2, జులై 2025, బుధవారం

సమస్య - 5171

3-7-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూతరేకులఁ దిని కడు పుల్లన యనె”

(లేదా...)

“పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే”

(అనంతచ్ఛందం సౌజన్యంతో)

22 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sitharamayya Solasa చెప్పారు...

తెలుగునాట జనుల జిహ్వ తియ్యనౌను
పూతరేకులఁ దిని : కడు పుల్లన యనె
మామిడి రసము‌ జుఱ్ఱగ మక్కువగొని ,
ఆంధ్రులకు గల సౌభాగ్య మరయగలమె

krkr చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
krkr చెప్పారు...

చేతనమ్మునఁగొత్తకోడలుఁజిత్తశుద్దిగజేసినన్
మూతిదిప్పుచునత్తగారటుమోదమన్నదిలేకనే
భీతిబెంచగనెక్కిరించుచుభేదభావపుజూపుతో
పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే
కొరుప్రోలు రాధాకృష్ణ రావు

విరించి చెప్పారు...


బాదుషాలును లడ్డూలు పాలకోవ
కాకినాజకాజాలు భక్ష్యాలు కడుపు
నిండ భుజియించి తానాగ కుండ నచటృ
పూతరేకులఁ దిని కడు పుల్లన యనె

*(కడుపు నిండిన గారెలు చేదనెడార్యోక్తి ప్రకారము)*


నీతిమాలిన వారలేగద నేతలన్నను ధాత్రిపై
కోతలెన్నియొ నోటుకోసము కోయుచుందురు నిత్యమున్
సీత గ్రోలుచు కల్లలాడెడి చేతకుండ్రిట గాంచగన్
బూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ ఆకతాయి యొకఁడు చెట్టు లటులనెక్కి
తుంటరి పనులఁ జేయుచు దూరి పైకి
కాయలఁ గొరికి చవిగొనుఁ గడకు చింత
పూత రేకులఁదిని కడు పుల్లన యనె

మత్త॥ ప్రీతిఁగాంచఁగఁ బట్టెడన్నముఁ బెట్టి నంతను పొంగరే!
భ్రాతి వీడఁగఁ బెట్టి యొప్పఁగఁ బంచ భక్ష్యము లైననున్
ద్యోతకమ్మును గాదు మోదము దోషమెంచెడి వారలున్
బూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే!

తే॥ రేకులు Petals
మత్త॥ మాములుగా (ముఖ్యంగా) గతంలో మగ పెళ్ళి వారి ఆగడాలు ఇలాగే ఉండేవండి.

M.B.G.TILAK చెప్పారు...

వెలది తీయని పలుకులు విశద పడవు
కలికి వచియింప కలుగును కలవరమ్ము
చెలియ మాటల కర్థము తెలియుటెట్లు
పూతరేకులఁ దిని కడు పుల్లన యనె

ప్రీతిపాత్రములైన కాంతలఁ బ్రేమతో పొడగాంచరే
చేతనీయము కానివేగద చెల్వలెల్లరి మాటలే
జాతి లక్షణమెంచ వారి వచస్సు కర్థము వేరులే
పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పూతరేకుల నాత్రేయపురమునుండి
భర్త తెచ్చినఁ బక్కింటి పడతికీయ
పొరుగు పచ్చకు నోర్వని పువ్వుబోడి
పూతరేకులఁ దిని కడు పుల్లన యనె

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఆతతమ్ముగ పూతరేకుల నగ్రహారమునందునన్
ప్రీతిగా గొనితెచ్చి నాథుఁడు పేర్మిఁబత్నికినీయగన్
భ్రాతిగాపొరుగింటిలోగల పంకజాక్షికి బంపినన్
పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:తాను మథు మేహమును గల్గి తాత "పెద్ద
తీపి కా"దని యెంతయు దృప్తిగ పది
పూతరేకులఁ దిని, "కడు పుల్లన" యనె
నాల్గు నేరేడు పండ్లిడ నాల్క బెట్టి.
(మథు మేహం ఉన్నాయన పూతరేకులు తింటూ తీపి తక్కువే అని సమర్ధించుకున్నాడు.షుగర్ కి వైద్యం కదా! అని నేరెడు పళ్లు పెడితే అబ్బే చాలా పుల్లగా ఉన్నాయని వంక బెట్టాడు.)

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మంచి పూరణ. అభినందనలు.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
వైరి చేతల మెచ్చెడు వారలరుదు
మగువలందున నసలుకునగుపడుదురె?
సుదతి పంచగ ప్రక్కింటి మదవతికని
పూతరేకులఁ దిని కడు పుల్లన యనె!

మత్తకోకిల
చేతలన్నవి వైరివన్నను జెల్లునే తగ మెచ్చగన్
గోతులందున జూడనట్టివి కోరిచూడఁగలేమయా!
నాతియొక్కతి పంచినంతనె నర్మిలిన్ బొరుగిళ్లకున్
పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే

(గోతి = ఆడుది, స్త్రీ)

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సతిని యే డ్పి o చ డలచిన పతి యొ కండు
కమ్మగా వండినవి గాంచి కడుపు నిండ
పూ త రేకు ల దిని కడు పుల్లనయనె
నలుక మాన్ఫ గ నోదా ర్చె నామె నతడు

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
బూతరేకులుఁ దిన్నవెంటనె పుల్లనైనవటందురే

మ.కో.

పాతకాలపు సుద్దిజెప్పెడు పాడు పెద్దలు ఛాందసుల్
కూత నేర్పియు కుక్షినింపిన కూడు నీయరు వారికే
నీతిపల్కులు నచ్చవే మరి నిష్టమెక్కడ వంటలన్
బూతరేకులుఁ దిన్నవెంటనె పుల్లనైనవటందురే

(పిజ్జా,బర్గర్ తినేవాళ్ళుకదా)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కజ్జికాయలు తినినంత కలిగెముదము
తినగ పాయసమును నోరు తీయ నయ్యె
పూతరేకులఁ దిని, కడు పుల్లన యనె”*
నత్త మామిడి పులిహోర నారగించి


చేతమెంతయొ సంతసించెనొ చెప్ప సాధ్యము కాదుగా
నేతి గారెల తోడ నోరది నిండినంతనె తీయనౌ
పూతరేకులు తిన్నవెంటనె, పుల్లనైనవ టందురే
ప్రీతి తోడను చింత తొక్కును వేగ మప్పుడె మెక్కుచున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పరుగిడుచు నెట నుండియొ వచ్చి తాను
గాంచి మామిడి కాయను బంచఁ జేరి
యంత వేవేగ కాంచక చెంత నున్న
పూతరేకులఁ దిని కడు పుల్లన యనె


ప్రీతి సుంతయు లేక యున్నను వెక్కసం బగుఁ జేష్టలే
నీతిమంతము లైన నెల్ల వినిశ్చయమ్మగ నిండుగా
మూతి దాఁకను గూరికొంచును మూరి మెక్కిన వార లీ
పూతరేకులఁ దిన్న వెంటనె పుల్ల నైన వటందురే

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

ప్రక్క యింటి వారిడె తీపి వంటకములు
రుచి చూడమనుచు; నందులోని రకము
లన్నియును నిజమునకు బాగున్న గాని
యింటి యందలి పడతియె యీర్ష్య తోడ
పూతరేకులఁ దిని కడు పుల్లన యనె.