25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

సమస్య - 4003

26-2-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరసతి పొందు సుజనుల కవారితము గదా”
(లేదా...)
“పరసతి పొందుఁ గోరుట యవారిత కార్యము సజ్జనాలికిన్”

24 కామెంట్‌లు:

 1. కందం
  నిరతము సంస్కృతి మఱువక
  యిరుగు పొరుగు మెచ్చు నడత నింపుగఁ గలుగన్
  మెరయన్ సద్వంశ పరం
  పర సతి పొందు సుజనుల కవారితము గదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంపకమాల
   నిరతము సంస్కృతిన్ విడక నీమమనంగఁ బరోపకారమున్
   బొరుగున నున్నవారలకుఁ బొల్పుగ జేసెడు సద్గణంబులన్
   గరుణయె భూషగా మెరయ గారము నందిన వంశపున్ పరం
   పర సతి పొందుఁ గోరుట యవారిత కార్యము సజ్జనాలికిన్!

   తొలగించండి

 2. పరనింద సేయు టేలర
  పొరపాటది కాదు వినర మూఢుని వలె నీ
  యరుపులవియేల నికనా
  పర, సతిపొందు సుజనులకవారితముగదా!

  రిప్లయితొలగించండి
 3. వరమాయెశంకరునకు
  కరమరుదుగతెలిసెకాంతకలియుటవలనన్
  పరమునుపొందగమార్గము
  పరసతిపొందుసుజనులకవారితముగదా

  రిప్లయితొలగించండి
 4. వరమాయెగశంకరునకు
  కరమరుదుగతెలిసెకాంతతెలియుటవలనన్
  పరమునుపొందగమార్గము
  పరసతిపొందుసుజనులకవారితముగదా

  రిప్లయితొలగించండి
 5. అరయగబ్రహ్మమానసమునందుననిల్పుచుసంగముక్తుడై
  సరసనుజేర్చసద్గతినిశంభునిరాణినివేడియాత్మలో
  విరియగశక్తికుండలినివేగమబ్రాకుచుకాంచదృష్టినా
  పరసతిపొందుగోరుటయవారితకార్యముసజ్జనాళికిన్

  రిప్లయితొలగించండి
 6. ఇది ఇప్పుడు ఇచ్చిన శంకరా భరణము వారి‌ సమస్య

  పరసతి పొందు‌ సుజనుల‌ కవారితము‌గదా


  నా పూరణ

  సరసమగు‌ తెలుగు‌ మన సతి,

  పరికించగ‌ నాంగ్ల మెపుడు పరసతి యేగా

  ధరణిన బ్రతుక దలచ యా

  పరసతి పొందు‌ సుజనుల‌ కవారితము‌గదా

  రిప్లయితొలగించండి

 7. దురితపు కార్యమంచు కడు దుష్టుడతండని నిందవేయుచున్

  పరులకు చెప్పుచుండుటది పాడియె కాదనెఱుంగవేల య

  త్తరుణి పరాయి కాదుగద తాళిని కట్టిన రాణివాస మా

  పర, సతి పొందుఁ గోరుట యవారిత కార్యము సజ్జనాళికిన్.

  రిప్లయితొలగించండి
 8. గురుతర గృహస్థ ధర్మము
  నెరవేర్చుచు నెల్లవేళ నియమముతోడన్
  పెరుగగ సంతాన పరం
  పర,సతి పొందు సుజనులకవారితము గదా!

  రిప్లయితొలగించండి
 9. కందం
  నిరతము శ్రీరామకథ వి
  వరముగ వినినట్టి పాఠి వ్రాక్కుచ్చె ,కథా
  చరితము సంపూర్ణముగన్
  పరసతి పొందు సుజనుల కవారితము గదా
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 10. నరకము కల్గు నీకు పర నారిని గోరకు
  మెప్పుడేనియున్
  పరమ పవిత్రమైన నిజ పత్నియు మిక్కిలి
  సుందరాంగియున్
  సరసననుండ నెల్లపుడు సంతసమొప్పగ
  ప్రేమ జూ
  పర, సతి పొందుగోరుట నవారిత కార్యము
  సజ్జనాళికిన్

  రిప్లయితొలగించండి
 11. తిర యశము గూర్చ దందురు
  పరసతి పొందు :సుజనుల క వారిత ము గదా
  నిరతము శుభము లొనర్చుట
  కరమగు సత్కార్య మo ద్రు కామిత మొప్పన్

  రిప్లయితొలగించండి
 12. పరసతిఁగోర రావణుని వంశము నాశనమయ్యె నక్కటా!
  పరధన వాంఛ కౌరవుల ప్రాణములన్ బలితీసె నౌర!స
  చ్చరితము లోకవంద్యమగు సద్గుణమిత్ర! పరోపకారత
  త్పర!సతిపొందుఁగోరుట యవారిత కార్యము సజ్జనాలికిన్.

