14, ఆగస్టు 2024, బుధవారం

సమస్య - 4852

15-8-2024 (గురువారం)

కవిమిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము”

(లేదా...)

“తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్”

22 కామెంట్‌లు:

  1. తేటగీతి
    చిలకమర్తివారలు నాడు చెప్పినట్లు
    తెల్లవారను గడుసరి గొల్లలపుడు
    సొంతవారు దుర్మార్గులై వంతలిడఁగ
    దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము?

    మత్తేభవిక్రీడితము
    అలనాడార్తిగ మాన్యులై చిలకమర్త్యాఖ్యుల్ విలాపించెనన్
    పలుకుల్; తెల్లలు గొల్లలై భరతభూభాగంబునన్ దోచగన్
    విలువల్ మృగ్యమనంగ పాలకులు నిర్వీర్యమ్ము నేడెంచఁగన్
    దలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్?

    రిప్లయితొలగించండి

  2. ఓటు విలువ నెరుగని వయోజనులిట
    మద్యమాశించి మిగుల దుర్మతుల మెచ్చ
    ప్రభువులుగ గెల్చు నీచుల పాలనమున
    దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము.



    కలియమ్మాశకు నోటు నమ్ముకొను నిర్గ్రందుండ్రె కోకొల్లలై
    ఖలులన్ మెచ్చుచు నోటువేయగను దుష్కార్యమ్ములే చేయుచున్
    బలహీనుండ్ర దమించు నేతలిల సంప్రాప్తించి పాలింపగా
    తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్.

    రిప్లయితొలగించండి
  3. జై హింద్
    గట్టిసంకల్పబలమున గామిగాక
    చిత్తమరయక స్వేచ్ఛను చీడ బట్టి
    అంథమనుకరణమ్మును నాసజేయ
    దక్కునభరతభూమికిస్వాతంత్య్రఫలము

    రిప్లయితొలగించండి
  4. తే॥ హక్కుభుక్తము లన్నియుఁ జక్కఁగాను
    గొందరే పొందఁగన్ దేశమందు నిటుల
    నర్భకులు కలతఁ బడఁగ నాశలుడుగి
    దక్కున భరత భువిని స్వాతంత్ర్యఫలము

    మ॥ కలయేఁ గాదొకొ దేశసంపదలు స్వీకారమ్ముఁ జేయన్ గనన్
    జలగల్ వోలెను గొల్లగొట్టుచు నిటుల్ సాంతమ్ముగాఁ గొందరే
    బలిమిన్ జూపుచు సర్వులున్ మనఁగ సౌభాగ్యమ్ముఁ బ్రాప్తించఁగన్
    దలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్

    రిప్లయితొలగించండి
  5. అన్యదేశపు పాలకులణచివేయ
    విడుపు నొందియు , నీనాటివిభుల వింత
    పోకడలను గనిన శంకపుట్టు నిటుల
    దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము ?

    రిప్లయితొలగించండి
  6. దేశ భక్తులు మిక్కిలి దీక్ష బూన
    లభ్య. మయ్యెను స్వాతంత్ర్య లక్ష్మి మనకు
    దుష్ట నేతల న్ పాలనన్ దొచె నిపుడు
    దక్కున భరత భువికి స్వాతంత్ర్య ఫలము?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదంలో దుష్ట నేతల పాలనన్ దో చె నిపుడు అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  7. ఒక్కటై తెల్ల వారిని ధిక్కరించి
    చిక్కినారము నేతల చేతలందు
    మిక్కుటంబుగ నేతలే మెక్కుచుండ
    దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము

    కలకాలమ్మభివృద్ధి చెందు దిశలో కన్పట్టు నాదేశమే
    యిలసాధింపగ నేర్చునొక్కొ విభవమ్మేనాటి కైనన్ సదా
    గెలుపోటంబుల పైన ధృక్కులు వినా కేండ్రింతురా దైన్యమున్
    తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్

    రిప్లయితొలగించండి
  8. కలగంటిన్ గలలోన భారతినహో కన్నీరు మున్నీరుగా
    విలపించన్ గనుగొంటి బిడ్డలను నిర్వేదంబుగా జూచుచున్
    ఖలులై స్వార్థముతోచరించి ప్రగతిన్ గావింపఁగా ధ్వంసమున్
    తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్

    రిప్లయితొలగించండి
  9. ఎక్కితిరి యందలమ్ములు సక్క జనులు
    చిక్కు లెల్లఁ దొలంగిన వక్కజముగఁ
    దక్కు పలుకంగ వాక్కులు నొక్కి యిట్లు
    దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము


    తొలఁగెన్ శృంఖలముల్ పరాంగ్ల జన దుర్దోర్దండ బంధమ్ములుం
    దొలఁగెన్ వర్ణ విభేదముల్ మనకు సంతోషమ్ము లేపారఁగాఁ
    దొలఁగం జూడము వర్ణ భేదముల నెందుం గొంచె మైనం గటా
    తలపోయన్ భరతాంబ పొందు నొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:దక్కె స్వాతంత్ర్య మనగ మతమ్ము కొరకు
    ముక్క లయ్యె దేశము, చీలి పోగ మిగులు
    దేశమున హెచ్చ కులమతా వేశము లిక
    దక్కునె భరతభువికి స్వాతంత్ర్యఫలము?

    రిప్లయితొలగించండి
  11. మ:తలచెన్ గాంధి మహాత్ముడై యిటుల స్వాతంత్ర్యమ్ము నామార్ధమే?
    కులమున్ జూచుచు నిమ్నజాతులనుచున్ క్రూరంపు టాచారమై
    వెలి వేయన్ మన వారి,వారి కిలలో స్వేచ్ఛన్ నివారించుటన్
    దలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్”
    (మన మనుషులనే మనం స్వేచ్ఛ లేని వారిగా చేసి వెలివేస్తే,అస్పృశ్యత పాటిస్తే దేశానికి స్వాతంత్ర్యం నామమాత్రమే అని గాంధీజీ భావించారు.)

    రిప్లయితొలగించండి
  12. కులతత్వంబు మతంపు మత్సరము లెక్కొల్పంగ దుష్టాత్ములా
    వలలన్ జిక్కి వివేకమున్ విడిచి సౌభ్రాత్రంబు మన్నింపకే
    కలహంబే పరమార్థమై జనులహంకారంబునే వీడరే
    తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్

    రిప్లయితొలగించండి
  13. భరతమాతకు దాస్యమ్ముఁ బాపు కొరకు
    పణముగానొడ్డిరెందరో ప్రాణములనె
    యట్టి మహనీయ మూర్తుల త్యాగనిరతి
    దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. కలుషాత్ముల్ నరరూపరాక్షసులయో కామాంధులా కీచకుల్
    కలలే కల్లలు జేసి కొమ్మను బలాత్కారంబునన్ ద్రుంచిరే
    విలువేలేదిట ప్రాణమానములకున్ వేధింపులే నిత్యమై
    తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్

    రిప్లయితొలగించండి
  16. ఇలలో చూడ నరాచకమ్ము లవియున్ హెచ్చన్ గదా చూడగా
    విలువల్ తగ్గెను మంచి కార్యములకున్ విశ్వమ్ము నందెల్లడన్
    ఛలమున్ వీడక సాగుతున్న నికపై సత్కార్యముల్సాగవే
    *“తలపోయన్ భరతాంబ పొందునొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్”*

    రిప్లయితొలగించండి
  17. గాంధికన్నట్టికలలెల్ల కల్లలాయె
    యోటువిలువ నెరుంగక నోట్ల కమ్ము
    కొనెడిసంఖ్యయధికమయ్యెకువలయాన
    *“దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము”*

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    విలువ తెలియక వోటును విక్రయించ
    కొనుచు నధికార పీఠమున్ గొనెడు నేత
    లున్న, ప్రజలకు మేలు చేకూరుటెట్లు
    దక్కున భరత భువికి స్వాతంత్ర్య ఫలము?

    రిప్లయితొలగించండి