తే.గీ:బర్రె నేతిని,డాల్డాను బట్టి తేగ నావు నేతికి బదులుగా యజ్ఞమందు వాడె గోఘృత మ్మని యెట్లు బ్రాహ్మణునకు భ్రమ ఘటించెను? బ్రహ్మ సారాయి గొనెనొ? (యజ్ఞం లో బ్రాహ్మణులు బ్రహ్మ,హోత,ఋత్విజుడు, అధ్వర్యుడు అని నలుగు రుంటారు.గేదె నెయ్యి,డాల్డా పోసి యజ్ఞం చేస్తుంటే ఈ బ్రహ్మ ఆవు నెయ్యి అని ఎలా అనుకున్నాడు? ఈయన తాగి ఉన్నాడా? అని ఆక్షేపించినట్టు.)
ఉ:కవులకు బ్రహ్మ తిక్కనయె కాదొకొ?యట్టి మహాత్ము డేలనో "యమలిన యాజ్ఞసేని తన యారవ భర్తగ కర్ణు నెంచు" నన్ విమతపు బల్కు కృష్ణునకు బెట్టెను,విజ్ఞున కిట్టు లేలనో భ్రమ ఘటియించె? బ్రహ్మ కలు ద్రావెనొ యంచుఁ దలంచి రెల్లరున్” (తిక్కన గారికి కవిబ్రహ్మ అనే బిరుదు ఉంది.అలాంటి బ్రహ్మ కర్ణుణ్ని ఆరవ భర్తగా ద్రౌపది అంగీకరిస్తుందని శ్రీకృష్ణుని తో అనిపించట మేమిటి? ఆ సమయం లో ఆ కవిబ్రహ్మ గారు కల్లు పుచ్చుకున్నారా?అన్నారు విమర్శకులు.)
త్రాగుడుబోతువాని కూతలు:
రిప్లయితొలగించండితేటగీతి
సృష్టి కర్తకు సంతుగా చెల్లుదురన
బ్రహ్మకున్ పుత్రికలుగదే పడతులెల్ల
వాణిని సృజించి మోహించి పత్నిగఁగొనె
భ్రమ ఘటించె(నొ)ను బ్రహ్మసారాయి గొనెనొ?
చంపకమాల
తొలగించండిఅమలుడు పద్మనాభునకు నర్మిలి గల్గిన పుత్రుడే యనన్
విమలుడనన్ త్రిమూర్తులుగ వెల్గెడువారికినాద్యుడై కనన్
కమలజుఁడౌచు సృష్టికిని కర్తగ వాణి సృజించి పొందెనే!
భ్రమ ఘటియించె బ్రహ్మ కలు ద్రావెనొ? యంచుఁ దలంచి రెల్లరున్
రమ్యమైనదిసృష్టినిరాగమొలుక
రిప్లయితొలగించండికమ్రకమనీయగానంబు కలను బోసి
భ్రమఘటించెను బ్రహ్మ సారాయిగొనెనొ
దూరమైనదిపరమునుతోచదాయె
రిప్లయితొలగించండితే॥ నగలు చీరెలఁ గొనిపెట్టి వగలు దీర్చి
రిప్లయితొలగించండిమగఁడు మురిపింపఁ బూనిన మమతఁ గనక
ముదిత మథన పరచునను పురుషు లనిరి
భ్రమ ఘటియించె బ్రహ్మ సారాయి గొనెనొ
చం॥ భ్రమమున నల్గె జీవితము పాశము లాగుచునుండ సర్వదా
సమిధగ మారి భార్యనిలఁ జక్కగఁ జూసినఁ బ్రేమ మీరఁగన్
మమతను జూపఁ బోదుగద మానిని యంచు గణించు పూరుషుల్
భ్రమ ఘటియించె బ్రహ్మ కలు ద్రావెనొ యంచుఁ దలంచి రెల్లరున్
రిప్లయితొలగించండిఆయవారము కోసమై యరుగ నేమి
యే గృహము ముందు నిలువక నేగుచుండె
వడిని యదిగాంచి వచియించె బాలుడొకడు
భ్రమ ఘటించెను బ్రహ్మ సారాయి గొనెనొ?
సుమధుర గాత్రమున్ హరిని స్తోత్రము జేసెడీ భిక్షకుండు స
త్తముడని ఖ్యాతిగాంచిన బుధానుదు పాడెడి నాటి పాటలో
గమకము లెన్నొ తప్ప ననగారుడు గాంచి వచించె నిట్లు వి
భ్రమ ఘటియించె, బ్రహ్మ కలు ద్రావెనొ యంచుఁ దలంచి రెల్లరున్.
అమితముగ సృష్టి జరిపించుటనునది కన
రిప్లయితొలగించండిభ్రమ ఘటించెను బ్రహ్మ సారాయి గొనెనొ!
కాని సురలకు నిత్యము కల్లుగొనుట
నానవాయితి కనుకనె యరమరయది
తాను సృష్టించి నట్టి దౌ తన్వి గాంచి
రిప్లయితొలగించండిమోహ పరవశ మందియు బుద్ది పుట్టీ
సతిగ జేకొనె వాణిని సత్య మరయ
భ్రమ ఘటించె ను బ్రహ్మ సారాయి గొనె నొ?
తే.గీ.||
రిప్లయితొలగించండిసృష్టి కార్యముఁ సలుపుచు స్పృహను మరచి
యిచ్చవచ్చిన రీతిగా ఈజగమున
వింత జీవుల సృజియించి విస్వసృజుడు
భ్రమ ఘటించెను బ్రహ్మ సారాయి గొనెనొ
చంపకమాల:
కమలజుఁడీ భువిన్ కడు వికారఁపు జేష్టల జీవజాలమున్
తమకముతో సృజించి తన తత్తరబాటును వెల్లడించెనో
అమితఁపు సృష్టికార్యమున వ్యాకులపాటు వహించెనేలనో
భ్రమ ఘటియించె బ్రహ్మ కలు ద్రావెనొ యంచుఁ దలంచి రెల్లరున్
కమలములఁ దలపించెడి కనులు కలిగి
రిప్లయితొలగించండివిమలమైతోచు కన్నియ బెళుకు గాంచి
సమధికోత్సాహ భరితులౌ సర్వులకును
భ్రమ ఘటించెను బ్రహ్మ సారాయి గొనెనొ
కమలము విచ్చెనో యనగ కన్నియ కన్నులు కాంతివంతమే
గమనము హంసదే యనుచు కంతుని సాయక మంచు యెంచు నా
సమయము మత్తుకల్గెనట సర్వులు వీక్షణ సల్పుచుండ ది
గ్భ్రమ ఘటియించె బ్రహ్మ కలు ద్రావెనొ యంచుఁ దలంచి రెల్లరున్
తే.గీ:బర్రె నేతిని,డాల్డాను బట్టి తేగ
రిప్లయితొలగించండినావు నేతికి బదులుగా యజ్ఞమందు
వాడె గోఘృత మ్మని యెట్లు బ్రాహ్మణునకు
భ్రమ ఘటించెను? బ్రహ్మ సారాయి గొనెనొ?
(యజ్ఞం లో బ్రాహ్మణులు బ్రహ్మ,హోత,ఋత్విజుడు, అధ్వర్యుడు అని నలుగు రుంటారు.గేదె నెయ్యి,డాల్డా పోసి యజ్ఞం చేస్తుంటే ఈ బ్రహ్మ ఆవు నెయ్యి అని ఎలా అనుకున్నాడు? ఈయన తాగి ఉన్నాడా? అని ఆక్షేపించినట్టు.)
ఉ:కవులకు బ్రహ్మ తిక్కనయె కాదొకొ?యట్టి మహాత్ము డేలనో
రిప్లయితొలగించండి"యమలిన యాజ్ఞసేని తన యారవ భర్తగ కర్ణు నెంచు" నన్
విమతపు బల్కు కృష్ణునకు బెట్టెను,విజ్ఞున కిట్టు లేలనో
భ్రమ ఘటియించె? బ్రహ్మ కలు ద్రావెనొ యంచుఁ దలంచి రెల్లరున్”
(తిక్కన గారికి కవిబ్రహ్మ అనే బిరుదు ఉంది.అలాంటి బ్రహ్మ కర్ణుణ్ని ఆరవ భర్తగా ద్రౌపది అంగీకరిస్తుందని శ్రీకృష్ణుని తో అనిపించట మేమిటి? ఆ సమయం లో ఆ కవిబ్రహ్మ గారు కల్లు పుచ్చుకున్నారా?అన్నారు విమర్శకులు.)
గుండె లోపల జాలియె బెండువడియె
రిప్లయితొలగించండిరాముఁ డాపద పాలయ్యె నేమొ యంచు
జానకీ దేవి కక్కట కాననమున
భ్రమ ఘటించెను బ్రహ్మ సా రాయి గొనెనొ
[బ్రహ్మ సా = బ్రహ్మ చా ]
సుమతి వచింప నోపునె వసుంధర నివ్విధి నెన్నఁ డైననుం
గమలజుఁ గూర్చి వక్రముగఁ గంజ దలాక్షుని పట్టి గూర్చియే
స మల మనస్కుఁడై పలుక జ్ఞాన విహీనుఁ డొకండు నిట్టులన్
భ్రమ ఘటియించె బ్రహ్మ, కలు ద్రావెనొ యంచుఁ దలంచి రెల్లరున్
ముగురుమూర్తులవేషముల్ ముదము తోడ
రిప్లయితొలగించండిదాల్చినాటకమునువేయదానియందు
అందొకండుపిచ్చిగమాటలాడ ననిరి
*“భ్రమ ఘటించెను బ్రహ్మ సారాయి గొనెనొ”*