  రిప్లయితొలగించండి
 13. నరకుడు కోరుకొనును గద
  పరసతి పొందు ; సుజనుల కవారితము గదా
  బురుకను కన నేగిన సతి
  మరల నరుగుదెంచుదనుక మనికిత పాటున్

  రిప్లయితొలగించండి
 14. పరమ నికృష్టంబు గదా
  పరసతి పొందు; సుజనుల కవారితము గదా
  సురుచిర సుందర కృత్యము
  పరమానందమిడు ధర్మపత్నిని గూడన్

  రిప్లయితొలగించండి
 15. పరసతినమ్మగా దలచు పావన నైజము సాంప్రదాయమై
  వరలెదరీ పవిత్రమగుభారతభూమి వసించువారు స
  చ్చరితయు దైవకార్యములు సల్పుచు మన్ననలొందు భక్తిత
  త్పర! సతి పొందుఁ గోరుట యవారిత కార్యము సజ్జనాలికిన్

  రిప్లయితొలగించండి
 16. బురుకను పొందు వేళయని పోయెను భార్య యనంగ నేర్వవే !
  పురమున ముఖ్యుడాతడని పోల్చక నేల నివ్విధి నివ్వెరన్
  పరుషపు పల్కులన్నిటిని వాగెదవేల నిప్పుడు నోర్పు జూ
  పర ! సతి పొందుఁ గోరుట యవారిత కార్యము సజ్జనాలికిన్

  రిప్లయితొలగించండి
 17. చం.మా.
  వరముగ నింటజేరి సతి భర్తను దైవము చందమెంచుచున్
  తరతమ భేద భావములు తల్చక నాతని సేవజేయుచున్
  నిరతము సన్మదిన్ గలిగి నెమ్మిని జూపుచునుండ, నెట్లగున్
  పరసతి పొందుఁ గోరుట యవారిత కార్యము సజ్జనాళికిన్?

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. సురుచిర నియమమ్ము గలదు
   పరమ పవిత్రము దలంప భర తావనిలో
   నరున కొక దారయె పరం
   పర సతి పొందు సుజనుల కవారితము గదా


   నిరతము ధర్మ తత్పరత నిల్చి ఘనమ్ముగ సంతసమ్మునన్
   విరివిగ స్వీయ కార్యములు విస్తృత రీతిని నాచరించుచుం
   బర సతి నెంచి తల్లి వలె వంశక రార్థము నెమ్మి స్వీయ త
   త్పర సతి పొందుఁ గోరుట యవారిత కార్యము సజ్జనాళికిన్

   తొలగించండి
 19. నరకమునకు దారియదియ
  పరసతిపొందు,సుజనులకవారితము గదా
  పరసతులు మాతలనుచును
  నిరతము బూజించుడనుచు నెమ్మిని జెప్పన్

  రిప్లయితొలగించండి
 20. కరమును దోషమయ్యది కాంతురు ధర్మజు పట్టణంబునున్
  పరసతి పొందుగోరగ, యవారితకార్యము సజ్జనాళికిన్
  నిరతము గారవంబునను నెమ్మది జూడుడు మాతవోలె,యే
  పరసతి నైననున్ బలుకు పావన మూర్తులనంగ వారికిన్

  రిప్లయితొలగించండి
 21. పరమును సాధించుటకై
  సరవిని సతిపతులు హరిని స్మరియించదగున్
  వరముగ భువి సేవా త
  త్పరసతి పొందు సుజనుల కవారితము గదా

  రిప్లయితొలగించండి 22. నరకమునకు దారేదన
  *పరసతి పొందు సుజనుల కవారితము గదా”*
  హరినామస్మరణ మె యిహ
  పరములకునుశుభముకూర్చుపరమౌషధమౌ  మరణముముందు వచ్చుసుమిమత్తు కు బానిసలై చరించచున్
  *పరసతి పొందుఁ గోరుట, యవారిత కార్యము సజ్జనాళికిన్*
  నిరతముభక్తితోడహరినెమ్మినికోరుచుసేవచేయచున్
  పరసతులెల్లరక్కలనుభావనతోడనుగాంచుటెప్పుడున్  రిప్లయితొలగించండి