2, ఆగస్టు 2024, శుక్రవారం

సమస్య - 4840

3-8-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“యక్షవాక్కు గడు ముదావహంబు”

(లేదా...)

“యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

21 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    పాండవాగ్రజుండు ప్రశ్నల నెగ్గుచు
    నకులుని బ్రతికింప నప్పుననఁగఁ
    బంచపాండవులను బ్రతికించి దీవించు
    యక్షవాక్కు గడు ముదావహంబు!

    ఉత్పలమాల
    దక్షతనెగ్గి ధర్మజుఁడు తప్పక ప్రశ్నల, నశ్వినేయునిన్
    రక్షణఁ జేయనొప్పునన రంజిలి ధార్మిక చింతకెంతయో
    భిక్షగ పంచపాండవుల వీడుచు నందరి ప్రాణమిత్తునన్
    యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్!

    రిప్లయితొలగించండి
  2. రక్షనుజేయతమ్ములను రాజుగా ధర్మజుడంతకోరగా
    శిక్షనువేసెతండ్రియునుచెప్పెగసందియమంతలోననే
    అక్షయమైనమాటలనుహంసగబల్కెకుమారుడత్తఱిన్
    యక్షునివాక్కులెంతయు ముదావహముల్సుమనోభిరామముల్

    రిప్లయితొలగించండి

  3. పాటవమ్ము తోడ ప్రచ్ఛనములకెల్ల
    ప్రతి వచనము నిడిన పాండుసుతుని
    ధర్మపాలనంబు దర్శించి పలికిన
    యక్షవాక్కు గడు ముదావహంబు.


    దక్షతతో సవాలులకు ధాటిగ నుత్తరమిచ్చినట్టి యా
    లక్షణ మూర్తి ధర్మజుని భ్రాతల కాయువొసంగి ధర్మమున్
    రక్షణ సేయువాడవని ప్రస్తుతి జేయుచు పల్కినట్టి యా
    యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్.

    రిప్లయితొలగించండి
  4. ధర్మజుని సహజుల తత్వమెరిగియుండి
    ధర్మజుడిని కొలనుదరికి వచ్చు
    నటుల జేయుటకయి షరతుగ పెట్టు యా
    యక్షవాక్కు గడు ముదావహంబు

    రిప్లయితొలగించండి
  5. తమ్ములందరు తమ తనువులు చాలింప
    తగు జవాబులిడెను ధర్మజుండు
    తమకు రక్షణమిడు ధర్మమెల్లెడలను
    యక్షవాక్కు గడు ముదావహంబు

    యక్షుని మాటలన్ వినక యాయువు చెల్లిన తమ్ములంగనెన్
    దక్షతతోడతానొసగె ధర్మజుడే తన మారుమాటలన్
    రక్షణ సల్పుఁ ధర్మమని ప్రశ్నలు వైచిన వాడు పల్క నా
    యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్

    రిప్లయితొలగించండి
  6. మేఘ సందేశం:

    పక్షి పథమ్మునన్ వెడలు వారిద సంతతి రాజరాజమా!
    శిక్షను పొంది నేనిచట చిక్కితి భార్యకు దూరమై విశా
    లాక్షికి చెప్పవే విడువుమార్తము వచ్చెదనంచు పల్కెడా
    యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్!!

    విడువుము + ఆర్తము = విడువుమార్తము

    రిప్లయితొలగించండి
  7. పూర్వ కాల మందు నుర్వి జనుల క్షేమ
    మెంచి మెలఁగ వలయు నంచు మూరి
    శాసన సభ యందుఁ జేసిన భార తా
    ధ్యక్ష వాక్కు గడు ముదావహంబు


    అక్షయుఁ జేయ వేఁడికొన నా నకులుం దగు కారణమ్ముతో
    దక్షత మీఱ నింపుగను ధర్మజుఁ డిచ్చిన నుత్తరమ్ము లా
    యక్ష వరేణ్యు ప్రశ్నలకు నంతట భ్రాతల నెల్లఁ గొమ్ము నా
    యక్షుని వాక్కు లెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్

    రిప్లయితొలగించండి
  8. యక్షుడు వేయు ప్రశ్నలకు నాత్రతనొందక ధర్మరాజు తా
    దక్షతతోడుతన్ బదులు ధర్మయుతంబుగ నిచ్చినంతటన్
    యక్షుడు మెచ్చి ధర్మజుని యక్కఱ దీరిచి పల్కినట్టి యా
    యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్

    రిప్లయితొలగించండి
  9. యక్ష డడుగ ప్రశ్న లవలీలగా ధర్మ
    రాజు బదులు నీయ రహిని మెచ్చి
    రక్షజేయు నీదు దక్షత యెపుఁడను
    యక్షవాక్కు గడు ముదావహంబు

    రిప్లయితొలగించండి
  10. సోదరుల రక్ష సేయంగ సూటి గాగ
    ధర్మ జు డొ స o గె ను జవాబు దక్షు డ గుచు
    బ్రతుకు వారల గాంచియు పరవ సింప
    యక్ష వాక్కు గడు ముదా వ హంబు

    రిప్లయితొలగించండి
  11. ఆ.వె:సిక్కు సైన్యనేత శివమెక్కి సింగమ్ము
    జూలు దులిపినట్లు "చూతురేమి!
    రిపుల జీల్చు"డనగ రెచ్చిన సిక్కు హ
    ర్యక్షవాక్కు కడు ముదావహమ్ము
    (అతడు సిక్కు సైన్యాధ్యక్షుడు.అతడికి సింగ్ అనే పేరు ఉంటుంది కనుక సింహము.హర్యక్షము.అతడికి జుట్టు బాగా ఉంటుంది కనుక జూలు విదిల్చిన సింహం లాగా ఉన్నాడు.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:భక్షణ జేసి కాలమును వ్యర్థపు పల్కులు పల్కు భాషణా
    రాక్షసులన్,సకాలమున రాని ప్రయోక్తల గూర్చి నేర్పుగా
    రూక్షము కాని హాస్యమును రువ్వుచు చక్కగ పల్కు నా సభా
    ధ్యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్”

    రిప్లయితొలగించండి
  13. ఆ॥ పశ్నలన్నిటికిని పాటవ మొప్పఁగ
    నుత్తరమ్ముల నటులోరిమిఁ గని
    ధర్మజుండు నుడువఁ దనిసి వచించిన
    యక్షవాక్కు గడు ముదాహవంబు

    ఉ॥ దక్షతతోడ ప్రశ్నలకు ధర్మజుఁడోరిమిఁ గాంచి తెల్పఁగా
    నక్షయ జ్ఞాన సారమటు లాయరవిందిని వద్ద తుష్టుఁడై
    రక్షణఁ జేసి ధర్మజుని భ్రాతల మెచ్చుచు వక్కణించెనా
    యక్షుని వాక్కు లెంతయు ముదాహవముల్ సుమనోభిరామముల్

    అరవిందిని కొలను నిఘంటువు సహాయమండి
    గత 4రోజులుగా బెంగుళూరులో లేనందున ఇక్కడ post చెయ్యలేకపోయానండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించాలి తే॥ ఉ॥ రెంటిలోను ముదావహ ముదాహవ అని తప్పు టైపు చేసానండి

      తొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ధర్మరాజు చెప్పి తగిన జవాబులు
    నకులుని బ్రతికించు నజరు నడుగ
    నందరికిని జీవ మందించి దీవించు
    యక్ష వాక్కు గడు ముదావహంబు.

    రిప్లయితొలగించండి
  15. దక్షత జూపి భారత పతాకము ఠీవిగ నుద్గమించగా
    దీక్షను బూని జట్టు కొనితేవలె మేల్ పతకంబులన్ సదా
    రక్షగ నిల్చు దేశ జనులందరి దీవనలన్న నా సభా
    ధ్యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్

    రిప్లయితొలగించండి
  16. కక్షను బూని రాష్ట్రమును కాష్ఠము జేసిన దుండగీండ్లకున్
    శిక్ష విధించి రోటరులు శీఘ్రమె వారల బంపిరిండ్లకున్
    దక్షులు విజ్ఞులౌ ప్రజలు ధర్మము నిల్పిరటన్న నూతనా
    ధ్యక్షుని వాక్కులెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్

    రిప్లయితొలగించండి
  17. చాటుమాటుగాను చాడీలు చెప్పుచు
    పబ్బము గడుపుకొను వారి కన్న
    భేష జమ్ము లేక భేషుగా నాడు ప్ర
    *త్యక్షవాక్కు గడు ముదావ హంబు”*


    రక్షణ చేయువాడయిన రాజిత సుందరు డాయ పర్ణ నే
    వీక్షణ చేయుచున్ నడిగె వేగత పమ్మును నాపుమోచెలీ
    నక్షులుమూడుకల్గెనని నాగ్రహ మొందగచేయిపట్టు నా
    త్ర్యక్షుని వాక్కు లెంతయు ముదావహముల్ సుమనోభిరా మముల్

    రిప్లయితొలగించండి