12-2-2022 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తూర్పు తెలవారె సూర్యుఁడు దొలఁగి చనఁగ”(లేదా...)“తూరుపు తెల్లవారినది తోయజబాంధవుఁ డస్తమించఁగన్”
భరత భూమిపై నడుగిడ భాస్కరుండుతూర్పు తెలవారె,సూర్యుడు తొలగి చనగనమెరికా రాజ్యమంతయు నలము కొనగచీకటి నరుదెంచె నపుడు శ్వేతవాజిమనకు తెల్లవారితే అమెరికాకు సాయంత్రం
కార్యసాధనజేసినగాంధితాతతెచ్చిపెట్టినస్వాతంత్య్రతేజమందిభవ్యదీప్తినివెలిగెనుభారతంబుతూర్పుతెలవారెసూర్యుడుదొలగిజనగ
పక్షిజాతులు పలుకగా స్వాగతములుప్రాగ్దిశాద్రుల కెగబ్రాకె బహుకు డపుడుతూర్పు తెలవారె, సూర్యుడు దొలగి చెనఁగనవనినాక్రమించిన ధ్వాంత మంతరించె.సారసజాతి మేల్కొనుచు స్వాగత మంచును బిల్వగా నకూపారుడు రక్తవర్ణమున ప్రాగ్దిశ జేరిన పాళమందునన్ దూరుపు తెల్లవారినది, తోయజ బాంధవు డస్తమించగా పేరను క్రమ్ముకున్న కఱ వృత్రము భీతిలి పారె నత్తరిన్.
నింగిలో సూర్యబింబముతొంగి చూడతూర్పు తెలవారె; సూర్యుఁడు దొలఁగి చనఁగమెల్ల మెల్లగ చీకటి వెల్లి విరిసిచంద్ర కాంతులు జగతిని చల్లబరిచె
తేటగీతిసూర్యుడొక్కడే భూమికి క్షోభఁ బాపభూ పరిభ్రమణంబునఁ 'బ్రొద్దు క్రుంకెనమెరికా దేశమందు' ,నా నిముషమె మనతూర్పు తెలవారె, 'సూర్యుఁడు దొలఁగి చనఁగ'ఉత్పలమాలఆరయ భాస్కరుండు భువికంతకు నొక్కడె బాంధవుండునైప్రేరణమీయ ధారుణి పరిభ్రమణంబున రేబవళ్లగున్మారుచు మాడిసన్ బ్రజ కమాంతము గ్రుంకఁగ,భారతంబునన్తూరుపు తెల్లవారినది, తోయజబాంధవుఁ డస్తమించఁగన్( మాడిసన్ = అమెరికాలో నొక నగరము)
మిహిరుడుదయించ నిండగు మించుదోడతూర్పు తెలవారె ; సూర్యుఁడు దొలఁగి చనఁగనిందుడేతెంచి ధామమునిడె జగతికియిరువురటుల తమ విధుల నెంచుకొనిరి
కమల బాంధవు డగుపించ గగన మందు తూర్పు తెలవారె : సూర్యుడు దొలఁగి చన గ నింగి యందున నెలరాజు నిగ్గు లొలికి కలువ రాశికి చేకూర్చె కాంతి సొబగు
భారత దేశమందునను భానుడ మేరికనస్తమించగాన్తూరుపు తెల్లవారినది, తోయజ బాంధవుడస్తమించగా భారత దేశమందిరులు, భాగ్యప మేరకలోనవెల్గులుంజేరును కారణమ్మిదియె సీరుని చుట్టుధరిత్రి తిర్గుటే
వారిధినుండి వెల్వడ ప్రభాకరబింబము కాంతులీనుచున్తూరుపు తెల్లవారినది,తోయజ బాంధవుఁడస్తమించగన్తారలు మిన్కుమిన్కుమనె దారల చెంతకుఁజేర్చెభర్తలన్మారుఁడు,పుష్పబాణుఁడసమానుడు మన్మథుఁడానిశీధమున్.గగనమును వీడె చీకటుల్,కాంతులొప్పతూర్పు తెలవారె,సూర్యుడు దొలగి చనగనే పడమట క్రొంజీకటుల్ నింగిఁగ్రమ్మెనౌర!దినరాజు లేడని చోరులవలె.
