16, ఫిబ్రవరి 2022, బుధవారం

సమస్య - 3994

17-2-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చినవానికి నగ్రపూజ సేయుటయె తగున్”
(లేదా...)
“చినవాఁడే తగు నగ్రపూజఁ గొని రక్షింపంగ మిమ్మెల్లరన్”

22 కామెంట్‌లు:

  1. ఘనమగు దక్షత జూపుచు
    మునుకొని సత్కార్యములను పొల్పుగ సల్పన్
    జనుల ప్రశంసలను వరి o
    చిన వానికి నగ్ర పూజ సేయుట యె తగున్

    రిప్లయితొలగించండి
  2. అనఘా!ధర్మజ!గిరిఁదా
    ల్చినవానికి,ద్రౌపదికిని చీరలొసఁగి బ్రో
    చినవానికి,గోవులఁగా
    చినవానికి నగ్రపూజ సేయుటయె తగున్.

    రిప్లయితొలగించండి

  3. వినయమె భూషణముగ గల
    మనుమడు ధర్మజు డడుగగ మాన్యుడు భీష్ముం
    డనె కృష్ణుడు గోవుల బ్రో
    చినవానికి నగ్రపూజ సేయుటయె తగున్.

    రిప్లయితొలగించండి
  4. అనిశముకృష్ణుడుధర్మము
    నెనయుచునీతినిగురుడుగనేరుపుజూపన్
    కొనియెనుపూజనుసభలో
    చినవానికినగ్రపూజసేయుటయెతగున్

    రిప్లయితొలగించండి
  5. అనునిత్య మొకరికొకరుగ
    ననుశయమడరించు కొనుట నలవడి యుండన్
    మనుజులలో సఖ్యము పెం
    చినవానికి నగ్రపూజ సేయుటయె తగున్

    రిప్లయితొలగించండి
  6. ధర్మ రాజుతో శిశుపాలుఁడు...

    కందం
    వినవే వెన్నలు దొంగి, ల
    లనల వలువలఁ గొని దాచు ప్రజ్ఞతఁ! బృథ నం
    దన! హరి, నెల్లరు దూషిం
    చిన వానికి నగ్రపూజ సేయుటయె తగున్!

    మత్తేభవిక్రీడితము
    వినవే! దొంగిలి పాలుమీగడలఁ దా పీడింప, రేపల్లె భా
    మినులున్ స్నానములాడువేళ నదిలో మేలమ్మనన్ జీరలన్
    గొనుచున్ దాచిన గ్రంథసాంగుఁడనగా గోపాలుఁడీ రీతి హె
    చ్చినవాఁడే తగు నగ్రపూజఁ గొని రక్షింపంగ మిమ్మెల్లరన్!

    రిప్లయితొలగించండి


  7. ఘనుడాతండు వివేక పూర్ణుడు రమాకాంతుండు మీకాప్తుడౌ

    మునివంద్యుండగు చక్రపాణి యొకడే పూజ్యుండు గాదందువే

    యనుమానంబును వీడుమంటి నిక, కంసారాతిఁ గోజాతిఁ బ్రో

    చినవాఁడే తగు నగ్రపూజఁ గొని రక్షింపగ మిమ్మెల్లరన్.

    రిప్లయితొలగించండి
  8. అనఘా!ధర్మజ!రాజసూయమన నీయాగంబు పూర్తయ్యె,నీ
    వును యోచింపగనేల?నిత్తఱిని సంపూజ్యుండెవండంచు?నా
    ఘనుడౌ కృష్ణుఁడు,కాళిమర్దనుఁడు,శ్రీకాంతుండు,చక్రంబుఁదా
    ల్చినవాఁడే తగు నగ్రపూజఁగొని రక్షింపంగ మిమ్మెల్లరన్.

    రిప్లయితొలగించండి
  9. కనికరమున శివుడొసగిన
    ఘనతర మంత్రము జపించి గణనాయకుడై
    జనులెల్లరి మనమునుగెలి
    చినవానికి నగ్రపూజ సేయుటయె తగున్

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    అనెను దరుమయ్య తోడను
    చనువుగ భీష్ముడు ననుగున సభలో కృష్ణున్
    అనువుగ మిమ్మందర జూ
    చిన వానికి నగ్రపూజ సేయుటయె తగున్.

    వినుమా! ధర్మజ! లోకరక్షకుడునై వెల్గొందుచున్ నిచ్చలున్
    ఘనమౌ లీలల నాడుచున్ కుమతులన్ ఖండించు తత్త్వమ్ముతో
    కొనలున్ వాఱెడి కృష్ణదేవుడె నిలన్ కూర్మిన్ ప్రసాదించి కా
    చినవాడే తగు నగ్రపూజ గొని రక్షింపంగ మిమ్మెల్లరన్.

    రిప్లయితొలగించండి
  11. కం:చిన వానికి,గొల్లలు మె
    చ్చిన వానికి,గడుసు దనము చే పూతన గూ
    ల్చిన వానికి,కాళియు గె
    ల్చిన వానికి నగ్రపూజ సేయుటయె తగున్.

