16, ఆగస్టు 2024, శుక్రవారం

సమస్య - 4854

17-8-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా”

(లేదా...)

“ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్”

24 కామెంట్‌లు:

  1. అనువగు మిత్రుడుతనకగు
    నను చును రారాజు నంత ప్రక్కన నిలువన్
    వినయములేకను, దుర్యో
    ధనసంసర్గమునఁజావుతప్పదుకర్ణా

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. శ్రీకృష్ణ పరమాత్మ కర్ణునితో:

      కందం
      నినుగన్న కుంతి సుతులం
      దున నగ్రజుఁడవనఁ గృష్ణ తోడగు బావా!
      యొనగూడు గద్దె,దుర్యో
      ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా!

      మత్తేభవిక్రీడితము
      నినుదొల్తన్ రవిఁ గూడి కుంతి బడసెం దేజమ్మునేపార నం
      దనులందగ్రజుడంచు ద్రోవదియు భర్తన్రీతి మన్నించు నీ
      కొనగూడున్ దగ పీఠమున్ వినవె? నీవొప్పారు బాటన్ సుయో
      ధన సంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్!

      తొలగించండి
  3. వినడేభీష్ముని, తానుగాతలపడే, వివ్వచ్చునూహింపడే
    కనడేకార్యము, కండకావరముతోగాండ్రించహంకారియై
    చెనకన్జూచెనుధర్మమార్గమును, నాచివ్వన్, సదా
    ధనసంసర్గమువీడకున్న, రవిపుత్రా! మృత్యుపాశంబగున్

    రిప్లయితొలగించండి
  4. 3వపాదంసవరణ
    చెనకన్జూచెనుధర్ంమార్గమునునాచివ్వన్ప్రథన్సుయో
    ధనసంసర్గమువీడకున్న, రవిపుత్రా, మృత్యుపాశంబగున్

    రిప్లయితొలగించండి

  5. చెనటులు ధర్మ విహీనుల
    ననుకూలురటంచు నెంచి యంధుడ వయి నీ
    వనినే సాగింప సుయో
    ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా.


    వినునామాటలు ధర్మరక్షకులనే విద్రోహు లంచెంచి నీ
    కనుకూలుండ్రగు నట్టి దుష్టులకు సాయంమ్మంద జేయంగ నీ
    వని సాగింపగ వారిపక్షమది యన్యాయంబెయౌ నా సుయో
    ధన సంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్.

    రిప్లయితొలగించండి
  6. వినుమయ్య నాదు పలుకులు
    చెనటుల తోడను సతతము చెలిమిని చేయన్
    కనరాదు మేలు,దుర్యో
    ధన సంసర్గమున జావు తప్పదు కర్ణా!

    రిప్లయితొలగించండి
  7. వినయముగ జెప్పె కృష్ణుడు
    విను పాండవ పక్ష మీవు వెళ్ళుము శుభమౌ
    మనుదువు తప్పక, ధుర్యో
    ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా!

    రిప్లయితొలగించండి
  8. ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడు కర్ణుడితో శరసంధానానికి మునుపు

    కం॥ కొనిపోవంగను సాధ్యమె
    వినుమా ఫల్గుణునిఁ గెల్చి విహితముఁ గనుమా!
    మననెంచఁగ లేని యెడల
    ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా

    మ॥ కొనిపోవంగను సాధ్యమా విజయుఁడే ఘోరాకృతిన్ శస్త్రముల్
    తనదౌ శైలినిఁ గూర్చి మోదఁగను యుద్ధంబందు రాధేయ నీ
    కనుమోదమ్మగునేని యాహవము సాధ్యాసాధ్యముల్ గాంచవో
    ధనసంసర్గము వీడకున్న రవి పుత్రా మృత్యు పాశమ్మగున్

    ధన ధనము ఆవులమంద నిఘంటువు సహాయమండి.
    కన్నడ భాషలో ధన హసువు రెండూ ఆవుకు వాడతారండి

    రిప్లయితొలగించండి
  9. ఘనుడవు దానగుణమ్మున
    నినుమించిన వీరులెవరు నిఖిలజగములన్
    రణమున దుష్టుండు సుయో
    ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా!

    రిప్లయితొలగించండి
  10. ఘనతన్ గాంచియు దానశీలునిగనో కర్ణా యధర్మంబునన్
    మను దుర్యోధను సాహచర్యమున దుర్మార్గంబులన్ సల్పగన్
    నిను రక్షించెడువారలెవ్వరిలఁ? దుర్నీతుండవౌచున్ సుయో
    ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్

    రిప్లయితొలగించండి
  11. రాయబారము విఫలమయ్యాక కృష్ణుడు కర్ణునితో

    అనుగుణము జెప్పెదనువిను
    మనీతిగ యితరుల నేల నార్జించుటకై
    అనియం దారీతిగ సా
    ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా

    రిప్లయితొలగించండి
  12. ఘన మని మైత్రిని నమ్ముచు
    మనమున యో చింప బో క మాత పలుకు లన్
    విన నేరక నా దుర్యో
    ధన సంసర్గ మున చావు తప్పదు కర్ణా!

    రిప్లయితొలగించండి
  13. తన దాయాదుల రాజ్యం
    బును తన సొంతమని తెల్పు మూర్ఖుడు వాడే
    ధనకాంక్షా పరుడు సుయో
    ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా

    అనుకూలంబగు మిత్రుడైనఁ బడెఁ దానన్యాయమార్గంబునన్
    నిను పుట్టించిన వానిమాట వినుమా నీఛాత్మునే వీడుమా
    ధనమే సర్వమటంచు ప్రల్లదులకున్ దన్నైన మూర్ఖున్ సుయో
    ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్

    రిప్లయితొలగించండి
  14. ఘనమౌ పాసుపతాస్త్ర ధారి నరుడే గాండీవమున్ బూన చె
    ల్లునె నీశక్తి కిరీటి ముందరననిన్? లుప్తంబుగాదే శపిం
    చిన శాపంబులు తీరు వేళకు? పృథా క్షేత్రోద్భవుండా! సుయో
    ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా! మృత్యుపాశమ్మగున్!!

    రిప్లయితొలగించండి
  15. అని లోనఁ బాండవేయులు
    కనలిన నిక్కముగ నంబికా నందన నం
    దన దురభిమాన దుర్యో
    ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా


    ఘన సంతాపము సెందు చుండ నెద నా కాకుత్స్థ రత్నంబు వే
    దన వర్ధిల్లెడు రీతి నిప్పగిది నుత్సాహమ్ముతోఁ గాల యా
    పనముం జేయుచు రామ కార్యమున నీ భామా చరత్కామ సా
    ధన సంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యు పాశమ్మగున్

    [రవిపుత్రుఁడు = సుగ్రీవుఁడు]

    రిప్లయితొలగించండి
  16. కం:ఘనులౌ వరపుత్రులు నీ యనుజులు పాండవులు ,వారి యండ బడయు, మిం
    ధనమౌదువె యనికి ?సుయో
    ధనసంసర్గమునఁ జావుతప్పదు కర్ణా”
    (రాయబారం సందర్భం లో కర్ణునితో శ్రీకృష్ణుని మాటలు.)

    రిప్లయితొలగించండి
  17. మ:వినతుండై నచికేతు డిట్లనియె"నే వేడంగ నీ తత్త్వమున్
    వినిపింపన్ మరలింప నన్ పసులనో,విత్తమ్మునో,స్త్రీలనో
    గొనుమంచున్ వచియింతు వేల నవి నే గొన్నంత మోహాన నా
    ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్”
    (యముడు కూడా రవిపుత్రుడే.నచికేతుడు జన్మమృత్యురహస్యాన్ని తెలుపమని కోరితే ఆ బాలుణ్ని మరిపించటానికి యముడు అనేక వరా లిస్తా నంటాడు.నన్ను మరిపించ వద్దు.నేను మోహం లో పడితే ఆ ధనా లన్నీ మృత్యుపాశాలే అవుతాయి.నాకు తత్త్వమే కావాలి అన్నాడు నచికేతుడు.)

    రిప్లయితొలగించండి
  18. పైనప టారుఁడు కర్ణుడు
    ననిలో నర్జును గెలువఁగ నసమర్ధుండౌ
    వినుమా యీయది దుర్యో
    ధనసంసర్గమునఁ జావు తప్పదు కర్ణా

    రిప్లయితొలగించండి
  19. ఘన మార్తాండ మహాంశసంభవుడవే గర్హింపకన్ సత్కులాం
    గన నట్లీడ్చి మహాసభాంగణమునన్ భంగంబు గావించు దు
    ర్జన సాంగత్య మహాంధకూపమున కూర్మంబౌదువేలా సుయో
    ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్

    రిప్లయితొలగించండి
  20. వినుమయ్య నాదు పలుకులు
    చెనటుల తోడను సతతము చెలిమిని చేయన్
    కనరాదు మేలు,దుర్యో
    ధన సంసర్గమున జావు తప్పదు కర్ణా!


    వినుమో విక్రమశాలి చెప్పు పలుకుల్ వేగమ్ము గా పాండవుల్
    నిను సంహార మొనర్చకన్ విడరుగా నిన్నున్ వడిన్ మట్టిడన్
    మనమందెంచరటంచువింటినయ నా మాటల్ నికన్ నా సుయో
    *“ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్”*

    రిప్లయితొలగించండి
  21. ధనమే మూలము గావచించుటలు మిధ్యాలాపసంభాషణల్
    ధనముంజూడుము లేశమాత్రమున విద్యాదానమెంతేనియున్
    మనువుంగూర్చును గాననీవికను సన్మానించు నమ్మానినిన్
    ధనసంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యుపాశమ్మగున్

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.
    కర్ణునితో... కృష్ణుడు....

    వినుమా కుంతీ పుత్రా
    మనుమా ధర్మమ్ముతోడ మర్మమెఱుగుచున్
    చనుమా,లేకున్న సుయో
    ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా!

    రిప్లయితొలగించండి