3, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4841

4-8-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్”

(లేదా...)

“మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

41 కామెంట్‌లు:

  1. కందం
    మనసుపడి జింకఁ గోరియు
    నినకులతిలకుని బనచియు నిడుమల జిక్కెన్
    గొనిపో వచ్చెడు రఘురా
    మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      మనసయ్యెన్ హరిణమ్ము గాంచననుచున్ మారామునన్ గోరి తా
      నినవంశోత్తము నంపి రావణుడు కీడెంచంగ మూలమ్మునై
      వనిలోజిక్కితి నంచు శోకమునఁ గావన్రాగ శీఘ్రమ్ము రా
      మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. అనయముపతినేదలచుచు
    తనియకమదిలోవిరహముదండిగ జేసన్
    కనియెన్రూపము వరరా
    మునికైధ్యానమునొనర్చె భూమి జ లంకన్

    రిప్లయితొలగించండి
  3. దనుజుడు లంకేశునిపై
    కినుక ననుభవించి జానకి యతని నుండిన్
    తనను విడిపించుమని రా
    మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

    రిప్లయితొలగించండి

  4. అనుకుడగు రావణుండట
    వనమున బంధించినట్టి పాళము నందున్
    పెనిమిటి యగు శ్రీ రఘు రా
    మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్.

    రిప్లయితొలగించండి
  5. ఇనవంశంబునచంద్రుజడాతడును తానిచ్చెన్కరంబామెకున్
    తనువున్నిండెగజానకీసతికియానందంబుతావెన్నెలై
    కనియెన్మానసదర్పణంబుననునాకాకుస్థవీరురా
    మునికైధ్యానమొనర్చె సీతమదివ్యామోహంబుతోలంకలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సతికి నానందంబు...కాకుత్స్థ..." అనండి.

      తొలగించండి
  6. ఘన మూర్ఖుడు రావణుడును
    జనకునిసుతసీతగొనియు చనియెన్ లంకన్
    అనిశము మదిలో రఘు రా
    మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

    రిప్లయితొలగించండి

  7. తననాశించుచు దీవిరాయడట యుద్యానమ్ములో దాచి కా
    మనుడై నీచపు మాటలన్ బలికి ధర్మద్రోహి బాధింపగా
    నను గాపాడగ వేగరమ్మనుచమానస్యమ్ముతో సేక్త రా
    ముని కై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో.

    రిప్లయితొలగించండి
  8. కం॥ తనదుస్థితికి వగచఁగను
    మనమున దుఃఖము పెరుఁగఁగ మథనపడుటయే
    తన భాగ్యమాయెనని రా
    మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

    మ॥ తన దుర్భాగ్యము నెంచ భూమిజకటుల్ తాపమ్ము హెచ్చంగ నా
    థుని శ్రీరాముని దైత్యునిన్ దునుమగన్ దుర్భాగ్యమున్ బాపగన్
    దనధర్మమ్మని వేడఁగన్ దలచి సంత్రాణమ్ము నాంశించి రా
    మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం॥ తనదుస్థితికి వగచఁగను
      మనమున దుఃఖము పెరుఁగఁగ మథనపడుటయే
      తన భాగ్యమాయెనని రా
      మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

      మ॥ తన దుర్భాగ్యము నెంచ భూమిజకటుల్ తాపమ్ము హెచ్చంగ నా
      థునిఁ బ్రార్థించఁగ దైత్యునిన్ దునుమగన్ దుర్భాగ్యమున్ బాపగన్
      దనధర్మమ్మని వేడఁగన్ దలచి సంత్రాణమ్ము నాశించు రా
      మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

      శ్రీకంది శంకరయ్య గారు సూచించిన పిదప టైపాటు పునరుక్తి సరిచేసిన పద్యము

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. ముని వేషంబున సీతను
    వనిలో రావణుడులంక వద్దకు జేర్చన్
    కనులారగాంచ రఘురా
    మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

    రిప్లయితొలగించండి
  10. క్షణమైనన్ రఘురామచంద్రుని వియోగంబా ధరాపుత్రికిన్
    యనలంబై దహియింపజేయు నెడదన్నాభీలముం గూర్చుచున్
    వనిలో మాయలఁబన్ని రావణుఁడు యావాసంబుకుం జేర్చ రా
    మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పుత్రికిన్ + అనలంబై, రావణుడు + ఆవాసంబు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  11. రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      '...యశోకవనిలో' అనండి.

