26, ఫిబ్రవరి 2022, శనివారం

సమస్య - 4004

27-2-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లినిఁ గని భీముఁడయ్యొ భీతుండయ్యెన్”
(లేదా...)
“పిల్లినిఁ గాంచినంతఁ గడు భీతినిఁ బొందెను భీమసేనుండే”

16 కామెంట్‌లు:


 1. పిల్లలకు శకునములనుచు
  తల్లియె కథలెన్నొ చెప్పు తరుణము నందున్
  మెల్లిగ వచ్చిన నల్లని
  పిల్లినిఁ గని భీముడయ్యొ భీతుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 2. కందం
  అల్లన వనవాసమ్మున
  నొల్లువిరిచి నిద్రలేచి యొక దిశగాంచన్
  ఝల్లనఁ గుక్కకు బలియౌ
  పిల్లినిఁ గని భీముఁడయ్యొ భీతుండయ్యెన్!

  ఉత్పలమాల
  అల్లన బ్రహ్మ వ్రాత యన నా వనవాసముసేయువేళలో
  నొల్లును సాగగన్ విరిచి యూసురటంచును నిద్రలేయుచున్
  ఝల్లనఁ నంతదూరమునఁ జప్పునఁ గుక్కకు నోటికందెడున్
  పిల్లినిఁ గాంచినంతఁ గడు భీతినిఁ బొందెను భీమసేనుఁడే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులకు ప్రణామములు.

   ఉత్పలమాల రెండవపాదము చివర 'లేచియున్' అని చదువుకొన ప్రార్థన.

   తొలగించండి
 3. తల్లియు భీముని నామము
  పిల్లాడికిఁబెట్టుకొనియె ప్రేమగ ,తమ వం
  టిల్లున దూరిన బావురు
  పిల్లినిఁగని భీముఁడయ్యొ భీతుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 4. కందం
  అల్లన పద్మవ్యూహము
  కల్లోల పరచ సమరము గావించంగా
  చెల్లి మగడు సైంధవుడను
  పిల్లిని గని భీముడయ్యొ భీతుండయ్యెన్.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 5. అల్లనధర్మవ్యాధుడు
  కల్లాకపటముతెలియకకౌశికుతోడన్
  చల్లనిమాటలుచెప్పగ
  పిల్లినిగనిభీముడయ్యుభీతుండయ్యెన్

  రిప్లయితొలగించండి

 6. ఉల్లము దోచు రీతి నలి యూకుడు గాథల చెప్పువేళలో

  కల్లయె గాదు పూతికను గాంచిన దుశ్శకునమ్మటంచునా

  తల్లియె చెప్పగా నదియె తథ్యమటంచును నమ్మినందుకా

  పిల్లినిఁ గాంచినంతఁ గడు భీతినిఁ బొందెను భీమసేనుడే.

  రిప్లయితొలగించండి
 7. చెల్లని మాటల బల్కుచు
  కల్లల తో మిత్రుల యెడ కపట o బుల తా
  నుల్ల సిల న్ జెప్పె నిటుల
  "పిల్లిని గని భీము డయ్యొ భీతుండయ్యెన్

  రిప్లయితొలగించండి
 8. చెల్లున?యిట్టిమాటలు,వచించెద,
  బాల్యమునందుఁబాండవుల్
  పిల్లలఁగూడి యాడు తఱి బిడ్డడొకండును నొంటిపాటునన్
  పిల్లినిగాంచినంతఁగడు భీతినిఁబొందెను,భీమసేనుఁడే
  వెళ్లి భయంబు బాపె సుకవీ!పువు పుట్ట పరీమళించుగా.

  రిప్లయితొలగించండి
 9. మల్లుఁడు బలమున భీముడు
  బల్లిదులను నేలగూల్చు భటిలుండైనన్
  తల్లడమగుననియెదురగు
  పిల్లినిఁ గని భీముఁడయ్యొ భీతుండయ్యెన్

  రిప్లయితొలగించండి
 10. బల్లి శిరస్సుపై బడగ పార్థుడు దద్దఱె
  నెయ్యది సాగునో యనన్

  పిల్లినిఁ గాంచినంతఁ గడు భీతినిఁ బొందెను భీమసేనుండే

  నల్లియె పాన్పుపై నొదుగి నాల్గవ వానిని కుట్టగ నల్లలాడెనే

  చెల్లెను పాండునందనుల శ్రేష్ఠము , గాంచగ మిక్కిలి బాధ కల్గెనే


  ( గురువర్యుని క్షమాపణ కోరుతూ )

  బల్లి పడ బార్ధుడు వగచె
  పిల్లినిఁ గాంచినంతఁ గడు భీతినిఁ బొందెను భీమసేనుండే
  నల్లియె నకులుని కుట్టెను
  చెల్లెను యతి ప్రాసలు మరి చింతించకుమా

  రిప్లయితొలగించండి
 11. పిల్లలు సంబాషించుచు
  కల్లల నీరీతి నుడివె కపటముతోడన్
  మెల్లగ తనదరికొచ్చిన
  పిల్లినిఁ గని భీముఁడయ్యొ భీతుండయ్యెన్

  రిప్లయితొలగించండి
 12. నిరతము పేదవారలకు నిర్మల రీతిని సేవచేయుచున్
  స్థిరమగు భక్తియుక్తముగ శ్రీహరి పూజల సన్నుతించినన్
  ధరణిని నిల్పగా కులము తప్పక కావలె స్వీయమౌ పరం
  పర, సతి పొందుఁ గోరుట యవారిత కార్యము సజ్జనాలికిన్

  రిప్లయితొలగించండి
 13. చల్లగఁ బ్రాకి జగమ్మున
  వెల్లివిరియ నల్పపుఁ గ్రిమి భీకర రీతిం
  దల్లడ మందెను లోకము
  పిల్లినిఁ గని భీముఁ డయ్యొ భీతుం డయ్యెన్


  తొల్లిటి నుండి నమ్మకము దుశ్శకు నావలి మానవాలికిం
  బెల్లుగ విస్తరించి యెదఁ బృథ్విని నుండెను డెంద మందుఁ గం
  పిల్లుచుఁ గార్య హాని యని వీరుఁడు దుశ్శకునంపు శంకతోఁ
  బిల్లినిఁ గాంచి నంతఁ గడు భీతినిఁ బొందెను భీమసేనుఁడే

  రిప్లయితొలగించండి
 14. పిల్లల కెల్లవేళల వివేచన వీడియు
  దల్లిదండ్రులే
  చెల్లని గ్రుడ్డిమాటలును జేటొనరించెడు
  వాటి గూర్చియున్
  కల్లలు సెప్పుచుండ మది గట్టిగ నమ్మియు
  దారి కడ్డమౌ
  పిల్లిని గాంచినంత గడు భీతిని చెందెను
  భీమసేనుడే

  రిప్లయితొలగించండి