3, ఫిబ్రవరి 2022, గురువారం

సమస్య - 3982

4-2-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మార కళల మెచ్చె మౌనివరుఁడు”
(లేదా...)
“మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్”

28 కామెంట్‌లు:

  1. ఉభయభారతమ్మయుంచినపందెమ్ము
    శంకరుండుతెలిసిజారుడయ్యె
    సుదతిముద్దుకులుకుచూచుచుమదిలోన
    మారకళలమెచ్చెమౌనివరుడు

    రిప్లయితొలగించండి
  2. చేరెనుపార్థుడాయెడనుచెల్లినమాయలరాగముక్తుడై
    ద్వారకపూజలందెనటదాపుననిల్చినరాజకన్యతో
    ఆరనిప్రేమగల్గిఘనుడాయమతోడుతనాటపాటలన్
    మారకళారహస్యములమత్తిలుభాగ్యముదక్కెమౌనికిన్

    రిప్లయితొలగించండి
  3. ఘోరమైన తపము నౌర!భగ్నముఁజేయ
    మేనకాప్సర,తన మేని సిరుల
    నొలకఁబోయ,మేన పులకరింతలు పుట్టి
    మార కళల మెచ్చె మౌని వరుడు.

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    మీరి యింద్రుడంప మేనక నంతట
    కౌశికునకు జూపఁ కౌగిటఁ బసఁ
    దపము మరచి ముక్తి తరుణిలోఁ గలదని
    మార కళల మెచ్చె మౌనివరుఁడు!

    ఉత్పలమాల
    సారస నేత్ర మేనకను శక్రుఁడు వంపఁగ కౌశికోత్తమున్
    మీరుచు యౌవనాద్రులను మీటుచు స్వర్గము సూడరమ్మనన్
    జారిచి మేటిదౌ తపము జవ్వని కౌగిలె ముక్తిమార్గమై
    మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్!

    రిప్లయితొలగించండి
  5. మేని హొయలు జూపు మేనక దర్శించి
    గాధి సుతుడు మాని కఠిన తపము
    లొంగి పోయి యతడు లోలత లో మున్గి
    మా ర కళల మె చ్చె మౌని వరుడు

    రిప్లయితొలగించండి
  6. ఘోరతపస్సుఁజేయ ముని ఘూర్ణిల లోకములెల్ల నింద్రుఁడున్
    వారిజనేత్ర మేనకను పంపగఁజూపుచు వన్నెచిన్నెలుం
    జేరియు ,కౌగిలింతల వశీకరణంబొనరించె,నామెతో
    మార కళారహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్.

    రిప్లయితొలగించండి

  7. వేల్పుదపసి గాంచె వ్రేపల్లె కేతెంచి

    నందునింటపెరుగు నవ్వ వాడు

    గొల్ల వాడలందు నల్లవేల్పు హరి కౌ

    మార కళల మెచ్చె మౌని వరుడు.


    నారదుడా రణాశనుడు నందుని యింటికి జేరు నత్తరిన్

    వారిజనేత్రి స్తన్యమిడు పాళము నామెను సంహరించె కా

    సారముఁ స్నానమాడుతరి చామల కోకల దోచె చక్రి కౌ

    మారకళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్.

    రిప్లయితొలగించండి
  8. వజ్రి తనను భువికి పంపగ , మేనక
    తపము సలుపు వాని దరిని జేయు
    నర్తనముల గాంచిన తరి గల్గిన కోప
    మార కళల మెచ్చె మౌనివరుఁడు

    రిప్లయితొలగించండి
  9. కౌశికముని దీక్ష నాశన మొనరింప
    నప్సరసను బంపె నమర విభుడు
    మేనక వలలోన మీనాంకునికి జిక్కి
    మార కళల మెచ్చె మౌనివరుఁడు

    రిప్లయితొలగించండి
  10. మేనిలోనిహొయలు మేనక చూపగ
    గాధిపట్టితపము ఘాతమొందె
    నతిశయించు మోహ మచ్చర జూపిన
    మార కళల మెచ్చె మౌనివరుఁడు

    రిప్లయితొలగించండి
  11. మార వశుఁడు నయ్యె మఱి భరద్వాజుఁడు
    మార వశి పరాశ రోరు జపుఁడు
    మార వశుఁడు కాఁడె మౌని గాధేయుఁడు
    మార కళల మెచ్చె మౌని వరుఁడు


    సార తరామ లేరితము సాధు జనావలి భావ సమ్మతా
    పార విశేష వృత్త సు విభాజిత సత్కృత కామ సూత్ర స
    త్కారు నెఱుంగ నట్టి జన కాయము నెందును గాన వచ్చునే
    మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్

    రిప్లయితొలగించండి
  12. ఘోరతపంబొనర్చుముని గూడి తపంబును భగ్నపర్చ జం
    భారినియంత్రణంబున దివంబును మేనక వీడివచ్చి సం
    సారిగమార్చె తాపసిని చక్కలిగింతల సోయగాలతో
    మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్

    రిప్లయితొలగించండి
  13. అంగసొబగు గనబడంగను నాట్యమ్ము
    జేయు రంభ జూచి చిత్తమలర
    మార కళల మెచ్చె, మౌని వరుండును
    తపము మాని గూడె దన్వి నపుడు

    రిప్లయితొలగించండి
  14. ఆటవెలది
    రోమపాదు డంపె రూప వనితలను
    ఋష్యశృంగ సంయమీంద్రు కడకు
    కఱవు బాప గోరి ,గణికల శృంగార
    మార కళల మెచ్చె మౌని వరుడు.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  15. ఘోరత పంబుజేయముని ఘూర్ణిల లోకము లంతటన్
    వారిజ నేత్ర మేనకను పంపెను శక్రుడు వానియొద్దకున్
    జేరగ వచ్చిరంభ తన చేష్టల చేతను లొంగదీయగా
    మారకళారహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్

    రిప్లయితొలగించండి
  16. ఘోర తపంబునన్ మునిగి కోరికలన్ త్యజియించ బూనినన్
    మారె మనోరథంబు నవ మంజుల మోహిని మేనకన్ గనన్
    దూరమొనర్చె గామ మతి దుర్లభ సంయమ మోక్ష మార్గమున్
    మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్

    రిప్లయితొలగించండి
  17. ఋష్యశృంగుడచట రేచక్కవోలెను
    సంచరించు చున్న చాననచట
    గనుచుడెంద మందు కమనీయమైన ట్టి
    మారకళలమెచ్చె మౌని వరుడు

    రిప్లయితొలగించండి