      తొలగించండి
    2. తననా వింశతిబాహుడు
      వనమున బంధించి యుంచ భామిని వగచెన్
      మనసున పతిని తలచి రా
      మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

      తననా రావణుడే యశోక వనిలో దాసీల కాపుంచుచున్
      జినదానా కరుణింపుమా యనుటయే చీకాకు పుట్టించగా
      మనసే రాముని పైన లగ్నమవగా మాయావినింజంపఁ రా
      మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

      తొలగించండి
  12. కనిఁదా దెల్పెనుస్వప్నము
    సునిశిత శీలద్రిజటయెఁశోకముబాపన్,
    వినిఁదాననయముశ్రీరా
    మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  13. కం:తన కెగ్గు దలచు రావణు
    దునుమగ రాఘవు డనుజుని తో నరుదెంచన్
    గను భాగ్యము గొన పరమా
    త్మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్”

    రిప్లయితొలగించండి
  14. ముని వేషంబున జానకి
    దనతో గైకొని వెడలియు దనుజుడు బ o ధిం
    చిన విల పించుచు దన రా
    ముని కై ధ్యానము నొన ర్చె భూమిజ లంకన్

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బాణమ్మునకు' అనడం సాధువు కదా... అక్కడ "రాముని బాణాహతి దాళలేక" అందామా?

      తొలగించండి
    2. అయ్యా! పద్యం మరింత మార్చి పూరించాను.దయచేసి గమనించ వలసినది.

      తొలగించండి
  16. అనిశమ్ము భర్తృ పద చిం
    తనా విలగ్నాంతరంగ తద్దయు భీతిన్
    వనజాక్షి నిజ మనోధా
    మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్


    వనమం దుండఁగ రావ ణాపహృతయై వ్యాజమ్మునన్ దుస్స్థితిన్
    దనుజాధీశు పురమ్ములో నిలిచి సంతప్తాంతరంగమ్మునం
    గన రాకున్నఁ గలంత రామునకునై కాకుత్స్థవంశాభిరా
    మునికై ధ్యాన మొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

    రిప్లయితొలగించండి
  17. )మ:తన కెగ్గున్ దల బెట్టు రావణుని యా దౌర్జన్యముల్ బాయ రా
    ముని బాణాహతి దాళ లేక యసువుల్ పోనాడు కామాతురా
    త్మునికై ధ్యానమొనర్చె సీత మది, వ్యామోహమ్ముతో లంకలో”
    తనకున్ బంధము గూర్చు నాయసుర బాధల్ సైచుచున్ నిత్యమున్.
    (వ్యామోహమ్ము తో అనే పదం సీతకు అన్వయించటం ఇష్టం లేక సమస్యని మూడవ పాదం లో ఉంచి ఆ వ్యమోహాన్ని రావణునికి వర్తింప జేసాను.)


    రిప్లయితొలగించండి
  18. వనిలో జింకను కోరగ
    నినవంశుండేగయతిగనేతెంచి గొనన్
    అనయము తలంచుచా రా
    ముని కై ధ్యానమునొ నర్చె భూమిజ లంకన్

    గొనిపోవంగను నెంచుచున్ మదముతో క్రూరంపు చిత్తంబుతో
    తన దౌర్భాగ్యమిదంచు దుఃఖితయునై తాపమ్ము హెచ్చంగరా
    *“మునికై ధ్యానమొనర్చె సీత మదివ్యామోహమ్ముతో లంకలో”*

    రిప్లయితొలగించండి
  19. దనుజుండట్టుల భిక్షురూపధరుడై దంభంబునన్ దెచ్చి యా
    వనమందుంచి వరించి రమ్మనుచు నిర్బంధింప లక్షింపకన్
    మునివంద్యుండసురాంతకుండజితుడా మూర్ధన్యుడౌస్వామి రా
    మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

    రిప్లయితొలగించండి