15, ఆగస్టు 2024, గురువారం

సమస్య - 4853

16-8-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్”

(లేదా...)

“శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్”

31 కామెంట్‌లు:

  1. కందం
    ఆహ్వానమ్మని యసురుఁడు
    వహ్వా! యేమందమనుచుఁ భైరవిఁ జేరన్
    జిహ్వన్ జాచఁగ కసి ముఖ
    శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్

    శార్దూలవిక్రీడితము
    ఆహ్వానమ్మని భ్రాంతి తో నసురుఁడున్ హ్లాదమ్మునన్ మీరుచున్
    వహ్వా! యంచు నసహ్యమౌ నడత శర్వాణిన్ సమీపించఁగన్
    జిహ్వన్ జాచుచు నుగ్రరూపమొదవన్ జృంభించు చుబ్రమ్మనన్
    శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్

    రిప్లయితొలగించండి
  2. వహ్వా! యెంతటి చిత్రము!
    శ్ర్యాహ్వము ముకుళించిపోవు భ్రమరము చొరగన్
    విహ్వలమొనరించెడు నా
    శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్

    రిప్లయితొలగించండి
  3. జిహ్వ పురిగొల్పుచున్నను
    శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్
    వహ్వా యనిపించెడిదిది
    శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి నేను జడిసెద మిగులన్

    రిప్లయితొలగించండి
  4. వహ్వా యెంతటి వింతయో గనుగొనన్ వైచిత్ర్యముల్ సృష్టిలో
    జిహ్వన్ జాపుచు బంభరమ్ముచొరగన్ చిత్రమ్ముగా చెచ్చెరన్
    శ్ర్యాహ్వమ్మే ముకుళించి తేటినట నిర్బంధించు నిర్జించనా
    శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్

    రిప్లయితొలగించండి

  5. జిహ్వాగ్రపు రుచి కోసం
    బాహ్వానించెనని వెడల యంశుడు క్రుంగన్
    శ్రాహ్వమున జచ్చెద నని
    శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్.


    వహ్వా నాకిట కానవచ్చె గనగన్ బంకేరుహమ్మయ్యదే
    యాహ్వానించిన నేమి భాస్కరుడు సాయంకాలమున్ గ్రుంకగా
    శ్రాహ్వమ్మింకను మోడ్చుకొన్ననిక దిష్టాంతమ్మె నాకంచు నా
    శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్.

    రిప్లయితొలగించండి
  6. కం॥ ప్రాహ్వమ్మందునఁ జక్కగ
    నాహ్వానించఁగ విరిసిన యార్తవములటుల్
    వాహ్వా యని క్రోలి సొలయ
    శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్

    శా॥ ఆహ్వానంబును బల్క పువ్వు లటులాహ్లాదంబుగాఁ దోటలోఁ
    బ్రాహ్వమ్మందున నట్లు తేఁటి మధవుల్ పానమ్ము సంతుష్టితో
    వాహ్వాయంచును జేసి నేమమునఁ ద్రావంజాలకన్ డస్సియున్
    శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసమున్ బొందెడిన్

    ప్రాహ్వ పూర్వాహ్ణము సంస్కృత పదమునకు ప్రథమా విభక్తి చేర్చి ప్రాహ్వము చేసానండి
    ఆర్తవము పుష్పము
    నేమము సాయంకాలము
    అన్ని పదాలు నిఘంటువు సహాయముతో నండి.

