20, ఆగస్టు 2024, మంగళవారం

సమస్య - 4858

21-8-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గండపెండెరముం గోరఁగలరె కవులు”

(లేదా...)

“తలఁతురె గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్”

18 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మనుచరిత్రన్ రచించిన మాన్యుడనఁగ
    నష్టదిగ్గజ కవులకు నాద్యుడైన
    పెద్దనను మించు పాటవమొద్దలేక
    గండపెండెరముం గోరఁగలరె కవులు

    చంపకమాల
    పిలుచుచు రాయలున్ మిగుల పెద్దననెంతయొ గారవించియున్
    విలువగు గండపెండరము వేడుకఁ దొడ్గియు తేరు మోసె వ
    ర్థిలు కృతియైమనన్ మనుచరిత్రనుమించెడు కావ్యమల్లకే
    తలఁతురె గండపెండెరముఁ దాల్పఁగసత్కవు లెన్నఁడేనియున్?

    రిప్లయితొలగించండి
  2. కావ్యమాత్మగధ్వనియది కలదుగాని
    రసమునానందరూపమై రాగమొలుక
    పరముదెల్పగ పద్యంబుపండుబ్రదుకు
    గండపెడెరముంగోరగలరె కవులు

    రిప్లయితొలగించండి
  3. పిలచినపల్కెవాణిపినవీరునకయ్యెడ నాట్యమాడుచు న్
    తలచుచుభారతీసతిని ధైర్యముజెప్పెగపోతనార్యుడున్
    కులుకుచువిశ్వనాథునకుకోమలికన్పడెనవ్యరీతిలో
    తలతురెగండపెండెరముఁదాల్పగ సత్కవులెన్నడేనియున్

    రిప్లయితొలగించండి
  4. ప్రజ్ఞ పాటవ మెరిగియు ప్రజలు దాము
    కవులు సన్మాని o చ వలయు కాని యెపుడు
    మాకు బిరుదము లిమ్మని మహిని జూడ
    గండ పెండర ముంగోర గలరె కవులు?

    రిప్లయితొలగించండి
  5. తే॥ తమ కవిత్వ మధురిమను తనయ జనులు
    ముదముఁ బడసి యుప్పొంగుచు మోదమందు
    కవుల కాడంబరపు కాంక్ష కలుగఁ గలదె
    గండపెండరముం గోరఁ గలరె కవులు

    చం॥ విలసిత పద్య ధారలనుఁ బ్రీతిగ మెచ్చుచు మోదమందుచున్
    వలచినఁ జాలు చాలనెడి వారలు సత్కవి వర్యులే గదా
    సలలిత మాధురీ చవిని సర్వ జనాళికిఁ బంచు కోర్కెయే
    తలఁతురె గండ పెండరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. తే॥ తమ కవిత్వ మధురిమను తనిసి జనులు
      ముదముఁ బడయ నుప్పొంగుచు మోదమందు
      కవుల కాడంబరపు కాంక్ష కలుగఁ గలదె
      గండపెండరముం గోరఁ గలరె కవులు

      చం॥ విలసిత పద్య ధారలనుఁ బ్రీతిగ మెచ్చుచు మోదమందుచున్
      వలచినఁ జాలు చాలనెడి వారలు సత్కవి వర్యులే గదా
      సలలిత మాధురీ చవిని సర్వ జనాళికిఁ బంచు కోర్కెయే
      తలఁతురె గండ పెండరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్

      శ్రీకంది శంకరయ్య గారు సూచించిన పిదప మార్చినదండి

      తొలగించండి
  7. పురమునందు గల జనుల పొగడికపయి
    మక్కువ గలిగి సాహిత్యమన దెలియని
    పెళుచు లేర్పర్చు సభనుండి పేర్మి తోడ
    గండపెండెరముం గోరఁగలరె కవులు

    రిప్లయితొలగించండి

  8. కాసులిచ్చిన నేడు కుకవుల నైన
    సత్కవులనుచు పొగుడుచు సత్కరించి
    యాదరించుట నెఱగిన యనఘు లట్టి
    గండపెండెరముం గోరఁగలరె కవులు.


    పలువురి డెందమందు దన వాణి కృపారస లబ్ద మైన కై
    తలవి స్థిరమ్ముగా నిలువ ధన్యుడనంచు దలంచు ప్రాజ్ఞులే
    విలువయె లేని యార్భటపు వేడుక లెల్లను కాంచి వ్యర్థమం
    దలఁతురె, గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్.

