2, ఆగస్టు 2025, శనివారం

సమస్య - 5201

3-8-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాతిరి సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్”

(లేదా...)

“రాతిరి వేళ భాస్కరుఁడు రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్”

(రావిపాటి లక్ష్మినారాయణ గారి 'సమస్యాపూరణ' గ్రంథం నుండి)

5 కామెంట్‌లు:

  1. ఉ.
    ద్యోతక కౌముదీ కిరణ తోష మహోత్సవ కామ్య ధారియై
    చేతమునందు నాతురతఁ జెన్నగు రీతిని నిల్పి వేసవిన్
    వాతముఁ దాళపత్ర భర వాతద యష్టులచేతఁ బొందెనీ
    రాతిరి వేళ, భాస్కరుడు రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్ !

    రిప్లయితొలగించండి

  2. శీతము వెడలె నటంచును
    కాతాళము నందుచు నుడుగణవీధిని ఖ
    ద్యోతుడు క్రుంగిన నేమిర
    రాతిరి , సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్.


    ఖ్యాతిగడించినట్టి తపనాంశుడజంభుడు లోకబాంధవుం
    డాతడు ఘర్మదీధితి యహర్మణి చీకటిగొంగ వాడటన్
    శీతము చేయిజారెనని చిందర నందుచు, క్రుంగనేమిరా
    రాతిరి వేళ, భాస్కరుఁడు రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్.

    రిప్లయితొలగించండి
  3. శీతలుడు వెన్నెలనొసగె
    రాతిరి ; సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్ 
    చేతనులపయిన , వారా
    యాతపము భరించలేక నలజడి నొందెన్

    రిప్లయితొలగించండి
  4. చేతము చల్లబరచి చనె
    శీతరుచుడు రాతిరి విరజిమ్మి వెలుగులన్
    నూతన దివసము, ముగియగ
    రాతిరి, సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్

    చేతము చల్లజేయునని చేరితి పున్నమి వెల్గులందునన్
    శీతమయూఖ రేఖల వశీకరణంబున సేదదీరితిన్
    రాతిరి వేళ; భాస్కరుఁడు రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్
    రాతిరి పూర్తియైనతరి రమ్యముగా క్రమమైన రీతినిన్

    రిప్లయితొలగించండి