తే.గీ:తమ కుమార్తెయె బడి నాటకమున సీత పాత్ర వేయగ ,నచ్చె నా పాత్ర తమకు పొలతి కొప్పెను, నాల్గు కన్ బొమలు భళిర యల్లలాడెను సతోష మవధి మీర. (కూతురు సీత వేషం వేస్తే తలిదండ్రులకి ఆనందం తో నాలుగు కనుబొమలు అల్ల లాడాయి.ఆ పాత్ర అమ్మాయికి ఒప్పింది.)
చం:వలపు రగుల్చు గీతముల పాడ దివాణపు మేజువాణి లో గలగల నృత్యముల్ సలుప,కైతల నా భట రాజొసంగె నా పొలఁతికి నాల్గు, కన్బొమలు పొల్పు వహించె, విలాసినీతతిన్” పలువుర లోన నీమె కడు బాగుగా నున్న దటంచు మెచ్చుచున్.
(జమీందారీ సంస్కృతి లో మేజువాణీలు,భోగం వారు నృత్యాలు చెయ్యటాలు,భట్రాజులు పద్యాలు చెప్పటాలు ఉండేవి.మా నూజివీడు ఈ సంస్కృతికి ప్రసిద్ధి.మేజు వాణీ లో ఒకమ్మాయి కనుబొమలు నచ్చి ఒక భట్రాజు నాలుగు పద్యాలు చెప్పేసాడు.)
తేటగీతి
రిప్లయితొలగించండివేడినీళ్లకు చన్నీళ్ళు కూడినటుల
బాధ్యతల్ గొని కొలువుకుఁ బత్నిచనుచుఁ
కళ్ళజోడు ధరింపఁగఁ గాంచినంత
పొలఁతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర!
చంపకమాల
నిలుపుచు నింటిగౌరవము నీరజ నేత్రయుఁ గొల్వుఁజేయుచున్
గలిమిని గూర్చు బాధ్యతలఁ గైకొని యేగుచు వాహనంబునన్
జలువకుఁ గళ్లజోడుఁ గొని సాగుచునుండఁగఁ దాల్చినంతటన్
బొలఁతికి నాల్గు కన్బొమలు పొల్పు వహించె విలాసినీతతిన్!
దైవ మిచ్చిన కనుబొమతానునొకటి
రిప్లయితొలగించండిరంగుబూసిన దొకటి రమణికుండె
వెరసిరెండునురెండునై వింతనుండె
పొలతికొప్పొనునాల్గుకన్బొమలుభళిర
దొకటియై
రిప్లయితొలగించండిసహజ మైనట్టి కనుబొమల్ సౌ రు గొలుప
రిప్లయితొలగించండివేషమును దాల్చి నప్పుడు వేసిన వి యును
కలియ వింత గా నయ్యె డ గాంచ నగును
పాలతి కొప్పెను నాల్గు క న్బొ మలు భళి ర
తే॥ ఆధునిక నితంబిని తన యందమునకు
రిప్లయితొలగించండిమెరుగులను దిద్ద ననిశము వరలుచుండు
కనుబొమలపై మరియొకటి కలికి దిద్దఁ
బొలఁతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర
చం॥ కలువలఁ బోలు కన్నులకు కాటుక దిద్దఁగ హెచ్చు నందమే!
విలసిత రూప సంపదకుఁ బ్రీతిగ వన్నియఁబెట్ట నెంచుచున్
మలచఁగ నాతి కన్బొమల మక్కువ మీరఁగ దిద్ది నాల్గుగాఁ
బొలఁతికి నాల్గు కన్బొమలు పొల్పు వహించె విలాసినీతతిన్
తాటకివధ నాటకమున తాటకివలె
రిప్లయితొలగించండియభినయమొనర్చు పడతుక కనువుగ ముఖ
మునకు భూషించ , బొరబడి పూన్చియుండ
పొలఁతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర
నెలతగకృష్ణుజూయెనటసున్నితమౌభ్రుకుటీ లలామయై
రిప్లయితొలగించండికలసినరౌద్రమూర్తియనకన్బొమవిచ్చెగసత్యపోరులో
వెలసెనురాగరేఖనటపెల్లుబికెన్గదవీరమందునన్
పొలతికినాల్గుకన్బొమలుపొల్పువహించెవిలాసినీతతిన్
రిప్లయితొలగించండిప్రియుని సాంగత్యమంబున విల్లు వోలె
సొబగులీనినను రణమున్ జూడనవియె
యగ్నిగోళాలకాధారమై నిలుచుచు
పొలఁతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర.
చెలువడు కంస హింసకుని చెంతకు చేరిన పాళమందునన్
విలువలె శోభలీనినను విగ్రహమందున కాంచి నంతనే
యలికపు పక్షముల్ వలె భయంకర రూపము దాల్చుచు నద్భుతమ్ముగా
పొలఁతికి నాల్గు కన్బొమలు పొల్పు వహించె విలాసినీతతిన్.
