ఫలితమున
    నుద్యద్రవిఁ బడమటఁ గని , యుక్తంబంటిన్
    పద్యము పూరించుట కయి ,
    సద్యమటుల జేయ మెచ్చె శంకర గురువుల్

    రిప్లయితొలగించండి
  4. విద్యావంతులుగాగభారతమునన్విన్నాణమున్జూపుచున్
    పథ్యంబైనదిమార్గమెంచిగనిరేప్రాంబునైపుణ్యతన్
    సద్యస్ఫూర్తినినేర్పుతోనమెరికాశాంతిన్గనన్బిడ్డలున్
    ఉద్యద్భానునిగాంచిపశ్చిమమునన్యుక్తంబుగానెంచితిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థ - ద కు యతి చెల్లదమ్మా. ద ధ లకు థ ధ లకు మాత్రమే చెల్లుతుంది.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో ప్రాస, గణ భంగం. సవరించండి.

      తొలగించండి
    3. తప్పుగావ్రాసితినిక్షమించగలరు

      తొలగించండి

  5. ఉద్యోగిగ గోవాలో
    నుద్యమములనడిపినట్టి యువకుండతడా
    విద్యాధికుఁ దేశప్రగతికి
    ఉద్యద్రవిఁ బడమటఁ గని యుక్తంబంటిన్

    రిప్లయితొలగించండి

  6. విద్యల్ మెండుగ నేర్వనేమి యతడో పెచ్చారియే గావునన్
    మద్యంబున్ గొని మత్తులో రవి యా మార్తాండుఁ వర్ణించుచున్
    బద్యంబోక్కటి వ్రాసె నందుగనగన్ భావంబిదే గాంచగా
    నుద్యద్భానుని గాంచి పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్.

    రిప్లయితొలగించండి
  7. సద్యఃకాలముఁదూర్పున
    నుద్యద్రవిఁ,బడమటఁగని యుక్తంబంటిన్
    ఉద్యోగానంతరమున
    నాద్యుమణియు నస్తమించ ననుదినమందున్.

    రిప్లయితొలగించండి
  8. ఉద్యద్భానుని చిహ్నమె
    సాధ్యంబొనరించె గెలుపు సర్వస్వంబై
    ఉద్యమమంతముకాగా
    ఉద్యద్రవిఁ బడమటఁ గని యుక్తంబంటిన్

    రిప్లయితొలగించండి
  9. ఉద్యోగంబునకై సనెన్ సఖుడు తా నూరున్
    విసర్జించియున్
    సద్యంబాతడు భాగ్యవంతుడయి తా
    సంతో షసౌఖ్యంబుతో
    హృద్యమ్మొప్పగనుండె నచ్చట గడున్
    హెచ్చైన ద్రవ్యంబుతో
    నుద్యద్భానునిగాంచి పశ్చిమమునన్
    యుక్తంబుగా నెంచితిన్

    రిప్లయితొలగించండి
  10. విద్యలబడసిన పిమ్మట
    నుద్యోగముసేయనేగ యూయెస్యేకున్
    సద్యస్స్ఫూర్తిగనచ్చట
    నుద్యద్రవిఁ బడమటఁ గని యుక్తంబంటిన్

    రిప్లయితొలగించండి
  11. ఉద్యోగార్థము వ్యోమ్నిప్రాగ్దిశను నోహో!వెల్గులొప్పారగా
    నుద్యద్భానునిఁగాంచి,పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్
    ఉద్యోగంబునుపూర్తిచేసిచనుటల్,ఉత్సాహముంగల్గుగా
    యీ ద్యోవీథిఁజరించు భాస్కరుని వీక్షించంగ నెవ్వారికిన్.

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    విద్యల నెల్లయు నేర్చియు
    ఉద్యోగము జేయుటందు నుత్తమ గతిలో
    సద్యశుడైన సుతుండా
    ఉద్యద్రవి బడమట గని యుక్తంబంటిన్.

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    విద్యల్ నేర్చియు నన్యదేశమునకున్ పెంపారు చిత్తమ్ముతో
    ఉద్యోగార్థము జేరి కీర్తిగొనుచున్ యుద్ఘాటితజ్ఞుండునై
    హృద్యంబౌనగు జీవితమ్మున సదా హేలొందు సూనుండు నా
    ఉద్యద్భానుని గాంచి పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్.

    రిప్లయితొలగించండి
  14. సద్యశము నొందు నభమున
    నుద్యత్ర వి : పడమట గని యుక్తంబంటిన్
    విధ్యుక్త ధర్మ మందున
    నాద్యు o డై వెల్గు గాదె యాదిత్యుo డై

    రిప్లయితొలగించండి
  15. విద్యల్ నేర్చి కరమ్ము శక్తియుతుడై, విత్తమ్మునార్జించి తా
    నుద్యోగమ్మున పేరుపొంది, మదిలోనుత్పన్నమౌయిచ్ఛతో
    సద్యస్ఫుర్తిని చూపుచున్ రచనలన్ సాగించి పేరొందగా
    నుద్యద్భానునిఁ గాంచి పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్

    రిప్లయితొలగించండి
  16. శా.
    సద్యోజాత నరేంద్ర నాథుడగుచున్ జన్మించ బెంగాలునన్
    వేద్యంబౌ ఘన తత్వశాస్త్రములపై పేర్మిన్ సదా వాదనల్
    హృద్యంబయ్యెడి బోధనా పటిమచే నింపార విన్పించగా
    *ఉద్యద్భానునిఁ గాంచి పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్*

    రిప్లయితొలగించండి
  17. కందం
    ఉద్యమ భానుడు గాంధీ
    సద్యము నాంగ్లేయులపయి సమరము సలిపెన్
    ఉద్యమ కారుల భావన
    ఉద్యద్రవి బడమట గని యుక్తంబంటెన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  18. విద్యోత నార్థ మాత్రమ
    సద్యో యత్న మొనరించి సంబరమున నే
    నాద్యంతము వీక్షించుచు
    నుద్యద్రవిఁ బడమటఁ గని యుక్తం బంటిన్


    ఛేద్యంబై తనరంగ సంశయము వే ఛేదింపఁగా నొప్పు ని
    ర్భేద్యం బైనను మున్ను భేద్యముగఁ గావింపంగ యత్నింపుమా
    చోద్యం బైనను నేను మున్నెడఁద సంశోధించి ప్రాక్దిక్కు నం
    దుద్యద్భానునిఁ గాంచి పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్

    [పశ్చిమమునన్ =వెనుకను]

    రిప్లయితొలగించండి
  19. సద్యో గర్భుడుగద యా
    యుద్యద్రవి, బడమటగని యుక్తంబంటిన్
    మధ్యాహ్నంబును దాటిన
    హృద్యమమౌ కాంతి గలిగి యింపున నుండన్

    రిప్లయితొలగించండి
  20. సద్యో గర్భునిగా దలంచితిని యాసాకార రూపుండు నా
    యుద్యద్భానుని గాంచి ,పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్
    మధ్యాహ్నంబున గాంతి గూడుచు దగన్ మార్తాండ నామంబుతో
    నాద్యంతంబును సేవ జేయును వెసన్ నాహాయ నంగా బ్రజల్

    రిప్లయితొలగించండి
  21. హృద్యముగానగుపించుచు
    నాద్యంతముకాంతిపంచియాదరమొప్పన్
    విద్యలునేర్పెడిగురువగు
    ఉద్యద్రవిఁ బడమటఁ గని యుక్తంబంటిన్”*

    రిప్లయితొలగించండి