    రిప్లయితొలగించండి
  12. మ:తన సామర్థ్య మెరింగి ,తమ్ము నెడ స్పర్థన్ గెల్వ లే నంచు ,తం
    డ్రిని మెప్పించుక, మంత్రమున్ బడసి, యుర్విన్ సర్వతీర్థమ్ములన్
    మునకల్ వేయుచు భక్తి తోడ నహమున్ పోద్రోలి ధీశక్తి గె
    ల్చిన వాడే తగు నగ్రపూజ గొని రక్షింపంగ మి మ్మెల్లరున్
    (అగ్రపూజకి అర్హుడు విఘ్నేశ్వరుడే.ఎలాంటి విఘ్నేశ్వరుడు?తమ్ముడి తో పోటీలో గెలవ లేనని తెలిసి ,అహాన్ని వదలి,తండ్రి నుంచి మంత్రాన్ని గ్రహించి భక్తితో,ధీశక్తి తో నెగ్గిన విఘ్నేశ్వరుడు కాబట్టి అర్హుడు. ఇది వినాయకచవితి కథ.)

    రిప్లయితొలగించండి
  13. ఘనుడా గోకులసంభవుండు మిగులన్
    గాంభీర్య గోవర్ధనం
    బను శైలంబును వ్రేలనెత్తె గద గోపాలుండు
    శ్రీకృష్ణుడున్
    ఘన కాళీయుని సంహరించి ప్రజలన్
    కారుణ్యమేపార గా
    చినవాడేతగు నగ్రపూజగొని రక్షింపంగ
    మిమ్మెల్లరన్

    రిప్లయితొలగించండి
  14. వినయము గలుగుచు నిరతము
    ననుదినమును మనుజసేవ హర్షము తోడన్
    నొనరెడు దయ జేసెడు నా
    చినవానికి నగ్రపూజ సేయుటయె తగున్

    రిప్లయితొలగించండి
  15. కనరాడాయగకకంటికేనెపుడుతాకారుణ్యవారాంబుధై
    పినవాడైఘనచోరుడైగనగనీపేగందుకన్పించుగా
    వినగానాతడుసూక్ష్ముడేపరముడావేల్పంచుతెల్లంబయెన్
    చినవాడేతగునగ్రపూజగొనిరక్షింపంగమిమ్మెల్లరన్

    రిప్లయితొలగించండి
  16. కని రక్షించును భక్తులఁ
    గని శిక్షించును భృశమ్ము కలుషాత్ములనే
    యనిశమ్మును వసుదేవుని
    చినవానికి నగ్రపూజ సేయుటయె తగున్


    వనజాక్షుండు జగద్గురుండు సుర సంభావ్యుండు కంసారియే
    దనుజవ్రాత వినాశకుండు తలపం దథ్యంబుగా నర్హుఁడే
    ఘనుఁడా కృష్ణుఁడు వాసుదేవుఁడు ధరం గౌంతేయులం బ్రీతిఁ గా
    చిన వాఁడే తగు నగ్రపూజఁ గొని రక్షింపంగ మిమ్మెల్లరన్

    రిప్లయితొలగించండి
  17. కందం
    ఘనుడౌ కృష్ణుడు పాండవు
    లను రక్షించు పరమాత్మ, లక్ష్మీపతి ,మే
    లని తాత నుడువ, తము బ్రో
    చిన వానికి నగ్రపూజ సేయుటయె దగున్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    (భీష్ముడు పాండవులతో చెప్పిన సందర్భం).

    రిప్లయితొలగించండి
  18. వినుమా ధర్మజ!దేవదేవుడగు నవ్విష్ణుండు బాలుండునౌ
    చినవాడేతగు నగ్రపూజగొని రక్షింపగ మిమ్మెల్లరన్
    గనుకన్ జేయుడు పూజనీతనికి మీకామంబు లీడేర్చునౌ
    ననుగుందమ్ములు బాటుగా దమిని నారాధించు డిప్పట్టునన్
    రిప్లయితొలగించు

    రిప్లయితొలగించండి
  19. కొనగోట నగము నెత్తెను
    ఘనుడౌ శ్రీకృష్ణమూర్తి కనికారముతో
    ననవరతము నార్తుల గా
    చినవానికి నగ్రపూజ సేయుటయె తగున్

    రిప్లయితొలగించండి
  20. అనయమ్మున్ మదిలోన నమ్మి ధృతితోనత్యంత నెయ్యమ్ముతో
    మనుచున్నన్ దయఁ గాచు నంచు కడు సమ్మానమ్ముతో నెప్పుడున్
    ఘనుడౌ తామరకంటి శౌరి నళినీగర్భుండు గోసంతుఁ గా
    చినవాఁడే తగు నగ్రపూజఁ గొని రక్షింపంగ మిమ్మెల్లరన్

    రిప్లయితొలగించండి
  21. వినుమో ధర్మజ కలుగును
    మనకిక తప్పకశుభములు మహిలోసతతం
    బనుచు చెలులకోకలుదో
    చినవానికినగ్రపూజచేయుటయెతగున్

    రిప్లయితొలగించండి