21, ఆగస్టు 2024, బుధవారం

సమస్య - 4859

22-8-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పరతంత్రుల్ దీన కల్పపాదపములె పో”

(లేదా...)

“పరతంత్రుల్ వసియింత్రు దీనజనకల్పక్ష్మాజసాదృశ్యులై”

19 కామెంట్‌లు:

  1. మత్తేభవిక్రీడితము
    భరతోర్విన్ విడ తెల్లవారలు ప్రజాస్వామ్యంపు దేశమ్మనన్
    పరిపాలించెడు వారలన్ బ్రజలె విశ్వాసంబుతోనెన్నగన్
    దొరలై యేలెదరైదువత్సరములున్ దుష్టిన్ భవిష్యత్తుకై
    పరతంత్రుల్ వసియింత్రు దీనజనకల్పక్ష్మాజసాదృశ్యులై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందం
      పరిపాలించెడు వారల
      భరతోర్విన్ పౌరులెన్ను పద్ధతులుండన్
      తిరిగి గెలువంగ నేతలు
      పరతంత్రుల్ దీన కల్పపాదపములె పో!

      తొలగించండి
  2. ఇరవగుతానము వీడుచు
    నిరతము పెరవాని యింట నెలకొను చుండన్
    నరయగ వాడుక రీతిని
    పరతంత్రుల్ దీన కల్పపాదపములె పో

    రిప్లయితొలగించండి
  3. భరతోర్విన్ విడి డబ్బుకై
    పరదేశంబునుజనియెడు ప్రజలెల్లరునున్
    నిరతముగనుందురటనే
    పరతంత్రుల్ దీన కల్ప పాదపములెపో

    రిప్లయితొలగించండి
  4. పరులైజనిరివిదేశము
    తరుగనిభక్తినితమదగుధర్మముతోడన్
    విరిసిరిధర్మాత్ములునై
    పరతంత్రుల్దీనకల్పపాదపములెపో

    రిప్లయితొలగించండి

  5. హరిహర నామమ్మదియె య
    హరహము స్మరియించు వారికండగ నిలిచే
    పరమాత్ములు నాశ్రిత జన
    పరతంత్రుల్ , దీన కల్పపాదపములె పో.



    శరణంబంచును వేడు భక్తులకిటన్ సంక్షేమమున్ గూర్చుచున్
    బరిరక్షించెడు వారలౌ హరిహరుల్ భద్రమ్మునే గూర్చగన్
    ధరణిన్ ధర్మము నిల్పువారలయి సద్భక్తాళికిన్ నిత్యమున్
    బరతంత్రుల్ , వసియింత్రు దీనజనకల్పక్ష్మాజసాదృశ్యులై.

    రిప్లయితొలగించండి
  6. అరయగ బ్రతుకు తెరువు కై
    పరదేశ ము జేరి యచట పర జాతి వలె న్
    వెర చుచు నుండుట జూడన్
    పర తంత్రులు దీన కల్పపాదప ములె పో

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. కం॥పరులకు సాయముఁ జేయఁగ
      నిరతము సిద్థమని చనెడి నీతిమతులిలన్
      వరలఁగలరు కాకున్ననె
      పరతంత్రుల్ దీన కల్ప పాదము వలెపో

      మ॥ వరమౌ విద్యల నేర్చి సర్వులను సంభావించి సాహాయమున్
      నిరతమ్మున్ దమ సాధ్యతన్ గనుచునున్ నేమమ్ముతోఁ జేసెడిన్
      మరులుండంగను జాలునే కనఁగ సమ్మానమ్ము కాకున్ననే
      పరతంత్రుల్ వసియింత్రు దీనజన కల్పక్ష్మాజసాదృశ్యులై

      తొలగించండి
  8. వరమాశించిన భక్తులు
    పరమాత్మను వేడుకొంద్రు ఫలితము కొరకై
    పరమాత్ములు జనరక్షా
    పరతంత్రుల్ దీన కల్పపాదపములె పో

