6, ఆగస్టు 2025, బుధవారం

సమస్య - 5205

7-8-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బారుకుఁ బరుగెత్తిరంట పండితవర్యుల్”

(లేదా...)

“బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్”

(దండిభొట్ల దత్తాత్రేయ శర్మ గారికి ధన్యవాదాలతో...)

16 కామెంట్‌లు:

  1. వారొనరించిన సేవకు 
    గౌరవ సూచికగ బిలచి ,  కవులందరికిన్ 
    ఆరగింపునందు నిడు సాం
    బారుకుఁ బరుగెత్తిరంట పండితవర్యుల్

    రిప్లయితొలగించండి
  2. ఉ.
    చారు లసత్కవిత్వ గుణ సౌరభ శోభిత పద్య సూనముల్
    చేరి వధానముం సొరిది చేతములంటుచు రాజిలంగ నా
    పేరగు వేది వెన్క తగు వేడికి కాగుచు మీఱి చిందు సాం
    బారుకుఁ బర్వులెట్టిరట పండితవర్యులు పారవశ్యతన్ !

    రిప్లయితొలగించండి
  3. బారులు తీరిరి సుకవులు
    తీరుగ సాహిత్యసభకు ధిషణను జూపన్
    చేరగ సమయమునకు ద
    ర్బారుకుఁ బరుగెత్తిరంట పండితవర్యుల్

    రిప్లయితొలగించండి

  4. కోరగ సుగంధ ద్రవ్యము
    లారాటముతో కదిలిరి యవియే కనగా
    నేరాళము దొరికెడి మల
    బారుకుఁ బరుగెత్తిరంట పండితవర్యుల్.


    ధారుణి నేలెడర్థపతి దండి బుధానుడతండు కాన స
    త్సారుల గారవించి తగు సత్కృతి సేయునటంచు తెల్ప నూ
    పారము పైన యాశగల వారలు కావున వేగమందు ద
    ర్బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్.

    రిప్లయితొలగించండి
  5. బారులు తీరి సత్కవులు పండిత గోష్ఠికి హ్వానమంపగన్
    జేరిరి రాజమందిరము చెన్నుగ పద్యము లాలపించ, ద
    ర్బారున కావ్యగానమున ప్రజ్ఞను జూపి విరామమందు సాం
    బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    భారతి కరుణారసమున్
    బేరిచి సాహిత్యసుధను వేడ్కగ పంచన్
    భూరిగ రారారమ్మన
    బారుకుఁ బరుగెత్తిరంట పండితవర్యుల్


    ఉత్పలమాల
    భారతి సత్కృపారసము చక్కగ నందియు సాహితీ సుధన్
    బేరిమి మీర భక్తిని నివేదన జేసి తరింప నేర్వఁగన్
    భూరిగ బిల్చి కోవిద సమూహముతో కవి సంగమంబనన్
    బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్

    రిప్లయితొలగించండి
  7. చేరగ వచ్చెడి కవులకు
    భూరి సుదాయములనిచ్చు భూభృత్తనుచున్
    బారులుగా రాయలు ద
    ర్బారుకుఁ బరుగెత్తిరంట పండితవర్యుల్

    తీరిన కొల్వుకూటమునఁ దీపిలు దృంభువు కృష్ణరాయలే
    చేరగవచ్చుపండితుల చింతలనెల్ల హరించు చుండగా
    భూరి యుపగ్రహమ్ములను పొందగ వచ్చని యెంచి రాజద
    ర్బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్

    రిప్లయితొలగించండి
  8. కం:జోరుగ సాగె వధానము
    నోరూరు సమస్య లిచ్చి నూర్వురు పూర్ణా,
    లూరు మిరప,పప్పుకు,సాం
    బారుకుఁ బరుగెత్తిరంట పండితవర్యుల్”
    (శతావధానాలలో భోజనాలు పెళ్లి భోజనాల కంటే రుచిగా ఉంటాయి లెండి.నేను ప్రాశ్నికుడిగా వెళ్లేది అందుకే.)

