7, ఆగస్టు 2024, బుధవారం

సమస్య - 4845

8-8-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రక్ష సేయువాఁడు రాక్షసుండు”

(లేదా...)

“రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్”

19 కామెంట్‌లు:

  1. భీమసేనుపుత్రుడు, భీకరుడై యుండి
    కాచెతమ్మునభినికండఁజూపి
    ధర్మమెంచితాను ధర్మజుపుత్రుడై
    రక్షసేయువాడురాక్షసుండు

    రిప్లయితొలగించండి
  2. దేశ పేద ప్రజల దీనులుగాజేసి
    కలిమి పరుల నెపుడు గాచుకొరకు
    చట్టములను కూడ సవరించి వారల
    రక్ష సేయు వాడు రాక్షసుండు.

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    హరిని గొల్చు సుతుని నంతమ్ము సేయఁగన్
    కనకకశిపుఁ జేత కాకనుండెఁ
    దనయుఁ గాచ హరియె! దైత్యుని దృష్టిలో
    రక్ష సేయువాఁడు రాక్షసుండు!

    ఉత్పలమాల
    శిక్షణ నిచ్చు యొజ్జలు విశిష్టుని దండ్రి భజించుమన్నఁ దా
    రక్షకుఁడంచు శ్రీహరిని రంజిలి గొల్వ నడంచఁ బంపినన్
    వీక్షణతోడనే సుతుని విష్ణువు కావఁగ దైత్యునీక్షణన్
    రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్!

    రిప్లయితొలగించండి
  4. సెలవు దినములందు జిన్న పిల్లలు గూడి
    ఆమ్రవనము జేరి యచట గెంతు
    లాడుచుండ తోట యందలి కోతుల
    రక్ష సేయువాఁడు రాక్షసుండు

    రిప్లయితొలగించండి
  5. ఆ॥ శిష్టజనులఁ గాయు చిద్విలాసము తోడ
    సర్వదా ధరణినిఁ జల్లఁ గాను
    దైవమొకఁడె తెలుపఁ దప్పక దుష్టుల
    రక్ష సేయువాఁడు రాక్షసుండు

    ఉ॥శిక్షణ బాధ్యతల్ గురువు చేకొని తిద్దెడు రీతి శిష్యులన్
    సక్షమ రూపుఁడై భువినిఁ జల్లఁగ దైవము సజ్జనాళినిన్
    రక్షణ సేయుచుండుఁ గద రాజిల దుష్టజనాళికిన్ సదా
    రక్షణ నిచ్చు వాఁడనఁగ రాక్షుసుఁడే యగు నంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  6. ధర్మరక్షసులను దండించు వారలై
    దుర్మతులన మిగుల పేర్మి కలిగి
    చెలగు నట్టి పరమ ఖలులనీ పుడమిని
    రక్ష సేయువాఁడు రాక్షసుండు.


    అక్షయు డేగుదెంచెనని యాస్ఫుజితుండు వచించు నత్తరిన్
    భిక్షను గోరువారల యభీష్టము తీర్చెద నంచు పల్చుచున్
    రాక్షస చక్రవర్తి బలి రత్నసువందున నాశ్రితాళికిన్
    రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్. (విరించి)

    రిప్లయితొలగించండి
  7. శక్యమైన హాని సత్వరంబు తొలఁగ
    రక్ష సేయువాఁడు రక్షకుండు
    నిరతము తనవారగు రజనీకరులకు
    రక్ష సేయువాఁడు రాక్షసుండు

    శిక్షణ నిచ్చువాడనగ శిక్షకు డందురు లోకులెల్లరున్
    భక్షణ సేయువాడనగ భక్షకుడే యగునంద్రు ప్రాజ్ఞులే
    దక్షతతోడదైత్యులకు దన్నుగ నిల్చి నిశాచరాళికిన్
    రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  8. యక్ష సిద్ధ మాన వామర కిన్నర
    వ్రాతమునకు దొడ్డ బాధ లొసఁగి
    దైత్య దానవులకు నిత్య మంచితముగ
    రక్ష సేయువాఁడు రాక్షసుండు