తూరుపుదేశముల్విడచి తోయజబంధుఁడు పశ్చిమాద్రికిన్చేరగ నస్తమానమయె జింకలతాలుపువచ్చె పిమ్మటన్తూరుపు తెల్లవారినది, తోయజబాంధవుఁ డస్తమించఁగన్వేరొకభాగమందు, సిరివెన్నెలపంచెను కాంతిమంతుడే.
రేయిగడచెను వెన్నెల రేడు గ్రుంకెతూర్పు తెలవారె, సూర్యుఁడు దొలఁగి చనఁగనుద్భవించెను చందిరుఁడుర్వియందుమరల వెన్నెల వెలుగులు విరియ భువిని
సూర్య భగవాను రాకచే సురుచిరముగ తూర్పు తెలవారె,సూర్యుడు దొలగి చనగ నావరించును దిమిరము యవని యంత యంధకారమె మిగులును నార్య! యికను
ఎఱ్ఱగా నయ్యె నాకాశ మెల్ల దిశలఁ జేరెఁ బక్షులు గూళ్లకు శీఘ్రముగను జీకఁటి పొడచూపఁ దొడంగె వీఁక నింకఁ దూర్పు తెలవాఱె సూర్యుఁడు దొలఁగి చనఁగ [తెలవాఱు= నిస్సార మగు]దోర దినేశు నారసి సుదూర నభస్తల మందు బింబమున్మూరఁగ సంతసమ్ము నరపుంగవుఁ డింపుగ నిల్చి వాకిటందోరపుఁ బండితుం డొకఁడు తూర్పును గాంచి వచించె నివ్విధిం దూరుపు తెల్లవాఱినది తోయజ బాంధవుఁ డస్తమింపఁగన్ [తోయజము =నీటిలోఁ బుట్టినది,ఇక్కడ కలువ ]
వారధి నుండిభానుడట భాసిలు చుండుచు బైకివచ్చుటన్ తూరుపు తెల్లవారినది,తోయజ బాంధవు డస్తమించగన్ దారలు నొక్కటొక్కటిగ ద్రాపము నందున వెల్గుచుండుచున్ నారని దివ్వెవోలెనట యారుచు వెల్గుచు గాంతినిచ్చెడున్
శౌరి భజింప నెంచుచును సాత్విక భావము చెంగలింపగా తోరపు భక్తితో గుడికి తోయజ నేత్రలు చేరుచుండగాతూరుపు తెల్లవాఱినది, తోయజ బాంధవుఁ డస్తమింపఁగన్చేరెను చందమామ కాదు చెన్నును గూర్చుచు నాకసమ్ముపై
తేటగీతిజీవకోటి చైతన్యము చిగురులొత్తతూర్పు తెలవారె ,సూర్యుడు దొలగి చనగచీకటి నెలకొనగ జన జీవనమ్ముకృత్రిమ వెలుగు దీపాల కృపన సాగు.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
దినమణియరుదెంచనణగె తిమిర మెల్ల*తూర్పు తెలవారె, సూర్యుఁడు దొలఁగి చనఁగ”*పశ్చిమంబున, నరుదెంచె పక్షధరుడుకౌముదిని పంచ నెంచుచు గగనమందుతీరుగ నేడు గుర్రముల తేరున నూరుడుతోలుచుండగా“తూరుపు తెల్లవారినది, తోయజ బాంధవుఁ డస్తమించఁగన్”*వారిజవైరియున్ వడిగ వచ్చెను పంచగ వెన్నెలెల్రడన్తారలతోడతీరుగను ధారుణిలో్ప్రజమోదమందగన్
భరత భూమిపై నడుగిడ భాస్కరుండు
రిప్లయితొలగించండితూర్పు తెలవారె,సూర్యుడు తొలగి చనగ
నమెరికా రాజ్యమంతయు నలము కొనగ
చీకటి నరుదెంచె నపుడు శ్వేతవాజి
మనకు తెల్లవారితే అమెరికాకు సాయంత్రం
కార్యసాధనజేసినగాంధితాత
రిప్లయితొలగించండితెచ్చిపెట్టినస్వాతంత్య్రతేజమంది
భవ్యదీప్తినివెలిగెనుభారతంబు
తూర్పుతెలవారెసూర్యుడుదొలగిజనగ
రిప్లయితొలగించండిపక్షిజాతులు పలుకగా స్వాగతములు
ప్రాగ్దిశాద్రుల కెగబ్రాకె బహుకు డపుడు
తూర్పు తెలవారె, సూర్యుడు దొలగి చెనఁగ
నవనినాక్రమించిన ధ్వాంత మంతరించె.
