18-7-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై”
(లేదా...)
“భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై”
మ.స్థిర దీక్షాగుణ పౌర సంతతి సముత్తేజాగ్ర సత్వంబుచే భరత క్షోణి పురోభివృద్ధిఁ గను, భాస్వత్సంస్కృతి భ్రష్టమై చెరిగెం జూడగ, మానవాసురులుగాఁ జేటుల్ కలింగించిరా దురితోన్మాదులు ధర్మ గేహమునకున్ దుష్టాఢ్య పాశ్చాత్యులే !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఏ శివరాత్రిన జనులులెశమయిన భక్తి జూపలేకుండెదరౌఆశంక వలదు నాడేదేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై
కందంనాశమొనర్చెడు వర్తనమాశించియు 'సంస్కృతి' గను నాచరణఁ గనన్లేశము నభివృద్ధి గనముదేశమ్ము వెలుంగు 'సంస్కృతి'భ్రష్టమ్మై!మత్తేభవిక్రీడితమునిరతమ్మున్ బ్రజ దుష్టవర్తనమునందేలంగ మూర్ఖత్వమైసరికాదన్నను దుష్టసంస్కృతినె భాస్వంతమ్ముగా నెంచుచున్గురితో సాగిన నాశనమ్ము నిజమై కూలున్గదే! నప్పుడాభరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై!
ఆశయె హద్దులు దాటి విదేశపు భాషయును సంస్కృతియె మోజని తామాశించిన నిక నెవ్విధి దేశమ్ము వెలుంగు , సంస్కృతిభ్రష్టమ్మైపరదేశమ్మది స్వర్గతుల్యమను విశ్వాసమ్ములో మానవుల్ స్థిరవాసంబట గోరుకుందురెపుడా దేశంబులో గావునన్ పరభాషన్ బర సంస్కృతిన్ విధిగ సంభావింపగా నెవ్విధిన్ భరతక్షోణి పురోభివృద్ధిఁ గను , భాస్వత్సంస్కృతిభ్రష్టమై.
కం॥ ఆశగఁ బాశ్చాత్య విధముదేశము నందున మనుజులు దివ్యమని చనన్ వేశము భాషయు మార్చుచుదేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మైమ॥ నెరవై దుస్తులు పొట్టివై మిగుల మన్నించంగఁ బాశ్చాత్య రీతి రసాభాసముఁ గాదటంచు జనులుద్దీపించి పాటించఁగన్భరతాద్యంతముఁ గ్రొత్త పోకడలకే పట్టాభిషేకమ్మిడన్భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమైసమస్యను మిగతా 3 పాదాలలో తెలిపిన విషయము చూసి వ్యంగ్యంగా తీసుకోవచ్చండినెరువు వ్యాపకము రసాభాసము అనౌచిత్యము (the unsuitable manifestation of a sentiment), ఉద్దీపించు విజృభించు (నిఘంటువు సహాయమండి)
ఇది కేవలము పాశ్చాత్యుల జీవన విధానంగురించేనండి. వారివద్దనుండి మనము నేర్చుకో దగిన పాఠాలు శాస్త్రవిజ్ఞానం అనంతమండి
ఆశయ సంస్కృతిని మరచిదేశౌన్నత్యముఁ దలపక స్థిరపడి జనులాక్రోశింప నశాంతిరగిలిదేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై[వెలుఁగు = జ్వలించు]స్థిరసంకల్పముతో జనుల్ నిలువగా సిద్ధించుగాలక్ష్యముల్భరతక్షోణి పురోభివృద్ధిఁ గను; భాస్వత్సంస్కృతిభ్రష్టమైనిరతానందము కోరుచున్న జనులే నిర్లక్ష్య భావాలతోదరహాసంబొనరించి చూడ కడకున్ దౌర్భాగ్యమీడేరుగా
దేశపు పౌర గణ ము లా వే శము తో సలుపు పెక్కు వికృతపు చేష్ట ల్ నాశ మొ నర్ప గ ప్రగతిని దేశ మ్ము వెలుంగు సంస్కృతి భ్రష్ట మై
కం:దేశము లన్నియు గొప్పవెదేశము తన దైన సంస్కృతిని విడి యేదోదేశము వెంటన్ బడ నే దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై?(అన్ని దేశాలూ గొప్పవే.అన్ని సంస్కృతులూ గొప్పవే.తన సంస్కృతి వదలి ఎవరినో కాపీ కొడితే భ్రష్ట మౌతుంది.)
