30, ఆగస్టు 2024, శుక్రవారం

సమస్య - 4868

31-8-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను”

(లేదా...)

“చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్”

18 కామెంట్‌లు:

  1. తేటగీతి
    అక్కడ మెరయ! వేదిపై నద్భతమన
    చిత్రసీమ వెల్గు కళాభినేత్రలౌచు
    నెగడ నాయికల్, కవులన నింగిఁజారి
    చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను!


    ఉత్పలమాల
    అక్కడ వెల్గునట్టి నటనాంగననెల్లరు చిత్రసీమలో
    నిక్కి కళాభినేత్రలననేర్పును జూపిన మేటి తారలై
    మక్కువనొక్క వేదిపయి మన్ననలందఁ, గవీంద్ర వాక్కులన్
    చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్!

    రిప్లయితొలగించండి
  2. నింగినిమెరయు తారలు నిక్కముగను
    నేలపై సీనిమాలలో నిగుడు చుండ్రి
    కాంచు వారికి కనువిందు కలుగనాహ!
    చుక్కలు పుడమిపై సాగె జోద్యముగను

    రిప్లయితొలగించండి
  3. తే॥ మక్కువగ మదిరను గ్రోల మత్తు విరియ
    మత్తు చేతన మంతయుఁ జిత్తుఁ జేయ
    కరములు వడఁక మద్యము సరుగున చిందఁ
    జుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను

    ఉ॥ మక్కువ మీరఁగన్ మదిర మానకఁ ద్రావుచు నుండనత్తరిన్
    జిక్కని మత్తుఁ బొందఁగను జేతన మెంతయొ తగ్గెఁ జూడఁగన్
    బక్కున నవ్వుచుండఁగను బట్టును దప్పఁగ జాలువారఁగన్
    జుక్కలు నేలరాలిపడి చోద్యముగా నడయాడె నత్తరిన్

    రిప్లయితొలగించండి
  4. చెలువపు మెరిసే బొట్టుల సీసా పగిలి
    తెరలె నేలపై నవి నలుదెసల వాటి
    గనగ దలపించు చున్నవి యాకసము నుండి
    చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను

    రిప్లయితొలగించండి

  5. కృష్ణలీలలను తెరకెక్కించు వేళ
    గొల్లభామలపాత్రలో కొమ్మలచట
    మళగు చుండగ గాంచి నిర్మాత పలికె
    చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను.


    చక్కని ప్రేమగాథను ప్రశస్తిని పొందిన దర్శకోత్తముం
    డక్కడ సుందరమ్మగు మహానగరమ్మున తీయనెంచగా
    పెక్కునటీమణుల్ వివిధ వేషములందున జేర గాంచగన్
    జుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్.

    రిప్లయితొలగించండి
  6. చుక్కలు మెఱయు నింగికి శోభగూర్చ
    చుక్కల వలె మెఱయుచున్న సుందరాంగు
    లన్గని నుడివి రెందరో రమ్యరీతి
    చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను

    చుక్కలు నింగిలో మెఱచి చూచిన వారల కింపు గూర్చుగా
    చుక్కలఁ బోలుచుంద్రుగద చూడగ భామలుచిత్ర సీమలో
    చుక్కల రాత్రిగా తనరు సుందర కార్యము గాంచి చెప్పిరే
    చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్

    రిప్లయితొలగించండి
  7. మిక్కిలి తీవ్రమౌ జ్వరము మ్రింగగ తిండి సహించబోదహో
    ఉక్కకు నిల్వ బోరు మరి యుష్ణము కొల్చెడి మీటరిచ్చినన్
    ప్రక్కకు తూలగన్ పగల బారెను పాదరసమ్ము జారగా
    చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్!!

    రిప్లయితొలగించండి
  8. చక్కనమ్మలు కదిలిరి శ్రావణమున
    పట్టుచీరల మెరమెరల్ ప్రబ్బికొనగ
    సిరులుగోరుచు శ్రీలక్ష్మి సేవజేయ
    చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను

    రిప్లయితొలగించండి
  9. చక్కని చుక్కలే భువికి సందడి సేయఁగ వచ్చినట్టులన్
    చక్కదనాల భామినులు శ్రావణమందున వస్త్రశాలలో
    పెక్కురకాల చీరలను బేరములాడగఁ దోచెనివ్విధిన్
    చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్

    రిప్లయితొలగించండి
  10. కుంద జగమెల్ల వేఁడిమి నంది మిగుల
    వేసఁగి యరుగు దెంచి కవియఁగ దెసలు
    వెక్కసమ్ముగ నక్కట నిక్కి వేఁచు
    చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను

    [వేఁచుచు + ఉక్కలు =వేఁచు చుక్కలు]


    ఎక్కటి కారు మబ్బులు రహిం దమకించి కరమ్ము నింగినిన్
    టెక్కున నేఁగుచుండఁగఁ గడింది మగంటిమిఁ గొండ చాలుపుల్
    డెక్కినఁ జాల చల్లఁబడ డెందములన్ మురిపించు మంచు పె
    న్చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పూరణ పెట్టిన తరువాత వేసవిలో ముత్యముల వలె రాలు వాన చినుకుల గురించి వ్రాయాలనిపించిందండి. మీ పూరణలు అద్భుతంగా ఉంటున్నాయి. అభినందనలు

      తొలగించండి
    2. ధన్యవాదములండి. మంచి యూహ కదండి. పద్యములు నా ముత్యములను రాల్చండి.

      తొలగించండి
  11. తే.గీ:రాక్షసాచార్యు డైన శుక్రర్షి తానె
    శాప మిడి కల్లు మానెను పాప మనుచు
    మానవులలోన నది యింక మనగ మత్తు
    చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను!

    రిప్లయితొలగించండి
  12. ఉ:ఎక్కడి తారకావళులొ!యెంతటి ప్రజ్ఞయొ శాస్త్రవేత్త? దే
    లెక్కయు తప్పకుండ ప్రబలెన్ గద యుల్కలు!చెప్పినట్లు గా
    నక్కడి రాశియౌ మిథున మందు చలించి భయమ్ము గూర్చుచున్
    చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్
    (మిథున రాశి నుంచి ఉల్కలు రాలతాయని శాస్త్రవేత్తలు లెక్కలు వేసి చెప్పారు.చెప్పినట్టే మిటియార్ షవర్ జరిగింది.అవి నెలకి తాకితే ప్రమాదం కూడా!శాస్త్రవేత్తల లెక్కల ప్రజ్ఞకి నమస్కారం.)

    రిప్లయితొలగించండి
  13. పర్వ దిన మని పల్లెల పడుచు లెల్ల
    పూజ లొన రింప వారలు మోద మలర
    శ్రావణ మున ముస్తాబు గ చక్క నగు చు
    చుక్కలు పుడమి పై సాగె చోద్య ముగను

    రిప్లయితొలగించండి
  14. చలన చిత్రపు వేడుకల్ జరుగు చుండ
    నాయికామణు లందరు నాట్యమాడ
    కనుల విందును జేయుచుఁగానిపించ
    చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను

    రిప్లయితొలగించండి
  15. అక్కజ మౌవిధమ్ము భువియంతయు నీనెపగిందిచూడగాఁ
    జక్కని తారకాంతలట సంతస మొందినమోముతోడ, రే
    చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్
    మక్కువ తోడ ప్రేక్షకులు మౌనపు ముద్రన నుండి చూచిరే

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాదు.

    పయనమై రాత్రి యందున బయలుదేరి
    క్రిందికిన్ జూడగ విమాన కిటికి నుంచి
    కానుపించెను బల్బుల కాంతులిటుల
    చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను.

    రిప్లయితొలగించండి