27, ఆగస్టు 2024, మంగళవారం

సమస్య - 4865

28-8-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దానము శాపముగ మారె దాతకు భువిలో”

(లేదా...)

“దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

18 కామెంట్‌లు:

  1. కందం
    హీనమని వామనుఁడడుగఁ
    బూనిక బలి మూడడుగుల భూమిడుదనఁగా
    నానె ద్రివిక్రమునిగఁ గొని
    దానము శాపముగ మారె దాతకు భువిలో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      హీనము భూమిమూడడగులెంచ నటంచు బలీంద్రుఁడొప్పఁగన్
      బూని త్రివిక్రముండనఁగ భూమినినింగిని రెండుపాదముల్
      తానుగ నింపి వామనుడు తాచెను మూడవదుంచి శీర్షమున్
      దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే!

      తొలగించండి
  2. సూనుని గావగ నింద్రుడు
    భానుని సుతు కర్ణుని గని వాంఛ ను దెలుపన్
    మౌనముగా కవచ మొసగ
    దానము శాపము గ మారె దాతకు భువిలో

    రిప్లయితొలగించండి

  3. ఆ నరుని తక్క నేను
    త్థానమునన్ జిక్కనేమి తక్కిన సుతులన్
    బోనడచననిన యా వా
    గ్దానము శాపముగ మారె దాతకు భువిలో



    సూనుడ నంచు వచ్చితివి శుశ్రువుగా నిది యాలకింపు ము
    త్థానము నందు ఫల్గునుని తక్క మరొక్క సుతుండు చిక్కినన్
    నేనట సంహరింపనిది నిశ్చయ మంచు నొసంగినట్టి వా
    గ్దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే.

    రిప్లయితొలగించండి
  4. మానక మద్యము త్రాగగ
    నానాటికి కుశలమునకు నష్టినొసగుటన్
    పానము జేయుటకయి ధన
    దానము శాపముగ మారె దాతకు భువిలో

    రిప్లయితొలగించండి
  5. దానమునడుగంగాబలి
    నానారాయణుడుతానునర్భకునివలెన్
    మానుగ మూడడుగులుడుగ
    *"దానము శాపముగ మారె దాతకు భువిలో”*


    దానవచక్రవర్తినటదానమువేడగవచ్చె శ్రీశుడున్
    మానవరూపుతోసభకుమానుగదండకమండలమ్ములన్
    తానటచేతులందునిచి ధాత్రిని కోరగ మూడపాదముల్
    *“దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే”*

    రిప్లయితొలగించండి
  6. కం॥ దానమునకు ధనవనరులఁ
    దాను గనిన విధము నుడువఁ దప్పదటంచున్
    మానకఁ బ్రభుత్వము తెలుప
    దానము శాపముగ మారె దాతకు భువిలో

    ఉ॥ దానము సేయు విత్తమును ధర్మముఁ దప్పక నెట్లు పొందితో
    మానకఁ దెల్పఁగా వలయు మన్నన సేసి ప్రభుత్వ యాజ్ఞలన్
    గానకఁ నీవు వర్తిలగఁ గష్టముఁ దప్పుదటంచు నందురే!
    దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే

    (నేటి సామాజిక ఆదాయ పన్నుల నిబంధనలననుసరించి యండి)

    రిప్లయితొలగించండి
  7. మానస ముప్పొంగఁ దగని
    వానికి వాంఛిత మెఱుగక పన్నుగ నొసఁగన్
    దానవున కుమా పతి వర
    దానము శాపముగ మారె దాతకు భువిలో


    మానక నిర్జరాలి కవమాన మొసంగుచు నుండి యోటమిం
    గానని వాని కక్కజముగా బవరమ్మున రోష చిత్తుఁడై
    రా నిడ మచ్చ రావణు నురమ్మున శక్రుని ప్రాగ్దిశా సదా
    దానము శాప మయ్యెఁ గద దాతకు నీ భువి లోనఁ గంటివే

    [సదాదానము= ఏనుఁగు; దాతకు = యుద్ధ దాతకు]

    రిప్లయితొలగించండి
  8. కం: మా నాన్న కేమి యుంచక
    యేనాడును దాన మొక్కటే గొప్ప యటం
    చీనాడు పేద యయ్యెను
    దానము శాపముగ మారె దాతకు భువిలో”
    (ఇక్కడ దాత కాదు.తాత సరళాదేశం తో దాత.)

    రిప్లయితొలగించండి
  9. దానము గోరి వామనుడు దైత్యవరున్ బలి యుక్కడంచెతా
    దానము గోరె దేవపతి తాపను వర్మము కుండలమ్ములన్
    దానమొసంగి యిర్వురును తద్దయు నొందిరి భంగపాటునే
    దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే

    రిప్లయితొలగించండి
  10. తానడిగెను మూడడుగులు
    దానవపతి బలిని హరియె దానమునీయన్
    దానమొసఁగి భంగపడెను
    దానము శాపముగ మారె దాతకు భువిలో

    రిప్లయితొలగించండి
  11. దానపుటర్హత గలిగిన
    వానికినేయీయవలయుఁబైకము వసుధన్
    దానముఁజేసిన యాబలి
    దానము శాపముగ మారె దాతకు భువిలో

    రిప్లయితొలగించండి
  12. దానముఁజేయగావలయుదాతలు తప్పక పేదవానికిన్
    వానికి దానమేయిడును భాగ్యము సంపద యెల్లవారికిన్
    దానముఁజేసియా బలియె ధర్మము నిల్ప,చూడగన్
    దానము శాపమయ్యెఁ గద దాతకు నీభువిలోనఁ గంటివే

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    తానిడె దానము వటునికి
    కానక నాపదను బలి, యొక యడుగు తోడన్
    తానేగెను పాతాళము
    దానము శాపముగ మారె దాతకు భువిలో.

    రిప్లయితొలగించండి