మ:పర దాస్యమ్మును రాజకీయముగ నే భ్రష్టమ్ము గావించి సంబరముల్ జేతురె?వారి వేషముల ,తద్భాషాదులన్,సంస్కృతిన్పరమాన్నమ్ముగ గ్రోల నెవ్విధిన నీ స్వాతంత్ర్య మన్ మాటతోభరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై?(రాజకీయస్వాతంత్ర్యము,భాషాసాంస్కృతిక దాస్యము అని విమర్శించినట్లు.)
నిరతంబున్ శ్రమియించి వ్యూహముల నున్మీలించగా పాలకుల్భరతక్షోణి పురోభివృద్ధిఁ గను, భాస్వత్సంస్కృతిభ్రష్టమైవిరతమ్మొందును దేశవైభవము నిర్వీర్యంబవన్ నేతలే,నిరతిన్ దేశహితంబుఁగోరి ధృతి సందీపించగా నెమ్మియౌ
దేశమనఁగాదు మృత్తికదేశమ్మన మనుజులంచు దెలిపె సుకవి యావేశమ్ము వలన నుడుగునుదేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై
ఆశా పాశ స రోష దురాశయ మర్త్యు లొనరించు నఘముల నిత్యావేశ జనిత పాపాగ్నుల దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై అరి వీరోగ్ర చమూ సమూహ బల మేపారంగ నత్యంతమున్ వర దీప్తాయుధ కోటిచే రిపుల సంభారమ్ములం గూల్పఁగాఁ బరవీరవ్రజ నాశ కార్యమున సంప్రాప్తైక విత్తమ్మునన్ భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై [భాస్వత్ నకుఁ దత్సమము భాస్వంతుఁడు, వీరుడు; సంస్కృతి = మంచి పని; వీరులు (వైరి) చేసినట్టి మంచి పని(సంభారములు సమకూర్చుకొనుట) భ్రష్టము కాఁగ]
నిరతమ్మున్న్ గురువున్ ,హరిన్ ,శృతుల వాణీనాథ లేఖావిధిన్,ధరలేవంచు వచించు నాస్తికుడు క్రోధావేశముంబల్కె నీ"సురపూజల్ హవనంబులెల్ల విడుమా!శోధింపగా లోకమున్భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై"
మ.
రిప్లయితొలగించండిస్థిర దీక్షాగుణ పౌర సంతతి సముత్తేజాగ్ర సత్వంబుచే
భరత క్షోణి పురోభివృద్ధిఁ గను, భాస్వత్సంస్కృతి భ్రష్టమై
చెరిగెం జూడగ, మానవాసురులుగాఁ జేటుల్ కలింగించిరా
దురితోన్మాదులు ధర్మ గేహమునకున్ దుష్టాఢ్య పాశ్చాత్యులే !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఏ శివరాత్రిన జనులు
రిప్లయితొలగించండిలెశమయిన భక్తి జూపలేకుండెదరౌ
ఆశంక వలదు నాడే
దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై
కందం
రిప్లయితొలగించండినాశమొనర్చెడు వర్తన
మాశించియు 'సంస్కృతి' గను నాచరణఁ గనన్
లేశము నభివృద్ధి గనము
దేశమ్ము వెలుంగు 'సంస్కృతి'భ్రష్టమ్మై!
మత్తేభవిక్రీడితము
నిరతమ్మున్ బ్రజ దుష్టవర్తనమునందేలంగ మూర్ఖత్వమై
సరికాదన్నను దుష్టసంస్కృతినె భాస్వంతమ్ముగా నెంచుచున్
గురితో సాగిన నాశనమ్ము నిజమై కూలున్గదే! నప్పుడా
భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై!
రిప్లయితొలగించండిఆశయె హద్దులు దాటి వి
దేశపు భాషయును సంస్కృతియె మోజని తా
మాశించిన నిక నెవ్విధి
దేశమ్ము వెలుంగు , సంస్కృతిభ్రష్టమ్మై
పరదేశమ్మది స్వర్గతుల్యమను విశ్వాసమ్ములో మానవుల్
స్థిరవాసంబట గోరుకుందురెపుడా దేశంబులో గావునన్
పరభాషన్ బర సంస్కృతిన్ విధిగ సంభావింపగా నెవ్విధిన్
భరతక్షోణి పురోభివృద్ధిఁ గను , భాస్వత్సంస్కృతిభ్రష్టమై.