    రిప్లయితొలగించండి
  9. సమస్య:
    “బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్”

    ఉ.మా :

    సారపు వేడి సాదము, రసంబును గోరిరి వడ్డనన్ భళా !
    తీరున పండితాళియును తిండికి దండిగ వేచి చూచిరే
    పేరును గాంచు వంటకము, పేరిమి మెచ్చుచు ద్రావిడంపు సాం
    “బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్”

    రిప్లయితొలగించండి
  10. ఉ:ఊరిన జూములో జరుగుచున్న వధానము లెన్నొ యుండగా
    "మా రుచి మా" దటంచు మరుమాముల సోదరు లెచ్చు చేయగా
    పేరు గలట్టి వారిదని పెన్నిథి యీ యవధాన మంచు మ
    ల్బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్”
    (ఊళ్లో హాయిగా ఇంట్లో కూర్చొని జూం లో అవధానాలు వినచ్చు,పాల్గొనచ్చు కానీ వారి ఆరాటం వారిది.మరుమాముల సోదరులు శృంగేరి లో,కాశీ లో అవధానలు పెడితే పోయినట్టు ఈ సారి మలబారు లో అవధానం పెడితే అక్కడికి కూడా ఎగేసుకుంటూ పోయారుట.సరదాకి. మరుమాముల సోదరులు మన్నించాలి.)

    రిప్లయితొలగించండి
  11. కం॥ మారక మద్యముఁ గ్రోలెడి
    వారల రుగ్మత నడవడి పరిశీలనతోఁ
    దీరుగ వ్రాయఁగఁ దలఁచుచు
    బారుకుఁ బరుగెత్తిరంట పండిత వర్యుల్

    ఉ॥ మారక మద్యపానమును మక్కువ మీరఁగఁ జేయు వారి యా
    తీరును శోధనా విధినిఁ దెల్లమొనర్చఁగఁ బారితోషికా
    ధారణనొంద వీలనుచుఁ దత్పరులై బహుమాన కాంక్షతో
    బారుకుఁ బర్వులెట్టిరట పండితవర్యులు పారవశ్యతన్

    (త్రాగుబోతుల మనోస్థితి పై కవిత్వం వ్రాయడానికండి)

    రిప్లయితొలగించండి
  12. భూరి గ ధన రాసు లొసగి
    పేరిమి సన్మానములను బ్రీతి నొనర్చు న్
    ధీరుడు రాయ లటంచు ద
    ర్బా రు రు కు పరుగెత్తి రంట పండిత వర్యుల్

    రిప్లయితొలగించండి
  13. రారాజు శాసనమ్మున
    ధారాళమ్ముగఁ గవులకు ధాన్యము నచ్చో
    నూరక యిత్తు రనఁగ నం
    బారుకుఁ బరుగెత్తి రంట పండితవర్యుల్

    [అంబారు = ధాన్య రాశి]


    తేర కవిత్వ మెన్నఁడును దేరఁగఁ గాసుల పైన నాసలే
    వీరలు చెప్ప నొల్లరు వివేక విహీనులు పౌర వర్యులే
    వారక తిట్ట నిప్పగిది పట్టెను వీరికి నెల్ల డబ్బు జ
    బ్బారుకుఁ బర్వులెట్టి రఁట పండితవర్యులు పారవశ్యతన్

    [ఆరు = నింద; పారవశ్యత = ఇక్కడ ధన పారవశ్యత]

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    “బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్”

    ఉ.మా :

    పోరును సల్పి రాజసపు పోడిమి చూపెడు కృష్ణరాయలే
    మీరిన సాహితీ పటిమ మేటిగ జేర్చెను పండితాళినే
    తీరగు భాష తెల్గు నది తేనియ భాషని చాటి చెప్ప యా
    ధీరతనష్టదిగ్గజపు దీటగు కొల్వుకు రండు రండనా
    బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్”

    (బారు = వరుస, సమూహము, పంక్తి, శ్రేణి)

    రిప్లయితొలగించండి
  15. చారుతరంపు కైతలకు చక్కని గౌరవ మందజేయుచున్
    తీరుగ ప్రోత్సహించగను ధీరులు, శ్రోతలు మెచ్చగా చమ
    త్కారపు పద్యరత్నముల తద్దయు ప్రీతిని యెంచినట్టి ద
    ర్బారుకుఁ బర్వులెట్టిరఁట పండితవర్యులు పారవశ్యతన్

    రిప్లయితొలగించండి