రాముని ధర్మపాలనము రాముని సద్గుణసంపదల్ మదిన్ నీమముగా నొనర్చుకొని నీతిని వీడకనెన్నడున్ ప్రజా క్షేమము జూచు నాయకుడు సేయగ పాలనమీ జగంబునన్ రాముని పాలనంబు గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ
రాముని రాజ్యమందున సురక్షణ కల్గెను సర్వ జాతికిన్ రాముడు రాజ్య మేలె నను రాగ ముతో జనులెల్ల మెచ్చగన్ రామడు శాంతి సౌఖ్యమును రాజిల జేసెను, స్వల్పక్షామ మా రాముని పాలనంబు గనరాని ప్రదేశమె రామ రాజ్యమౌ.
కందం
రిప్లయితొలగించండిరాముడు ధర్మము గాచుచుఁ
బ్రాముఖ్యమ్ము గొనె నేక పత్నీవ్రతుఁడై
కాముకులనఁ బోలెడు సు
త్రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ గనుమా!
ఉత్పలమాల
రామునిదొక్కమాటతగు! రాల్చును శత్రులనొక్క బాణమే!
స్వామికి భామయొక్కతిగ! భాసిలె కీర్తిని ధర్మమూర్తిగన్
కాముక రావణున్ దునిమె, కాంచగ కొల్వున వేశ్యలుండు సు
త్రాముని పాలనంబు గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ!
ఉ.
రిప్లయితొలగించండిశ్రీ మదఖర్వ ధర్మ గుణ శిల్పిత మంజుల వైభవాభలన్
ద్యో మహిమన్ మహిం దనరఁ దోషము నింపుచు సజ్జనాళితో
ప్రేమపు ధామమై పొలుపుఁ బెంపుగఁ జేసెడి లంకిణీ పురా
రాముని పాలనంబుఁ గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ !
రిప్లయితొలగించండిభూమిని ధర్మము నిలిపెడి
యా మహనీయుని వనమున కంపితివట హే
భామరొ యయోధ్య నేడది
రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ, గనుమా.
భూమిని ధర్మమున్ నిలుప భూజని పుట్టె మహీతలమ్మునన్
కోమలివీవు కోరగనె కూరిమితోడను కానకేగెనా
క్షేమకరుండు మాతరొ విచిత్రము గాంచవె నేడయోధ్యయే
రాముని పాలనంబు గనరాని ప్రదేశమె, రామరాజ్యమౌ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమనుకొంటివి వినుమిక
రిప్లయితొలగించండిభూమిని గంజ దరి దులసి పుట్టిన రీతిన్
ఈ మహినందునగల యే
రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ గనుమా
రాముడు కానలకేగగ
రిప్లయితొలగించండిరాముని పాదుకల తోడ రాజ్యమునేలెన్
రాముని తమ్ముడు భరతుడు
రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ గనుమా
రాముని పాలనంబు కడు రమ్యమటంచు వచింతురెల్లరున్
సేమము కూడునెల్లరకుఁ జీవనమే సుఖ శాంతు లీనగా
రామపదాబ్జ రేణువులు గ్రక్కున భూమిని తాకినంతటన్
రాముని పాలనంబు గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ
రాముని యాదర్శముగా
రిప్లయితొలగించండిక్షేమముఁ గూర్చుచు ప్రజలకు సేవలు చేయన్
నీమముగొను నేతయతఁడు
రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ గనుమా
రాముని ధర్మపాలనము రాముని సద్గుణసంపదల్ మదిన్
రిప్లయితొలగించండినీమముగా నొనర్చుకొని నీతిని వీడకనెన్నడున్ ప్రజా
క్షేమము జూచు నాయకుడు సేయగ పాలనమీ జగంబునన్
రాముని పాలనంబు గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ
రాముని రాజ్యమందున సురక్షణ
రిప్లయితొలగించండికల్గెను సర్వ జాతికిన్
రాముడు రాజ్య మేలె నను రాగ
ముతో జనులెల్ల మెచ్చగన్
రామడు శాంతి సౌఖ్యమును
రాజిల జేసెను, స్వల్పక్షామ మా
రాముని పాలనంబు గనరాని
ప్రదేశమె రామ రాజ్యమౌ.
నీమము గా పాలించుచు
రిప్లయితొలగించండిసేమము లారసి ప్రజలకు చింతలు బాపన్
కామితములు నెర వేరగ
రాముడు లేనట్టి రామ రాజ్యము గనుమా!