కం॥ ఆశగఁ బాశ్చాత్య విధము
రిప్లయితొలగించండిదేశము నందున మనుజులు దివ్యమని చనన్
వేశము భాషయు మార్చుచు
దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై
మ॥ నెరవై దుస్తులు పొట్టివై మిగుల మన్నించంగఁ బాశ్చాత్య రీ
తి రసాభాసముఁ గాదటంచు జనులుద్దీపించి పాటించఁగన్
భరతాద్యంతముఁ గ్రొత్త పోకడలకే పట్టాభిషేకమ్మిడన్
భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై
సమస్యను మిగతా 3 పాదాలలో తెలిపిన విషయము చూసి వ్యంగ్యంగా తీసుకోవచ్చండి
నెరువు వ్యాపకము రసాభాసము అనౌచిత్యము (the unsuitable manifestation of a sentiment), ఉద్దీపించు విజృభించు (నిఘంటువు సహాయమండి)
ఇది కేవలము పాశ్చాత్యుల జీవన విధానంగురించేనండి. వారివద్దనుండి మనము నేర్చుకో దగిన పాఠాలు శాస్త్రవిజ్ఞానం అనంతమండి
తొలగించండిఆశయ సంస్కృతిని మరచి
రిప్లయితొలగించండిదేశౌన్నత్యముఁ దలపక స్థిరపడి జనులా
క్రోశింప నశాంతిరగిలి
దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై
[వెలుఁగు = జ్వలించు]
స్థిరసంకల్పముతో జనుల్ నిలువగా సిద్ధించుగాలక్ష్యముల్
భరతక్షోణి పురోభివృద్ధిఁ గను; భాస్వత్సంస్కృతిభ్రష్టమై
నిరతానందము కోరుచున్న జనులే నిర్లక్ష్య భావాలతో
దరహాసంబొనరించి చూడ కడకున్ దౌర్భాగ్యమీడేరుగా
దేశపు పౌర గణ
రిప్లయితొలగించండిము లా
వే శము తో సలుపు పెక్కు వికృతపు చేష్ట ల్
నాశ మొ నర్ప గ ప్రగతిని
దేశ మ్ము వెలుంగు సంస్కృతి భ్రష్ట మై
కం:దేశము లన్నియు గొప్పవె
రిప్లయితొలగించండిదేశము తన దైన సంస్కృతిని విడి యేదో
దేశము వెంటన్ బడ నే
దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై?
(అన్ని దేశాలూ గొప్పవే.అన్ని సంస్కృతులూ గొప్పవే.తన సంస్కృతి వదలి ఎవరినో కాపీ కొడితే భ్రష్ట మౌతుంది.)
మ:పర దాస్యమ్మును రాజకీయముగ నే భ్రష్టమ్ము గావించి సం
రిప్లయితొలగించండిబరముల్ జేతురె?వారి వేషముల ,తద్భాషాదులన్,సంస్కృతిన్
పరమాన్నమ్ముగ గ్రోల నెవ్విధిన నీ స్వాతంత్ర్య మన్ మాటతో
భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై?
(రాజకీయస్వాతంత్ర్యము,భాషాసాంస్కృతిక దాస్యము అని విమర్శించినట్లు.)
నిరతంబున్ శ్రమియించి వ్యూహముల నున్మీలించగా పాలకుల్
రిప్లయితొలగించండిభరతక్షోణి పురోభివృద్ధిఁ గను, భాస్వత్సంస్కృతిభ్రష్టమై
విరతమ్మొందును దేశవైభవము నిర్వీర్యంబవన్ నేతలే,
నిరతిన్ దేశహితంబుఁగోరి ధృతి సందీపించగా నెమ్మియౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదేశమనఁగాదు మృత్తిక
రిప్లయితొలగించండిదేశమ్మన మనుజులంచు దెలిపె సుకవి యా
వేశమ్ము వలన నుడుగును
దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై
ఆశా పాశ స రోష దు
రిప్లయితొలగించండిరాశయ మర్త్యు లొనరించు నఘముల నిత్యా
వేశ జనిత పాపాగ్నుల
దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై
అరి వీరోగ్ర చమూ సమూహ బల మేపారంగ నత్యంతమున్
వర దీప్తాయుధ కోటిచే రిపుల సంభారమ్ములం గూల్పఁగాఁ
బరవీరవ్రజ నాశ కార్యమున సంప్రాప్తైక విత్తమ్మునన్
భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై
[భాస్వత్ నకుఁ దత్సమము భాస్వంతుఁడు, వీరుడు; సంస్కృతి = మంచి పని; వీరులు (వైరి) చేసినట్టి మంచి పని(సంభారములు సమకూర్చుకొనుట) భ్రష్టము కాఁగ]
నిరతమ్మున్న్ గురువున్ ,హరిన్ ,శృతుల వాణీనాథ లేఖావిధిన్,
రిప్లయితొలగించండిధరలేవంచు వచించు నాస్తికుడు క్రోధావేశముంబల్కె నీ
"సురపూజల్ హవనంబులెల్ల విడుమా!శోధింపగా లోకమున్
భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై"