12, ఆగస్టు 2024, సోమవారం

సమస్య - 4850

13-8-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్”

(లేదా...)

“కోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో”

(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

28 కామెంట్‌లు:

  1. కందం
    నాతియె గుడి నొక మూలన
    ప్రీతి మునఁగ ధ్యానమందు బీగము వైచన్
    యాతన నాకలి, ఫలమిడ
    కోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్!

    ఉత్పలమాల
    నాతియె యొక్క మాల గుడి నర్మిలి ధ్యానమునందు మున్గగన్
    బ్రీతిగ రామునిన్ దలఁచి బీగము వైచఁగ రాత్రి విప్రులున్
    యాతనఁ జిక్క నాకలికి హన్మను బోలుచు పండ్లనీయఁగన్
    గోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా🙏 తమరి సూచనలనుసరించి సవరణ లతో..

      కందం
      నాతియె గుడి నొక మూలన
      ప్రీతి మునఁగ ధ్యానమందు బీగము వేయన్
      యాతన నాకలి, ఫలమిడఁ
      గోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్!

      ఉత్పలమాల
      నాతియె యొక్క మాల గుడి నర్మిలి ధ్యానమునందు మున్గగన్
      బ్రీతిగ రామునిన్ దలఁచి బీగము వేయఁగ రాత్రి విప్రులున్
      యాతనఁ జిక్క నాకలికి హన్మను బోలుచు పండ్లనీయఁగన్
      గోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో!

      తొలగించండి
  2. త్రాతగ హనుమయురాగా
    చేతల నాతఁడుజనకజచేరియుపలుకన్
    మాతగనోదార్చెనుగా
    కోఁతినిఁదల్లిగఁదలంచెకోమలిమురియన్

    రిప్లయితొలగించండి
  3. త్రాతగనాంజనేయుడును తల్లిని సీతను నూరడించెగా
    సాతమురామనామమునుసన్నిథిపల్కుచునాదరించెగా
    లాతియుగానిమానవత రామునిబంటువిచారమందెగా
    కోఁతినిఁదల్లిగాఁదలచెఁగోమలికెంతటిభాగ్యమబ్బెనో

    రిప్లయితొలగించండి

  4. నీతిని వీడిన రావణు
    డాతీరుగవచ్చెనంచు ననుమానముతో
    సీత యె దూషించె మొదట
    కోఁతినిఁ , దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్.


    ప్రీతిని గూర్చుమాటలనె పేర్మిని పల్కుచు రామభద్రుడే
    దూతగ పంపె నన్నికను దుఃఖము వీడుమటంచు పల్కగా
    నీతిని వీడిరావణుడె నేరుగ వచ్చెనటంచు నెంచెనా
    కోఁతినిఁ , దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో.

    రిప్లయితొలగించండి
  5. ఆతత శక్తి యుతుండై
    మాతను దర్శించి హనుమ మహిమను జూపన్
    సీత కు ధైర్య ము కలుగగ
    కోతిని దల్లిగ దలంచె కోమలి మురియన్

    రిప్లయితొలగించండి
  6. కం॥ నీతిని మరచి చను జనులు
    యాతనఁ బెట్టెడు కుటిలుల యాసర కంటెన్
    గోఁతియె నయమనిఁ దెలియఁగఁ
    గోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్

    ఉ॥ నీతినిఁ బాయు వారిఁ గని నేమముఁ దప్పని కోఁతి శ్రేయమౌ
    భూతలమందుఁ బ్రేమఁ గనఁ బోడిమి మీరఁగ సర్వవేళలన్
    ఖాతరఁ జేయుచున్ బరఁగఁ గార్యము లక్ష్యముఁ దీరునంచునో
    కోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో

    రిప్లయితొలగించండి
  7. యాతనతో తిప్పలుపడు
    సీతను మారుతి కనుగొనె శ్రీరామునికై
    ఆతని గని యూరటపడి
    కోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్

    సీతమ జాడకోరి చనె శ్రీహనుమంతుడు లంకవైపుగా
    మాతను గాంచి వేగిరము మారుతి తెల్పెను రామ బంటుగా
    యాతన లంతమౌననుచు నాతడు జానకి నూరడించగా
    కోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో

    రిప్లయితొలగించండి
  8. కందం:
    సీతను గన్గొని మారుతి
    చేతమ్ముప్పొంగరాము సేమము దెలుపన్
    భీతి తొలంగి మనమునన్
    కోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్

    ఉత్పలమాల:
    చేతమునందు నెన్నడును శ్రీరఘురాముని నిల్పి లంకలో
    సీత యశోకవాటికను శింశుపవృక్షపునీడ కుందగన్
    భీతి తొలంగ జానకికి ప్రీతిగ రాముని యుంగరంబిడన్
    కోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో

    రిప్లయితొలగించండి
  9. మేతనిడి పెంచి నందున
    యాతన బడు సమయమందు నాదుకొనెననిన్
    జాతిగ పరాయి యైనను
    కోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్

    మేత నొసంగినందుననె మిక్కిలి భక్తిని జూపుచుండగన్
    యాతన నొందుకాలమున నారయవచ్చిన దానినెంచుచున్
    జాతిని భేదముండినను చాగిలు చుండెడి రీతి నొందుచున్
    కోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో”

    రిప్లయితొలగించండి
  10. నీతు లెఱింగిన బాలుం
    డా తఱిఁ బరుల వలెఁ గాక యన్నుల గమిలో
    నాతిని నల్లరి లోనం
    గోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్


    చేఁతల రాఘవేంద్రునకుఁ జిక్కుల సాయ మొనర్చు వీరుఁ డీ
    భూతల మందు నంజనకుఁ బుట్టుట భాగ్యము కాకపోవునే
    ప్రీతిని గాలి కొడ్కునకు వీర వరేణ్యున కాత్మ నింపుగాఁ
    గోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్య మబ్బెనో

    రిప్లయితొలగించండి
  11. కం:కోతి యనుచు పోషించెడు
    నాతిని సేవికయె చూచి నవ్వు మనమునం
    దా తల్లి చీర పెట్టగ
    కోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్”

    రిప్లయితొలగించండి
  12. ఉ:కోతి యటంచు రూపమును గూర్చి వచించుచు నెక్కిరించి తా
    నాతిని బిడ్డ! నీ చెలియ నమ్రత జూపుచు విద్య నేర్చె , దా
    నీతిని నేర్చె చక్కనగు నేర్పున నున్నతి జెందె ప్రేమతో
    కోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో”
    (అమ్మా! ఆవిడని కోతి అని ఎక్కిరిస్తూ నువ్వు దూరం చేసుకున్నావు కానీ నీ స్నేహితురాలు ఆమెని గురువుగా భావించి ,తల్లి గా భావించి బాగుపడింది అని ఒక తల్లి తన అల్లరి బిడ్డతో అన్నట్టు. )

    రిప్లయితొలగించండి
  13. నాతి వనంబునేరి పతి నామ జపంబొనరింప గాంచెనో
    కోఁతి వనంబునందు గని గోమలి జానకి నేమనెంచెనో
    రాతిని నాతి జేయ నల రాము పదంబపుడేమనెంచిరో
    కోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో

    రిప్లయితొలగించండి
  14. కోతియె వారిధి దాటెను
    మాతకు ముద్రిక నొసగగ మహి జాతయుతా
    ప్రీతిగ చూచుచు మది నా
    కోతిని తల్లిగ తలంచి కోమలి మురియన్

    రిప్లయితొలగించండి
  15. సీతను గాననేగుచట శీఘ్రగతిన్మరుతాత్ముజుండుతా
    ప్రీతిగ మాతకున్నొసగ శ్రీరఘు రామునియంగుళీయమున్
    మాతయు ప్రేమతో గనుచు మారుతియేతన కాప్తుడంచు నా
    *“కోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్యమబ్బెనో”*


    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    నాతియు నాకలి గొనగా
    కోతి యొకటి ఫలములీయ కుడుచుచు
    ముదమున్
    ప్రీతిగ నా పిచ్చిది యా
    కోతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్.

    రిప్లయితొలగించండి