15, ఫిబ్రవరి 2022, మంగళవారం

సమస్య - 3993

16-2-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాజమహేంద్రి కలదు గన రాయలసీమన్”
(లేదా...)
“రాయలసీమలోఁ గలదు రాజమహేంద్రవరమ్ము సూడఁగన్”

48 కామెంట్‌లు:


  1. రాజనరేంద్రుడేలెను
    రాజమహేంద్రి, కలదు గన రాయల సీమన్
    రాజీవలోచనుండా
    శ్రీజానికి మందిరమ్ము శేషాచలమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రాజనరేంద్రుం డేలెను" టైపాటు.

      తొలగించండి
  2. రాజితతెలుగులరాష్ట్రము
    పూజితమాయెనునలుగడభూజనములతో
    వేజనుసమతూకమునను
    రాజమహేంద్రికలదుగనరాయలసీమన్

    రిప్లయితొలగించండి
  3. రాజనరేంద్రుని నగరము
    రాజమహేంద్రి కలదు కనరా!యల సీమన్
    భ్రాజిత భారత గ్రంథము
    తేజోనిధి నన్నయ మును తెనిగించెనుగా.

    రిప్లయితొలగించండి
  4. గాయకపండితాళిఘనకావ్యములల్లిరికృష్ణరాయుతో
    పాయనికీర్తినన్నయయుభారతమిచ్చెనురాజరాజుతో
    ఊయనిరెల్లవారలునునూహలజేయుచురాజవీధిలో
    రాయలసీమలోగలదురాజమహేంద్రవరమ్ముసూడగన్

    రిప్లయితొలగించండి

  5. శ్రేయమొసంగువాడెయగు శ్రేష్ఠుడు జిష్ణువుకున్ ప్రసిద్ధ దే

    వాయతనమ్ము గానిలను భాసిలు క్షేత్రము శేష శైలమే

    రాయలసీమలో గలదు, రాజమహేంద్ర వరమ్ము సూడగన్

    ధీయుతుడైన నన్నయ ప్రతీతుడు త్రిమ్మరి నట్టి నేలయే.

    రిప్లయితొలగించండి
  6. శ్రీయలరారు తిర్పతియు క్షేత్రములందుఁబ్రసిద్ధిగాంచి యా
    రాయలసీమలోఁగలదు,రాజమహేంద్రవరమ్ము సూడగన్
    హాయిగ గౌతమీతటి విహారము సేయుచు నన్నపార్యుఁడో
    హో!యన వ్రాసె భారతము నొప్పుదురిచ్చట సత్కవీంద్రులున్.

    రిప్లయితొలగించండి
  7. కందం
    నైజమ్మందరి దొకటౌ
    భాజితమన నాంధ్రలోనఁ బద్యమొలుకు ను
    త్తేజము గలిగనదందువె
    రాజమహేంద్రి? కలదు గన రాయలసీమన్!

    ఉత్పలమాల
    సోయగమొల్కు పద్యముల సొంపగు భాగవతమ్ము మెచ్చెడున్
    ఛాయలు లేని ప్రాంతమది సంభవమెట్లగుఁ దెన్గు నేలపై
    తీయని పల్కుతేనియలఁ దేలగ జూచెడు భావముండగన్
    రాయలసీమలోఁ ,గలదు రాజమహేంద్రవరమ్ము సూడఁగన్!

    రిప్లయితొలగించండి
  8. సోయగ మొప్పు సప్తగిరి చోద్యపు
    ప్రాంతమునందు నచ్చటన్
    పీయువువంటి తిర్మలయు పెంపువహించిన
    దేవలమ్మిదే
    రాయల సీమలో గలదు, రాజమహేంద్ర
    వరమ్ము చూడగన్
    బాయక గోద జీవ నది ప్రక్కన నిర్మిత
    మాయె గొప్పగన్.

    రిప్లయితొలగించండి
  9. రాజిలె గోదావరి దరి
    రాజమహేంద్రి, కలదు గన రాయలసీమన్
    భూజనులకువైకుంఠము
    భ్రాజిత తిరుమల తిరుపతి భక్తవరులకున్

    రిప్లయితొలగించండి
  10. తేజోమయులకు నెలవుగ
    రాజమహేంద్రి కలదు, గన రాయలసీమన్
    రాజాశ్రయమును బడసిన
    తేజోమయ కవుల సంఖ్య తెలుపగ తరమా

    రిప్లయితొలగించండి
  11. ప్రాజదువుల కాణాచిగ
    రాజమహేంద్రి కలదు .; గన రాయలసీమన్
    తేజిలె కలియుగ దైవము
    మోజు గడచ తిరు
    మలపయి పూజలు సలుపన్

