31, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4869

 1-9-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

“పెండ్లి సేయఁదగును ప్రేతమునకు”

(లేదా...)

“పెండ్లినిఁ జేయఁగాఁ దగును ప్రేతమునున్ బ్రియమారఁ బిల్చియున్”

(మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)

30, ఆగస్టు 2024, శుక్రవారం

సమస్య - 4868

31-8-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను”

(లేదా...)

“చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్”

29, ఆగస్టు 2024, గురువారం

సమస్య - 4867

30-8-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గానగంధర్వుఁ గని నవ్వె గార్దభంబు”

(లేదా...)

“గానకళావిశారదుని గార్దభమొక్కటి గేలి సేసెఁగా”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

28, ఆగస్టు 2024, బుధవారం

సమస్య - 4866

29-8-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాధిక కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే”

(లేదా...)

“రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

27, ఆగస్టు 2024, మంగళవారం

సమస్య - 4865

28-8-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దానము శాపముగ మారె దాతకు భువిలో”

(లేదా...)

“దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

26, ఆగస్టు 2024, సోమవారం

సమస్య - 4864

27-8-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు”

(లేదా...)

“గురువులమంచు శిష్యజనకోటిని  మోస మొనర్తు రెందరో”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

25, ఆగస్టు 2024, ఆదివారం

సమస్య - 4863

26-8-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్”

(లేదా...)

“పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

24, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4862

25-8-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పామరుఁ డొనర్చెఁ బద్యసంభాషణమ్ము”

(లేదా...)

“పద్యములందు భాషణము పామరుఁ డొక్కడు సేసి చూపెగా”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

23, ఆగస్టు 2024, శుక్రవారం

సమస్య - 4861

24-8-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నిస్సంగత్వ మిడునొక్కొ నిజముగ ముక్తిన్”

(లేదా...)

“నిస్సంగత్వమె ముక్తినిచ్చు ననఁగా నీవెట్టులన్ నమ్మితో”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య. కొద్దిగా మార్చాను)

22, ఆగస్టు 2024, గురువారం

సమస్య - 4860

23-8-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దుష్టసాంగత్యమే ఘనదోషహరము”

(లేదా...)

“దుష్టుని స్నేహమే జనుల దోషములం దొలగింప జేసెడిన్”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధానంలో సింహాద్రి వాణి గారి సమస్య)

21, ఆగస్టు 2024, బుధవారం

సమస్య - 4859

22-8-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పరతంత్రుల్ దీన కల్పపాదపములె పో”

(లేదా...)

“పరతంత్రుల్ వసియింత్రు దీనజనకల్పక్ష్మాజసాదృశ్యులై”

20, ఆగస్టు 2024, మంగళవారం

సమస్య - 4858

21-8-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గండపెండెరముం గోరఁగలరె కవులు”

(లేదా...)

“తలఁతురె గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్”

19, ఆగస్టు 2024, సోమవారం

సమస్య - 4857

20-8-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భ్రమ ఘటించెను బ్రహ్మ సారాయి గొనెనొ”

(లేదా...)

“భ్రమ ఘటియించె బ్రహ్మ కలు ద్రావెనొ యంచుఁ దలంచి రెల్లరున్”

18, ఆగస్టు 2024, ఆదివారం

సమస్య - 4856

19-8-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రక్షాబంధన మటంచు రావల దనుజా”

(లేదా...)

“రక్షాబంధనమంచు రావలదిఁకన్ భ్రాతా ననుం జూడఁగన్”

17, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4855

18-8-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పొలఁతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర”

(లేదా...)

“పొలఁతికి నాల్గు కన్బొమలు పొల్పు వహించె విలాసినీతతిన్”

16, ఆగస్టు 2024, శుక్రవారం

సమస్య - 4854

17-8-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా”

(లేదా...)

“ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్”

15, ఆగస్టు 2024, గురువారం

సమస్య - 4853

16-8-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్”

(లేదా...)

“శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్”

14, ఆగస్టు 2024, బుధవారం

సమస్య - 4852

15-8-2024 (గురువారం)

కవిమిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము”

(లేదా...)

“తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్”

13, ఆగస్టు 2024, మంగళవారం

సమస్య - 4851

14-8-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు”

(లేదా...)

“గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకున్ నేర్తు రాసక్తులై”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

12, ఆగస్టు 2024, సోమవారం

సమస్య - 4850

13-8-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్”

(లేదా...)

“కోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో”

(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

11, ఆగస్టు 2024, ఆదివారం

సమస్య - 4849

12-8-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జిన్ సేవించిన లభించు స్థిరవాగ్ధనముల్”

(లేదా...)

“జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్”

10, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4848

11-8-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మాసిన చీరయె లలనకు మాన్యతఁ గూర్చున్”

(లేదా...)

“మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో”

9, ఆగస్టు 2024, శుక్రవారం

సమస్య - 4847

10-8-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్”

(లేదా...)

“పిల్లం గన్గొని పాండురాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా”

(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

8, ఆగస్టు 2024, గురువారం

సమస్య - 4846

9-8-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్”

(లేదా...)

“విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము గీర్తింపఁగన్”

(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

7, ఆగస్టు 2024, బుధవారం

సమస్య - 4845

8-8-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రక్ష సేయువాఁడు రాక్షసుండు”

(లేదా...)

“రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్”

6, ఆగస్టు 2024, మంగళవారం

సమస్య - 4844

7-8-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నరసింహుడు భక్తి మ్రొక్కె నారీమణికిన్”

(లేదా...)

“నరసింహుండు నమస్కరించెనఁట యానందంబునన్ నారికిన్”

(శృంగేరి 'భువనవిజయం'లో ఆముదాల వారిచ్చిన సమస్య)

5, ఆగస్టు 2024, సోమవారం

సమస్య - 4843

6-8-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్”

(లేదా...)

“మకరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను ప్రేమ పొంగగన్”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

4, ఆగస్టు 2024, ఆదివారం

సమస్య - 4842

5-8-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాంస్యమునకుఁ గంచుఁ గలుపఁ గాంచనమయ్యెన్”

(లేదా...)

“కాంస్యము గంచుతోఁ గలియఁ గాంచనమేర్పడెఁ జూడఁ జోద్యమే”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

3, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4841

4-8-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్”

(లేదా...)

“మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

2, ఆగస్టు 2024, శుక్రవారం

సమస్య - 4840

3-8-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“యక్షవాక్కు గడు ముదావహంబు”

(లేదా...)

“యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

1, ఆగస్టు 2024, గురువారం

సమస్య - 4839

2-8-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కలఁడె పండితుఁ డొకఁడు శ్రీకాకుళమున”

(లేదా...)

“కలఁడే పండితవర్యుఁ డొక్కఁడును నిక్కంబెన్న సిక్కోలులో”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)