చం:మకరము రాశి యై పరగు మానిని యే తగునంచు బండితుం డొకడు వచించ గా దొరకె నొక్క వధూమణి,యామె జాతక మ్మొకటి గ్రహించి, రాశి ఫల ముండిన పత్రిక బట్టి,దానిలో మకరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను ప్రేమ పొంగగన్” ( నీకు మకరరాశి ఐన అమ్మాయి శ్రేష్ఠ మని పండితులు చెప్పగా అలాంటి జాతకం లభించింది.దానితో సంతోషం పట్ట లేక పత్రికల రాశిఫలితాలలో ఉన్న మకరం బొమ్మని పట్టి చుంబించాడు.)
సకలముబ్రహ్మంబనుచును
రిప్లయితొలగించండిఅకలంకంబగునియమమునందున్ఋషియై
వికలముగానిదిమనసున
మకరముఁజుంబించెవలపుమరిమరిపొంగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅకలంకితమ్ము సృష్టియె
సకలేశుండు సృజియించె జంటకు నడుమన్
ప్రకటింప రాగము మకరి
మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్!
చంపకమాల
తొలగించండిసకలము సృష్టికర్త కృత సారము జీవుల రాగబంధముల్
వికసిత మానసాన జత వేడ్కగ సల్లపనంబునెంచఁగన్
ప్రకటితహావభావములు రంజిలగన్ మకరిన్ గనన్ గుతిన్
మకరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను ప్రేమ పొంగగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిపకపకలాడెకీచకుడుపట్టుచుభీమునిద్రౌపదంచునున్
రిప్లయితొలగించండిసుకమునుగోరియాతఁడును, సుందరిరమ్మనెరాసలీలకై
తికమకయైనమానసముదెచ్చినపాతముదారిజూపగా
మకరముఁబట్టిచుంబనముమాటికిజేసెనుప్రేమపొంగగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ద్రౌపది + అంచు' అన్నపుడు సంధి లేదు.
రిప్లయితొలగించండి*(శ్రీ కృష్ణుడు రుక్మిణికి పారిజాతమొసగెనని తెలుసుకొని కినుక బూనిన సత్యనోదార్చుచు చక్రి)*
ముకుళితమయ్యె వదన మం
బకములవియె కెంపులయ్యె పడతికటంచున్
బకవైరి చెంత జని భా
మ కరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్.
వికసిత పారిజితమును వెన్నుడు రుక్మిణి కిచ్చెనంచు నా
సకియయె తెల్పినంత నవసాదము జెందగ తామ్రవర్ణ పం
బకముల గాంచినట్టి బకవైరియె స్వాంతన గూర్చ జేరి భా
మ కరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను ప్రేమ పొంగగన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం॥ మకరముఁ దినుట బహుముదము
రిప్లయితొలగించండిసుకరము కాదు దొరకుటయుఁ జూడఁ గఠినమే
నొక దినము విపణినిఁ గనఁగ
మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్
చం॥ మకరమనంగ భక్షణము మక్కువ గాద భుజించు వారికిన్
సుకరము కాదు పట్టఁగను జూడఁగఁ గష్ట తరమ్ము దుర్లభ
మ్ము కనఁగ నొక్క పూటనట భోజ్యము గంజములోనఁ గాంచఁగన్
మకరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను ప్రేమ పొంగఁగన్
మకరము పెద్దచేప
గంజము అంగడి
(నిఘంటువు సహాయమండి)
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిసకి నెరిచూపులందు జలజారి ద్యుతుల్ వికసించెనంచు, నీ
రిప్లయితొలగించండిమకురము వంటి మోముఁ కుసుమాస్త్రుని మోహితుఁజేయు కామినీ
సకలము నాకు నీవయని సమ్ముదమందుచు వల్లభుండు భా
మ కరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను ప్రేమ పొంగగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'మోము' తర్వాత అరసున్న అవసరం లేదు.
మకరాంకునిఁ బోలుసఖుడు
రిప్లయితొలగించండిసకలము శుభలక్షణముల సరసిజముఖిపై
ప్రకటించుచు ప్రేమను లే
మ కరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్
చకచక నాట్యమాడు సఖి చక్కని రూపము సౌష్ఠవంబుతో
వికలము చేసె డెందమని ప్రేమను చూపగ నిశ్చయమ్ముతో
ప్రకటితమౌ నెఱిన్ పొలతి ప్రాపునచేరి మనోజ్ఞ మూర్తి లే
మ కరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను ప్రేమ పొంగగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిమకరాంకుని ప్రాభవమునఁ
రిప్లయితొలగించండిజకచక వెచ్చందనమ్ము చవిగొన శీతో
దకమున నక్రస్వామిని
మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్
శకటము లాఁగ గుఱ్ఱములు సందడి సేయక సంతతమ్ము పా
యక చనుచుండి నింగి విరహమ్ము వహింపఁ గడింది భారమై
యొక పెను వత్సరం బరుగ నుర్విని సూర్యుఁడు సంక్రమించి యా
మకరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను బ్రేమ పొంగఁగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివికసిత వదనులు జంటగ
రిప్లయితొలగించండినొకటై రన్యో న్య మైన నుత్సా హము తో
ప్రకటిత మోహంబు న భా
మ కరము జుంబిo చె వలపు మరిమరి పొంగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:మకరము వలె పతి తన భా
రిప్లయితొలగించండిమకరమ్మును విడువడు కద! మాపట నా భా
మ కరమ్ము నచ్చగా భా
మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్”
(కరమ్ము నచ్చగా=మిక్కిలి నచ్చగా)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం:మకరము రాశి యై పరగు మానిని యే తగునంచు బండితుం
రిప్లయితొలగించండిడొకడు వచించ గా దొరకె నొక్క వధూమణి,యామె జాతక
మ్మొకటి గ్రహించి, రాశి ఫల ముండిన పత్రిక బట్టి,దానిలో
మకరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను ప్రేమ పొంగగన్”
( నీకు మకరరాశి ఐన అమ్మాయి శ్రేష్ఠ మని పండితులు చెప్పగా అలాంటి జాతకం లభించింది.దానితో సంతోషం పట్ట లేక పత్రికల రాశిఫలితాలలో ఉన్న మకరం బొమ్మని పట్టి చుంబించాడు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమకరధ్వజుడేలనొ చెలి
రిప్లయితొలగించండివికలంబొనరించుచు మది వేసట పెట్టెన్
సకలము నీవే యని భా
మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసకలమునెరింగియును సతి
రిప్లయితొలగించండినొకకంటగనుచుమురారి యుత్సాహముతో
చకచకమనిసాగుచుభా
*“మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్”*
పకపక నవ్వుచున్ సతియు పారగ దవ్వున కల్గ మోహమున్
చకచక చెంతకున్ చనుచుసన్నుతి చేయుచు మోకరిల్లుచున్
వికసిత మౌగ డెందెమది వేడుక తోడను గాంచి వేగభా
*మకరము బట్టి చుంబనము మాటికి చేసెను ప్రేమపొంగగన్*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఒక దేశపురాణి మొసలి
రిప్లయితొలగించండినకలును జేయించె హెచ్చు నైపుణి తోడన్
చకితులయిరి కనిన జనులు
మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసకల శుభంకరంబు సురసాల సుమంబు సపత్ని కందగా
రిప్లయితొలగించండివికల మనస్కయై కనలి వేదన నారటమొందు సత్యభా
మ కరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను ప్రేమ పొంగగన్
మకరపతాకు దండ్రికిని మానిని యల్కను మాన్ప శక్యమే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి