13, ఆగస్టు 2024, మంగళవారం

సమస్య - 4851

14-8-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు”

(లేదా...)

“గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకున్ నేర్తు రాసక్తులై”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

18 కామెంట్‌లు:

  1. దనులచదివినతెలియును జాణతనము
    కష్ట సుఖములకలబోత కానవచ్చు
    లోకమంతయు గ్రంథంబు లవముతెలియు
    గురువుచెప్పనిచదువు లోకులకువచ్చు

    రిప్లయితొలగించండి
  2. అనుభ వమ్మున దెలియును మనుజ తతుల
    వర్త నమ్ములని యు నంద్రు ప్రాజ్ను లిలను
    బడికి వెళ్ళక పోయిన పామరులకు
    గురువు సెప్పని చదువు లో కులకు వచ్చు

    రిప్లయితొలగించండి
  3. తే॥ లౌక్య సంపదను బ్రదుకు రంజిలుఁ గద
    యనుభవమ్ము కరపువిద్య యది యెవరికి
    వారు నేర్చుకొందురిలను భవ్యముగను
    గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు

    మ॥ విరియన్ ధాత్రిని లౌక్యసంపదల ప్రావీణ్యమ్ము పెంపొందుచున్
    బరఁగన్ జీవన సంగరమ్మునను సంప్రాప్తించు జాగ్రత్తయున్
    గరిమన్ నేర్తురు లౌక్యమెల్లరును సాంకాంక్షా మహాత్మ్యమ్మునన్
    గురువుల్ సెప్పరు గాని యీచదువు లోకుల్ నేర్తు రాసక్తులై

    రిప్లయితొలగించండి
  4. కరమున్గల్గెనుచారుభూషణము తాకన్జెప్పువార్తల్వడిన్
    పరమానందముగూర్చుబంధువుల సావాసంబువాట్సాప్పులో
    జరయూట్యూబున చాలినంతచదువుల్చైతన్యమిచ్చున్గదా
    గురువుల్సెప్పరుగానియీచదువులోకుల్నేర్తురాసక్తులై

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    విద్య ముక్కుసూటిగ నాడు విధము నేర్ప
    కష్టనష్టముల్ గాంచి లోకమునఁ జెల్ల
    నెప్ప్పుడెయ్యది యొప్పునో యప్పుడాడు
    గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు!

    మత్తేభవిక్రీడితము
    వరమౌ విద్యయె ముక్కుసూటితనమున్ బాటించుటల్ నేర్పఁగన్
    దరమే కాకను లోకమందు బ్రతుకన్ దత్కాలపున్ మాటలున్
    దిరకాసుల్ దగనేర్చి లౌక్యమననుద్దేశ్యమ్ములన్ బోకడన్
    గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకుల్ నేర్తు రాసక్తులై!

    రిప్లయితొలగించండి

  6. తాను చేసిన పనులలో తప్పు దొరల
    తప్పుకొనుట కనృతముల ధాటి గాను
    పలుకు చుందురు మానవుల్ వసుధలోన
    గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు.


    ఒప్పు జరిగిన తనవల్ల తప్పు జరుగ
    పరుల వలనంచు పలుకుచు వసుధ జనులె
    యనృతముల నవలీల మాటాడుడదియె
    గురువు సెప్పని చదువు, లోకులకు వచ్చు.


    సిరులన్ బొందుటె లక్ష్యమై చెలగుచున్ జిత్రంబు గామానవుల్
    పరులన్ వంచన సేయబూని మృషలే వాచించుచున్ బొందగా
    ధరలో మెప్పును సంపదన్ కుటిలమౌ తంత్రమ్ము లెన్నింటినో
    గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకుల్ నేర్తు రాసక్తులై.

    రిప్లయితొలగించండి
  7. గురువు జ్ఞానమ్ము నొసగెడు కోవిదుండు
    సరియగు తెఱగు బోధింప సాధనమగు
    దురిత కార్యాలు బోధించు గురువు లెవరు
    గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు

    గురువుల్ చెప్పుచునుంద్రు గాదె వటువుల్ కోరేటి పాఠ్యాంశముల్
    సరియౌ రీతిని నేర్చుకొన్న చదువే సంపూర్ణ సంజ్ఞానమౌ
    పరువేదీయుచు లోకమందు చెడుగా భావించు కార్యమ్ములన్
    గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకున్ నేర్తు రాసక్తులై

    రిప్లయితొలగించండి
  8. గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు ,
    నేటి కాలమందున ననునిత్యముండు
    చేతి యందలి చిన్నదౌ సెల్లుఫోను
    విప్పి , గూగులు నందున వెదకి జూడ

    రిప్లయితొలగించండి
  9. అనుభవమ్ము జీవులకు విద్యాలయమ్ము
    స్వానుభవమును మించిన చదువులేదు
    ఝషముకెవరీద నేర్పిరి జలమునందు
    గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు

    రిప్లయితొలగించండి
  10. పుట్ట రోదించుఁ బసిబిడ్డ బోరు మంచుఁ
    గొట్ట నుంకింప నేరైన నెట్ట నేర్చు
    ముసర నీఁగలు కన్నుల మూయ నేర్చు
    గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు


    ధరలో నిత్యము స్వీయ లాభ పరులై దాక్షిణ్య హీనాత్ములై
    పర విత్తార్జన సక్త మానసులునై పాపాత్ములై ధూర్తులై
    దురవస్థార్దిత మాన వాకలన సద్యో వంచనా విద్య లే
    గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకుల్ నేర్తు రాసక్తులై

    రిప్లయితొలగించండి
  11. సరవిన్ జీవులకెల్ల స్వానుభవమే సంప్రాప్తమౌ విద్య, యే
    గురువుల్ నేర్పిరి చేఁపకీదుటను సంకోచింపకన్ నీట నం
    బరమందున్ విహరింప పక్షులకునెవ్వారల్ గురుల్ నేర్పగన్
    గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకుల్ నేర్తు రాసక్తులై

    రిప్లయితొలగించండి
  12. తే.గీ: అక్షరము లైన , మరి శిరోజక్షవరమె
    యైన,బట్టలు కుట్టుట యైన గురువు
    చెప్ప వచ్చును, తత్త్వార్థ చింత నెట్లు
    గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు?
    (ఆధ్యాత్మికానికి గురువు అవసరం లేదని కొందరంటారు కానీ పై విద్యలకే గురువు అవసరం కాగా తత్త్వానికి గురువు అక్కర లేదంటే ఎలా? అనే భావం.)

    రిప్లయితొలగించండి
  13. మ:"గురువుల్ నేర్పరె కామశాస్త్ర?" మనుచున్ ఘోషించి ప్రశ్నించు తెం
    పరియౌ మిత్రుడ!తేరి చూడుము పసుల్, ,పక్షుల్,క్రిముల్ నేర్వవే?
    ధరలో నంతట నున్న విద్య యిది బోధల్ లేక రాదందువే?
    గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకున్ నేర్తు రాసక్తులై”
    (విద్యాలయాలలో లైంగికవిద్య నేర్పాలని వాదించే ఒక ఆథునికునితో ఒక సంప్రదాయవాది అన్నట్టు.)


    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ప్రకృతియె జనులకున్ నేర్పు పాఠములను
    అనుభవమ్మున కొన్నింటి ననుసరింత్రు
    స్వయముగా నేర్చుకొనుటది సహజ గుణము
    గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు.

    రిప్లయితొలగించండి
  15. జగతియందు చూడ సతము జవముగాను
    *“గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు”*
    ప్రకృతియేనేర్పుచుండును పాఠములను
    చక్కగానాచరించుచు సాగవలెను.

    డా బల్లూరి ఉమాదేవి
    పరమోత్సాహముతోడనేడిలనునావాగ్దేవినేదల్చుచం
    తరజాలమ్మునుచూచుచున్వడివడిన్ తామిమ్ముగా జ్ఞానమున్
    నరయంగా గని సంబరమ్ము నను తామానందమున్ బొందుచున్
    *“గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకుల్ నేర్తు రాసక్తులై”*

    రిప్లయితొలగించండి