లలిత మనోహరమ్ముగ విలాసముగా తన రూపు దిద్దుచున్
రిప్లయితొలగించండివిలసితమైన మోమునతి వేళముగా హవణించుచుండగా
చిలుకలకొల్కి కన్బొమల చేరువ కాటుక రేకలేర్పడన్
పొలఁతికి నాల్గు కన్బొమలు పొల్పు వహించె విలాసినీతతిన్
కులుకు లాడి కనుబొమలే పొలుపుమీర
రిప్లయితొలగించండివిలసితంబగు కనుగొనఁ వీక్షకులకు
దర్ప ణంబున ద్విగుణీకృతమ్ము కాగ
పొలఁతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర
కులుకుచు వన్నెలాడి తన కోరిక తీరగ నిల్చియుండగా
విలసితమాయె చూడ హరివిల్లుగ కన్బొమ రూపురేఖలే
చెలువపు టద్దమందు గన చిత్రముగా ద్విగుణీకృతంబులై
పొలఁతికి నాల్గు కన్బొమలు పొల్పు వహించె విలాసినీతతిన్
ముకురమందున కోమలి మోముఁ గనుచు
రిప్లయితొలగించండికనుల కాటుక దిద్దుచు కనుబొమలకు
గూడనలదెను కాటుకఁ జూడనపుఁడు
పొలఁతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర
ఒకటి రెండుగఁ గనిపించు నొకఁడు వలికె
రిప్లయితొలగించండినాల్గు పాదసరోజముల్ నాల్గు హస్త
పద్మములు నలరుచు నుండఁ బద్మ ముఖికిఁ
బొలఁతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర
అలరుచు నుండఁ జక్కగను నబ్జము పొత్తము కీరరాజమున్
లలితపు టక్ష మాలయును రమ్యతరమ్ముగ సంతతమ్మునుం
దలరుచుఁ బద్మసంభవుని దారకు వాణికి హస్తపద్మముల్
పొలఁతికి నాల్గు కన్బొమలు పొల్పు వహించె విలాసినీ తతిన్
తే.గీ:తమ కుమార్తెయె బడి నాటకమున సీత
రిప్లయితొలగించండిపాత్ర వేయగ ,నచ్చె నా పాత్ర తమకు
పొలతి కొప్పెను, నాల్గు కన్ బొమలు భళిర
యల్లలాడెను సతోష మవధి మీర.
(కూతురు సీత వేషం వేస్తే తలిదండ్రులకి ఆనందం తో నాలుగు కనుబొమలు అల్ల లాడాయి.ఆ పాత్ర అమ్మాయికి ఒప్పింది.)
చం:వలపు రగుల్చు గీతముల పాడ దివాణపు మేజువాణి లో
రిప్లయితొలగించండిగలగల నృత్యముల్ సలుప,కైతల నా భట రాజొసంగె నా
పొలఁతికి నాల్గు, కన్బొమలు పొల్పు వహించె, విలాసినీతతిన్”
పలువుర లోన నీమె కడు బాగుగా నున్న దటంచు మెచ్చుచున్.
(జమీందారీ సంస్కృతి లో మేజువాణీలు,భోగం వారు నృత్యాలు చెయ్యటాలు,భట్రాజులు పద్యాలు చెప్పటాలు ఉండేవి.మా నూజివీడు ఈ సంస్కృతికి
ప్రసిద్ధి.మేజు వాణీ లో ఒకమ్మాయి కనుబొమలు నచ్చి ఒక భట్రాజు నాలుగు పద్యాలు చెప్పేసాడు.)
పొయ్యిముంగిటకూర్చొన్న పొలతి కపుడె
రిప్లయితొలగించండిపొగను పీల్చ గకళ్ళకుజోడురాగ
వింతగయగుపించతలచె వేగపతియు
*పొలతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర*
అలకనుపూనిసత్యయటనాగ్రహమున్ కనపర్చుచున్ వడిన్
చిలకలకొల్కిరోవినుముశీఘ్రమెతెచ్చెద నిప్పుడే తరున్
యలకలుగాలికిన్చెదర నద్దము నందు గనంగ మోమునన్
*బొలతికి నాల్గు కన్బొమలు పొల్పువహించె విలాసినీతతిన్.*
కలశము నిల్పి వేడుకగ కామితదాయిని పూజ కెన్నికన్
రిప్లయితొలగించండిలలనలు నారికేళమున లక్ష్మిని దీర్చుచునున్న వేళలో
దొలకగ చేయి దిద్దెనొక తొయ్యలి కుంకుమ రెండు వేళ్ళతో
పొలఁతికి నాల్గు కన్బొమలు పొల్పు వహించె విలాసినీతతిన్