బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు నిరుపమాన ప్రజ్ఞావంతులండి. శతావధానము రక్తికట్టడానికి ఉ॥ చం॥ మ॥ శా॥ కాక గురువులు లఘువులు గుంపులు గుంపులుగా వచ్చే శిఖరిణి మందాక్రాంత, అంతేకాకుండా మానిని స్రగ్ధర మహాస్రగ్ధర, అశ్వధాటి లాంటివి ఛందో నిర్దేశము చేసి అడగాలని నా ఆకాంక్ష. అప్పుడు వారి ప్రతిభ మరింత లోక విదితము కాగలదు. శుభమస్తు
ఉ.
రిప్లయితొలగించండిసార కవిత్వ వాక్ప్రభవ సౌరభ సంభృత పద్య సూనముల్
కోరి యుపాస్తులన్ సలుపఁ గూర్చిరి, చక్కగ మోదమొందుచుం
దీరుగ బిందు మాధవు మదిం బులకించుచు హృద్య భక్తిమై
చేరిరి కాశికిం గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపగన్ !
తేటగీతి
రిప్లయితొలగించండి' కాశి' యనగ శ్రమమనెడు ఖచ్చితంపు
అర్థమెరిగి సిరిని బొంద హరిహృదయమె
లక్ష్మి కావాసమంచెంచి రయముమీర
గాశిఁ జేరిరి కవులు శ్రీకాంతుఁ బొగడ
ఉత్పలమాల
కూరును సంపదల్ సిరుల కూరిమినిచ్చెడు లక్ష్మిఁగొల్చినన్
భారము దీర్చి వైభవము పంచెడుమాతగనెంచి వాసమై
శౌరి హృదాబ్జమందునను సందడి జేయుచునంచు నమ్మికన్
చేరిరి కాశికిన్ గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపఁగన్
తీరని యాశయంబులను దీర్చ
రిప్లయితొలగించండికొనంగను శైవభక్తులున్
దారుణమైన కష్టముల దాటుచు
పట్టిన పట్టు వీడకన్
చేరిరి కాశికిన్ గవులు , శ్రీపతీయైన
హరిన్ స్తుతింపగన్
జేరిరి కొందరన్ గవులు శ్రీరఘు
రాము నయోద్యపట్నమున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివిశ్వనాథుని దర్శించువేడ్కతోడ
కాశి చేరిరి కవులు, శ్రీకాంతు బొగడ
మనుచు పృచ్ఛకాళియు ప్రశ్నలడుగ మదిని
దలచుచవధానినచ్చోట తమిని బూని.
తీరుగ మాటలాడుకొని తేకువ తోడను సాగుచెల్లరున్
బారులు తీరుచున్ చనుచు పావన మైన పురమ్ములోపలన్
కోరుచుబిందుమాధవుని కూరిమితోగననెంచుచున్వడిన్
చేరిరి కాశికిన్ కవులు శ్రీపతి యైన హరిన్ స్తుతింపగన్
మాన నీయమైన శతావధాన సభను
రిప్లయితొలగించండిపాలు గొననెంచి రయమున బయలుదేరి
నిక్కముగ నాదికేశవుని పొడగాంచ
కాశిఁ జేరిరి కవులు శ్రీకాంతుఁ బొగడ
దూరమటంచు నెంచరుగ దోహలురెన్నడు కార్యశీలురై
వారు శతావధానమున పాల్గొని వేదికపై విరాజిలన్
గోరుచు నాదికేశవుని కొల్వదలంచుచు మిక్కుటంబుగా
చేరిరి కాశికిన్ గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపఁగన్
దాపున కలదనుచు నెంచి , తాము నమ్ము
రిప్లయితొలగించండిహరిహరులు వేరుకాదను నాశయమున
కాశిఁ జేరిరి కవులు , శ్రీకాంతుఁ బొగడ
దలచి , తరచి జుడగ నిందు దప్పు లేదు
కవుల సమ్మేళనమ్మునఁ గాశియందు
రిప్లయితొలగించండిపద్యములనల్లి తమతమ ప్రతిభఁజూప
రండనంగ నిర్వాహకుల్ రయముగాను
కాశిఁ జేరిరి కవులు శ్రీకాంతుఁ బొగడ
చేరగ రండు సత్కవులు శ్రీహరి లీలలు సంస్మరించగన్
రిప్లయితొలగించండివారణసీ పురంబున సభాస్థలియందని పిల్వనంపగా
దూరము భారమంచనక దూకొనగా కవిగోష్ఠి చెచ్చెరన్
చేరిరి కాశికిన్ గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపఁగన్
తే॥అట శతావధాన సమరమందు ప్రజ్ఞ
రిప్లయితొలగించండివెలుఁగు పగిదిఁ బ్రశ్నలడుగు విధము నరసి
కాశిఁ జేరిరి కవులు, శ్రీకాంతుఁ బొగడ
హరి కృపఁగనునని నుతించి శిరము వంచి
ఉ॥ పూరణఁ జేయు ప్రజ్ఞకటు భూరి పరీక్షను వెట్టఁ దల్చుచున్
గోరి శతావధానమునఁ గూరిమి వీడక వద్దిపర్తికిన్
జేరిరి కాశికిన్ గవులు, శ్రీపతి యైన హరిన్ స్తుతింపఁగన్
దీరును గూర్చ ప్రశ్నలను దీటుగ యుక్తిగ నంచు నెంచుచున్
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు నిరుపమాన ప్రజ్ఞావంతులండి. శతావధానము రక్తికట్టడానికి ఉ॥ చం॥ మ॥ శా॥ కాక గురువులు లఘువులు గుంపులు గుంపులుగా వచ్చే శిఖరిణి మందాక్రాంత, అంతేకాకుండా మానిని స్రగ్ధర మహాస్రగ్ధర, అశ్వధాటి లాంటివి ఛందో నిర్దేశము చేసి అడగాలని నా ఆకాంక్ష. అప్పుడు వారి ప్రతిభ మరింత లోక విదితము కాగలదు. శుభమస్తు
సమస్య:
రిప్లయితొలగించండిచేరిరి కాశికిన్ గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపఁగన్”
ఉ .మా :
మారెను కాలమే మనకు మార్గము లెన్నియొ కాశి చేరగా
కోరితి కొల్వనీశునిక కూరిమి రమ్మన శంకరార్యుడే
తీరెను శంక యీశు హరి తీరుగ నొక్కరె యంచు జ్ఞానులై
చేరిరి కాశికిన్ గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపఁగన్”
కాలకంఠుని సేవించి కరము భక్తి
రిప్లయితొలగించండినన్నపూర్ణ సమేతుని మిన్నగాను
బ్రీతి శ్రీరంగ నగరమ్ము, వేగ వీడి
కాశిఁ, జేరిరి కవులు శ్రీకాంతుఁ బొగడ
ఆరయ నిక్కమున్ హరి హరాంతర మించుక యేని లే దనన్
ద్వారక యైన గంగ తటి పట్టణ మైనను భేద మే లనం
దోరము తట్టఁ జిత్తములఁ, దూర్ణము శ్రీగళ దర్శనార్థమై
చేరిరి కాశికిన్గవులు, శ్రీపతి యైన హరిన్ స్తుతింపఁగన్
విశ్వ నాథుని సేవించి వేడు కలర
రిప్లయితొలగించండిజరిగె డి శతా వ ధానాన సంత సమున
పాలు పంచు కో దలచియు పండి తాళి
కాశి చేరిరి న్ కవులు శ్రీ కాంతు పొగడ
బాలరాముని కోవెలన్ పండితులట
రిప్లయితొలగించండికాంచ దలచి నయోధ్యకు కదిలి నపుడు
పిన్నలును పెద్దలును చెంత నున్న దనుచు
కాశిఁ జేరిరి కవులు, శ్రీకాంతుఁ బొగడ.
దూరము కాక తప్పవట దుఃఖము లెల్లను పోయి సంపదలే
చేరునటంచు పెద్దలన శ్రీ రఘురాముని గాంచ నయోధ్య పిమ్మటన్
పేరిమితోడ గుబ్బెతలు పిన్నలు గొరగ దాపునంచనన్
చేరిరి కాశికిన్,, గవులు శ్రీపతి పైన హరిని స్తుతింపగన్.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
శివుని దర్శించి పూజలు చేయనెంచి
కాశిఁ జేరిరి కవులు; శ్రీకాంతుఁ బొగడ
మనుచు నవధాని నడిగిరి యచట జరుగు
చున్న యవధాన మందు పాల్గొన్న కవులు.