    రిప్లయితొలగించండి
  9. పలువురు రచించిరిగద ప్రబంధములను
    స్వప్నమందైన పెద్దన సాటివచ్చు
    విలువ గలిగిన రచనలు సలుపకున్న
    గండపెండెరముం గోరఁగలరె కవులు

    పలువురు సల్పినారు గద పాటవమొప్పగ కావ్య సృష్టినే
    కలగనగల్గినారె మరి కాలికిఁ గట్టగ గండపెండెమున్
    విలువగు కావ్య సృష్టినిల పెద్దన సాటిగ సల్పకున్నచో
    తలఁతురె గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్

    రిప్లయితొలగించండి
  10. కృష్ణ దేవ రాయలు వంటి కృతి పతులను
    నల్లసాని వంటి కవుల నరయఁ గలమె
    ధరణి నేఁడు వెదకి చూడ ధైర్య మూని
    గండపెండెరముం గోరఁ గలరె కవులు


    అల కవితా పితామహుని నాంధ్రము నందుఁ బ్రసిద్ధుఁ డంచు భూ
    వలయము నందు వెల్గు కవి వర్యులఁ జక్కఁగ నర్హుఁ డంచు నా
    సలలితు నల్లసాని కుల సాగర చంద్రునిఁ బెద్దనార్యునిం
    దలఁతురె గండ పెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్

    రిప్లయితొలగించండి
  11. పలువురు సత్కవీశ్వరులు పన్నుగ సత్కృతులన్ రచించినన్
    నిలువవు పెద్దనార్యు కమనీయ కవిత్వము ముందు నెంచగన్
    లలితవిలాస బంధురములైయలరింపక వ్రాసి కావ్యముల్
    తలఁతురె గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్

    రిప్లయితొలగించండి
  12. అందరుకవులలో పెద్ద యల్లసాని
    పెద్దనార్యుఁడు, తనసాటి వేరెవండు?
    ఆంధ్ర కవితా పితామహుఁ డతనివోలె
    గండపెండెరముం గోరఁగలరె కవులు

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:పెద్దనార్యులే సభ లోన పెద్ద కాదె!
    అట్టి కవితాపితామహు లైన వారి
    కిడక యన్యు లెవ్వరు తమ కిమ్మటంచు
    గండపెండెరముం గోరఁగలరె కవులు”
    (ఇలా సభ లో ఇతరకవులు రాయల వారి తో అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  14. చం:తలపక వారి యర్హతల, దాన మొసంగెడి వారి యర్హతన్
    కలిగెను నాకు నేదొ యొక గౌరవ మియ్యది చాలు నంచు లో
    కుల కొక మేలు చేయుటకు కూర్చిన కావ్యము వ్రాయకుండియున్
    తలఁతురె గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్”
    (గౌరవం తనకి లభించినా తనకి అంతటి అర్హత ఉన్నదా?అని అసలు ఇచ్చే వాళ్ల అర్హత ఏమిటి?అని,ఏదో ఒకటి రాసాను చాలు అని కాక లోకప్రయోజనం కల్గినది ఏదైనా వ్రాసానా?అని ఆలోచించకుండా సత్కవులు ఏదో దానం తీసుకున్నట్టు బహుమతులు పొందరు.)

    రిప్లయితొలగించండి
  15. పలుకులనల్లికన్ జిగియు భావమునన్ బిగి రాగమందునన్
    సలలిత ధార పాకమున స్వాదిమమెన్న రసాలసారమున్
    చిలికెడి పద్య కావ్యముల చెన్నుగ జెప్పిన పెద్దనార్యుకే
    తలఁతురె గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్

    రిప్లయితొలగించండి
  16. నాటి కాలమునందున నాణ్యమైన
    కావ్యరాజములను కవులు వ్రాయ
    తొడిగిరప్పుడే కవులకు దోషమంది
    గండెపెండెరము,గోరగలరె
    : డా బల్లూరి ఉమాదేవి

    విలువలు సన్నగిల్లినవి విద్యకు గౌరవమివ్వకన్ సదా
    వలువలబట్టి నిచ్చెడుకు పద్ధతి గాంచుచుగోర రెవ్వరున్
    కలననుగానినట్టికుహకంపు ప్రశ‌స్తిని పొందగామదిన్
    తలతురెగండ పెండెరము దాల్చగ సత్కవు లెన్నడేనియున్

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    గొప్ప గ్రంథములను వ్రాయకున్న గాని
    పద్యములను రచించుచు హృద్యముగను
    అరుదుగాను సత్కారము లందు వారు
    గండపెండెరముం గోర గలరె కవులు?

    రిప్లయితొలగించండి