సారసజాతి మేల్కొనుచు స్వాగత మంచును బిల్వగా నకూ
పారుడు రక్తవర్ణమున ప్రాగ్దిశ జేరిన పాళమందునన్
దూరుపు తెల్లవారినది, తోయజ బాంధవు డస్తమించగా
పేరను క్రమ్ముకున్న కఱ వృత్రము భీతిలి పారె నత్తరిన్.
నింగిలో సూర్యబింబముతొంగి చూడ
రిప్లయితొలగించండితూర్పు తెలవారె; సూర్యుఁడు దొలఁగి చనఁగ
మెల్ల మెల్లగ చీకటి వెల్లి విరిసి
చంద్ర కాంతులు జగతిని చల్లబరిచె
తేటగీతి
రిప్లయితొలగించండిసూర్యుడొక్కడే భూమికి క్షోభఁ బాప
భూ పరిభ్రమణంబునఁ 'బ్రొద్దు క్రుంకె
నమెరికా దేశమందు' ,నా నిముషమె మన
తూర్పు తెలవారె, 'సూర్యుఁడు దొలఁగి చనఁగ'
ఉత్పలమాల
ఆరయ భాస్కరుండు భువికంతకు నొక్కడె బాంధవుండునై
ప్రేరణమీయ ధారుణి పరిభ్రమణంబున రేబవళ్లగున్
మారుచు మాడిసన్ బ్రజ కమాంతము గ్రుంకఁగ,భారతంబునన్
తూరుపు తెల్లవారినది, తోయజబాంధవుఁ డస్తమించఁగన్
( మాడిసన్ = అమెరికాలో నొక నగరము)
మిహిరుడుదయించ నిండగు మించుదోడ
రిప్లయితొలగించండితూర్పు తెలవారె ; సూర్యుఁడు దొలఁగి చనఁగ
నిందుడేతెంచి ధామమునిడె జగతికి
యిరువురటుల తమ విధుల నెంచుకొనిరి
కమల బాంధవు డగుపించ గగన మందు
రిప్లయితొలగించండితూర్పు తెలవారె : సూర్యుడు దొలఁగి చన గ
నింగి యందున నెలరాజు నిగ్గు లొలికి
కలువ రాశికి చేకూర్చె కాంతి సొబగు
భారత దేశమందునను భానుడ మేరిక
రిప్లయితొలగించండినస్తమించగాన్
తూరుపు తెల్లవారినది, తోయజ బాంధ
వుడస్తమించగా
భారత దేశమందిరులు, భాగ్యప మేరక
లోనవెల్గులుం
జేరును కారణమ్మిదియె సీరుని చుట్టు
ధరిత్రి తిర్గుటే
వారిధినుండి వెల్వడ ప్రభాకరబింబము కాంతులీనుచున్
రిప్లయితొలగించండితూరుపు తెల్లవారినది,తోయజ బాంధవుఁడస్తమించగన్
తారలు మిన్కుమిన్కుమనె దారల చెంతకుఁజేర్చెభర్తలన్
మారుఁడు,పుష్పబాణుఁడసమానుడు మన్మథుఁడానిశీధమున్.
గగనమును వీడె చీకటుల్,కాంతులొప్ప
తూర్పు తెలవారె,సూర్యుడు దొలగి చనగ
నే పడమట క్రొంజీకటుల్ నింగిఁగ్రమ్మె
నౌర!దినరాజు లేడని చోరులవలె.