    వరమాశించిన భక్తులెల్ల రిలలో ప్రార్థింతురేదైవమున్
    గరుణా మూర్తులు చక్రియున్ బశుపతే కాంక్షల్ని తీర్చేరుగా
    పరమాత్ముల్ పరిరక్షణమ్మిడుదురే ప్రార్థించు భక్తాళికిన్
    బరతంత్రుల్ వసియింత్రు దీనజనకల్పక్ష్మాజసాదృశ్యులై

    రిప్లయితొలగించండి
  9. నిరతము జనుల హితమ్మును
    గుఱుతిడు గుణనిధులు వారె కువలయమందున్
    పరమోత్కృష్టులు సేవా
    పరతంత్రుల్ దీన కల్పపాదపములె పో

    రిప్లయితొలగించండి
  10. ధరలో పేదలనుద్ధరించుగతి సంధానించి యెల్లప్పుడున్
    కరుణాసాగరులై మెలంగుదురు సత్కార్యమ్ములన్ సల్పుచున్
    పరమోత్కృష్టులు వారలీ జగతి నిస్వార్ధంపు సంసేవకున్
    పరతంత్రుల్ వసియింత్రు దీనజనకల్పక్ష్మాజసాదృశ్యులై

    రిప్లయితొలగించండి
  11. నర లోకమ్మున వెదకఁగ
    నరుదుగఁ గన్పట్టుదురు మహాత్ములు వారల్
    ధరలో నిరంతర తపః
    పరతంత్రుల్ దీన కల్పపాదపములె పో


    సుర లోకమ్మును వీడి కావఁ దగ నా శోకార్తులం బ్రీతులై
    యిర కేతెంచి దయార్ద్ర మానసులు దేవేంద్రాది దాక్షిణ్య ని
    ర్జర ముఖ్యుల్, తము మర్త్యు లార్తు లయి భద్రం బెంచి ప్రార్థింపఁగాఁ
    బరతంత్రుల్, వసియింత్రు దీన జన కల్పక్ష్మాజ సాదృశ్యులై

    రిప్లయితొలగించండి
  12. కం:ఒరులకు మే లొనరించుచు
    నిరతమ్మును పేదవారినిన్ మాధవ శం
    కరులుగ నెంచెడు సేవా
    పరతంత్రుల్ దీన కల్పపాదపములె పో”

    రిప్లయితొలగించండి
  13. మ:సురలోకమ్మున నింద్రు డిట్లనియె నే జూడంగ కల్పద్రుమ
    మ్ము రహించున్ గద స్వర్గ సీమను శిబిన్, పూజ్యున్ దధీచిన్ సదా
    స్మరణన్ జేతును త్యాగశీలురని యాశల్ లేని యార్తావనా
    పరతంత్రుల్ వసియింత్రు దీనజనకల్పక్ష్మాజసాదృశ్యులై
    (మన స్వర్గం లో కల్పవృక్షం ఉంది కానీ శిబి,దధీచి మొదలైన వారు భూమిపై కల్పవృక్షాల తో సమానులే అని ఇంద్రు డన్నాడు.దధీచి యొక్క ఎముక ఇంద్రుని వజ్రాయుధ మైంది.శిబిని అతడు పరీక్షించాడు.)

    రిప్లయితొలగించండి
  14. నరలోకమునను కొందరు
    మరువక పరులకు సతతముమంచితనముతో
    కరుణనుచూపెడు సేవా
    పర తంత్రుల్ దీన కల్ప పాదపములె పో


    కరుణాపుంగవు లైన పాండవులు సత్కార్యమ్ము లన్చేయుచున్
    నిరతమ్మావిరటున్సభన్ సతతమున్ నెమ్మిన్సహాయమ్మునే
    మరకన్చేయుచుజీవితమ్మునటసమ్మానమ్ములన్పొందుచున్
    *పర తంత్రుల్ వసియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    నిరతము ధర్మముగ నడచి
    యొరులకు మేలును ఘటించి యుపయుక్త
    ముగా
    పర హితము కోరు వారలు
    పరతంత్రుల్ దీనకల్ప పాదపములె పో.

    రిప్లయితొలగించండి