    అక్షయ రీతి నిత్యము మహర్షి వరేణ్యుల కెల్ల వారికిన్
    శిక్ష లొసంగి ఘోరముగఁ జిత్రముగం గరుణా విహీనుఁడై
    కుక్షినిఁ గొంచు మానవులఁ గ్రూర తరమ్ముగ దుష్ట కోటికిన్
    రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె: నందవంశమునకు నమ్మిన బంటుగా
    చంద్రగుప్తునకును సాయమిడుచు
    రాజు లెవ్వ రైన రాజ్యమ్ము ముఖ్యమై
    రక్ష సేయువాఁడు రాక్షసుండు”
    (నంద వంశపరిపాలనలో ఆ మహామంత్రి పేరు రాక్షసుడు.దానిని చంద్రగుప్తుడు నిర్మూలించినా రాక్షసమంత్రి నిజాయతీ కి సంతోషించిన చాణక్యుడు అతనినే మంత్రిగా కొనసాగించమని చంద్రగుప్తుడికి చెప్పాడు.చంద్రగుప్తుడు గురువు సలహాని అంగీకరించాడు.)

    రిప్లయితొలగించండి
  10. దక్షతతోడ శిష్టులకు దన్నుగ నిల్చి నిరంతరమ్ము సం
    రక్షణ జేయువాడె జనరక్షకుఁడై దనరారు, నిర్దయన్
    వీక్షణ జేసి శిష్టులను వేదన పాలొనరించి యోగుకున్
    రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  11. ఉ:భక్షణ జేయుచున్ జనుల బాధలు పెట్టెడు వారటంచు ,సం
    రక్షణ జేయ కేశవుని రాకడ గూర్చి పురాణగాథలన్
    శిక్షణ జేయ నేర్పెదరు,"చెప్పుడు వ్యాకరణార్ధమే" యనన్
    "రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు" నంద్రు పండితుల్
    (పురాణాలు నేర్పుతున్నప్పుడు రాక్షసు లనగా పరమ క్రూరులు మొదలైనవి చెపుతారు.కానీ వ్యాకరణార్ధం మాత్రమే చెప్ప మంటే రక్షించే వాడే రాక్షసుడు అని చెపుతారు.)

    రిప్లయితొలగించండి
  12. పరుల హింస జేయు పాలసు లగు వారి
    రక్ష సేయు వాడు రాక్షసుండు
    ధర్మ బద్ధు లగుచు దైవ చింతన గల్గు
    వారి కండ యగును పరమ శివుడు

    రిప్లయితొలగించండి
  13. (3)ఉ:వీక్షణ జేయ జాతకము వేడితి పండితులన్ , బుధాళి "నిన్
    రక్షణ జేయు వా డిపుడు రాహువె" యంచు వచించ "నెట్టులౌ
    రాక్షస రక్ష?" యంచనగ ,"రాక్షసు డుండిన చోటు మంచిదై
    రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్”
    (రాహువు ని రాక్షసగ్రహం గానే లెక్కిస్తారు.కానీ అతడు ఉన్న స్థానాన్ని బట్టి గొప్ప ఫలితాలూ ఉంటాయి.)

    రిప్లయితొలగించండి
  14. మంచిచేయువాని వంచనచేయుచు
    సజ్జనుండువోలె సంచరించు
    దుష్టజనులకెపుడు నిష్టుడై చరియించి
    రక్ష సేయువాఁడు రాక్షసుండు

    రిప్లయితొలగించండి

  15. ఆర్తితోడవేడ నచ్యుతుడే ప్రజన్
    రాక్షచేయువాడు ;,:రాక్షసుండు
    శిక్ష లిడిన గాని శ్రీహరి స్మరణమ్మ
    మాన లేదు బిడ్డ మదిని యెపుడు

    రిప్లయితొలగించండి
  16. సజ్జనుండు నైన సదయను బాపుల
    రక్ష సేయువాఁడు రాక్షసుండు
    శిక్షవేయవలయు జీవిత కాలము
    బాధపడెడు విధము భయము తోడ

    రిప్లయితొలగించండి
  17. రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్
    రాక్షసులైనవారసలు రక్షణ నీయరు గాకనీయరే
    రక్షణ నీయువారిచట రాజవరేణ్యులు గాఁబ్రసిద్ధులై
    యీక్షితి యందు పాలనను నేపుగ ఁజేయగఁ బూనుకొందురే

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    దుష్ట బుద్ధితోడ దుష్టులు నల్వురు
    నొక వనితను చెఱచి యుసురు తీయ
    శిక్షలు పడకుండ చెట్టల కాపాడి
    రక్ష సేయువాడు రాక్షసుండు.

    రిప్లయితొలగించండి