    రిప్లయితొలగించండి
  7. జిహ్వాఘ్రాణముల వలన
    వహ్వాయని తరలినట్టి భ్రమరము తనదౌ
    విహ్వలచిత్తము వలనన్
    శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్

    శ్ర్యాహ్వమ్మున్ గని తేటి వ్రాల దలచెన్ క్షౌద్రమ్మునాశించుచున్
    జిహ్వాఘ్రాణములన్ దరించ మురిసెన్ చేతస్సు సౌముఖ్యమున్
    విహ్వాలమ్మగు చిత్తవృత్తి కలదై విభ్రాంతి వెంటాడగా
    శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్

    రిప్లయితొలగించండి
  8. కహ్వమున కనిమిషమ్ము న
    జిహ్వమునకుఁ గీటకమ్ము సెందును భీతిన్
    జిహ్వకుఁ దగులం జంపెడు
    శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్


    ఆహ్వానింపక యున్న వచ్చిన సుఘోరాగంత కత్యార్తినిన్
    రాహ్వాఖ్యుం గని చంద్రుఁ డైన గతి విద్రావుండు లూతా ముఖా
    ద్బహ్వానీతము కీట దుర్భరమునుం బ్రాణాపహారిన్ మహా
    శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్

    [శ్రీ + ఆహ్వము = విషము]
    సమస్యా పాదము లందు నఖండ యతులు గమనార్హము.

    రిప్లయితొలగించండి
  9. వహ్వా ఛంద విశారదుండ నికనీ పద్యంబు లెక్కేమి నా
    జిహ్వాగ్రంబున నాడు బల్కుచెలి నే సిద్ధంబనన్ వైళమే
    శ్ర్యాహ్వమ్మంచు పదంబు ప్రాస లిడగా జంకెన్ సమున్నద్ధుడే
    శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్

    రిప్లయితొలగించండి
  10. కం:శ్రాహ్వమునకు భ్రమరము వలె
    "వహ్వా!" యని పూరణలకు వచ్చిన కవికిన్
    "శ్ర్యాహ్వ"మను పదము తగిలెను
    శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్”

    రిప్లయితొలగించండి
  11. శా:ఆహ్వానించుచు బ్రేమ దెల్పు నొక పద్మాస్యన్ గనన్ వెంటనే
    వహ్వా! యంచు పరుంగిడన్ దగునె యా పద్మమ్ము దుష్టుండు నై
    రాహ్వంశన్ గల తండ్రికిన్ తనయ యౌరా! యంచు జింతించుచున్
    శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్
    (ఒక పద్మాక్షి ప్రేమించినా ఆమె తండ్రి రాహువు అంశలు గల దుర్మార్గు డైన తండ్రి కనుక వాడేం చేస్తాడో అనే భయం తో ఈ తుమ్మెద తొందర పడ లేదు.)

    రిప్లయితొలగించండి
  12. వహ్వా!యేమిది చిత్రము?
    శ్ర్యా హ్వ మ్మును గాంచి తేటి జడి సెన్ మిగులన్
    విహ్వ లు లై పలుక దగు నె
    యాహ్వా నించ రెవ రట్టి యల్పుల వ్యా ఖ్యల్

    రిప్లయితొలగించండి
  13. వహ్వా యనుచును గ్రోలన్
    శ్రాహ్వమ్మున దూరినట్టి సంకర క్రిమియున్
    జిహ్వకు బాధనిడగనా
    *"శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్”*

    రిప్లయితొలగించండి
  14. పద్య భారతి. 17--8--2024.
    పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.
    సూక్తి సుధ :--

    591.తే.గీ.
    ఆత్మ విశ్వాసమింత లేనట్టి నీవు
    సఫలముగ నే పనిని చేయ జాలవయ్య
    గెలిచిన గెలువ కున్నను కలదదేని
    నమ్మకము...గమ్యమువరకు నడుపగలదు.
    **************************************

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఆహ్వానంబని తలచుచు
    వహ్వా యని సంబరమున పద్మముఁ జేరన్
    విహ్వలత నొందె, ప్లాస్టికు
    శ్ర్యాహ్వమ్ముఁ గాంచి తేటి జడిసెన్ మిగులన్.

    రిప్లయితొలగించండి
  16. పద్యభారతి కి పంపవలసిన పద్యం పొరపాటున
    ఇచ్చట పేస్ట్ చేయబడినది. క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి