25, ఆగస్టు 2024, ఆదివారం

సమస్య - 4863

26-8-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్”

(లేదా...)

“పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

13 కామెంట్‌లు:

  1. కందం
    వరలక్ష్మీనారాయణి
    సురభి మెరయు మందిరమున శోభిల్లంగన్
    సిరులందించ వెలయ శ్రీ
    పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      మెరయు సువర్ణమందిరము మెచ్చఁగ సర్వులు భక్తినింపుచున్
      హరిసతి మూల దేవతగ నద్భుత రీతిని గొల్వుఁదీరఁగన్
      వరములనిచ్చులక్ష్మి పరిపాలన జేసెడు క్షేత్రమైన శ్రీ
      పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్

      తొలగించండి

  2. సిరిగిరిపై కోవెలలో
    హరుడే వెలసెనట మల్లి కార్జున నామాం
    తరమున నామందిర గో
    పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్.


    సిరిగిరి పైన ఖ్యాతిగల క్షేత్రమటంచును కాలకంఠుడౌ
    హరుడట మల్లికార్జునుడు నమ్మికయే భ్రమరాంబగా నటన్
    స్థిరముగ గొల్వుదీరిన ప్రతీతపు మందిరమంచు దీని గో
    పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  3. మరిమరి దర్శింతురుగద
    తిరుపతి వెంకన్న గుడిని దివ్యంబనుచున్
    సురుచిర సుందరమగు గో
    పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్

    సురుచిరమైన దేవళము చూడగ వత్తురు భక్తులెల్లరున్
    దిరుపతి వేంకటేశ్వరుని దివ్య మనోహర మంగళాకృతిన్
    మరిమరి కాంచగా మిగుల మక్కువ కల్గును దేవళంపు గో
    పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  4. అరుదగు పదవి కలదనుచు
    ఖరువును పొందుచునె యెంత ఖలమును జేయన్
    పురమున దేవాలయ గో
    పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి
  5. కరములు మోడిచి మదిలో
    హరినిఁదలచి శిరమువంచి యభివాదమ్మున్
    విరళిని సలుపుచు గుడిగో
    పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి
  6. కరములు మోడ్చి చిత్తమున కారణకారణమున్ దలంచుచున్
    స్థిరమగు భక్తి నెక్కొనగ శీర్షము వంచి నమస్కరించి శం
    కరుని కృపాకటాక్షములు కామితసిద్ధికి దేవళంపు గో
    పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  7. గిరి పై వెలసిన రుద్రుని
    తిరముగ సేవించి మిగుల దేదీ ప్య ము గా
    మెరిసె డి కోవెల దౌ గో
    పురమును గనినన్ జనులకు బుణ్యము గల్గు న్

    రిప్లయితొలగించండి
  8. స్థిరమగు చిత్తము తోడను
    నిరతమ్మా పరమశివుని నిలుపుచుమదిలో
    స్మరియించుచు చని కాశీ
    *“పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్”*


    మరచుచుమంచిచెడ్డలనుమానినితోచరియించుభక్తునిన్
    కరమనురక్తితోడనటగాంచుచుబుద్ధిని మార్చి పెద్దలన్
    నిరతముకొల్చురీతిగనునేర్పిన శ్రీహరియున్నపండరీ
    *“పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్”*



    రిప్లయితొలగించండి
  9. గిరిజా నాథుని గగనాం
    బరునిం బ్రేతగణ భూత పతినిం బరమే
    శ్వరుఁ గొల్చిన నటరా ణ్నూ
    పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్



    త్వరపడు వేంకటేశ్వరుని దర్శన మొప్పును జేయఁ బిమ్మటం
    దిరుమల ఱేనికిం బుడమిఁ దేర యొసంగెను వేంకటాద్రిలో
    గురు మహి మాన్వితుం డతఁడు గొప్ప వరాహపుఁ బేరి స్వామిఁ జూ
    పుర మునుఁ గాంచినం గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  10. వర శంకరార్య పీఠము
    వరలెను, కామాక్షి యమ్మవారును దయతో
    స్థిర శుభముల నిడు కాంచీ
    పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్

    నిరతము భక్తి మార్గమున నిశ్చలబుద్ధి సమన్వితుండునై
    హరు జప పూజనాదికము లంచిత శక్తి ఘటించుచున్ మహే
    శ్వరుని సుదర్శనార్థమయి సంతసమందుచు బోయి కాశికా
    పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  11. కం॥ పరిణితిఁ బడయుచు ధర్మము
    ధరణిని విడువకఁ బరఁగుచుఁ దన్మయమొందఁగన్
    విరిసిన భక్తిని తిరుమల
    పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్

    చం॥మరువక భక్తి శ్రద్ధలను మన్ననఁ జేయుచుఁ బాండు రంగనిన్
    ధరణినిఁ గొల్చి మ్రొక్కులిడి ధర్మముఁ దప్పక మోదమందుచున్
    నిరతము పాదదాసుఁడుగ నెమ్మినిఁ దత్పరుడౌచు పండరీ
    పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  12. లోకులు పలుతీరులుగాదె!ఒక్కరైతు
    చెరువు నిండెనంచొక్కడు,నేడ్చె పంట
    పాడగుటగాంచినొక్కడు పరితపించె
    ఒకనినేడ్పించె,మురిపించెనొకని వాన!

    By
    వేదుల గణపతి రావు

    రిప్లయితొలగించండి