9, ఆగస్టు 2025, శనివారం

సమస్య - 5208

10-8-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శంకరునిఁ ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్”

(లేదా...)

“శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్”

17 కామెంట్‌లు:

  1. కందం
    కింకరులెల్లరు వేడగ
    సంకటముల్ బాప నరకుఁ జక్రి వధించెన్
    శంక వలదయ! జగన్నా
    శంకరునిఁ ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్

    ఉత్పలమాల
    కింకరులెల్లరున్ గొలిచి కృష్ణునివేడగ సత్యఁగూడుచున్
    బంకజనేత్రుఁడే నరకు భంజన చేసెను చక్రధారిగన్
    సంకటముల్ నశింప, మనసా వచసా సుఖమొంద లోక నా
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పునరుక్తి దోషము నివారించి సవరించిన వృత్తము:

      ఉత్పలమాల
      కింకరులెల్లరున్ గొలిచి కృష్ణునివేడగ సత్యఁగూడుచున్
      బంకజనేత్రుఁడే నరకు భంజన చేసెను చక్రధారిగన్
      సంకటముల్ నశింప, మనసా వచసా శుభమొంద లోక నా
      శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్

      తొలగించండి
  2. ఉ.
    పంకజధారులై గుడిని భక్తిని తేలుచు భక్త పుంగవుల్
    జంకక పార్వతీపతిని చక్కగ కొల్తురు సచ్ఛుభాళికై
    వంకర చేష్టలన్ దనుజ వంశజ వీడుము నిన్ను బోలు క్లే
    శంకరు గోరరెవ్వరును శాంతిని బొంది సుఖింపనెంచినన్ !

    రిప్లయితొలగించండి
  3. శంకగొననేల నిత్యము
    పొంకపు రీతిగ సమస్య పూరణ జేయన్
    వంకలు పెట్టుచు నుండెడి
    శంకరునిఁ ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్

    రిప్లయితొలగించండి

  4. *(సుయోధనునకు భీష్ముని హితవచనములుగా)*

    అంకంబేల సుయోధన
    వంకరబుద్ధి గల యొగుల వారల మైత్రిన్
    శంకించుట మేలగు నా
    శంకరునిఁ ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్.


    శంకయె లేదు సత్యమిది సంధిని గూర్చు నెపమ్ముతో గదా
    పంకజనాభుడే యిటకు వచ్చుచు నుండె సుయోధనా యిటన్
    వంకర బుద్ధిగల్గిన వివర్ణుల వీడుము సంధియన్న నా
    శంకరుఁ గోర రెవ్వరును, శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్.

    రిప్లయితొలగించండి
  5. శంకింపక పయనంబై
    శంకరునిపయి గుఱివెట్టి శరములు విడగా
    కింకరుడయ్యెను బూడిద
    శంకరునిఁ ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్

    పంకజజన్ముడే తెలుప వారిదవాహనుడంప వేగమున్
    జంకక పూలబాణములు శంభునిపై గుఱివెట్టి వేయగా
    కింకరుడయ్యె పార్పరము కింకరపాటున శూలి చూడగా!
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్

    రిప్లయితొలగించండి
  6. శంకలతోడ మానసము శాంతినిఁ గోల్పడి దుస్సహంబునౌ
    పంకమునందు గూరుకొని వ్యాకులమొందెను కస్తి బాపగన్
    సంకటహారియై యరయు శంకరుఁ గోరెదరెల్ల సర్వ నా
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్

    రిప్లయితొలగించండి
  7. సంకట మేలరా? నరుడ సభ్యస మాజము సాగుచుండ వే
    వంకలు జూపువానిఁబెనుభారము మోపుచు రచ్చజేసిఁదా
    శంకలు గల్గజే యుచును సత్యమెఱుంగకఁ గల్లలాడ ని
    శ్శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  8. శంకల పంకమునందున
    సంకటపడి జీవనమ్ము సతమతమగుచో
    శంకయనెడు శాంతి వినా
    శంకరునిఁ ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్

    రిప్లయితొలగించండి
  9. కం॥ సంకట హరుఁడగు నీశుఁడు
    నంకిలి వెట్టఁగ విలయము నాతడె సేయున్
    మంకును వీడుచు నప్పుడు
    శంకరునిఁ ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్