తూరుపుదేశముల్విడచి తోయజబంధుఁడు పశ్చిమాద్రికిన్
రిప్లయితొలగించండిచేరగ నస్తమానమయె జింకలతాలుపువచ్చె పిమ్మటన్
తూరుపు తెల్లవారినది, తోయజబాంధవుఁ డస్తమించఁగన్
వేరొకభాగమందు, సిరివెన్నెలపంచెను కాంతిమంతుడే.
రేయిగడచెను వెన్నెల రేడు గ్రుంకె
రిప్లయితొలగించండితూర్పు తెలవారె, సూర్యుఁడు దొలఁగి చనఁగ
నుద్భవించెను చందిరుఁడుర్వియందు
మరల వెన్నెల వెలుగులు విరియ భువిని
సూర్య భగవాను రాకచే సురుచిరముగ
రిప్లయితొలగించండితూర్పు తెలవారె,సూర్యుడు దొలగి చనగ
నావరించును దిమిరము యవని యంత
యంధకారమె మిగులును నార్య! యికను
ఎఱ్ఱగా నయ్యె నాకాశ మెల్ల దిశలఁ
రిప్లయితొలగించండిజేరెఁ బక్షులు గూళ్లకు శీఘ్రముగను
జీకఁటి పొడచూపఁ దొడంగె వీఁక నింకఁ
దూర్పు తెలవాఱె సూర్యుఁడు దొలఁగి చనఁగ
[తెలవాఱు= నిస్సార మగు]
దోర దినేశు నారసి సుదూర నభస్తల మందు బింబమున్
మూరఁగ సంతసమ్ము నరపుంగవుఁ డింపుగ నిల్చి వాకిటం
దోరపుఁ బండితుం డొకఁడు తూర్పును గాంచి వచించె నివ్విధిం
దూరుపు తెల్లవాఱినది తోయజ బాంధవుఁ డస్తమింపఁగన్
[తోయజము =నీటిలోఁ బుట్టినది,ఇక్కడ కలువ ]
వారధి నుండిభానుడట భాసిలు చుండుచు బైకివచ్చుటన్
రిప్లయితొలగించండితూరుపు తెల్లవారినది,తోయజ బాంధవు డస్తమించగన్
దారలు నొక్కటొక్కటిగ ద్రాపము నందున వెల్గుచుండుచున్
నారని దివ్వెవోలెనట యారుచు వెల్గుచు గాంతినిచ్చెడున్
శౌరి భజింప నెంచుచును సాత్విక భావము చెంగలింపగా
రిప్లయితొలగించండితోరపు భక్తితో గుడికి తోయజ నేత్రలు చేరుచుండగా
తూరుపు తెల్లవాఱినది, తోయజ బాంధవుఁ డస్తమింపఁగన్
చేరెను చందమామ కాదు చెన్నును గూర్చుచు నాకసమ్ముపై
తేటగీతి
రిప్లయితొలగించండిజీవకోటి చైతన్యము చిగురులొత్త
తూర్పు తెలవారె ,సూర్యుడు దొలగి చనగ
చీకటి నెలకొనగ జన జీవనమ్ము
కృత్రిమ వెలుగు దీపాల కృపన సాగు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
దినమణియరుదెంచనణగె తిమిర మెల్ల
రిప్లయితొలగించండి*తూర్పు తెలవారె, సూర్యుఁడు దొలఁగి చనఁగ”*
పశ్చిమంబున, నరుదెంచె పక్షధరుడు
కౌముదిని పంచ నెంచుచు గగనమందు
తీరుగ నేడు గుర్రముల తేరున నూరుడుతోలుచుండగా
“తూరుపు తెల్లవారినది, తోయజ బాంధవుఁ డస్తమించఁగన్”*
వారిజవైరియున్ వడిగ వచ్చెను పంచగ వెన్నెలెల్రడన్
తారలతోడతీరుగను ధారుణిలో్ప్రజమోదమందగన్