7, ఫిబ్రవరి 2022, సోమవారం

సమస్య - 3985

8-2-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రవి రథమ్మున కేడు చక్రములు గలవు"
(లేదా...)
"రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే"

23 కామెంట్‌లు:

  1. పవలు గురుండు శిష్యునకు వల్లెను వేయఁగఁ జెప్పెనిట్టులన్
    "రవి రథ మేడు గుఱ్ఱముల రంజిలుఁ జూడఁగ నొక్క చక్రమే"
    పవలు గతించె శిష్యుఁడిటు వల్లెను వేసెను రాత్రి నిద్రలో
    "రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే"

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ......
    రవి యనువానికిన్ సుతులు రమ్యముగా గననేడుమంది.,వా..
    డవిరళరీతిఁ గష్టపడి యందరి పోషణఁ జేయుచుండగా
    గవి యొకరుండు పిల్లలను గాంచి యనెన్ గడు వాక్చమత్కృతిన్
    రవిరథమేడుచక్రముల రంజిలు లాగెడిదొక్క గుఱ్ఱమే!!

    రిప్లయితొలగించండి
  3. కర్మ సాక్షిగ గనిపించు కమల సఖుడు
    తూర్పు నుదయించి వెడలగ తురగము లవి
    రవి రథమ్మున కేడు : చక్రములు గలవు
    తఱచి చూడగ నాలుగే తథ్య ముగను

    రిప్లయితొలగించండి
  4. రవిరథమునకేడుచక్రములుగలవు
    కానియొక్కటితానయైగమనమెంచు
    మేధతోడుతరాజునుమేటిజేయు
    కోటికొక్కడుగౌరంపుగుణముగలిగి

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    ఎన్నికల వేళ రయము, రవి యనెడి నొక
    నాయకుడు వింత జేయుచు నవ్య రీతి
    రథమును సమకూర్చుకొనెను రాజకీయ
    రవి రథమ్మున కేడు చక్రములు గలవు

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి

  6. అవిటి వాడు సారథిగాగ నశ్వములవి
    యేడు నేకచక్రమనుచు నెఱిగెద గద
    రవి రథమ్మునకేడు చక్రములు కలవు
    కలవనుచు వాదనలవేల చెలిమి కాడ?



    జవనము లేడు లాగెడు నిషంగధి కొక్కటె చక్రముండగా
    నవిటియె తేరు పూన్పరి యటంచు నెఱుంగుదు గాని బావ నన్
    జవటనటంచు నెంచుచు పిసాళము జేయుచు చెప్పె నిట్టులన్
    రవి రథమేడు చక్రముల రంజిలు లాగెడిదొక్క గుఱ్ఱమే.

    రిప్లయితొలగించండి
  7. మా మనుమడు రవి

    ఎనిమిదేల తేరుకనుచు నేవగించి
    విసరివేయ చక్రంబులు విడెనురెండు
    వెతకగ దొరకె నొక్కటి , వెరసి యిపుడు
    రవి రథమ్మున కేడు చక్రములు గలవు

    రిప్లయితొలగించండి
  8. అవిరళమేధతోడుతనుహంసగమానసమందునిల్చుచున్
    వివరమునెంచితిమ్మరుసువేధనులేకనుకృష్ణరాయనిన్
    కవనముచాటునుండెడిదికాననిశక్తినగగోచరించునే
    రవిరథమేడుచక్రములరంజిలలాగెడిదొక్కచక్రమే

    రిప్లయితొలగించండి
  9. శ్రీనృసింహుని క్షేత్రాన చెలగునట్టి
    పెద్ద యరదంబునకు నిప్పు పెట్టగాను
    కాలి పోయెను కొంత భాగమ్ము కవివ
    ర!విరథమ్మున కేడు చక్రములు గలవు.

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    చెలియ రమ్మనె రాత్రికి కలియనెంచి
    నేటి పవలొక యుగముగా నిగిడిసాగె!
    గగనవీధుల పయనింప బిగిసె నేలొ
    రవి రథమ్మున కేడు చక్రములు గలవు?

    చంపకమాల
    నవసుమ కోమలిన్ గలియ నాకిడె మూర్తము నేటి రాత్రికిన్
    జవమున నేడుగుర్రముల సాగడు భాస్కరు డేల నేడు నీ
    పవలిది దీర్ఘమై కదలు? పద్మములన్ విడలేక బూన్చెనో
    రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే!

    రిప్లయితొలగించండి
  11. కలవు‌ శ్వేత తురగములు ఘనత తోడ
    రవి రథమ్మునకేడు,చక్రము లు‌గలవు
    సమముగ యని తలచ రాదు,సరస గతిని
    యొక్క చక్రమే కలదుగా లెక్క బెట్ట

    రిప్లయితొలగించండి
  12. వివరమెరుంగుమో వటుఁడ వేసటచెందక యభ్ర మందునన్
    రవిరథమేడుగుఱ్ఱములు లాగును చిత్రము చక్రమొక్కటే
    యవిరళ సాధనన్ విసిగి యల్లరి శిష్యుడు పల్కె నిట్టులన్
    రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే

    రిప్లయితొలగించండి
  13. ఏటవాలుచినుకులలో నెండపడిన
    సప్త వర్ణశోభితమైన చక్ర తలము
    లను కనుగొనలేమా యింద్ర ధనుసునందు
    రవి రథమ్మున కేడు చక్రములు గలవు

    రిప్లయితొలగించండి
  14. కవివర!యొప్పు,తీయవలెగా మఱి యెన్మిది చక్రసంఖ్యలోన్
    రవిరథ,మేడుచక్రముల రంజిలు లాగెడిదొక్క గుఱ్ఱమే!
    దివియనఁజెల్లునా?కలిపి తీరవలెన్ మఱి యారు గుఱ్ఱముల్
    ఠవఠవ లేకయే యవి హుటాహుటి పర్వులుదీయు నేకమై.

    రిప్లయితొలగించండి
  15. భువనము లోన సత్యమిది బోధన జేసిరి పూజ్యులెందరో
    కవిజన నాయకుండు నిల కారణ హేతవు శ్రీపతుండు తా
    నవిరతుడై ప్రకాశమిడ నాట్యముసేయును శక్తికేంద్రముల్
    అవయము లెప్పుడుం కదులు ఆహరియాఙ్ఞగ, జీవితమ్ముగా
    రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే

    రిప్లయితొలగించండి
  16. కవితపు ఠీవి బెంచుచును గావ్యము లెన్నియొ వ్రాయనేర్పుచున్,
    గవులను దీర్చిదిద్దుచును కాలము బుచ్చెడి సూరియై, మహా
    స్తవములఁ శంకరాభరణసంఘపు పత్రము లెన్న, దోచెనే,
    *రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే.*

    నిన్నటి పూరణ:

    ప్రావీణ్యంబున విద్య నేర్వగ లసత్పాండిత్య మబ్బున్ ధరన్
    నీవే రాజగు దెందునెందు జనినన్, నీచంబు దుష్టంబు దు
    ర్భావావేశము కూడదంద్రు జను,లా పాండిత్యమున్ బోయి, దు
    *ష్ప్రావీణ్యంబు విలుప్తమైననె కదా ప్రాశస్త్యమందంగనౌ.*

    రిప్లయితొలగించండి
  17. రాగమును జక్కఁగఁ దలఁప రథ మనంగ
    స్వరము లేడింటి ననుకొనఁ జక్రము లని
    నిజము గాదె యిట్టులనంగ నీరజాక్ష!
    రవి! రథమ్మున కేడు చక్రములు గలవు


    సువిదితమై చెలంగు నవి చోద్యముగా వ్యసనమ్ము లేడు మా
    నవునకుఁ దిర్గుచుండును ఘనమ్ముగ నిత్యము చక్ర చక్ర మి
    య్యవసర మందుఁ జెప్ప నగు నంచిత రీతిని జీవితంపు టో
    రవి! రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే

    రిప్లయితొలగించండి
  18. కలవు గుఱ్ఱము లమితవే గములు గలవి
    రవిరధమ్మునకేడు,చక్రములు గలవు
    తేరునకు జూడనాలుగు దృఢముగలవి
    యేడు గుఱ్ఱాల స్వామియా యినుడు మనకు

    రిప్లయితొలగించండి
  19. అవిరళ తేజమున్గలిగి యాకసమంతయు దిర్గి యిచ్చుగా
    బవలను గాంతిపుంజమును వాడలవాడకు నొక్కసారిగా
    సువిదితమైన సంగతిది చోద్యముగాదిల నెంచిచూడగా
    రవిరధ మేడుచక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే

    రిప్లయితొలగించండి
  20. కవి యిది యేమి కాలమిది కానిది యౌనని
    చెప్పుచుండి రీ
    భువిని యసత్యమాడు జనపుంగము
    పెర్గుచు నుండె నిత్యమున్
    చెవిబడె నాదు నే నిపుడు సెప్పెద చూడిది
    పచ్చి కల్లయే
    "రవి రథమేడు చక్రములు రంజిలు లాగెడు
    దొక్క గుర్రమే"

    రిప్లయితొలగించండి
  21. నిత్యమలుపన్నదియులేక నింగి యందు
    తిరుగునేడునశ్వములతో దినదినమ్ము
    *రవి రథమ్మున ,కేడు చక్రములు గలవు*
    గనుమనగరెండనెనొకండు గట్టిగాను

    రిప్లయితొలగించండి