    ఉ॥ సంకట హారియై జనుల శంకరుఁ డెప్పుడుఁ బ్రోచు చుండఁగా
    నంకిలి వెట్టగన్ లయము నాతఁడె సేయును రుద్రరూపుఁడై
    మంకుగఁ గొల్చ రాదపుడు మన్మథ వైరిని నట్టి వేళలన్
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్

    (సామాన్యంగా వరాలు గుప్పించే శివుడు రుద్రరూపుడైనపుడెవ్వరు దరిజేర సాహసింపరు. మన్మథుని భస్మము చేసిన పిదప రతి వేడగా వేడగా చివరకు శాంతిస్తాడు కదండి. అప్పుడు శివుని గోరి లాభము లేదని)

    రిప్లయితొలగించండి
  10. కం:అంకిత మైతి వ్యసనముగ
    శంకర గురువుల సమస్య సాధింపగ నా
    కింకే సమస్య లేదే!
    శంకరునిఁ ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్”
    (ఈ కంది శంకరయ్య గారి సమస్యలకి ఒక వ్యసనం లాగా అంకిత మై పోయాను.అసలైన సమస్య లేమీ నాకు లేవా? ఈయన గారిని వదిలించుకుంటేనే శాంతి దక్కేటట్టు ఉంది.)

    రిప్లయితొలగించండి
  11. వంకర బుద్ధులు గలిగియు
    సంకట ములు గలుగజేయు సైకో నొకనిన్
    శంకి ంచ క నా భోళా
    శంకరుని ధ్యజింప గ దగు శాంతి గను గొన న్

    రిప్లయితొలగించండి
  12. ఉ:"శంకలు తీరు నేమొ!" యని శంకరు తత్త్వము బట్ట నెన్నియో
    శంకలు గల్గు నా మదికి "సత్యము బ్రహ్మమె" యంచు బల్కి తా
    నింక నవిద్య,మిథ్య యని యెన్నియొ తర్కము లేవొ చేయు నీ
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్”
    (శంకలు తీరుతాయేమో అని శంకరాద్వైతాన్ని పట్టుకుంటే దానిలో అవిద్య,మిథ్య అంటూ ఏవేవో చెపుతాడు.నాకు అర్థం కాలేదు.దాన్ని పక్కన పెడితేనే మంచి దని ఒకని కన్ ఫ్యూషన్..)

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్.

    ఉ.మా :

    శంకయు లేదు నాకు మరి శంకరు దారగ కీర్తి వొందగన్
    శాంకరి నామమే జగతి శాంతము సంతుల మీయు నెంచుమా
    వంకర నేత్రముల్, దగర వందిత, యంబరకేశు నొండొరుల్
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్.

    రిప్లయితొలగించండి
  14. క్రుంకక యీర్ష్యాంబోధిని
    వంకలు వెట్టక నిరాశఁ బరిపంథులపై
    శంకావలి, నర్చించుచు
    శంకరునిఁ, ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్


    శంక వహింప నేల హర శక్తి పయిం దగ దట్టి దెన్నఁడుం
    బంకజ నాభ సంయుతము ఫల్గుణ యుక్తము వాహినీ విరా
    జ్యంకము నందు శాత్రవ జనాలి జయింపగ రక్షకున్ వినా
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింప నెంచినన్

    రిప్లయితొలగించండి
  15. సమస్య:
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్.

    ఉ.మా :

    శాంకరి కేల దక్కెనయ శంకరు దేహపు నర్ధభాగమున్ !
    వంకర దారులన్ పరుగు వచ్చిన నన్నును బట్టె జూటమున్
    శంకర శక్తి గంటి మరి షణ్ముఖ పెంపక మప్పగించగన్
    శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింపనెంచినన్.

    రిప్లయితొలగించండి
  16. సమస్య:
    శంకరుని ద్యజింపగదగు శాంతిగనుగొనన్

    కందము:

    శంకరి జనకుని దక్షుని
    శంకయు లేక వధియించె శత్రువు దానన్
    వంకర నేత్రపు రౌద్రుని
    శంకరుని ద్యజింపగదగు శాంతిగనుగొనన్

    రిప్లయితొలగించండి