    రిప్లయితొలగించండి
  12. ధీయుతులెల్లరున్ దిరుపతిన్ సభఁ జేయఁగ రాణ్మహేంద్రి వా
    రౌ యువనాయకుల్ గవులు నచ్చటఁ జేరిరి పెద్ద సంఖ్యలో
    నా యది కాంచి పల్కెనొకఁ "డౌర! యిటుల్ గనిపించుచున్నదే
    రాయలసీమలోఁ గలదు రాజమహేంద్రవరమ్ము సూడఁగన్”

    రిప్లయితొలగించండి
  13. రాజ మహేంద్ర పు వాసులు
    రాజిత తిరుపతిని జేరి రాణింపఁగా
    భాజితు లు నుతించు చనిరి
    రాజ మహేంద్రి కలదు గన రాయల సీమన్

    రిప్లయితొలగించండి
  14. ఉ:మా యనురాగమున్ బడసి మమ్ముల నెన్నడు వీడనట్టి య
    మ్మాయికి పెండ్లి యయ్యె ,నొక మంచి వరుండె లభించ దూరమౌ
    రాయలసీమలో గలదు , రాజమహేంద్రవరమ్ము సూడగన్
    తీయని యూహలన్ దెలుపు ,తీసుక రండను నాదు పత్నియున్.
    (తల్లిదండ్రులది రాజమండ్రి.అమ్మాయిని రాయలసీమ ఇచ్చారు.ఆ అమ్మాయి ఎప్పుడూ రాజమండ్రి చూడా లనుకుంటూ ఉంటుంది.)

    రిప్లయితొలగించండి
  15. సవరించిన పద్యం.
    (1)కం:నీ జత గూర్చగ జెప్పెద
    రాజ! మహేంద్రి కలదు కన రాయల సీమన్
    తేజేశ్వరుడన్ నృపుని త
    నూజ సకలసద్గుణ జననుతసుందరి యై.
    (ఒక పురోహితుడు రాజుకి సంబంధం చెప్పాడు.అమ్మాయి పేరు మహేంద్రి.తండ్రి తేజేశ్వరు డనే రాజు.ఆ రాజ్యం రాయలసీమ లో ఉంది.)





    రిప్లయితొలగించండి
  16. రాజిలె గోదావరిదరి
    రాజమహేంద్రి,కలదు రాయలసీమన్
    దేజో మయుడగు వేంకన
    ఖజానపుం దేవళంబు గలదు తిరుమలన్

    రిప్లయితొలగించండి
  17. ఆయతనంబు వేంకనిది యద్భుతమైనది పుత్తడీయమై
    రాయలసీమలో గలదు,రాజమహేంద్రవరమ్ము సూడగన్
    ధీయుత పండితోత్తముల, ,ధీరత గల్గిన రాజపుంగవుల్
    దీయని కావ్యముల్ మిగుల దేనెలు సిందిన పట్టణంబుగా

    రిప్లయితొలగించండి
  18. తేజము మెండు మహోగ్రపు
    రాజసము సెలఁగుఁ గడింది రాయల సీమన్
    భూజ వరేణ్యము విను మో
    రాజ! మహేంద్రి కలదు గన రాయలసీమన్

    [మహేంద్రి = బొంతరటి]


    ఆయత కీర్తి మంతుఁడు మహాత్ముఁడు ధర్మ విదుండు వాసవ
    ప్రాయుఁడు రాజు రాజులకు రాజ నరేంద్రుఁడు వానిఁ బోలెడిన్
    రాయలు పెక్కు రింపుగను రాజ్యము నేలిరి యాంధ్రు లెల్ల రా
    రాయల సీమలోఁ గలదు రాజ మహేంద్రవరమ్ము సూడఁగన్

    రిప్లయితొలగించండి
  19. కందం
    తేజోవిరాజ నగరము
    రాజమహేంద్రి ,కలదు గన రాయల సీమన్
    రాజిల్లు మల్లికార్జున
    తేజిత భ్రమరాంబ సహిత దేవాలయమున్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  20. శ్రేయమొసంగ నీభువిని చిన్మయరూపుడు వేంకటేశుడై
    బాయక శేషశైలమున భక్తుల గాచెడి దివ్యధామమీ
    రాయలసీమలోఁ గలదు, రాజమహేంద్రవరమ్ము సూడఁగన్
    ధీయుతుడైననాదికవి దెల్గున నన్నయ వాసమేగదా

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు
    ఈరోజు కుటుంబంతో తిరుపతికి బయలుదేరుతున్నాను. 17, 18 తేదీలలో తిరుమలలో ఉండి. 19 న కాళహస్తికి వెళ్ళి ఆరోజు రాత్రి అక్కడే రైలెక్కి 20న స్వస్థలం చేరుకుంటాను. ఈ మూడురోజులు మీ పూరణలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  22. పూజితమగు గోదావరి
    రాజమహేంద్రి,గలదు, గన రాయల సీమన్
    పూజలుగొనంగవెలసెను
    తేజోమూర్తిగనుహరియు తిరుమలయందున్

    రిప్లయితొలగించండి